ఇంద్రవెల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంద్రవెల్లి
—  మండలం  —
అదిలాబాదు జిల్లా పటంలో ఇంద్రవెల్లి మండల స్థానం
అదిలాబాదు జిల్లా పటంలో ఇంద్రవెల్లి మండల స్థానం
ఇంద్రవెల్లి is located in తెలంగాణ
ఇంద్రవెల్లి
ఇంద్రవెల్లి
తెలంగాణ పటంలో ఇంద్రవెల్లి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 19°29′40″N 78°40′13″E / 19.494347°N 78.670163°E / 19.494347; 78.670163
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం ఇంద్రవెల్లి
గ్రామాలు 34
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.46%
 - పురుషులు 63.88%
 - స్త్రీలు 35.54%
పిన్‌కోడ్ 504346

ఇంద్రవెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఉట్నూరు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంక వివరాలు[మార్చు]

2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47435. ఇందులో పురుషుల సంఖ్య 23602, మహిళలు 23833. అక్షరాస్యుల సంఖ్య 25139.

2001 లెక్కల ప్రకారం ఇంద్రవెల్లి మండల జనాభా 38642. ఇందులో పురుషుల సంఖ్య 19045, మహిళలు 19597. షెడ్యూల్ కులాలవారు 4666, షెడ్యూల్ తెగల వారు 23361 మంది ఉన్నారు. మండల జనాభాలో 60% పైగా షెడ్యూల్ తెగల వారున్నారు.[3]

వ్యవసాయం, పంటలు[మార్చు]

ఇంద్రవెల్లి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10646 హెక్టార్లు, రబీలో 534 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[4]

1981లో ఏప్రిల్ 20న పోలీసు కాల్పుల్లో ఎంతో మంది ఆదివాసీలు మృత్యువాతపడటంతో.. ఇంద్రవెల్లి మరో జలియన్​వాలాబాగ్​గా ప్రాచుర్యం పొందింది

ఇంద్రవెల్లిలోని ఆనాటి సంఘటనలు[మార్చు]

 • 1981, ఏప్రిల్ 20: పోలీసు కాల్పులలో అనేక మంది గిరిజనులు మరణించారు. దానికి గుర్తుగా గ్రామంలో అమరవీరుల స్తూపం నిర్మించబడింది.[5]

మండలానికి చెందిన కొన్ని విషయాలు[మార్చు]

 • గ్రామపంచాయతీలు: 15
 • చెరువులు: 7
 • పోస్టాఫీసులు: 10
 • బస్ స్టాపులు: 10
 • రైల్వేస్టేషన్లు: లేవు
 • గ్రంథాలయాలు: 2

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 25 (ఇరవైఐదు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
 3. Statistics Book of Adilabad, 2004-05
 4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 111
 5. మన ఆదిలాబాదు, మడిపల్లి భద్రయ్య రచన, ప్రథమ ముద్రణ మార్చి 2008, పేజీ 108

వెలుపలి లంకెలు[మార్చు]