ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్
| దస్త్రం:Indianstatisticalinstitutelogo.svg | |
| నినాదం | భిన్నత్వంలో ఏకత్వం |
|---|---|
ఆంగ్లంలో నినాదం | bhinneṣvaikyasya darśanam |
| సంక్షిప్తపదం | ISI |
| రకం | పౌర విశ్వవిద్యాలయం |
| స్థాపితం | 17 December 1931 |
| వ్యవస్థాపకులు | ప్రశాంత చంద్ర మహలనోబిస్ |
విద్యాసంబంధ affiliations | AIU |
| బడ్జెట్ | ₹349.39 crore (US$43.8 million) (2025–26)[1] |
| చైర్మన్ | కొప్పిల్లిల్ రాధాకృష్ణన్ |
| డైరక్టరు | అయనేంద్రనాథ్ బోస్ (acting) |
విద్యాసంబంధ సిబ్బంది | 262 (2025)[2] |
| విద్యార్థులు | 1,165 (2025)[2] |
| అండర్ గ్రాడ్యుయేట్లు | 245 (2025)[2] |
| పోస్టు గ్రాడ్యుయేట్లు | 863 (2025)[2] |
డాక్టరేట్ విద్యార్థులు | 57 (2025)[2] |
| స్థానం | కోల్‌కత, పశ్చిమ బెంగాల్, భారతదేశం 22°38′55.25″N 88°18′39.5″E / 22.6486806°N 88.310972°E |
| ప్రాంగణం | Metropolis |
| ఇతర కేంద్రాలు | |
| జర్నల్ | సంఖ్య |
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ISI) కోల్‌కత ప్రధాన కార్యాలయంగా ఉన్న సార్వజనిక పరిశోధనా విశ్వవిద్యాలయం. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, తేజ్‌పూర్ లో దీని కేంద్రాలు ఉన్నాయి. 1959లో భారత ప్రభుత్వం ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ చట్టం ద్వారా జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థగా రూపుదిద్దింది.[3] దీన్ని 1931లో ప్రారంభించారు. దీనిని భారత ప్రభుత్వం గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది.[4]
ISI యొక్క ప్రాథమిక కార్యకలాపాలు గణాంకశాస్త్రంలో పరిశోధన, శిక్షణ, సైద్ధాంతిక గణాంకశాస్త్ర అభివృద్ధి, వివిధ సహజ, సామాజిక శాస్త్రాలలో దాని అనువర్తనాలు. గణాంకశాస్త్రం (Statistics), గణితం (Mathematics), సైద్ధాంతిక కంప్యూటర్ సైన్స్ (Theoretical Computer Science), ఇన్ఫర్మేషన్ సైన్స్ (Information Science), మ్యాథమెటికల్ ఎకనామిక్స్ (Mathematical Economics) వంటివి ISI లోని ప్రధాన పరిశోధనా రంగాలు. డిగ్రీ కోర్సులతో పాటు, ISI కొన్ని డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను, ISEC ద్వారా అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక డిప్లొమా కోర్సులను, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) ప్రొబేషనరీ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వడానికి CSO సహకారంతో ప్రత్యేక కోర్సులను అందిస్తుంది.
చరిత్ర
[మార్చు]ISI మూలాలు కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలోని గణాంక ప్రయోగశాలలో ఉన్నాయి. దీనిని 1920లలో కళాశాల భౌతిక శాస్త్ర విభాగంలో పనిచేసిన పి.సి.మహలనోబిస్ స్థాపించాడు. 1913–1915 సమయంలో, ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణితం, భౌతిక శాస్త్రంలో ట్రిపోస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.[5] అక్కడ ఆయన కార్ల్ పియర్సన్ స్థాపించిన గణాంకాల జర్నల్ బయోమెట్రికా గురించి తెలిసింది.[6] 1915 నుండి ఆయన ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రాన్ని బోధించడం ప్రారంభించాడు. కానీ గణాంకాలపై అతని ఆసక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి బ్రజేంద్ర నాథ్ సీల్ మార్గదర్శకత్వంలో మరింత ఇనుమడించింది. మహాలనోబిస్ సహచరులు చాలా మంది గణాంకాలపై ఆసక్తి చూపారు. గణాంక ప్రయోగశాలలో పనిచేసేవారు ఎక్కువయ్యారు. వాతావరణాన్ని అంచనా వేయడం, పంట దిగుబడిని కొలవడం మరియు సర్వేలు నిర్వహించడం వంటి వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి గణాంకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి, పి.సి. మహాలనోబిస్ మరియు అతని సహచరులు ఈ అంశంపై పరిశోధన మరియు బోధన కోసం ఒక ప్రత్యేక సంస్థను సృష్టించాల్సిన అవసరం ఉందని భావించారు.[7]
1931 డిసెంబర్ 17న, మహలోనోబిస్ ప్రమథ నాథ్ బెనర్జీ (మింటో ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్), నిఖిల్ రంజన్ సేన్ (ఖైరా ప్రొఫెసర్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్), సర్ రాజేంద్ర నాథ్ ముఖర్జీలతో సమావేశం నిర్వహించాడు.[7][8][9] ఈ సమావేశం ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ISI) స్థాపనకు దారితీసింది. ఇది 1860 నాటి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ XXI కింద లాభాపేక్షలేని పంపిణీ పండితుల సంఘంగా 1932 ఏప్రిల్ 28న అధికారికంగా నమోదు చేయబడింది.[8][9] తరువాత, ఈ సంస్థ 1964లో సవరించబడిన 1961లోని పశ్చిమ బెంగాల్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ XXVI కింద నమోదు చేయబడింది.[10] ముఖర్జీ ISI అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. 1936లో మరణించే వరకు ఈ పదవిలో ఉన్నారు.[10] In 1953,[11] 1953లో ISIని బారానగర్‌లోని ప్రొఫెసర్ మహాలోనోబిస్ యాజమాన్యంలోని "అమ్రపాలి" అనే ప్రదేశానికి మార్చారు. ఇది ఇప్పుడు కోల్‌కతా ఉత్తర శివార్లలో మునిసిపాలిటీగా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "DEMAND NO. 96, Demands for Grants, 2025-2026, MINISTRY OF STATISTICS AND PROGRAMME IMPLEMENTATION" (PDF). IndiaBudget.gov.in. New Delhi. 1 Feb 2025. p. 5. Retrieved 1 Feb 2025.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "NIRF 2025" (PDF). Indian Statistical Institute.
- ↑ "UNSD Document – The Indian Statistical Institute Act 1959". United Nations Statistics Division. Retrieved 14 November 2012.
- ↑ "About Ministry". Ministry of Statistics and Programme Implementation of the Government of India. Retrieved 19 November 2012.
- ↑ Ghosh, Maiti & Bera 2010, p. 1013
- ↑ Ghosh, Maiti & Bera 2010, p. 1019
- ↑ 7.0 7.1 Ghosh et al. 1999, p. 22
- ↑ 8.0 8.1 Rao, C. R (1973). Prasantha Chandra Mahalanobis. 1893–1972. Vol. 19. Biographical Memoirs of Fellows of the Royal Society. pp. 454–492.
- ↑ 9.0 9.1 Rudra, A (1996). Prasanta Chandra Mahalanobis: A Biography. Oxford University Press.
- ↑ 10.0 10.1 "History of ISI". Indian Statistical Institute. Archived from the original on 5 August 2012. Retrieved 22 November 2012.
- ↑ Ghosh, Maiti & Bera 2010, p. 1020