ఇంటెలిజెన్స్ బ్యూరో (ఇండియా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంటెలిజెన్స్ బ్యూరో
భారతదేశ చిహ్నం
భారతదేశ చిహ్నం
సంస్థ
స్థాపన 1964
దేశం భారతదేశం
నియమించబడేవారు ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులు
నియంత్రణ విభాగం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ
పరిమాణం రహస్యం
వెబ్‌సైట్ https://web.archive.org/web/20110721165958/http://www.ceib.nic.in/default.htm

! cellpadding="1" colspan="12" style="background:#798050; color:#f9f9f9; text-align: center" |సిబ్బంది |- | |డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో |}

ఇంటెలిజెన్స్ బ్యూరో (దేవనాగరి: खुफिया ब्यूरो, ఖుఫీయా బ్యూరో ) అనేది భారతదేశం యొక్క అంతర్గత నిఘా సంస్థ, ప్రపంచంలో అత్యంత పురాతన గూఢచర్య సంస్థగా ఇది ప్రసిద్ధిగాంచింది, దీనిని IB గా కూడా గుర్తిస్తున్నారు.[1] 1947లో హోం మంత్రిత్వ శాఖ పరిధిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోగా ఇది రూపాంతరం చెందింది. నిఘా విభాగం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, 1885లో మేజర్ జనరల్ సర్ ఛార్లస్ మ్యాక్‌గ్రెగోర్‌ను సిమ్లాలో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీకి క్వార్టర్‌మాస్టర్ జనరల్‌గా మరియు నిఘా విభాగ అధిపతిగా నియమించారు. 19వ శతాబ్దం చివరి కాలంలో వాయువ్య భాగం నుంచి బ్రిటీష్ ఇండియాను రష్యా ఆక్రమిస్తుందనే భయాల నేపథ్యంలో, ఆఫ్ఘనిస్థాన్‌లో రష్యా దళాల మోహరింపులపై నిఘా పెట్టడం ఈ గూఢచర్య విభాగం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది.

భారతీయ అరాజకవాద కార్యకలాపాలు వృద్ధి చెందుతున్న నేపథ్యంలో, 1909లో ఈ పరిస్థితికి స్పందనగా ఇంగ్లాండ్‌లో ఇండియన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్‌ను స్థాపించారు, 1921లో దీని పేరును ఇండియన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ (IPI)గా మార్చారు. ఇది ప్రభుత్వం నిర్వహించిన నిఘా మరియు పర్యవేక్షణ సంస్థ. భారత కార్యాలయం మరియు భారత ప్రభుత్వం ఉమ్మడిగా ఐపిఐని నిర్వహించాయి, భారత కార్యాలయం యొక్క ప్రభుత్వ మరియు న్యాయ విభాగం యొక్క కార్యదర్శి మరియు భారతదేశం యొక్క డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో (DIB)ల నేతృత్వంలో ఐపిఐ కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు, స్కాట్లాండ్ యార్డ్ మరియు ఎంఐ5 సంస్థలతో దగ్గరి సంబంధాలు కొనసాగించింది.

బాధ్యతలు[మార్చు]

రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తూ IB భారతదేశంలో నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది, అంతేకాకుండా గూఢచర్య-నిరోధక మరియు తీవ్రవాద నిరోధక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో చట్టాన్ని అమలు చేసే సంస్థలకు చెందిన ఉద్యోగులు పని చేస్తారు, ఎక్కువగా ఇండియన్ పోలీస్ సర్వీస్ మరియు సైనిక అధికారులు దీనిలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో (DIB)గా మాత్రం ఎల్లప్పుడూ ఒక IPS అధికారి ఉంటారు. దేశీయ నిఘా బాధ్యతలతోపాటు, IB సరిహద్దు ప్రాంతాల్లో గూఢచర్యం ద్వారా సమాచారాన్ని సేకరించే పనులు నిర్వహించింది, హిమ్మత్‌సిన్హాజీ కమిటీ (ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దు కమిటీగా కూడా దీనిని గుర్తిస్తున్నారు) 1951 సిఫార్సులతో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించడాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టింది, 1947లో స్వాతంత్ర్యానికి పూర్వం సైనిక నిఘా సంస్థలు ఈ బాధ్యతలను నిర్వహించేవి. భారతదేశంలో మరియు పొరుగు ప్రాంతాల్లో అన్ని రకాల మానవ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే బాధ్యతలను ఇంటెలిజెన్స్ బ్యూరోకు కేటాయించారు. 1951 నుంచి 1968 వరకు విదేశీ నిఘా బాధ్యతలను కూడా IB నిర్వహించింది, ఆ తరువాత ఈ బాధ్యతల కోసం ప్రత్యేకించి రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం IB అధిపతిగా దినేశ్వర్ శర్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కార్యకలాపాలు[మార్చు]

IB రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, దీని యొక్క చర్యలు ఎక్కువగా బహిర్గతమయ్యాయి.అనేక సమయాల్లో IBలోనివారికి కూడా వారి సభ్యులు ఎక్కడున్నారో తెలియదు.ఔత్సాహిక రేడియో అభిమానులకు అనుమతులు ఇచ్చే కార్యాన్ని కూడా IB నిర్వహిస్తుంది. ఇతర భారతీయ నిఘా సంస్థలు మరియు పోలీసులకు కూడా నిఘా సమాచారాన్ని IB తెలియజేస్తుంది. IB భారతీయ దౌత్యాధికారులు మరియు న్యాయమూర్తులకు కూడా వారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే అవసరమైన భద్రతా అనుమతులను మంజూరు చేస్తుంది. అరుదైన సందర్భాల్లో, IB అధికారులు సంక్షోభ పరిస్థితులను వివరించేందుకు ప్రసార మాధ్యమాలతో కూడా మాట్లాడతారు. IB రోజుకు సుమారుగా 6,000 లేఖలను తనిఖీ చేసేందుకు తెరిచి చూస్తుందని ప్రచారంలో ఉంది[ఉల్లేఖన అవసరం]. FBI యొక్క కార్నివోర్ సిస్టమ్‌ను పోలిన ఒక ఇ-మెయిల్ నిఘా వ్యవస్థ కూడా దీని వద్ద ఉంది.[2]

ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఎటువంటి వారెంట్ లేకుండా టెలిఫోన్ లైన్‌లు ట్యాప్ చేసే అధికారాన్ని ఇచ్చారు. ప్రభుత్వం యొక్క దృష్టికోణానికి మద్దతు ఇచ్చేందుకు వివిధ వార్తా పత్రికలు మరియు మేగజైన్‌లకు లేఖలు రాసే అనేక మంది రచయితలు IBలో ఉన్నారు.

పనులు[మార్చు]

"క్లాస్ 1" (గెజిటెడ్) అధికారులు IB సమన్వయ మరియు ఉన్నత-స్థాయి నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తారు. జాయింట్ డైరెక్టర్ లేదా అంతకంటే పైస్థాయి అధికారుల నేతృత్వంలో SIBలు పని చేస్తాయి, చిన్న SIBలు కొన్నిసార్లు డిప్యూటీ డైరెక్టర్‌ల నేతృత్వంలో ఉంటాయి. డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు లేదా DCIOల నేతృత్వంలో జిల్లా ప్రధాన కార్యాలయాల్లో SIBలు తమ విభాగాలను కలిగివుంటాయి. IB పెద్దసంఖ్యలో ఉన్న క్షేత్ర బృందాలను మరియు ప్రధాన కార్యాలయాలు (ఇవి జాయింట్ లేదా డిప్యూటీ డైరెక్టర్‌ల నియంత్రణలో ఉంటాయి) నిర్వహిస్తుంది. ఈ కార్యాలయాలు మరియు సంకటమైన నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్ర పోలీసు సంస్థలు మరియు IB మధ్య దగ్గరి సంబంధాలు నిర్వహించబడతాయి. వీటితోపాటు, జాతీయ స్థాయిలో IBకి పలు యూనిట్‌లు ఉన్నాయి (కొన్ని సందర్భాల్లో అనుబంధ నిఘా సంస్థలు), ఇవి తీవ్రవాదం, గూఢచర్య-నిరోధక కార్యకలాపాలు, VIP భద్రత, ముప్పు అంచనా మరియు సున్నితమైన ప్రదేశాలకు (అంటే జమ్ము-కాశ్మీర్ వంటి ప్రాంతాలు) సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుంటాయి. IB అధికారులు (R&AW మరియు CBIల్లోని అధికారుల మాదిరిగా) ఏడాదిలో ఒక నెల అదనపు జీతంతోపాటు నెలసరి ప్రత్యేక వేతనాలు పొందుతారు, వేతన పెంపులతోపాటు మెరుగైన పదోన్నతలు పొందుతారు.[3]

ర్యాంకులు మరియు చిహ్నం[మార్చు]

డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో చిహ్నం

గెజిటెడ్ అధికారుల ర్యాంకులు (గ్రూపు 'A')[మార్చు]

 • డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (అత్యంత అనుభవం ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఉంటారు; కేవలం 4 నక్షత్రాల ర్యాంకును కలిగివుంటారు, ఇది సైనిక దళాల్లో చిహ్నం పరంగా జనరళ్ల స్థాయికి సమానంగా ఉంటుంది, అయితే వేతన చెల్లింపులు వీరికి మెరుగ్గా ఉంటాయి, హోదా మాత్రం సమానంగా ఉంటుంది.)
 • ప్రత్యేక డైరెక్టర్/ప్రత్యేక కార్యదర్శి (DGకి సమానం)
 • అదనపు డైరెక్టర్ (ADGకి సమానం)
 • జాయింట్ డైరెక్టర్ (ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాకు సమానం)
 • డిప్యూటీ డైరెక్టర్ (DIGకి సమానం)
 • సహాయ డైరెక్టర్ (AIGకి సమానం)
 • సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (SPకి సమానం)
 • జాయింట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (అదనపు SPకి సమానం)
 • డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (DSPకి సమానం)

గెజిటెడ్ కాని అధికారుల ర్యాంకులు (గ్రూపు 'B')[మార్చు]

గెజిటెడ్ కాని అధికారుల ర్యాంకులు (గ్రూపు 'C')[మార్చు]

 • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్-II (సబ్-ఇన్‌స్పెక్టర్‌కు సమానం)
 • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-I (అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌కు సమానం)
 • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II (హెడ్ కాన్‌స్టేబుల్‌కు సమానం)
 • సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (కాన్‌స్టేబుల్)

కార్యకలాపాలు[మార్చు]

ఇంటెలిజెన్స్ బ్యూరో గణనీయమైన స్థాయిలో విజయాలు సాధించింది, IB నిర్వహించే కార్యకలాపాలు చాలా అరుదుగా బహిర్గతమవుతుంటాయి. సంస్థ అత్యంత రహస్య వాతావరణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారణంగా, IB గురించి లేదా దాని కార్యకలాపాలు గురించి అతికొద్ది సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. 1950వ దశకం నుంచి సోవియట్ యూనియన్ పతనమయ్యే వరకు IB సిబ్బందికి సోవియట్ KGB శిక్షణ ఇచ్చింది.

IB మొదట భారతదేశ అంతర్గత మరియు విదేశీ నిఘా సంస్థగా ఉండేది. 1962లో చైనా-భారత్ యుద్ధాన్ని కనిపెట్టడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో విఫలం కావడం, తరువాత 1965లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో నిఘా వైఫల్యాలు ఫలితంగా దీనిని రెండు భాగాలుగా చీల్చారు, ఆపై IBకి కేవలం అంతర్గత నిఘా బాధ్యతలను మాత్రమే అప్పగించారు. విదేశీ నిఘా విభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్‌కు అప్పగించారు.

IB తీవ్రవాద నిరోధక కార్యకలాపాల్లో మిశ్రమ ఫలితాలు సాధించింది. 2008లో కొన్ని తీవ్రవాద ముఠాల గుట్టురట్టు చేయడంలో IB విజయవంతమైంది. హైదరాబాదు పేలుళ్లకు ముందుగానే పోలీసులను ఇది అప్రమత్తం చేసింది, నవంబరు 2008 ముంబయి దాడులకు ముందు, ముంబయిపై సముద్రమార్గం గుండా దాడులు జరిగే అవకాశం ఉందని పదేపదే హెచ్చరికలు చేసింది. అయితే మొత్తంమీద, 2008లో తీవ్రవాద దాడుల తరువాత ప్రసార మాధ్యమాలు IBపై పెద్దఎత్తున విమర్శలు గుప్పించాయి. పెద్దఎత్తున రాజకీయాలు, నిధుల కొరత మరియు నిపుణులైన క్షేత్ర సిబ్బంది కొరత ఈ సంస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ఈ నిఘా సంస్థలో మొత్తం 25,000 మంది సిబ్బంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు, 3500 మంది క్షేత్ర సిబ్బంది దేశవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది రాజకీయ నిఘా పై దృష్టి కేంద్రీకరిస్తారు.[4][5]

ప్రసార మాధ్యమాల చిత్రీకరణ[మార్చు]

ఇంటెలిజెన్స్ బ్యూరో (ఇండియా)ను బాలీవుడ్ చలనచిత్రం సర్ఫరోష్ (1999)లో చూపించారు, ఈ చలనచిత్రంలో ఏసిపి రాథోడ్ నేతృత్వంలోని ఒక ముంబయి పోలీస్ క్రైం బ్రాంచ్ బృందం యొక్క దర్యాప్తులు అంతిమ దశకు చేరుకునే సమయానికి, IB నుంచి వచ్చిన ఒక ఆధారం దర్యాప్తు సిబ్బందిని రాజస్థాన్‌లోని బాహిద్‌కు తీసుకెళుతుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

 1. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) - ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్
 2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-12-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-24. Cite web requires |website= (help)
 3. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2011-07-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-24. Cite web requires |website= (help)
 4. http://www.thaindian.com/newsportal/uncategorized/new-ib-chief-has-his-task-cut-out_100128955.html
 5. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-01-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-24. Cite web requires |website= (help)

సూచనలు[మార్చు]

మరింత చదవడానికి[మార్చు]

 • మ్యాక్‌గ్రెగోర్, లేడీ (Ed.) ది లైఫ్ అండ్ ఒపినియన్స్ ఆఫ్ మేజర్-జనరల్ సర్ ఛార్లస్ మ్యాక్‌గ్రెగోర్. 2 వాల్యూమ్‌లు. 1888, ఎడిన్‌బర్గ్
 • మ్యాక్‌గ్రెగోర్, జనరల్ సర్ ఛార్లస్. ది డిఫెన్స్ ఆఫ్ ఇండియా. సిమ్లా: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్. 1884

బాహ్య లింకులు[మార్చు]