ఇందిరాదేవి(బరోడా రాకుమారి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indira Raje of Baroda as a young girl with her mother, Chimnabai II, wearing a 'Nauvari', a traditional Maharashtrian sari

ఇందిరాదేవి 1892 ఫిబ్రవరిలో 19న ఇందిరా రాజేగా (1892 ఫిబ్రవరి - 1968 సెప్టెంబరు 6) జన్మించింది.ఆమె కూచ్ బెహర్ జితేంద్ర నారాయణ్‌ను (బరోడా)వివాహం చేసుకుంది. ఇందిరాదేవి ఆమె కుమారుని మైనారిటీ తీరేవరకు కూచ్ బెహర్ రాజప్రతినిధిగా బాధ్యత వహించింది.

బరోడాలో[మార్చు]

Jagaddipendra Narayan of Cooch Behar

ఇందిరాదేవి మహారాజు మూడవ గేక్వర్డ్, ఆయన రెండవభార్య మహారాణి చిమ్నాభాయి (1872-1958) ఏకైక కుమార్తెగా జన్మించింది. ఆమె బరోడాలోని లక్ష్మి విలాస్ ప్యాలెస్‌లో పలువురు సోదరులతో పెరిగింది.ఆమెకు చిన్నవయసులోనే గ్వాలియర్ మహారాజు " మాధవరావు సింధియా "తో వివాహం నిశ్చయించబడింది. నిశ్చితార్ధం సమయంలో ఆమె డెల్లీ దర్బారు (1911) కు చేరుకుంది. అక్కడ ఆమె కూచ్ బెహర్ మహారాజు తమ్ముడు జితేంద్రను కలుసుకుంది. వారిరువురు ప్రేమించుకుని తరువాత వివాహమాడాలని నిశ్చయించుకున్నారు.

నిశ్చితార్ధం విచ్ఛిన్నమైన తరువాత[మార్చు]

ఆమె తల్లితండ్రులు ఇందిరాదేవి ప్రేమవిషయం తెలుసుకుంటే నిర్ఘాంతపోతారని పలు వివాదాలు తలెత్తుతాయని ఇందిరాదేవికి తెలుసు. గ్వాలియర్ పాలకునితో చేసుకున్న నిశ్చితార్ధం నిలిచిపోతే ఇరు రాజ్యాలమద్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయని, జితేంద్రా చిన్నకుమారుడు కనుక ఎప్పటికీ రాజు కాగలిగిన అవకాశం లేదని కూడా తెలుసు.

తన తల్లితండ్రులను చిక్కుపరిస్థితి నుండి బయటపడేలా చేయాలని ఇందిరాదేవి నిశ్చయించుకుంది. 18 సంవత్సరాల ధైర్యశాలి వధువైన ఇందిరాదేవి నిశ్చయించబడిన వరునికి తాను ఆయనను వివాహం చేసుకోవడానికి అయిష్టతగా ఉన్నానని వ్రాతపూర్వకంగా తెలియజేసింది. బరోడాలో ఉన్న ఇందిరాదేవి తండ్రి గ్వాలియర్ మహారాజు నుండి " రాకుమారి లేఖద్వారా తెలిపిన అభిప్రాయానికి అర్ధం ఏమిటి? " అని ప్రశ్నిస్తూ ఒక తంతిని పంపాడు. ఆమె తల్లితండ్రులు ఇది తెలుసుకుని స్తంభించారు. గ్వాలియర్ మహారాజా విభిన్నరీతిలో స్పందిస్తూ వ్రాసిన లేఖలో ఇందిరాదేవి తల్లితండ్రులను తల్లితంద్రులులా భావిస్తూ మీ కుమారుడు అని సంతకం చేసాడు.

వివాహం[మార్చు]

నిశ్చితార్ధం విచ్ఛిన్నం అయింది. అయినప్పటికీ ఇందిరాదేవి ధిక్కారానికి అప్రసన్నులైన ఆమె తల్లితండ్రులు జితేంద్రాతో వివాహానికి సహకారం అందించలేదు. వారు జితేంద్రను బాధ్యతారహితునిగా భావించారు. వారు జితేద్రకు ఈ వ్యవహారానికి దూరంగా ఉండమని వ్యక్తిగతమైన బెదిరింపు జారీచేసారు. అయినప్పటికీ ఈ ప్రయత్నాలన్ని నిష్ఫలం అయ్యాయి. ఇందిరాదేవి, జితేంద్ర మొండితనం ప్రదర్శించారు. చివరికి ఇందిరాదేవి తల్లితండ్రులు వారి వివాహానికి అయిష్టంగా అంగీకరించి వారిని ఇల్లు విడిచిపోయి వివాహం చేసుకోవాలని అర్ధాంగీకారం తెలిపారు.తరువాత ఇందిరాదేవి, జితేంద్రా లండన్ చేరుకుని వివాహం చేసుకున్నారు.

ఇందిరా, జితేంద్రా లండన్‌లోని హోటెల్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఇందిరాదేవి కుటుంబం నుండి ఎవరూ హాజరు కాలేదు. వారు జితేంద్ర తల్లి సునీతిదేవి (కేసుబ్ చందర్ సేన్) అనుసరించిన బ్రహ్మసమాజ విధానంలో వివాహం చేసుకున్నారు.

కోచ్ బెహర్ లో[మార్చు]

ఇందిరాదేవి, జితేంద్రల వివాహసమయంలో జితేంద్ర అన్న కూచ్ బెహర్ మహారాజు తీవ్రమైన అశ్వస్థకు గురైయ్యాడు. వివాహం జరిగిన తరువాత కొన్ని రోజులలోనే మహారాజు మరణించాడు. మహారాజు మద్యపానం కారణంగా కలిగిన అస్వస్థతో మరణించారని భావించారు. తరువాత జితేంద్ర కూచ్ బెహర్ రాజసింహాసనం అధిష్ఠించాడు. రాజదంపతులు సంతోషకరమైన జీవితం కొనసాగించారు.వారికి 5 గురు సంతానం కలిగారు.మద్యపానవ్యసనం జితేద్ర కుటుంబానికి శాపంగా మారింది. వివాహం జరిగిన దశాబ్ధంలోపుగా జితేంద్ర కూడా మరణించాడు.

ఇందిరాదేవి ఐదుగురు సంతానంతో పాటు చిన్నవయసులో వైధవ్యం అనుభవించింది. ఆమె కుమారుడు మైనారిటీ తీరేవరకు ఆమె కూచ్ బెహర్ రాజప్రతినిధిగా బాధ్యత వహించింది. ఆమె తనజీవిత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నది. ఆమె నిర్వహణా సామర్ధ్యాన్ని పరిశీలకులు మధ్యస్థంగా భావించినప్పటికీ ఇందిరాదేవి సాంఘిక జీవితంలో చురుకుగా వ్యవహరించింది. ఆమె దీర్ఘకాలం కూచ్ బెహర్‌కు దూరంగా ఐరోపా‌లో గడిపింది.

సంతానం[మార్చు]

ఇందిరాదేవికి ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు.

  • ఆమె పెద్ద కుమారుడు జగదీపేంద్ర నారాయణ్ తండ్రి తరువాత రాజసింహాసనం అధిష్ఠించాడు.వారి సింహాసనానికి ఆయన చివరి పాలకుడయ్యాడు. తరువాత కూచ్ బెహర్ సమైక్య భారతదేశంలో విలీనం చేయబడింది. ఆయనకు వారసులు లేరు ఆయన సోదరుని కుమారుడు విరాజేంద్ర ఆయన తరువాత రాజరిక వారసుడు అయ్యాడు.
  • జితేంద్ర రెండవ కుమారుడు ఇంద్రజితేంద్ర పిఠాపురం (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్) రాకుమారిని వివాహం చేసుకున్నాడు. వారికి విరాజేంద్ర, ఉత్తరాదేవి అనే సంతానం ఉన్నారు. విరాజేంద్ర కూచ్ బెహర్ రాజపదవి చేపట్టాడు. ఉత్తరాదేవి రాజస్థాన్ లోని కోట రాజ్యానికి రాణి అయొంది.
  • ఇందిరా పెద్దకుమార్తె ఇలాదేవి త్రిపురా మాహారాజును వివాహం చేదుకుంది. ఆమె కుమారుడు చలనచిత్ర నటి మున్ మున్ సేన్‌ను వివాహం చేసుకున్నాడు. వారు బాలీవుడ్ చలనచిత్ర నటీమణులైన రీమాసేన్, రియాసేన్ లకు జన్మనిచ్చారు.
  • ఇందిరాదేవి రెండవ కుమార్తె గాయత్రీదేవి జైపూర్ మహారాజుకు మూడవభార్య అయింది. ఆమె స్వయంగా ప్రముఖవ్యత్వం సంతరించుకుంది.
  • ఇందిరాదేవి కనిష్ఠ కుమార్తె మేనకాదేవి దేవస్ మహారాజును వివాహం చేసుకుంది.

తరువాత జీవితం[మార్చు]

ఇందిరా పెద్దకుమారుడు 1936లో కూచ్ బెహర్ రాజ్యపాలకుడుగా సంపూర్ణ అధికారం పొందాడు. తరువాత ఇందిరాదేవి ఎక్కువ కాలం ఐరోపా‌లో గడిపింది. ఇందిరాదేవి తన జీవితంలో పలు విషాదాలను ఎదుర్కొన్నది. ఆమె తన జీవితంలో ఇద్దరు సంతానాన్ని కోల్పోయింది. రాకుమారి ఇలాదేని తన చిన్నవయసులోనే మరణించింది. రాకుమారుడు ఇంద్రజిత్ నారాయణ్‌ భూప్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య కమల (పిఠాపురం) వైధవ్యం అనుభవించింది. మహారాణి ఇందిరా దేవి తన చివరి జీవితం ముంబయిలో గడిపి అక్కడే 1968లో మరణించింది.

మూలాలు[మార్చు]