ఇంటి పిచ్చుక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

House Sparrow
Male in Germany
Female in Delaware
శాస్త్రీయ వర్గీకరణ
Genus:
Passer
Species:
domesticus
       Native range
       Introduced range
Synonyms[2]

Fringilla domestica Linnaeus, 1758
Passer domesticus (Linnaeus, 1758) Brisson, 1760
Pyrgita domestica (Linnaeus, 1758) G. Cuvier, 1817
Passer indicus Jardine and Selby, 1835
Passer arboreus Bonaparte, 1850 (preoccupied)
Passer confucius Bonaparte, 1853
Passer rufidorsalis C. L. Brehm, 1855
Passer engimaticus Zarudny, 1903
Passer ahasvar Kleinschmidt, 1904

ఊర పిచ్చుక (మగది) / వనస్థలిపురంలో తీసిన చిత్రము

ఇంటి పిచ్చుక (శాస్త్రీయ నామం: Passer domesticus) అనునది పాసరిడే కుటుంబానికి చెందిన పక్షి. ఇది ప్రపంచంలో అనేక ప్రాంతములలో ఉండే పక్షి. దీని పొడవు 16 cm (6.3 in), బరువు 24–39.5 g (0.85–1.39 oz) ఉంటుంది. ఆడ పక్షులు, యువ పక్షులు రంగులేని ఊదారంగు గోధుమరంగులో ఉంటాయి. మగ పక్షులు కాంతివంతమైన నలుపు, తెలుపుతో కూడిన గోధుమరంగు మచ్చలతో కూడి ఉంటాయి.

ఇంటి పిచ్చుక ఆడియో రికార్డింగ్

పిచ్చుక చిన్నదే అయినా దీన్ని బ్రతికించుకోవాలి “ పిచుకంతలేవు. ఎందుకురా అలా ఎగురుతావు?” అనేది పల్లెటూరి జీవనంలో ఊతపదం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పిచ్చుకే పిచ్చుకంతయి పోయింది. కాబట్టి మనం అందరం కలసే పిచ్చుకని బ్రతికించుకోవాలి. పిచ్చుక సాధారణంగా మన ఇళ్లలోనే తిరుగుతాయి. మనుషులమద్య కలివిడిగా తిరుగుతూవుంటాయి. మనలోఒకటిగా కలసి పోతుంది. కాని ఇళ్లు ఇరుకై వాకిలి పెరడు హరించిపోయి చెట్లు కనిపించకుండా పోతూవుంటే ఈ పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుందు? బ్రతకడానికే దారి లేకపోతే పెగుతున్న సాంకేతిక విప్లవం వలన పిచ్చుక పూర్తిగా కనుమరుగై భావితరానికి “పిచ్చుక బొమ్మ”ను చూపించి ఈ పిచ్చుక అనే పక్షి మన ఇళ్లలోనే తిరిగేదని చెప్పల్సిన పరిస్థితి రాకుండా, వున్న పిచ్చుకలునైనా బ్రతికించుకుందాం. దీనికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా పిచ్చుకలు హరించుకు పోవడానికి కారణాలు:

  1. ఇంధన కాలుష్యం
  2. గృహనిర్మాణంలో మార్పులు
  3. పెరుగుతున్న అపార్టమెంటు కల్చరు
  4. సాంకేతిక మార్పులతొపాటు సెల్ టవర్లు నిర్మాణం (వీటితరంగాల వలన తగ్గు తున్న ఉత్పత్తి).
జర్మనీలో ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ కింద గుంపులు గుంపులుగా, కిలకిలారావాలు

గృహనిర్మాణం

[మార్చు]

సాధారణంగా పిచ్చుకలు ఇంటి కప్పులక్రింద, పూర్వం రోజులలో పెంకులు అడుగుభాగంలో, 90 శాతం ఇళ్లలోనే గూళ్లు నిర్మించుకుంటాయి. ఆడ, మగ పిచ్చుకలు కలసి జీవనం సాగించుకోవడానికి నిర్నయించుకున్న తరువాత గూడు నిర్మాణం చేపడుతాయి. రెండూ కలసి కష్టపడి గూడు నిర్మాణం చేసి గుడ్లుపెట్టి పిల్లలు ఎదిగేవరకు కలసి బాధ్యత వహించుతాయి. ఇవిఎక్కువగా ధాన్యం తింటాయి. ప్రతిధాన్యంగింజా వలుచుకొని బియ్యంగింజని మాత్రం తింటాయి, అత్యంతవేగంగా గమ్మత్తుగా తింటాయి

ప్రపంచ దేశాలలో పిచ్చుకలు

[మార్చు]

సాధారణంగా పిచ్చుకలు మనదేశంలోనే కాకుండా ఆశియా, ఆఫ్రికా ఐరోపా ఖండాల్లో కూడా కనిపించుతున్నాయి. భారతదేశంలో కర్ణాటకా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడ్, పశ్చిమబెంగాల్ ఒడిశ్సా రాష్ట్రాలలో విరివిగా కనిపించుతాయి.

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

[మార్చు]

ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటారు.

మూలాలు

[మార్చు]
  1. BirdLife International (2013). "Passer domesticus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 12 March 2014.
  2. Summers-Smith 1988, pp. 307–313