జాతీయ ఇ-పాలన ప్రణాళిక

వికీపీడియా నుండి
(ఇండియాలో ఇ- పరిపాలన నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భారత ప్రభుత్వ జాతీయ ఇ-పాలన ప్రణాళిక[1] ప్రధానోద్దేశాలలో ముఖ్యమైనవి: సరైన పాలన, సంస్థాగత పద్ధతులను తయారుచేయడం, మౌలిక సదుపాయాలేర్పాటు, పాలసీల తయారీ, ఇంకా కేంద్రంలో, రాష్ట్రాలలో లక్ష్యాధార ప్రాజెక్టులను అమలుచేయడం, సమీకృత ప్రజాసేవలను, పాలనకై వ్యాపార వాతావరణాన్ని ఏర్పాటుచేయడం. దీని 27 లక్ష్యాధార ప్రణాళికలు, 8 విభాగాలకు 2006 మే 18 న ప్రభుత్వ అనుమతి లభించింది .

Negp09.gif

జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక లక్ష్యం (విజన్)[మార్చు]

ఎన్.ఇ.జి.డి పౌరులకు, వివిధ వ్యాపారాలకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక ఈ క్రింది సిధ్దాంతాన్ని లక్ష్యంగా పెట్టుకుంది: “సామాన్య మానవుడికి నివసించేచోటే ఉమ్మడి సేవా కేంద్రాలద్వారా అన్ని ప్రభుత్వసేవలూ అందించేటట్లుగా చూడాలి. ఆ సేవలు సామాన్య మానువుడి ప్రాథమిక అవసరాలు, అతను భరించగలిగే ఖర్చుతో తీరేలా సమర్ధవంతంగా, పారదర్శకంగా, విశ్వాసయోగ్యమైనవిగా, నమ్మకంగా అందించాలి.”

విభాగాలు[మార్చు]

సాధారణ సేవా కేంద్రాలు[మార్చు]

దీని ద్వారా ఇ-పాలన సేవలన్నీ పౌరులకు అందుతాయి. ఒక కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, నిరంతరాయంగా విద్యుత్శక్తి ఉపకరణము, వైర్లెస్ సంపర్క వ్యవస్థ వుంటాయి. విద్యావినోద పరికరాలు, దూర ఆరోగ్య వ్యవస్థ ఉపకరణాలు, పెద్ద తెర వ్యవస్థ కూడా వుంటాయి. దీనిని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తారు. గ్రామీణ స్థాయి వ్యవస్థాపకుడు క్రింది స్థాయిలో, సేవా కేంద్ర ఏజెన్సీ మధ్యస్థాయిలో, పేర్కొనబడిన రాష్ట్ర ఏజెన్సీ పై స్థాయిలో వుంటాయి. వీటిని దేశంలోని సుమారు 600 000 గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. దీనికోసం నాలుగేళ్లలో 5742 కోట్లు ఖర్చవుతుంది. కేంద్రం 856 కోట్లు, రాష్ట్రాలు 793 కోట్లు ఖర్చు చేస్తాయి.

రాష్ట్ర వైడ్ ఏరియా నెట్వర్క్[మార్చు]

ఇది కేవలం వివిధ ప్రభుత్వశాఖలమధ్య సంపర్కానికి తయారు చేసిన కంప్యూటర్ నెట్వర్క్. దీని ద్వారా జిటుజి (G2G), జిటుసి (G2C) సేవలు అందుతాయి. దీనికోసం 3334 కోట్లు ఖర్చవుతాయి. (మార్చి 2005 అంచనాలు). రాష్ట్ర ముఖ్య పట్టణంతో, జిల్లా ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాలు, కనీసం 2MBPS తో సంపర్కం చేస్తారు.

రాష్ట్ర డాటా సెంటర్లు[మార్చు]

ప్రతి వ్యక్తి సమాచారం, రాష్ట్ర డాటా సెంటర్లులో వుంచబడుతుంది. 2010-2011 నాటికి ఇవి పని చేస్తాయి. ఐదేళ్లలో 1623 కోట్లు ఖర్చవుతుంది.

సేవల వివరాలు[మార్చు]

ప్రభుత్వ విభాగం సేవలు
ఆదాయపు పన్ను పాన్/టాన్ (PAN/TAN) నమోదు, రిటర్న్ ఇ-ఫైలింగ్
పాస్ పోర్ట్ / వీసా ఆన్లైన్ విచారణ
కంపెనీ విషయాలు కంపెనీ నమోదు
సెంట్రల్ ఎక్సైజ్ రిటర్న్ ఇ-ఫైలింగ్
పింఛస్లు ఆన్లైన్ విచారణ
భూమి యాజమాన్య వివరాలు భూమి యాజమాన్య వివరాల విచారణ
ప్రాంతీయ రవాణా సంస్థ వాహనాల నమోదు, డ్రైవింగ్ లైసెన్సు జారి
ఆస్తి హక్కు నమోదు ఆస్తి హక్కు నమోదు
వ్యవసాయం వ్యవసాయ ఉత్పత్తుల ధరలు
మునిసిపాలిటీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల వితరణ
పోలీసు దొంగిలించబడిన వాహనాల వివరాలు
ఉద్యోగ వినిమయ కేంద్రం ఉద్యోగార్ధుల, సంస్థల నమోదు
ఈ-కోర్టు దావా వివరము, కాజ్ చిట్టా, తీర్పులు

ఆంధ్ర ప్రదేశ్ స్థితి[మార్చు]

  • 28000 గ్రామాలకొరకు 4687 సాధారణ సేవా కేంద్రాలు, ఆగస్టు 2009 నాటికి పని చేయాల్సి వుండగా, 319 మాత్రమే పనిచేస్తున్నాయి.[2] సిఎంఎస్ , టైమ్స్ రాష్ట్ర ఏజెన్సీ గుత్తేదార్లుగా రంగంలో ఉన్నాయి. వివిధ శాఖల ఇ-పాలన మార్పులో జాప్యాలు, సేవా కేంద్రాలఆదాయానికి గండికొడుతున్నాయి.
  • రాష్ట్ర వైడ్ ఏరియా నెట్వర్క్ మండల స్థాయి వరకు సెప్టెంబరు 2009కి పని చేయాల్సి ఉంది.
  • రాష్ట్ర డాటా సెంటర్ ప్రణాళిక నివేదిక తయారయ్యింది. మార్చి 2010 నాటికి పని చేయాల్సి ఉంది.

మూలాలు[మార్చు]

  1. జాతీయ ఇ-పాలన ప్రణాళిక భారత ప్రగతి ద్వారం [permanent dead link]
  2. "ఆంధ్రప్రదేశ్ లో సాధారణ సేవా కేంద్రాల స్థితి (ఇంగ్లీషులో)". Archived from the original on 2010-11-25. Retrieved 2009-11-14.