ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian Oil Corporation Limited
రకంState-owned enterprise
Public (మూస:NSE)
స్థాపితం1964
ప్రధానకార్యాలయంNew Delhi, India
కీలక వ్యక్తులుBrij Mohan Bansal, Chairman
పరిశ్రమOil and Gas
ఉత్పత్తులుOil
Petroleum
Natural gas
Petrochemical
Fuel
Lubricant
ఆదాయంINR331893.78 కోట్లు (US) (2010)[1]
మొత్తం ఆదాయము US$ 2.44 billion (2010)[1]
ఆస్తులుUS$ 34.36 billion (2010)[1]
మొత్తం ఈక్విటీUS$ 12.05 billion (2010)[1]
ఉద్యోగులు34,363 (2010)[1]
వెబ్‌సైటుIocl.com
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై వద్ద ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కి చెందిన రవాణా వాహనం.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లేదా ఇండియన్ ఆయిల్ మూస:NSE భారత దేశంచే నడపబడుతున్న చమురు మరియు సహజవాయువుల సంస్థ. ఇది భారత దేశంలోనే అతి పెద్ద సంస్థ, 2009లో ఫార్ట్యున్ గ్లోబల్ 500ల జాబితాలో 105వ స్థానం పొందింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మరియు అనుబంధ సంస్థలు కలిపి దేశీయ చమురు ఉత్పత్తుల అమ్మకాల్లో 47% ఆక్రమించాయి, 40% చమురు శుద్ధి సామర్థ్యం కలిగి ఉన్నాయి మరియు దేశం మొత్తం మీద ప్రవాహ ఆధారిత గొట్టాల ద్వారా 67% చమురు సరఫరా చేస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లు దేశంలో ఉన్న 19 చమురు శుద్ధి కర్మాగారాలను సొంతంగా పదింటిని కలిగి ఉంది.వీటి సామర్థ్యం సంవత్సరానికి 60.2 లక్షల మెట్రిక్ టన్నులు.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ దేశం లోనే విస్తృతమైన అతి పెద్ద ఇంధన విక్రయ స్థలాలను కలిగి ఉంది, సుమారు 17606 (15557 సాధారణ ROలు మరియు 2049 రైతు సేవా కేంద్రాలు). అంతే కాకుండా స్వయం చలిత సహజ వాయువు విక్రయ శాలలు (ALDS) ప్రారంభించాయి. ఇండేన్ ఇంటిలో వాడే సహజ వాయువును 475 లక్షల గృహాలకు 4,990 పంపిణీదారుల పటిష్ఠమైన సరఫరా వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కి ఫరిదాబాద్ లో పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (R&D) సంస్థకు కావలసిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచి సహాయం చేస్తుంది, ఈ పరిజ్ఞానం సంస్థకే కాకుండా దేశ విదేశాల వినియోగదారులకు కూడా ఉపయోగపడుతుంది. తరువాతి కాలంలో, ఇండియన్ ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే సంస్థను 2003లో స్థాపించారు, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పరిశోధించి మరియు అభివృద్ధి పరిచిన పరిజ్ఞానాన్ని ప్రపంచ విపణిలో ప్రేవేశపెట్టడం దీని ముఖ్యోద్దేశం. రాయల్ డచ్ షెల్ మరియు బ్రిటిష్ పెట్రోలియానికి చెందిన పరిశోధన మరియు అభివృద్ధి నమూనాలను ఆధారం చేసుకుని ఈ సంస్థకు రూపకల్పన చేసారు.

చరిత్ర[మార్చు]

1959లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ పేరుతొ ప్రారంభించబడినది, తరువాత 1964లో మిగతా చమురు శుద్ధి కర్మాగారాలు విలీనం ఐన మీదట ది ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ గా రూపాంతరం చెందింది.

ఉత్పత్తులు[మార్చు]

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వివిధ రకాల ఉత్పత్తులను విపణిలోకి ప్రేవేశ పెట్టింది అవి పెట్రోల్, డిసిల్, వాహనాల్లో ఉపయోగించే సహజవాయువు, విమాన ఇంధనం, లుబ్రికాంట్లు, నాఫ్త, బిటుమెన్, పరఫిన్, కిరోసిన్, ఇత్యాది ఉత్పత్తులు. ఎక్స్ ట్రా ప్రీమియం పెట్రోల్, ఎక్స్ ట్రా మైల్ డిసిల్, సర్వో లుబ్రికాంట్లు, ఇండేన్ సహజ వాయువు, ఆటో గ్యాస్ ఎల్ పి జి, ఇండియన్ ఆయిల్ ఏవియేషన్ ప్రఖ్యాతి గాంచిన ఉత్పత్తులు.
ఈ మధ్య కాలంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ నూతనంగా ఎల్ ఎన్ జి (ద్రవ సహజ వాయువు) పంపిణి వ్యాపారం ప్రారంభించింది. దీనిని ఇంటి ముంగిట ద్రవ "సహజ వాయువు" అంటారు. ద్రవ సహజ వాయువు ప్రధాన కార్యాలయం స్కోప్ కాంప్లెక్స్, లోధి రోడ్, ఢిల్లీలో ఉంది.

శుద్ధి కర్మాగారాలు[మార్చు]

 • 1901లో ఉత్తర అస్సాంలో స్థాపించిన దిగ్బోయ్ శుద్ధి కర్మాగారం దేశం లోనే పురాతనమైనది. ప్రథమంగా ఇది అస్సాం చమురు సంస్థలో భాగంగా ఉండేది, తరువాతి కాలంలో ఇది ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో విలీనం ఐనది. దాని సామర్థ్యం మొదట్లో 0.5 MMTPA 1901లో ఉండేది. కర్మాగారాన్ని ఆధునీకరించి దాని సామర్థ్యం 0.65 MMTPA పెంచడం జరిగింది.
 • గువహటి శుద్ధి కర్మాగారం, మొట్టమొదటి ప్రభుత్వంచే నడపబడే శుద్ధి కర్మాగారాన్ని రోమానియా పరిజ్ఞాన సహకారంతో నిర్మించారు, దీనిని ప్రారంభించిన వారు స్వర్గీయ పండిట్. జవహర్ లాల్ నెహ్రు భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి, 1 జనవరి ఒకటి 1962 లో ప్రారంభించారు.
 • బరౌనీ శుద్ధి కర్మాగారాన్నిరష్యా మరియు రొమేనియా పరిజ్ఞానం సహకారం తోటి బీహార్లో నిర్మించారు. అది ఒక MMTPA సామర్థ్యంతో 1964లో ఉత్పత్తి ప్రారంబించింది.ప్రస్తుతం దీని సామర్థ్యం 6 MMTPA.
 • పశ్చిమ భారత దేశం కోయాలిలో ఉన్న గుజరాత్ శుద్ధి కర్మాగారం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ యొక్క అతి పెద్ద కర్మాగారం. ఈ శుద్ధి కర్మాగారం 1965లో ఉత్పత్తి ప్రారంబించింది. దేశంలో మొట్టమొదటి హైడ్రో కర్బంలను విడతీసే వ్యవస్థ ఇక్కడ ఉంది. దీని ప్రస్తుత సామర్థ్యం 13.70 MMTPA.
 • ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్కు చెందిన హల్దియా శుద్ధి కర్మాగారం ఒక్కటే తీర ప్రాంతంలో ఉంది, అది కొల్కొత్త దిగువన ఉన్న పురాబ్ మిడ్నాపూర్ (తుఉర్పు మిడ్నాపూర్) జిల్లాలో ఉంది. 2.5 MMTPAల సామర్థ్యంతో 1975లో ఉత్పత్తి ప్రారంభించి ఇప్పుడు 5.8 MMTPAల సామర్థ్యంతో నడుస్తుంది.
 • 1982లో ప్రారంభించిన మథుర శుద్ధి కర్మాగారం భారత చమురు సమస్త యొక్క ఆరవ శుద్ధి కర్మాగారం, దీని మొదటి సామర్థ్యం 6.0 MMTPA నుంచి 7.5 MMTPAలకు పెంచారు, దీనిని వ్యూహాత్మకంగా ఢిల్లీ అగ్రాల మధ్య నిర్మించారు.
 • పానిపట్ శుద్ధి కర్మాగారం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ యొక్క ఎదవా శుద్ధి కర్మాగారం మొట్టమొదట 6 MMTPAల సామర్థ్యంతో 1998లో ప్రారంబించారు. పానిపట్ శుద్ధి కర్మాగార ప్రారంభ సామర్థ్యం 6 MMTPAల నుంచి 12 MMTPAలకు అంటే రెండింతలు చేయబడింది.

అనుబంధ శుద్ధి కర్మాగారాలు- బొంగైగోన్ శుద్ధి కర్మాగారం (2.95యెమ్ MMTPA), చెన్నై పెట్రోలియం (9.5 MMTPA)

అనుబంధ సంస్థలు మరియు భాగస్వామ్యాలు[మార్చు]

 • ఇండియన్ ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్: IOCL యొక్క ముఖ్య వ్యాపార విభాగం పలు రకాలైన ఆధునిక పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ విపణిలోకి ప్రేవేశ పెడుతుంది. ఇది ఫరిదాబాద్లో ఉంది. ఇండియన్ ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్. ముఖ్య కార్యాలయం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కు చెందిన ఆర్&డి కేంద్రంలో ఉంది.
 • ఇండియన్ ఆయిల్ మారిషస్ లిమిటెడ్
 • లంక IOC PLC- శ్రీ లంకలో నిల్వ మరియు అమ్మకాలు చేసే అనుబంధ సంస్థ. కొలంబో స్టాక్ ఎక్సచెంజ్లో నమోదు కాబడింది. శ్రీ లంక ప్రభుత్వంతో మినహింపు డబ్బు చెల్లింపు వివాదంలో చిక్కుకుంది, తరువాతి కాలంలో ఆ సమస్య పరిష్కారం అయ్యింది.[ఉల్లేఖన అవసరం]
 • ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మధ్య ధరా FZE
 • చెన్నైఇంధన సంస్థ.
 • బొంగైగోన్ శుద్ధి కర్మాగారం మరియు ఇంధన రసాయనాలు.
 • గ్రీన్ గ్యాస్ లిమిటెడ్ -గ్యాస్ అథారిటీ అఫ్ ఇండియా భాగస్వయంతో కలిపి పట్నాలలో సహజ వాయువు పంపిణి వ్యవస్థను మొదలు పెట్టారు.
 • ఇండో క్యాట్ ప్రైవేట్ లిమిటెడ్., అమెరికా కంపనీ ఐన ఇంటర్ క్యాట్ తో కలిసి సంవత్సరానికి 15,000ల టన్నుల FCC (ఫ్లూఇడ్ కేటలిటిక్ క్రాకింగ్) ఉత్ప్రేరకాలు మరియు ఇతర ఇంధన చమురు ఆధారిత ఉత్పత్తులను భారతదేశంలో తయారు చేస్తున్నారు.
 • ఆయిల్ ఇండియా, మరియు ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్తో అనుసాధనం అయ్యి చాలా అన్వేషణలు మరియు ఉత్పత్తులు చేస్తున్నారు.

అంతర్జాతీయ గుర్తింపులు[మార్చు]

భారతీయ సంస్థల్లో కెల్లా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అత్యుత్తమ స్థానం కైవసం చేసుకుంది. 2008లో ఫార్చున్ ప్రపంచ 500 స్థానాల్లో 116వ స్థానం పొందింది. ఈ పురస్కారం 2007 వ్యాపార ప్రదర్శన ఆధారంగా ఇచ్చారు. అది ప్రపంచంలోనే 18వ అతి పెద్ద చమురు సంస్థ, ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థల్లో మొదటి స్థానం పొందింది. 2008 ఫోర్బ్స్ గ్లోబల్ 2000లో 303వ స్థానంలో నిలిచి ప్రచురితమైనది. 2010లో బ్రాండ్ ఫైనాన్స్ మరియు ఎకోనమిక్ టైమ్స్ వారి పరిశోధన ప్రకారం భారత దేశంలో అత్యంత విలువైన 5వ సంస్థగా గుర్తింపు పొందింది.[2]

ప్రోత్సాహక ప్రణాళికలు[మార్చు]

పెద్ద రావణ సంస్థల యజమానుల కోసం ఎక్సట్రా పవర్ ఫ్లీట్ కార్డ్ రూపొందించారు. ప్రస్తుతం ఈ ప్రణాళికలో 10 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ మధ్యనే ప్రేవేశపెట్టిన ఎక్సట్రా రివార్డ్స్ ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే వినియోగదారులు వారు కొన్న ఉత్పత్తుల అనుసారంగా పురస్కార సంఖ్యలు పొందుతారు.

పోటీదారులు[మార్చు]

దేశీయంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కు రెండు ప్రధాన పోటీదారులు ఉన్నారు. వారు భారత్ పెట్రోలియం మరియు హిందూస్తాన్ పెట్రోలియం. ఈ రెండు కూడా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వలె నడపబడుచున్నాయి. అవే కాకుండా రెండు ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్ పెట్రోలియం, ఎస్సార్ ఆయిల్ నుంచి కూడా పోటి ఉంది.

సమస్యలు[మార్చు]

ప్రపంచ విపణిలో చమురు ధరలు నిలకడ లేకపోవడం మరియు ప్రభుత్వ మినహింపుల భారం IOCL పని తీరు పైన ప్రభావం చూపిస్తున్నాయి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు వలె సవాళ్ళను ఎదుర్కుంటుంది. దీని ప్రభావం ఈ సంవత్సర ఫార్చున్ జాబితా పైన పడింది. అంతేకాకుండా, ప్రభుత్వ విధానాల వాళ్ళ కూడా కంపనీ పురోభివృద్దిని మందగిస్తున్నాయి. IOCLలో పనిని సమర్ధ వంతంగా అమలు చేయడానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఉన్నారు.

చమురు పరిశ్రమ అభివృద్ధి మండలి[మార్చు]

భారత దేశం వ్యూహాత్మకంగా తన చమురు నిల్వ సామర్ధ్యాన్ని 37.4 మిలయన్ బెరళ్ళకు పెంచుకుంది. ఇది రెండు వారాల వాడకానికి సరిపోతుంది.[3] ఇంధన నిల్వలను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఇండియన్ ఆయిల్) నుంచి ఇంధన పరిశ్రమ అభివృద్ధి మండలికి (IODB) బదిలీ చేసారు.[4] తదుపరి IODB భారత వ్యూహాత్మక చమురు నిల్వ సంస్థను (ISPRL) తయారు చేసింది, ప్రభుత్వ పరంగా ఇది వ్యుహతమక నిల్వలను నియంత్రిస్తుంది.[5]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ప్రపంచ వ్యూహాత్మక చమురు నిల్వలు.
 • ఇండియన్ ఆయిల్ ఇన్స్టిట్యూట్ అఫ్ పెట్రోలియం మేనేజ్మెంట్

బాహ్య లింకులు[మార్చు]

సంభందిత సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 "2011 Form 10-K, Indian Oil Corporation Limited" (PDF). iocl. Cite web requires |website= (help)
 2. "India's top 10 brands". business.rediff.com. Retrieved 26 Oct 2010. Cite web requires |website= (help)
 3. "Alexander's Gas & Oil Connections - India to build up storage of crude oil". Gasandoil.com. 2004-09-21. Retrieved 2010-08-26. Cite web requires |website= (help)
 4. "Strategic oil reserves to come directly under Govt". The Hindu Business Line. 2006-04-02. Retrieved 2010-08-26. Cite web requires |website= (help)
 5. 20 Jun, 2007, 09.18PM IST,PTI (2007-06-20). "'India to form crude oil reserve of 5 mmt'- Oil & Gas-Energy-News By Industry-News-The Economic Times". Economictimes.indiatimes.com. Retrieved 2010-08-26. Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)