ఇందిరా హిందుజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇందిరా హిందుజా
నివాసంబొంబాయి
మహారాష్ట్ర
పౌరసత్వంభారతీయురాలు
జాతీయతభారతీయురాలు
రంగములువంధ్యత్వం
వృత్తిసంస్థలుకె. ఇ. ఎం. ఆసుపత్రి, బొంబాయి
చదువుకున్న సంస్థలుబొంబాయి విశ్వవిద్యాలయము
ముఖ్యమైన పురస్కారాలుపద్మశ్రీ (2012)

పద్మశ్రీ డాక్టర్ ఇందిరా హిందూజా ఎం.డి, పిహెచ్‍డి భారతదేశానికి చెందిన పేరొందిన స్త్రీ వ్యాధి నిపుణులు, ప్రసూతి వైద్యురాలు, సంతాన సాఫల్య నిపుణురాలు. ఈవిడ బొంబాయి లోని హిందుజా ఆసుపత్రి లో వైద్య సేవలు అందిస్తున్నారు.[1]. 1986, ఆగస్టు 6న బొంబాయి లోని కె. ఇ. ఎం. ఆసుపత్రిలో భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబి ఈవిడ ఆధ్వర్యంలోనే జన్మించింది.[2].గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ (GIFT) అనే ప్రక్రియలో సిద్దహస్తులు. ఈ విధానం ద్వారా మనదేశంలో 1988, జనవరి 4 న భారతదేశపు మొట్టమొదటి GIFT శిశువుని జన్మింపజేశారు. అదే విధంగా సంతాన భాగ్యం లేని లక్షదాది మహిళలకు అండ దానము ప్రక్రియ ద్వారా సంతానభాగ్యం కలిగించారు. ఇదే విధానంలో 1991, జనవరి 24 న మనదేశంలో మొదటి శిశువు జన్మించింది.[3]

విద్యాభ్యాసము[మార్చు]

Human In Vitro Fertilization and Embryo Transfer' అనే అంశంపై పరిశోధనా పత్రం సమర్పించి బొంబాయి విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా అందుకున్నారు. కె. ఇ. ఎం. ఆసుపత్రి, బొంబాయి లో పూర్తికాలపు ప్రసూతి , సంతానసాఫల్య నిపుణురాలుగా పనిచేస్తున్నారు. అలాగే ముంబాయి పి.డి. హిందూజా జాతీయ ఆసుపత్రి , పరిశోధనాశాల లో ప్రసూతి , సంతానసాఫల్య విభాగంలో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పురస్కారములు[మార్చు]

 • యువ భారతీయురాలు (Young Indian) పురస్కారము (1987)
 • Outstanding Lady Citizen of Maharashtra State Jaycee Award (1987)
 • భాతర్ నిర్మాణ్ పురస్కారము (1994)
 • ముంబాయి మేయర్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కారము (1995; 2000)
 • Federation of Obstetrics and Gynaecological Society of India ద్వారా జీవితకాల సాఫల్య పురస్కారము (1999)
 • మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధన్వంతరి పురస్కారము (2000)
 • భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారము (2011)[4]

మూలాలు[మార్చు]

 1. Profile of Dr. Indira Hinduja at Hinduja Hospital.
 2. "India's First Test Tube Baby". New Strait Times. August 8, 1986.
 3. "Dr. Indira Ahuja Profile". NDTV Doctor. July 20, 2009.
 4. "Padma Awards Announced" (Press release). Ministry of Home Affairs. 25 January 2011.