ఇంద్రధనుస్సు (1978 సినిమా)
Jump to navigation
Jump to search
ఇంద్రధనుస్సు (1978 సినిమా) (1978 తెలుగు సినిమా) | |
![]() ఇంద్రధనుస్సు సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.బాపయ్య |
తారాగణం | కృష్ణ, శారద |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | ఉదయ లక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ[మార్చు]
సంపన్నుడైన రాజశేఖరానికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడైన గోపాల్ ధనం ఉన్నదనే అహంతో వక్రమార్గాన పడతాడు. రెండవ కొడుకు ప్రతాప్ పోలో ఆటలో ఛాంపియన్. సామ్యవాది. ప్రతాప్ గుర్రాలకు పాలిష్ చేసేవాని కూతురు శాంతను ప్రేమిస్తాడు. ఇది తెలిసిన రాజశేఖరం మండిపడి నోట్లకట్టలను తీసుకుని శాంత తండ్రి మొఖాన కొట్టి శాంతకు వేరే పెళ్లి చేయమంటాడు. శాంత సవతి తల్లి ఆ డబ్బు తీసుకుని రాజశేఖరానికి భరోసా ఇస్తుంది. వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన శాంత పెళ్లిరోజున మరణిస్తుంది. ప్రతాప్ ఇది భరించలేక మానసిక శాంతి కోసం ఎస్టేట్‌కు వెళతాడు. ఎస్టేట్‌లో అచ్చం శాంత మాదిరే వున్న మరో అమ్మాయి తారసపడుతుంది. శాంతను కోల్ఫోయి ప్రశాంతత కోసం వచ్చిన ప్రతాప్‌కు మళ్లీ అశాంతి ఏర్పడుతుంది[1].
తారాగణం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- నిర్మాతలు: టి.సుబ్బారాయుడు, ఎన్.సుధాకర్
- దర్శకుడు: కె.బాపయ్య
- కథ: మోదుకూరి జాన్సన్
- గీత రచన: ఆత్రేయ
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: పి.భాస్కర్
- కళ: రామలింగేశ్వరరావు
- కూర్పు: నరసింహారావు
గీతాలు[మార్చు]
- నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ఏడు రంగుల ఇంద్రధనుస్సు ఈడు వచ్చిన నా వయసు - పి.సుశీల
- తడసిన కోక కట్టుకుని కడవ సంకన పెట్టుకుని వస్తుంటే - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ప్రేమకు మరణం లేదు దానికి ఓటమి లేనేలేదు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- మూసుకొ మూసుకొ తలుపులన్నీ మూసుకో గడియలన్నీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ↑ వెంకట్రావ్ (21 January 1979). "చిత్రసమీక్ష ఇంద్రధనుస్సు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 64, సంచిక 287. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 6 January 2018.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help)