ఇమ్మడిచెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఇమ్మడిచెరువు
రెవిన్యూ గ్రామం
ఇమ్మడిచెరువు is located in Andhra Pradesh
ఇమ్మడిచెరువు
ఇమ్మడిచెరువు
అక్షాంశ రేఖాంశాలు: 15°17′35″N 79°15′04″E / 15.293°N 79.251°E / 15.293; 79.251Coordinates: 15°17′35″N 79°15′04″E / 15.293°N 79.251°E / 15.293; 79.251 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంవెలిగండ్ల మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,104 హె. (7,670 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,766
 • సాంద్రత89/కి.మీ2 (230/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08402 Edit this at Wikidata)
పిన్(PIN)523224 Edit this at Wikidata

ఇమ్మడిచెరువు, ప్రకాశం జిల్లా, వెలిగండ్ల మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523 224., ఎస్.ట్.డి.కోడ్ = 08402.

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ ముక్కు కాశిరెడ్డి, 1981 లో ఈ గ్రామ సర్పంచిగా గెలుపొందినారు. 1983, 1985, 1994 లలో శాసనసభ్యులుగా, జిల్లా తె.దే.పా. అధ్యక్షులుగా, జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా పనిచేశారు. [1]

విద్య[మార్చు]

కనిగిరి పట్టణం కొత్తపేటకు చెందిన శ్రీ సుంకర బ్రహ్మానందరెడ్డి, వెలిగండ్ల మండలం ఇమ్మడిచెరువు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. వీరు "జన విఙాన వేదిక" కనిగిరి డిజను ప్రధాన కార్యదర్శిగా గూడా పనిచేస్తున్నారు. వీరు భౌతిక, రసాయన శాస్త్రాల అధ్యయనం, విస్తృతికి విశేష కృషి చేస్తున్నారు. వీరి సేవ, ప్రతిభను గుర్తించిన "స్టేట్ కరికులం ఎడ్యుకేషన్" వారు ఈయనను 10వ తరగతి భౌతిక, రసాయనిక శాస్త్ర పాఠ్యాంశ రూపకల్పనకు నియమించిన ఆరుగురు నిపుణులైన ఉపాధ్యాయులలో ఒకరిగా ఎంపిక చేసారు. ఎన్.సి.ఇ.ఆర్.ట్. వారి పదవ తరగతి భౌతిక, రసాయన శాస్త్ర పాఠ్యాంశ రచనకు జిల్లా నుండి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయులు వీరు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2, 766 - పురుషుల సంఖ్య 1, 433 - స్త్రీల సంఖ్య 1, 333 - గృహాల సంఖ్య 638

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2, 374.[2] ఇందులో పురుషుల సంఖ్య 1, 230, మహిళల సంఖ్య 1, 144, గ్రామంలో నివాస గృహాలు 463 ఉన్నాయి.

సమీప గ్రామాలు[మార్చు]

రామలింగపురం 2.8 కి.మీ, రామగోపాలపురం 4.5 కి.మీ, వెదుళ్లచెరువు 5.9 కి.మీ, మరపగుంట 9.4 కి.మీ, కంకణంపాడు 9.6 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

వెలిగండ్ల 10.4 కి.మీ, చంద్రశేఖరపురం 13 కి.మీ, హనుమంతునిపాడు 23.8 కి.మీ, కొమరోలు 27.3 కి.మీ.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-11; 8వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, మే-18; 8వ పేజీ.