ఇయాన్ చాపెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇయాన్ చాపెల్
Chappelli2.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు ఇయాన్ మైఖేల్ చాపెల్
జననం (1943-09-26) 1943 సెప్టెంబరు 26 (వయసు 79)
అన్లీ, సౌత్ ఆస్ట్రేలియా
ఇతర పేర్లు చాపెల్లి
ఎత్తు 1.80 మీ. (5 అ. 11 అం.)
బ్యాటింగ్ శైలి కుడిచేతి వాటం
బౌలింగ్ శైలి కుడి చేయి - లెగ్ స్పిన్
పాత్ర టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్
సంబంధాలు గ్రెగ్ చాపెల్ (సోదరుడు)
ట్రెవర్ చాపెల్ (సోదరుడు)
విక్ రిచర్డ్‌సన్ (తాత)
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు Australia
టెస్టు అరంగ్రేటం(cap 231) 4 December 1964 v Pakistan
చివరి టెస్టు 6 February 1980 v England
వన్డే లలో ప్రవేశం(cap 2) 5 January 1971 v England
చివరి వన్డే 14 January 1980 v England
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1961/62–1979/80 South Australia
1963 Lancashire
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 75 16 262 37
సాధించిన పరుగులు 5,345 673 19,680 1,277
బ్యాటింగ్ సగటు 42.42 48.07 48.35 39.90
100s/50s 14/26 0/8 59/96 0/13
ఉత్తమ స్కోరు 196 86 209 93*
బాల్స్ వేసినవి 2,873 42 13,143 202
వికెట్లు 20 2 176 5
బౌలింగ్ సగటు 65.80 11.50 37.57 28.40
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 2 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0 0
ఉత్తమ బౌలింగ్ 2/21 2/14 5/29 2/14
క్యాచులు/స్టంపింగులు 105/– 5/– 312/1 20/–
Source: Cricinfo, 13 November 2007

1943, సెప్టెంబర్ 26న జన్మించిన ఇయాన్ చాపెల్ (Ian Michael Chappell) దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తరఫున ఆడిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1971 నుండి 1975 వరకు ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ తరువాత ప్రపంచ సీరీస్ క్రికెట్‌లో ప్రవేశించి అక్కడ ప్రధాన పాత్ర వహించాడు. అతడి తాత, సోదరుడు కూడా ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. చాపెల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంలో బాగా స్థిరపడ్డాడు. 2006లో షేర్ వార్న్ తన కెరీర్‌లో చాపెల్ ప్రభావం ఉన్నదని ప్రకటించడం ఇతని గొప్పతనానికి నిదర్శనం.[1]

టెస్ట్ క్రికెట్[మార్చు]

ఇయాన్ చాపెల్ 1964 డిసెంబర్ 4న పాకిస్తాన్ పై తిలిసారిగా టెస్ట్ క్రికెట్ ఆడినప్పటినుంచి 1980, ఫిబ్రవరి 6న ఇంగ్లాండుపై చివరి టెస్ట్ ఆడేవరకు మొత్తం 75 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 42.42 సగటుతో 5345 పరుగులు సాధించాడు. అందులో 14 సెంచరీలు, 26 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 196 పరుగులు. బౌలింగ్‌లో 20 వికెట్లు కూడా సాధించాడు.

వన్డే క్రికెట్[మార్చు]

చాపెల్ 16 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 48.07 సగటుతో 673 పరుగులు సాధించాడు. వన్డేలలో 8 అర్థసెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 86 పరుగులు.

జట్టు నాయకుడిగా[మార్చు]

ఇయాన్ చాపెల్ 1970-1975 మధ్యలో 30 టెస్టులకు నేతృత్వం వహించి 15 టెస్టులను గెలిపించాడు. 5 టెస్టులు ఓడిపోగా మరో పదింటిని డ్రాగా ముగించాడు. 1972-73లో పాకిస్తాన్తో స్వదేశంలో జరిగిన సీరీస్‌లో 3-0 తో విజయం సాధించాడు. నేతృత్వం వహించిన తొలి టెస్టు మినహా ఏ సీరీస్ కూడా ఇతని నుంచి చేజారలేదు.

ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]

1975లో జరిగిన తొలి ప్రపంచ కప్ టోర్నమెంటులో ఇయాన్ చాపెల్ాస్ట్రేలియా జట్టుకు నేతృత్వం వహించాడు. అదే అతను పాల్గొన్న ఏకైక ప్రపంచ కప్ పోటీ.

మూలాలు[మార్చు]

  1. The Age: In Warne's Words. Retrieved 8 October 2007.