Jump to content

ఇమామ్ పసంద్

వికీపీడియా నుండి
హిమాయత్ లేదా హిమామ్ పసంద్ మామిడి

హమామ్ మామిడి, హిమాయత్, హిమామ్ పసంద్ అని వివిధ పేర్లతో పిలుచుకునే ఇమామ్ పసంద్ మామిడికాయలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పండించే ప్రత్యేకమైన మామిడి సాగు. ఈ పేర్లు రీగల్ మూలాలను సూచిస్తాయి, ఇది భారతదేశ రాయల్టీకి ఎంపిక చేసిన ఫలమని చెబుతారు.[1][2]

ఇది మే, జూన్ నెలల్లో మాత్రమే లభిస్తుంది. ప్రతి మామిడికాయ 800 గ్రాముల బరువు వరకు పెరుగుతుంది.[3][4][5]

ఇది దాని ప్రత్యేకమైన రుచికి ప్రాచూర్యం పొందింది. దీనిని 'మామిడి పండ్లలో రాజు' గా పరిగణిస్తారు.[6][7]

ఇమామ్ పసంద్ ముఖ్యంగా మృదువైన తొక్క కలిగి ఉంటుంది, ఇది తినడం సులభం. అయితే, రవాణా చేయడం కష్టతరం అవుతుంది. ఆధునిక రిటైల్ వ్యవస్థలు వాటిని జాగ్రత్తగా ఎలా పొందాలో, పంపిణీ చేయాలో చూసుకుంటున్నాయి. దీని విస్తృత సాగు కారణంగా రిటైల్ దుకాణాలలో లభ్యత పెరిగింది.[8][9][3]

ఇది మొదట కేరళలో పండించబడిందని, మొఘల్ చక్రవర్తి హుమాయున్ కు ప్రియమైనదని (దీనిని స్థానికంగా హుమాయున్ పసంద్ అని పిలువబడేది) కొందరు చెబుతారు.[3][5]

మూలాలు

[మార్చు]
  1. "Eat Your Way Through These Delicious Mango Destinations in India". Archived from the original on 2016-06-04. Retrieved 2016-05-26.
  2. "five-lesser-known-mangoes". Archived from the original on 2016-05-13. Retrieved 2016-05-26.
  3. 3.0 3.1 3.2 "a mango with taste that can challenge the Alphonso?". Archived from the original on 2021-04-24. Retrieved 2019-05-19. None, for me, have seriously challenged the Alphonso, except for one so different from the Alphonso, and yet so good, that comparisons are really pointless.
  4. "Eat Your Way Through India With These 14 Mangoes". Archived from the original on 2015-11-30. Retrieved 2016-05-26.
  5. 5.0 5.1 "A King among Mangoes". Archived from the original on 2017-05-11. Retrieved 2016-05-26.
  6. "living with a mango maniac". Archived from the original on 2018-06-20. Retrieved 2016-05-26.
  7. "Imam Pasand - The mango that is rumoured to be even more impressive than its grand name". Archived from the original on 2016-05-26. Retrieved 2016-05-26.
  8. "widening their boundaries". Archived from the original on 2023-05-12. Retrieved 2016-05-26.
  9. "life of temperate fruits in orchards extended thanks to nanotech". Archived from the original on 2023-05-15. Retrieved 2016-05-26.