Jump to content

ఇండియన్ ఇంపీరియల్ పోలీస్

వికీపీడియా నుండి

ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ అనేది బ్రిటిషు భారతదేశంలోని ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌లో భాగంగా ఉండేది. దీన్ని ఇండియన్ పోలీస్ అనీ, 1905 వరకూ ఇంపీరియల్ పోలీస్ అనీ వివిధ రకాలుగా అనేవారు. భారత ప్రభుత్వ చట్టం 1858, పోలీసు చట్టం 1861 ల ద్వారా దీన్ని స్థాపించారు. ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌ అనేది, బ్రిటిషు భారతదేశంలో పోలీసు పరిపాలనకు సంబంధించిన ఏకరీతి వ్యవస్థ. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిషు వారు తాము ఎదుర్కొన్న ప్రమాదం నుండి ప్రేరణ పొంది, దీన్ని స్థాపించారు.[1]

1920 లో ఇంపీరియల్ ఇండియన్ పోలీసుల బృందంలో 3,10,000 మంది పోలీసులు ఉండేవారు. వీరు బ్రిటిష్ భారతదేశంలో (ఇప్పుటి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా) 30 కోట్లకు పైగా ప్రజలకు పోలీసు బాధ్యతలు నిర్వర్తించారు.

1948 లో, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన ఒక సంవత్సరం తర్వాత, ఇంపీరియల్ పోలీస్ సర్వీస్ స్థానంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చింది. దీన్ని రాజ్యాంగం ద్వారా సృష్టించిన అఖిల భారత సర్వీసులలో భాగంగా ఏర్పాటు చేసారు.

మూలాలు

[మార్చు]
  1. "Police Reforms in India - History of Police Administration in India by Prakash Singh Ex DGP - YouTube". www.youtube.com. Retrieved 2020-12-02.