ఇమార్తి దేవి
| ఇమార్తి దేవి | |||
స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం జూలై 2020 – నవంబర్ 2020 | |||
| పదవీ కాలం డిసెంబర్ 2018 – మార్చి 2020 | |||
| ముందు | అర్చన చిట్నిస్ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 2008 – నవంబర్ 2020 | |||
| ముందు | నరోత్తం మిశ్రా | ||
| తరువాత | సురేష్ రాజే | ||
| నియోజకవర్గం | డబ్రా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1975 April 14 చర్బరా , మధ్యప్రదేశ్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | దాబ్రా , గ్వాలియర్ జిల్లా, మధ్యప్రదేశ్ , భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
| మూలం | [1] | ||
ఇమార్తి దేవి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు డబ్రా నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా పని చేసింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఇమార్తి దేవి 1975 ఏప్రిల్ 14న దాటియా జిల్లాలోని చార్బరా గ్రామంలో జన్మించింది. ఆమె హయ్యర్ సెకండరీ వరకు చదువుకుంది.
రాజకీయ జీవితం
[మార్చు]ఇమార్తి దేవి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి హరగోవింద్ జౌహరిపై 10630 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 2013 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సురేష్ రాజేపై 33278 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3]
ఇమార్తి దేవి 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో డబ్రా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కప్తాన్ సింగ్ సెహ్సారీపై 57446 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4] డిసెంబర్ 2018 నుండి మార్చి 2020 వరకు మహిళా, శిశు అభివృద్ధి శాఖల మంత్రిగా పని చేసి 2020 మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ సమయంలో ఆమె జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతు నిలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది.
ఇమార్తి దేవి 2020 శాసనసభ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సురేష్ రాజే చేతిలో 7,633 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[5][6] ఆమె 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సురేష్ రాజే చేతిలో 2267 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "इमरती देवी: पॉलिटिक्स में एंट्री के साथ ही बनीं सिंधिया की करीबी, यह हार चुभेगी". Zee News Hindi. 12 November 2020. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 10 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ "I have not lost, have just not won a seat: Imarti Devi" (in ఇంగ్లీష్). The Times of India. 11 November 2020. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "In battleground MP, family bad blood flares up along BJP vs Congress faultlines" (in ఇంగ్లీష్). The Indian Express. 24 October 2023. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "Madhya Pradesh Legislative Assembly Election Results 2023 - Dabra". Election Commission of India. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "Dabra Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.