Jump to content

ఇంటింటి రామాయణం

వికీపీడియా నుండి
ఇంటింటి రామాయణం
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. సాంబశివరావు
తారాగణం చంద్రమోహన్,
రంగనాథ్,
జయసుధ,
నూతన్ ప్రసాద్,
ప్రభ
సంగీతం రాజన్ - నాగేంద్ర
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన ఆరుద్ర, వేటూరి, కొంపెల్ల శివరాం
నిర్మాణ సంస్థ నవత ఆర్ట్స్
భాష తెలుగు

ఇంటింటి రామాయణం తెలుగు చలన చిత్రం 1979 న విడుదల.నవత ఆర్ట్స్ కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రంలో చంద్రమోహన్,రంగనాథ్, జయసుధ, నూతన్ ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం రాజన్ నాగేంద్ర అందించారు .

కల్పనకి, వా స్తవికతకి భూమి ఆకాశాల దూరం వుంటుంది. ప్రేను వివాహాలు సహజంగా సుఖంగా నమస్తాయని, పెద్దలు నిర్ణయించిన వివాహాలు అంత సుఖప్రదం కావు అనే చాలామంది అభిప్రాయం, అభిప్రాయంగా వుంటూనచ్చిన ఈ విషయాన్ని యవార్థం చేశారు దాక్టర్ జయకృష్ణ, విజయ మోహన్, అరుణ దంపతులు, ప్రఖ్యాత టెన్నిన్ ఛాంపియన్ డాక్టర్ జయకృష్ణ టెన్నిన్ ఆటకి ముగ్దురాలైన లక్షాధికారి జగతల ప్రభావ రావుగారి' ఏకైక పుత్రిక విజయ, తండ్రిమాటకూడా కాదని జయకృష్ణని వివాహం చేసుకుంది. ప్రేను, పెళ్ళిళ్ళు తరచు అపజయం పొందుతాయనే అపప్రధ విషయంలో తండ్రితో ఛాలెంజికూడా చేసింది విజయ. వివాహం అయి వేరే కాపురం పెట్టిన తరువాత, జయకృష్ణని పెళ్ళిచేసుకోవటంవల్ల స్త్రీ జీవితానికి ముఖ్యమైన మధురానుభూతికి దూరం అయినాననే అభిప్రాయం విజయ తెలుసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. అందరు కారణం జయకృష్ణ ఆదర్శాలుకూడా కొంతవరకు దోహదం చేశాయి. ఎంత గాఢంగా ప్రేమించి పెళ్ళిచేసుకున్నా అభిరుచులు ఆదర్శాలు సూత్రప్రాయమైన బేదాలు ఆ నవదంపతుల జీవితాన్ని కారుమేఘాల్లా కప్పివేశాయి. దినం ఒక క్షణంగా గడపవలసిన పండంటి యవ్వనంలోనే ఆ భార్యాభర్తలు ఆదర్శాలు పేరైనట్లుగానే విడిపోక తప్పలేదు. జయకృష్ణకు ప్రాణమిత్రుడు మోహన్రావు, జీవితం అతనికి నవ్వుల పంట. అందంగా అబద్దాలు చెప్ప టంలో, చెప్పిన దానిని పొందికగా సమర్థించుకోవటంలో అఖండమైన ప్రజ్ఞావంతుడు. అతనికున్న ఆ ప్రత్యేక లక్షణమే డ్యాంక్ ఏజంట్ సీతాపతిని, ఆయన అభిమాన పుత్రిక అరుణనుకూడా ఆకర్షించింది. నూరు అబద్దాలాడినా ఒక పెళ్ళి చెయ్యమన్నది ఒక సామెత. కాని మోహన్రావు మాత్రం అంతకు పైనే అబద్దలాడి అరుణను తానే పెళ్ళిచేసుకున్నాడు. ఉద్యోగరీత్యా మద్రానికి వచ్చిన అరుణ మోహనరావులు జయకృష్ణ, విజయల సంసార పరిస్థితి తెలుసుకుని కొండంత బాధపడిపోయారు. విడిపోయిన ఆ దంపతులను మళ్ళీ కలపాలనే నిర్ణయానికి వచ్చారు. అంచెలంచెలుగా సాగిన ఆ అందమైన ప్రయత్నంలో వారికి రిక్షా లింగరు, అతని భార్య రత్తిల సహకారంకూడా లభించింది.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పి.సాంబశివరావు
  • నిర్మాత: ఎన్.కృష్ణంరాజు
  • నిర్మాణ సంస్థ: నవత ఆర్ట్స్
  • సంగీతం: రాజన్, నాగేంద్ర
  • సాహిత్యం:ఆరుద్ర, వేటూరి సుందర రామమూర్తి, కొంపెళ్ళ శివరాం
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి .

పాటలు[1][2]

[మార్చు]
  1. ఇంటింటి రామాయణం... వింతైన ప్రేమాయణం... కలిసుంటే సల్లాపము ... విడిపోతే కల్లోలము (ఆరుద్ర[3] సాహిత్యాన్ని అందించారు)
  2. మల్లెలు పూసే...వెన్నెల కాసే....ఈ రేయి హాయిగా.... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
  3. వీణ వేణువైన సరిగమ విన్నావా.....తీగ రాగమైన మధురిమ కన్నావా... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం, జానకి గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
  4. ఈ తరుణము ...వలపే శరణము... జగములే సగము గా.... (కొంపెల్ల శివరాం సాహిత్యాన్ని అందించారు)
  5. శ్రీ రామ నామమ్ము సర్వస్వం అని ....... (హరికథ).. (ఎమ్.వి.ఎల్, కొంపెల్ల శివరాం సాహిత్యాన్ని అందించారు)
  6. ఉప్పు కారం తినక తప్పదు తప్పో ఒప్పో నడక తప్పదు,... (ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించగా, వేటూరి సాహిత్యం అందించారు).

మూలాలు

[మార్చు]
  1. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్
  2. Intinti Ramayanam (1979)-Song_Booklet. 1979.
  3. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.

బాహ్య లంకెలు

[మార్చు]