ఇన్‌శాట్
ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ లేదా ఇన్సాట్ అనేది టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్‌కాస్టింగ్, వాతావరణ శాస్త్రం, శోధన, రెస్క్యూ కార్యకలాపాలలో తోడ్పడడానికి ఇస్రో ప్రారంభించిన బహుళార్ధసాధక భూస్థిర ఉపగ్రహాల శ్రేణి. 1983లో మొదలైన ఈ ఇన్సాట్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థ. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ఇండియా మెటీరోలాజికల్ డిపార్ట్‌మెంట్, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌ల సంయుక్త కార్యక్రమం. ఇన్సాట్ మొత్తం సమన్వయం, నిర్వహణ సెక్రటరీ-స్థాయి ఇన్సాట్ కోఆర్డినేషన్ కమిటీ చేస్తుంది.
భారతదేశ టెలివిజన్, సమాచార ప్రసార అవసరాలను తీర్చడానికి ఇన్‌శాట్ ఉపగ్రహాలలో వివిధ బ్యాండ్‌లలో ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. వాతావరణ ఇమేజింగ్ కోసం కొన్ని ఉపగ్రహాల్లో వెరీ హై రిజల్యూషన్ రేడియోమీటర్ (VHRR), CCD కెమెరాలు కూడా ఉన్నాయి. ISRO Cospas-Sarsat ప్రోగ్రామ్‌లో సభ్యులు కాబట్టి, దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శోధన, రెస్క్యూ మిషన్‌ల కోసం డిస్ట్రెస్ అలర్ట్ సిగ్నల్‌లను స్వీకరించడానికి కూడా ఈ ఉపగ్రహాల్లో ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి.
ఇన్‌శాట్ వ్యవస్థ
[మార్చు]1983 ఆగస్టులో ఇన్‌శాట్-1B ప్రయోగంతో ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్‌శాట్) సిస్టమ్ మొదలైంది. మొదటి ఉపగ్రహం ఇన్‌శాట్-1A ను 1982 ఏప్రిల్లో ప్రయోగించినప్పటికీ, ఆ ప్రయోగం విఫలమైంది. ఇన్‌శాట్ వ్యవస్థ భారతదేశపు టెలివిజన్, రేడియో ప్రసారాలు, టెలికమ్యూనికేషన్స్, వాతావరణ రంగాలలో విప్లవానికి నాంది పలికింది. ఇది దూర ప్రాంతాలకు, ఆఫ్-షోర్ ద్వీపాలకు కూడా టీవీ, ఆధునిక టెలికమ్యూనికేషన్ సౌకర్యాలను వేగంగా విస్తరించడానికి వీలు కల్పించింది. మొత్తంగా, వివిధ రకాల కమ్యూనికేషన్ సేవల కోసం ఈ వ్యవస్థలో C, ఎక్స్‌టెండెడ్ C, K u బ్యాండ్‌లలో ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. కొన్ని ఇన్సాట్‌లలో వాతావరణ పరిశీలన, వాతావరణ సేవలను అందించడానికి డేటా రిలే కోసం కూడా పరికరాలు ఉన్నాయి. కల్పన-1 ఒక ప్రత్యేకమైన వాతావరణ ఉపగ్రహం. హాసన్, భోపాల్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీల ద్వారా ఈ ఉపగ్రహాలను పర్యవేక్షిస్తారు.
సేవలో ఉన్న ఉపగ్రహాలు
[మార్చు]ఇన్సాట్ ప్రోగ్రామ్‌లో ప్రయోగించబడిన 24 ఉపగ్రహాలలో 11 ఇప్పటికీ పనిచేస్తున్నాయి. [1]
జీశాట్ శ్రేణి
[మార్చు]జీశాట్ ఉపగ్రహాలు భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన సమాచార ఉపగ్రహాలు. ఇవి సైనిక, పౌర వినియోగదారుల కోసం డిజిటల్ ఆడియో, డేటా, వీడియో ప్రసారాలకు ఉపయోగపడతాయి. 2018 నవంబరు నాటికి, ఇస్రో 19 జీశాట్ ఉపగ్రహాలను ప్రయోగించగా, వాటిలో 15 ఉపగ్రహాలు ప్రస్తుతం సేవలో ఉన్నాయి.
వాణిజ్య సమాచార ఉపగ్రహం
[మార్చు]- ExseedSat-1 అనేది శాటిలైజ్ సంస్థ (గతంలో ఎక్సీడ్ స్పేస్ అని పిలిచేవారు) తయారు చేసిన మొదటి భారతీయ వాణిజ్య ఉపగ్రహం. ఇది 2018 డిసెంబరు 6 న [2] SpaceX ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహం.
- ExseedSat-2 (AISAT) పిఎస్‌ఎల్‌వి-C45 ద్వారా ప్రయోగించిన Amsat భారతదేశం కోసం నిర్మించిన రెండవ భారతీయ వాణిజ్య ఉపగ్రహం. [3]
భారతీయ కమ్యూనికేషన్ ఉపగ్రహాల లాంచ్ లాగ్
[మార్చు]Serial No. | ఉపగ్రహం | ప్రయోగ తేదీ | ప్రయోగ వాహనం | స్థితి |
1 | ఇన్‌శాట్-1A | 10 ఏప్రిల్ 1982 | Delta | కక్ష్యలో విఫలమైంది |
2 | ఇన్‌శాట్-1B | 30 ఆగస్టు 1983 | Shuttle PAM-D | పని ముగించింది |
3 | ఇన్‌శాట్-1C | 22 జూలై 1988 | ఏరియేన్-3 | కక్ష్యలో పాక్షికంగా విఫలమైంది |
4 | ఇన్‌శాట్-1D | 12 జూన్ 1990 | Delta | పని ముగించింది |
5 | ఇన్‌శాట్-2A | 10 జూలై 1992 | ఏరియేన్-4 | పని ముగించింది |
6 | ఇన్‌శాట్-2B | 23 జూలై 1993 | ఏరియేన్-4 | పని ముగించింది |
7 | ఇన్‌శాట్-2C | 7 డిసెంబరు 1995 | ఏరియేన్-4 | పని ముగించింది |
8 | ఇన్‌శాట్-2D | 4 జూన్ 1997 | ఏరియేన్-4 | కక్ష్యలో విఫలమైంది |
9 | ఇన్‌శాట్-2E | 3 ఏప్రిల్ 1999 | ఏరియేన్-4 | పని ముగించింది |
10 | ఇన్‌శాట్-3B | 22 మార్చి 2020 | ఏరియేన్-5 | పని ముగించింది |
11 | జీశాట్-1 | 18 ఏప్రిల్ 2001 | జిఎస్‌ఎల్‌వి | పని ముగించింది |
12 | ఇన్‌శాట్-3C | 24 జనవరి 2002 | ఏరియేన్-5 | పని ముగించింది |
13 | KALPANA-1 | 12 సెప్టెంబరు 2002 | పిఎస్‌ఎల్‌వి | పని ముగించింది |
14 | ఇన్‌శాట్-3A | 10 ఏప్రిల్ 2003 | ఏరియేన్-5 | పని ముగించింది |
15 | జీశాట్-2 | 8 మే 2003 | జిఎస్‌ఎల్‌వి | |
16 | ఇన్‌శాట్-3E | 28 సెప్టెంబరు 2003 | ఏరియేన్-5 | |
17 | EDUSAT | 20 సెప్టెంబరు 2004 | జిఎస్‌ఎల్‌వి | పని ముగించింది |
18 | HAMSAT | 5 మే 2005 | పిఎస్‌ఎల్‌వి | |
19 | ఇన్‌శాట్-4A | 22 డిసెంబరు 2005 | ఏరియేన్-5 | |
20 | ఇన్‌శాట్-4C | 10 జూలై 2006 | జిఎస్‌ఎల్‌వి | ప్రయోగం సఫలం |
21 | ఇన్‌శాట్-4B | 12 మార్చి 2007 | ఏరియేన్-5 | పని ముగించింది |
22 | ఇన్‌శాట్-4CR | 2 సెప్టెంబరు 2007 | జిఎస్‌ఎల్‌వి | |
23 | జీశాట్-4 | 15 ఏప్రిల్ 2010 | జిఎస్‌ఎల్‌వి | ప్రయోగం సఫలం |
24 | జీశాట్-5P | 25 డిసెంబరు 2010 | జిఎస్‌ఎల్‌వి-F06 | ప్రయోగం సఫలం |
25 | జీశాట్-8 | 21 మే 2011 | ఏరియేన్-5 | |
26 | జీశాట్-12 | 15 జూలై 2011 | పిఎస్‌ఎల్‌వి-C17 | |
27 | జీశాట్-10 | 29 సెప్టెంబరు 2012 | ఏరియేన్-5 | |
28 | జీశాట్-7 | 30 ఆగస్టు 2013 | ఏరియేన్-5 | |
29 | జీశాట్-14 | 5 జనవరి 2014 | జిఎస్‌ఎల్‌వి-D5 | |
30 | జీశాట్-16 | 7 డిసెంబరు 2014 | ఏరియేన్-5 | |
31 | జీశాట్-6 | 27 ఆగస్టు 2015 | జిఎస్‌ఎల్‌వి-D6 | |
32 | జీశాట్-15 | 11 నవంబరు 2015 | ఏరియేన్-5 | |
33 | జీశాట్-18 | 6 అక్టోబరు 2016 | ఏరియేన్-5 | |
34 | జీశాట్-9 | 5 మే 2017 | జిఎస్‌ఎల్‌వి-F09 | |
35 | జీశాట్-19 | 5 జూన్ 2017 | జిఎస్‌ఎల్‌వి MkIII - D1 | |
36 | జీశాట్-17 | 29 జూన్ 2017 | ఏరియేన్-5 | |
37 | జీశాట్-6A | 29 మార్చి 2018 | జిఎస్‌ఎల్‌వి-F08 | Failed in Orbit |
38 | జీశాట్-29 | 14 నవంబరు 2018 | జిఎస్‌ఎల్‌వి MkIII-D2 | |
39 | జీశాట్-11 | 5 డిసెంబరు 2018 | ఏరియేన్-5 | |
40 | జీశాట్-7A | 19 డిసెంబరు 2018 | జిఎస్‌ఎల్‌వి-F11 | |
41 | జీశాట్-31 | 6 February 2019 | ఏరియేన్-5 VA-247 | |
42 | జీశాట్-30 | 17 జనవరి 2020 | ఏరియేన్-5 VA-251 | |
43 | CMS-01 | 17 డిసెంబరు 2020 | పిఎస్‌ఎల్‌వి-C50 | |
44 | CMS-02 | 23 జూన్ 2022 | ఏరియేన్-5 VA-257 |
మూలాలు
[మార్చు]- ↑ GSAT-F06
- ↑ Laxman, Srinivas; Singh, Surendra (5 December 2018). "Exseed Sat 1: Mumbai startup first Indian private firm to have satellite in space". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-01-13.
- ↑ "India in Space through 2019: From RISAT, ASAT and Chandrayaan 2 to big wins for private space- Technology News, Firstpost". Tech2. 2019-12-25. Retrieved 2021-01-13.