ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ క్రిస్టల్ స్కల్ (చిత్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ క్రిస్టల్ స్కల్  (Indiana Jones and the Kingdom of the Crystal Skull) అనే చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇండియానా జోన్స్ వరస చిత్రాలలో ఇది నాల్గవ సినిమా. మొదటి మూడు చిత్రాలైన రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, ది టెంపల్స్ ఆఫ్ ది డూమ్, ది లాస్ట్ క్రూసేడ్, చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించాయి. మూడవ చిత్రమైన "ది లాస్ట్ క్రూసేడ్" విడుదలైన 19 ఏళ్ళ తర్వాత ఈ చిత్రం విడుదలైంది. మొదటి మూడు చిత్రాలలో కథానాయకుని పాత్రను పోషించిన ప్రముఖ నటుడు "హారిసన్ ఫార్డ్" ఈ చిత్రంలో వృద్ధ కథానాయకుడినా నటించాడు. ఈ చిత్ర కథ 1957 లో సోవియట్ గూడాచారులు ఇంద్రియాతీతపు శక్తులు కలిగిన స్పటికపు కపాలాన్ని వెతకడం కథానాయకుడు వారికి అడ్డుపడుతుండడం చివరికి ఆ కపాల శక్తికి ప్రతినాయకురాలు మరణించడంతో ఈ కథ ముగుస్తుంది.