ఇన్శాట్- 4CR ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్శాట్- 4CR ఉపగ్రహం
మిషన్ రకంసమాచార ఉపగ్రహం
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2007-037A Edit this at Wikidata
SATCAT no.32050
వెబ్ సైట్http://www.isro.org/satellites/insat-4cr.aspx
మిషన్ వ్యవధి12 years (planned)
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-2K
తయారీదారుడుఇస్రో
లాంచ్ ద్రవ్యరాశి2,168 kilograms (4,780 lb)
శక్తి3000 W
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ2 September 2007, 12:51 (2007-09-02UTC12:51Z) UTC
రాకెట్GSLV Mk.I F04
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం SLP
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం74° East
Perigee altitude35,779 kilometres (22,232 mi)[1]
Apogee altitude35,809 kilometres (22,251 mi)[1]
వాలు0 degrees[1]
వ్యవధి1,436.1 minutes[1] minutes[1]
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్12 Ku band
కవరేజ్ ప్రాంతంIndia
TWTA శక్తి140 watts
EIRP51.5 decibel-watts
 

ఇన్శాట్-4 CRఒక సమాచార ఉపగ్రహం.ఈ ఉపగ్రహాన్ని ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టంలో భాగంగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తయారు చేసి ప్రయోగించారు.ఈ ఉపగ్రహాన్ని సెప్టెంబరు నెల 2007 లో ప్రయోగించారు.అంతకు ముందు సంవత్సరం ప్రయోగింపబడి, కక్ష్యలో ప్రవేశపెట్టటంలో విఫలమైన ఇన్శాట్-4 C ఉపగ్రహం స్థానంలో ప్రవేశపెట్టుటకై ఇన్శాట్-4 CR ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. తూర్పు రేఖాంశంలో 74 డిగ్రీల వద్ద భూస్థిరకక్ష్యలో ప్రవేశపెట్టారు.ఈ ఉపగ్రహం నిజానికి సేవలు అందించవలసిన జీవిత కాలం 10 సంవత్సరాలు.అయితే ఉపగ్రహాన్ని నిర్దేశించిన కక్ష్యలో ప్రవేశపెట్టవలసిన భూసమస్థితి ఉపగ్రహ వాహకనౌక అనుకున్న విధంగా పూర్తిగా సక్రమంగా పనిచెయ్యకపోవడం వలన ఉపగ్రహ జీవితకాలం కుదింపబడింది.

ఉపగ్రహం[మార్చు]

ఇన్శాట్-4 CR ఉపగ్రహాన్ని భారతీయ ప్రతిష్ఠాత్మక అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రోచే I-2K ఉపగ్రహ బస్ ఆధారంగా రూపకల్పన చెయ్యబడి, నిర్మింపబడినది.[2] ఇన్శాట్-4 CR బరువు 2,168 కిలోగ్రాములు (4,780 పౌండ్లు).ఉపగ్రహంలో 36 MHz పౌనపుణ్యంలో పనిచేయు 12 Ku-బ్యాండు ట్రాన్స్‌పాండరులు,140 వాట్స్ శక్తి కలిగిన ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ ఆంప్లిఫైర్లు (TWTA power) పవర్ యూనిట్ అమర్చారు.ఈ ఉపగ్రహం 51.5 dBW ఎఫెక్టివ్ ఐసోట్రోపిక్‌ రేడియేటెడ్ పవర్ కలిగి ఉంది.బెకాన్ ట్రాకింగ్ కై అదనంగా ఒక Kuబ్యాండు సిగ్నల్ ను ఉపయోగించారు. ఉపగ్రహం విద్యుత్తు శక్తి 3000 Watts.ఉపగ్రహం పరిమాణం 1.65X1.53కX 2.4 మీట్ర్ల దీర్ఘచతురస్రాకారం.ఉపగ్రహానికి ఒక 2.2X2 మీటర్ల ఆఫ్‌సెటాకారపు పరావర్తక యాంటెన్నాతూర్పు వైపున, మరో 1.4మీటరు ఆఫ్‌సెటాకారపు పరావర్తక యాంటెన్నా పశ్చిమవైపున ఏర్పాటు చేసారు.విద్యుతు ఉత్పత్తికై రెక్కలవంటి రెండు సౌర పలకలను కలిగిఉన్నది.2x70Ah నికెల్ హైడ్రోజను బ్యాటరిని అనుసంధానించారు.[3]

ఇన్శాట్-4 CR ఉపగ్రహం 74 డిగ్రీల తూర్పు రేఖాంశాల వద్ద భూస్థిరకక్ష్యలో తిరుగుచు, సమాచారాన్ని భారతదేశానికి అందిస్తున్నది.[4] ఉపగ్రహంలోని బ్రాడ్ కాస్టింగ్/ప్రసారం చేయు నిర్వహణన ఎయిర్‌టెల్‌ డిజిటల్ TV (Airtel Digital TV), సన్ డైరెక్ట్ DTH (Sun Direct DTH ) కి కేటాయించారు.

ప్రయోగానంతరం ఉపగ్రహం తనకుతానుగా నిర్దేశిత భూస్థిరకక్ష్యలో ప్రవేశింపచేసుకొనుటకు ఇంజనును మండించుటకై, మధ్యలో ఇంజనును పనిచేయుస్తూ 12 సంవత్సరాల జీవితకాలం ప్రదక్షిణలు చేయ్యుటకై ప్రయోగ సమయంలో ఉపగ్రహంలో 1,218 కిలోల (2,685పౌండ్ల) ఇంధనాన్నినింపి ఉంచారు.[2]

ఉపగ్రహ ప్రయోగం[మార్చు]

ఇన్శాట్-4CR ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటరు నుండి 2007 సెప్టెంబరు 2 12:51 (UTCకాలమానమము) గంటలకు, GSLV-F04 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షములోకి పంపారు.[5] ఉపగ్రహ వాహకనౌక/రాకెట్ లోని మూడవ దశఅనుకున్న విధంగా పనిచెయ్యక పోవడం వలన ఉపగ్రహాన్ని అంతకు ముందు నిర్ణ యించినట్లుగా నిర్దేశించిన కక్ష్యలో ప్రవేశ పెట్టలేక పోయారు.

ప్రయోగానంతరం ఉపగ్రహం తనకుతానుగా నిర్దేశిత భూస్థిరకక్ష్యలో ప్రవేశింపచేసుకొనుటకు ఇంజనును మండించుటకై, మధ్యలో ఇంజనును పనిచేయుస్తూ 12 సంవత్సరాల జీవితకాలం ప్రదక్షిణలు చేయ్యుటకై ప్రయోగ సమయంలో ఉపగ్రహంలో 1,218 కిలోల (2,685పౌండ్ల) ఇంధనాన్నినింపి ఉంచారు. ప్రయోగ సమయంలో ఉపగ్రహ వాహకనౌక అనుకున్న కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనందున, ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ఉంచుటకై అధికమొత్తంలో ఉపగ్రహంలోని ఇంధనాన్ని వాడటంవలన సేవలందించ వలసిన ఉపగ్రహ జీవితకాలం తగ్గిపోయింది.ఇందువలన 5 సంవత్సరాల ఉపగ్రహ సేవలను నష్టపోయారు[6].కక్ష్యలో ఉపగ్రహం పెరిజీ దూరం35,779 కిలోమీటర్లు, అపోజీ 35,809 కిలోమీటర్లు, వాలుతలం 0 డిగ్రీలు,, ప్రదక్షణ సమయం 1,436.1 నిమిషాలు.

ఇవికూడా చూడండి[మార్చు]

ఆధారాలు/మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "INSAT 4CR". N2YO. Retrieved 29 November 2011.
  2. 2.0 2.1 Krebs, Gunter. "Insat 4C, 4CR". Gunter's Space Page. Retrieved 29 November 2011.
  3. "gslv brochures" (PDF). isro.gov.in. ఇస్రో. Archived from the original (PDF) on 2015-11-14. Retrieved 2015-09-08.
  4. "INSAT 4CR". The Satellite Encyclopedia. Retrieved 29 November 2011.
  5. McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 29 November 2011.
  6. Ram, Arun (15 December 2007). "Isro satellite 'disappears', loses five years of life". DNA. Retrieved 29 November 2011.