ఇయాన్ బెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ian Bell
Ian Bell Trent Bridge 2004.jpg
Flag of England.svg England
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Ian Ronald Bell MBE
మారుపేరు Belly
జననం (1982-04-11) 1982 ఏప్రిల్ 11 (వయస్సు: 37  సంవత్సరాలు)
Coventry, West Midlands, England
ఎత్తు 5 ft 10 in (1.78 m)
పాత్ర Batsman
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right-arm medium
International information
తొలి టెస్టు (cap 626) 19 August 2004: v West Indies
చివరి టెస్టు 04 June 2010: v Bangladesh
తొలి వన్డే (cap 184) 28 November 2004: v Zimbabwe
చివరి వన్డే 26 March 2011:  v Sri Lanka
Domestic team information
Years Team
1999–present Warwickshire
కెరీర్ గణాంకాలు
TestODIFCLA
మ్యాచ్‌లు 62 97 180 216
పరుగులు 4,192 3021 12,277 7,153
బ్యాటింగ్ సగటు 44.12 35.12 45.13 38.45
100s/50s 12/26 1/18 33/65 7/51
అత్యుత్తమ స్కోరు 199 126* 262* 158
వేసిన బంతులు 108 88 2,809 1,290
వికెట్లు 1 6 47 33
బౌలింగ్ సగటు 76.00 14.66 33.27 34.48
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 0 1
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగ్ 1/33 3/9 4/4 5/41
క్యాచ్ లు/స్టంపింగులు 50/– 29/– 126/– 75/–

As of 9 March, 2011
Source: Cricinfo

ఇయాన్ రొనాల్డ్ బెల్ MBE (1982 ఏప్రిల్ 11న పుట్టాడు) ఇంగ్లండ్ టెస్ట్ క్రికెటర్. ఇతడు వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కోసం కౌంటీ క్రికెట్ కూడా ఆడుతుంటాడు. ఇతడు కుడిచేతివాటం హయ్యర్/మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, ది టైమ్స్ పత్రిక ఇతడిని "సున్నితమైన పోటుకత్తి,"[1] అని వర్ణించింది, ఇతడు కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. ఇతడు అత్యంత చురుకైన కదలికలకు పేరు గాంచాడు మరియు మైదానంలో తరచుగా బ్యాట్స్‌మన్‌‍కి అతి దగ్గిరగా ఫీల్డ్ పొజిషన్లను తీసుకుంటుంటాడు.

బెల్ ఇంగ్లండ్ తరపున టెస్టులు మరియు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు రెండింటిలో ఆడుతున్నాడు. ఇతడు పన్నెండు టెస్టు శతకాలు ఒక ODI 100ని సాధించాడు.

2005లో విజయవంతమైన యాషెష్ కేంపెయిన్‌లో తన పాత్రకు గాను 2006 నూతన సంవత్సర గౌరవనీయుల జాబితాలో ఇతడికి MBE అవార్డునిచ్చి సత్కరించారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ద్వారా ఇతడు 2006 నవంబరులో ప్రతిష్ఠాత్మకమైన వర్ధమాన క్రీడాకారుడు అవార్డు అందుకున్నాడు.

2008 మరియు 2009లో, ఇంగ్లాండ్ జట్లలో ఇలా వచ్చి అలా వెళుతుండేవాడు - అయితే 2009 యాషెష్‌ పోటీలో ఇతడు టెస్టుల్లో స్థానాన్ని తిరిగి పొందాడు. ఈ పోటీలో ఇంగ్లండ్ గెలుపొందింది, తదుపరి సంవత్సరంలో ఇతడు అనేక ODIలలో పాల్గొన్నాడు కూడా.

తదుపరి శీతాకాలంలో తన తొలి యాషెష్ సెంచరీ చేయడానికి ముందు 2010లో ఇతడు CB40 ఫైనల్‌లో గెలుపు సాధించిన వార్విక్‌షైర్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేశాడు. ఇంగ్లండ్ యాషెష్‌ని గెల్చుకోవడంలో ఇతడు తోడ్పడ్డాడు.

వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ 2011లో బెల్‌కి ప్రయోజనం చేకూర్చింది.

2011 ఏప్రిల్ 6న, బెల్ తన ప్రియురాలు చాంటల్ బాస్టోక్‌ని వార్విక్‌షైర్‌లోని మల్లోరీ కోర్టు వద్ద వివాహమాడాడు.

విషయ సూచిక

ప్రారంభ జీవితం[మార్చు]

యువకుడిగా బెల్ ప్రిన్స్‌థ్రోప్ కాలేజిలో చేరి తన తొలి XIని 7వ సంవత్సరం పొందాడు. ఇతడు ప్రతిభావంతుడైన యువ క్రికెటర్ మాత్రమే కాదు. ఆస్టన్ విల్లా మద్దతుదారే అయినప్పటికీ, ఇతడు కొవెంట్రీ సిటీ యొక్క స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కి హాజరయ్యాడు. ఇతడి సోదరుడు కీత్ ఇతడు పుట్టిన రెండేళ్ల తర్వాత పుట్టాడు, స్టాఫోర్డ్‌షైర్ జట్టు తరపున ఔత్సాహిక క్రికెట్ ఆడాడు. వార్విక్‌షైర్ రెండవ XI కోసం ఏడు ఆటలు ఆడాడు.

ప్రారంభకాల క్రీడాజీవితం[మార్చు]

1998లో వార్విక్‌షైర్ రెండవ జట్టుకు మూడు సార్లు ఆడాడు. సీనియర్ స్థాయిలో తన తదుపరి మ్యాచ్‌లను శీతాకాలంలో న్యూజిలాండ్ టూర్ వెళుతున్న ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్తో ఆడాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఇతడు 91 పరుగులు చేశాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్సు‌లో 115 పరుగులు చేశాడు. దీంతో డేల్ హ్యాడ్లీ ఇతడిని "16 ఏళ్ల వయస్సు క్రీడాకారులలో తాను చూసిన అత్యుత్తమ ఆటగాడు"గా ప్రకటించాడు,[2] ఇతడిని మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైఖేల్ అథర్టన్‌తో తరచుగా పోల్చి చెబుతుంటారు. అండర్-19 సీరీస్‌లో అనేక మ్యాచ్‌లలో బెల్ ఆడాడు, 2000లో శ్రీలంకపై స్వదేశంలో తలపడిన జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. ఇండియాలో 2000/01 టూర్‌లో, 2001లో వెస్టిండీస్‌పై స్వదేశంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా బెల్ ఆడాడు.

ఈ సమయానికి బెల్ తన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో ఆరంగేట్రం చేశాడు. 1999 సెప్టెంబరులో వార్విక్‌షైర్ తొలి జట్టు ఆడిన సింగిల్ మ్యాచ్‌లో బెల్ పాల్గొన్నాడు. అయితే తన ఏకైక ఇన్నింగ్స్‌లో ఇతడు డక్ అవుట్ అయ్యాడు. తర్వాత 2000/01 వరకు ఈ స్థాయి పోటీల్లో పాల్గొనలేకపోయాడు. ఆంగ్విల్లాలో జరిగిన బుస్టా కప్‌ టోర్నమెంట్లో లీవార్డ్ ఐలండ్స్‌పై జరిగిన పోటీలో అండర్ 19 మ్యాచ్‌లో ఇంగ్లండ్ A తరపున బెల్ ఆడాడు.

2001లో వార్విక్‌షైర్ తొలి టీమ్‌లో చేరిన బెల్ మూడు సెంచురీలు రెండు 98 పరుగులతో పాటు 16 ఇన్నింగ్స్‌లో 836 పరుగులు చేశాడు. ఆక్స్‌ఫర్డ్ UCCEపై ఇతడు చేసిన మొట్టమొదటి సెంచురీ -130 పరుగులు-తో 19 సంవత్సరాల 56 రోజుల్లో శతకం చేసిన దేశ అతి చిన్న యుపకుడిగా ఇతడు చరిత్ర కెక్కాడు. సెషన్ చివరి రోజున వార్విక్‌షైర్ అతడికి కౌంటీ క్యాప్ బహూకరించడంతో కౌంటీ చరిత్రలో క్యాప్ ధరించిన అతి పిన్న వయస్కుడిగా బెల్ చరిత్రకెక్కాడు.

ఆస్ట్రేలియాలో 2001/02 శీతాకాల సీజన్‌లో గడిపిన బెల్ ECB నేషనల్ అకాడెమీలో చేరిన తొలి క్రీడాకారుడిగా బెల్ పేరుకెక్కాడు.[3] అడిలైడ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన మరుసటి దినం ఇతడు న్యూజిలాండ్ టూర్‌కి గాను తీసుకోబడిన మార్క్ బుచ్చర్కి గాయం కారణంగా పూర్తిస్థాయి ఇంగ్లండ్ టెస్ట్ జట్టు లోకి తీసుకోబడ్డాడు.

2002లో నాలుగు రోజుల కౌంటీ ఆటలో బెల్ ఫామ్ దిగజారిపోయింది ఇతడు 24.37 సగటుతో 658 పరుగులు మాత్రమే చేయగలిగాడు కాని, ఇతడు బెన్సన్& హెడ్జెస్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్‌లో అత్యధిక పరుగులు సాధించాడు (85 నాటవుట్), సెమీ ఫైనల్ (46), ఫైనల్ (65 నాటవుట్) ఫైనల్లో తను చేసిన ప్రదర్శకు గాను చిట్టచివరి బెన్సన్ & హెడ్జెస్ కప్ ఫైనల్ గోల్డ్ అవార్డ్ గెల్చుకున్నాడు.

2003లో బెల్ అత్యుత్తమ ఫామ్ వన్డే ఫార్మాట్‌లో మరోసారి వెలుగులోకి వచ్చింది. నేషనల్ లీగ్‌లో 43.07 సగటుతో చేసిన 560 పరుగులతో పోల్చితే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 28.85 సగటుతో 779 పరుగులు చేశాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన చెమ్స్‌పోర్డ్‌లో కనిపించింది. ఇక్కడ ఇతను తొలి వన్డే సెంచురీని 113 బంతులలో పూర్తి చేశాడు, అలాగే 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది బౌలింగ్‌లో ఇతడి అత్యుత్తమ ప్రదర్శన. వార్విక్‌షైర్ ఆటగాడు ఈ ఫీట్ సాధించడం దాని చరిత్రలో ఇది రెండవసారి మాత్రమే.[4]

రెండు పేలవమైన సీజన్ల తర్వాత బెల్ 2004లో మళ్లీ ఉత్తమ ప్రదర్శన చేశాడు, ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆరు శతకాలతో ఇతడు 1498 పరుగులు చేశాడు. ఈ ఆరు శతకాలలో ఒకటి ఇతడి కెరీర్‌‍లోనే అత్యుత్తమ శతకంగా మిగిలిపోయింది సస్సెక్స్‌పై ఇతడు 262 పరుగుల అత్యధిక స్కోరు చేశాడు; పది నిమిషాలు తక్కువగా దాదాపు పది గంటలపాటు కొనసాగిన ఇతడి ఇన్నింగ్స్ దేశంలో అతి పిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన యువ ఆటగాడిగా ఇతడిని చరిత్రలో నిలిపింది. జూలై చివరలో ఇతడు అయిదు ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్సులలో వరుసగా నాలుగు శతకాలు బాదాడు. మరొక ఇన్నింగ్స్‌లో 96 నాటవుట్‌గా మిగిలాడు. లాంక్‌షైర్‌పై రెండు ఇన్నింగ్సులలో చేసిన రెండు శతకాలతో 1994లో బ్రియన్ లారా తర్వాత (డేవిడ్ హంప్ అటాకింగ్ బౌలింగ్‌లో వార్విక్‌షైర్ తరపున ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా బెల్ రికార్డు సాధించాడు.[5] ఈ భీకర ఫామ్ కారణంగా, వేలిగాయంతో జట్టులో గ్రాహం థోర్ప్ ఆడడం సందేహంగా నిలిచిన నేపథ్యంలో ఇంగ్లీష్ టెస్టు జట్టులోకి బెల్ చేర్చుకోబడ్డాడు.[6]

అంతర్జాతీయ క్రీడా జీవితం[మార్చు]

2004 - వెస్టిండీస్[మార్చు]

బెల్ తన మొదటి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ని ఓవల్‌లో వెస్టిండీస్‌‌తో టెస్ట్ సీరీస్ చివరి మ్యాచ్‌తో ప్రారంభించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదోస్థానంలో ఆడిన బెల్ 70 పరుగులు సాధించాడు; ఇంగ్లండ్ వెస్టిండీస్‌ను ఫాలోఆన్‌కి నెట్టి పది వికెట్ల తేడాతో మ్యాచ్ నెగ్గడంతో బెల్‌కి మళ్లీ బ్యాట్ చేపట్టే అవకాశం రాలేదు.[7]

2004/5 - జింబాబ్వే మరియు దక్షిణాఫ్రికా[మార్చు]

జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనకు గాను బెల్ జట్టులోకి ఎంపికయ్యాడు, హరారేలో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో ఇతడు కెవిన్ పీటర్సన్‌తోపాటు తన మొట్ట మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. బెల్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించి 75 పరుగులు సాధించాడు. దీంతో తన తొలి ODI మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెల్చుకున్నాడు.[8] సీరీస్‌లో జరిగిన మొత్తం నాలుగు మ్యాచ్‌లను ఆడిన బెల్ 40.75 సగటు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఏ టెస్టు మ్యాచ్‌కూ ఇతడు ఎంపిక కాకపోయినప్పటికీ, ఏడు వన్డే మ్యాచ్‌లలో తొలి నాలుగింటిలో ఆడేందుకు ఎంపికయ్యాడు కాని మూడు ఇన్నింగ్స్‌లో పేలవంగా ఆడి 26 పరుగులు సాధించాడు.

2005 - బంగ్లాదేశ్ మరియు యాషెష్[మార్చు]

2005లో, బెల్ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఏప్రిల్ నెలలోనే 480 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ పరుగులు సాధించిన బెల్ 17 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా నిలిచిన గ్రేమ్ హిక్ రికార్డును బద్దలుగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లకు గాను ఇంగ్లండ్ జట్టుకు ఇతడిని తిరిగి పిలిపించారు, కాని రెండు టెస్టు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ సాధించిన ఇన్నింగ్స్ విజయాల వల్ల అతడు రెండు ఇన్నింగ్స్ మాత్రమే ఆడగలిగాడు. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో బెల్ 65 పరుగులు చేశాడు చెస్టర్-లె-స్ట్రీట్‌లో జరిగిన రెండో టెస్టులో 162 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఇతడు 1935లో లెస్లీ అమ్స్ తర్వాత టెస్టు మ్యాచ్‌లో లంచ్ సమయానికి ముందుగానే వంద పరుగులు సాధించిన తొలి ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.[9]

2005 యాషెస్ సీరీస్ కోసం, ముగ్గురు ఆటగాళ్లు - బెల్, గ్రాహమ్ థోర్ప్ మరియు కెవిన్ పీటర్సన్ – జట్టులో రెండు స్థానాలకోసం పోటీ పడ్డారు, ధోర్ప్‌ని మినహాయించి బెల్, పీటర్సన్‌ జట్టులోకి ఎంపికయ్యారు. లార్డ్స్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగడానికి ముందు బెల్ టెస్ట్ సగటు 303గా ఉండేది, ఇది ఒక ఆటగాడి కెరీర్ మొత్తంలో ఐదవ అత్యధిక సగటుగా నమోదైంది.[10] లార్డ్స్ మరియు ఎడ్గ్‌బాస్టన్ లలో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో బెల్ విఫలమయ్యాడు కాని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన మూడో టెస్టులో షేన్‌వార్న్పై గతంలో పడ్డ తిప్పలు అధిగమించి రెండు ఇన్నింగ్స్ లలో అర్థ సెంచరీ సాధించాడు. అయితే, నాలుగు, అయిదు టెస్టులలో ఒవల్‌తో కలిపి నాలుగు ఇన్నింగ్స్‌లలో ఇతడు కేవలం ఆరు పరుగులు మాత్రమే సాధించాడు దీంతో ఇతడి బ్యాటింగ్ సగటు దారుణంగా 17.10 శాతానికి పడిపోయింది. ఇది అంతవరకు ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌లలో అత్యల్ప సగటు. ఇంగ్లండ్ యాషెష్‌ను వరుసగా గెల్చుకుని MBEని స్వీకరించినప్పటికీ, తనపై తనకే సందేహం వేయడానికి వీలు కల్పించిన 2005 యాషెస్‌కి తక్కువ స్థానమిచ్చాడు.[2]

2005/6 - పాకిస్తాన్ మరియు ఇండియా[మార్చు]

ఆస్ట్రేలియాపై విఫలమైనప్పటికీ, పాకిస్తాన్‌తో శీతాకాల పర్యటనకు 17మంది సభ్యుల జట్టులో ఇతడు చేర్చుకోబడ్డాడు. ఇతడిని టెస్టు జట్టులోకి తీసుకోరని మీడియాలో పుకారు లేచింది కాని తొలి టెస్టుకు ముందు మైఖేల్ వాగన్ గాయపడటంతో బెల్ మరొక అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న బెల్ మూడు మ్యాచ్‌ల సీరీస్‌లో ఒక శతకం మరియు రెండు అర్థ శతకాలను బాదాడు, సీరీస్‌లో 313 పరుగులతో 52.16 సగటుతో ఇంగ్లండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పార్ట్ టైమ్ బౌలింగ్‌తో తన తొలి టెస్ట్ వికెట్ కూడా తీశాడు.

ఉపఖండంలో ఈ ఫామ్ కొనసాగింది, 2006 ఫిబ్రవరి 18న ఇంగ్లండ్లో టెస్టు సీరీస్ మొదలు కావడానికి ముందు జరిగిన సన్నాహక మ్యాచ్‌లో భారత్‌ పై ముంబైలో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగులు చేసిన బెల్ టాప్ స్కోర్ సాధించాడు. టెస్టు సీరీస్‌లో ఈ ఫామ్‌ని అతడు కొనసాగించలేకపోయాడు, 6 ఇన్నింగ్సులలో కేవలం 131 పరుగులు మాత్రమే సాధించిన బెల్ కేవలం 22 సగటుమాత్రమే సాధించాడు.

2006 - శ్రీలంక మరియు పాకిస్తాన్[మార్చు]

ఇండియా పర్యటన నుంచి తిరిగొచ్చాక, బెల్ వార్విక్‌షైర్‌తో సీజన్‌ని సాదాసీదాగా ప్రారంభించాడు. శ్రీలంకతో వేసవిలో జరిగిన తొలి హోమ్ టెస్టులో ఇతడు జట్టులో 13వ సభ్యుడిగా ఎంపికయ్యాడు కాని, మార్కస్ ట్రెస్కోథిక్ పునరాగమనం, పాల్ కాలింగ్‌వుడ్ చక్కటి ఫామ్‌లో ఉండటం, అలాస్టెయిర్ కుక్ ఉనికిలోకి రావడం వంటి కారణాలతో బెల్ 11మంది సభ్యుల జట్టు నుంచి తప్పించబడ్డాడు. శ్రీలంకపై 5 మ్యాచ్‌ల వన్డే సీరీస్‌కి బెల్ ఎంపికయ్యాడు, సీరిస్ మొత్తంమీద ఎలాంటి పేరు లేకుండా తిరిగి వచ్చిన కొద్దిమంది ఆటగాళ్ల సరసన చేరాడు.

దీని ఫలితంగా, మరియు ఆండ్రూ ప్లింటాఫ్ గాయం కారణంగా, బెల్ పాకిస్తాన్‌పై జరిగిన టెస్ట్ జట్టుకు తిరిగి పిలువబడ్డాడు. కెరీర్‌లో చాలా కాలం టాప్ ఫోర్‌లో ఉంటూవచ్చిన బెల్‌ని 6వ స్థానంలో ఆడవలసిందిగా జట్టు యాజమాన్యం కోరింది. తొలి మూడు టెస్టులలో బెల్ తలోక సెంచరీ చేశాడు, దీంతో గ్రాహం గూచ్ అనంతరం, వరుసగా మూడు టెస్టు మ్యాచ్‌లలో సెంచరీలు సాధించిన తొలి ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌గా పెరుకెక్కాడు కాని వరుసగా నాలుగో టెస్టులో శతకం సాధించలేకపోయాడు. ఎందుకంటే నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన బెల్, పాకిస్తాన్ బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఒక రోజు ముందుగా ఆట ఆగిపోవటంతో రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులతో నాటౌట్‌గా మిగిలిపోయాడు. ఆ సీరీస్‌ను 93.75 సగటుతో పూర్తి చేసాడు. అయితే ఆశ్చర్యకరంగా 63.42 సగటు సాధించిన ఆండ్రూ స్ట్రాస్‌కి మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డు ప్రకటించడంతో బెల్ ఈ అవార్డుకు దూరమైపోయాడు. ఈ రకమైన ఫాం కారణంగా (100*, 28, 106*, 119, 4, 9, 9*) అతడి మొత్తం టెస్టు సగటు 48కి చేరింది. ఆస్ట్రేలియాపై అతడి సగటు 17 మాత్రమే ఉండగా ఇతర జట్లపై అతడి సగటు 68రి చేరుకుంది. పాకిస్తాన్‌పై వన్డే సీరీస్‌లో కూడా ఇతడు ఆడాడు. ఈ సీరీస్‌లోనే సోఫియా గార్డెన్స్‌లో 88 పరుగులు, ట్రెంట్ బ్రిడ్జ్‌లో 86 పరుగులు సాధించి అప్పటవరకు తన వన్డే కెరీర్‌లో రెండు అత్యధిక స్కోర్లు సాధించాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌ టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించడంతో బెల్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

2006 - ఛాంపియన్స్ ట్రోఫీ[మార్చు]

2006 సెప్టెంబరులో బెల్ ఇండియాలో జరుగునున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో సభ్యుడిగా ప్రకటించ బడ్డాడు. అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో యాషెష్‌ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించిన జట్టులో కూడా సభ్యుడిగా ఎంపికయ్యాడు మార్కస్ ట్రెస్కోథెక్ గైర్హాజరీ కారణంగా వన్డే జట్టులో ఓపెనర్‌గా ప్రమోట్ చేయబడ్డాడు. ఇంగ్లండ్‌లో మూడు మ్యాచ్‌లలో ఇతడు 32.33 సగటుతో 97 పరుగులు చేసాడు. ఇంగ్లండ్ (ఇండియా, ఆస్ట్రేలియా) పై జరిగిన తొలి రెండు గేమ్‌లను కోల్పోయింది. వెస్టిండీస్‌తో తుది రౌండ్ పోటీలో గెలుపు సాధించినప్పటికీ టోర్నీ నుంచి జట్టు వైదొలగింది.

2006/7 ది యాషెస్[మార్చు]

యాషెస్ సీరీస్‌లో ఆండ్రూ ప్లింటాఫ్ కెప్టెన్‌ కావడంతో బెల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మళ్లీ ఆరో స్థానంలోకి వచ్చాడు. తొలి 11 మంది సభ్యులలో స్థానం కోసం బెల్, అలాస్టర్ కుక్ మరియు పాల్ కాలింగ్‌ఉడ్‌ లతో పోటీ పడుతున్నట్లు కనిపించాడు. అయితే మార్కస్ ట్రెస్కోతెక్ తొలి టెస్టుకు ముందే ఇంగ్లండ్‌కు వెనుదిరగడంతో, బెల్, కుక్, కాలింగ్ఉడ్ ఈ సీరీస్‌లో అన్ని మ్యాచ్‌లలోనూ ఆడాడు. నాలుగు అర్థ శతకాలతోపాటు మొత్తం 331 పరుగులు చేసిన బెల్ సగటు ఈ సీరీస్‌కి 33.10కు చేరింది. మంచి ప్రారంభాలను పెద్ద స్కోర్లుగా మలవడంలో ఇతడు విఫలమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 5-0 తేడాతో టెస్టు సీరీస్‌ని కోల్పోయింది. ఈ పేలవమైన పరుగుల క్రమం వన్డే సీరీస్‌లోనూ కొనసాగింది: ఇంగ్లండ్ ట్వంటీ20 గేమ్‌ని వన్డేలలో తొలి గేమ్‌ను కోల్పోయింది. అయితే, కామన్వెల్త్ బ్యాంక్ సీరీస్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్ ఫైనల్లో రెండు వరుస గేమ్‌లలో ఆస్ట్రేలియాను ఓడించింది. తొలి మ్యాచ్‌లో బెల్ 65 పరుగులు సాధించాడు.

ప్రపంచ కప్ 2010[మార్చు]

వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ 15మంది సభ్యుల జట్టులోకి బెల్ ఎంపికయ్యాడు, ఇంగ్లండ్ ఈ టోర్నీలో పేలవమైన ప్రదర్శన చేసింది, మొత్తం జట్టులో భాగంగా బెల్ ఆటతీరు కూడా సాధారణస్థాయిలో ఉండింది. టోర్నీ ప్రారంభంలో బెల్ మూడో స్థానంలోకి ఎంపికయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ న్యూజిలాండ్‌తో ఆటలో ఓడిపోయింది, కెన్యా, కెనడా మరియు ఐర్లండ్లపై కష్టం మీద గెలిచింది. ఈ మ్యాచ్‌లలో బెల్ 5, 28, 16 మరియు 31 సగటు పరుగులతో నిరాశ కలిగించాడు. ప్రపంచకప్ రన్నరప్ శ్రీలంకతో ఓటమి పాలైనప్పటికీ బెల్ 47 పరుగులు చేశాడు, దీంతో టాప్ ఆర్డర్ నుంచి ఎడ్ జాయిస్‌ని తప్పించిన ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం బెల్‌ని కెప్టెన్ మైఖేల్ వాగన్‌‌కు జోడీగా ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. ఈ స్థానంలో మార్పు ప్రారంభంలో బాగానే పనిచేసింది ఆస్ట్రేలియాపై ఓడినప్పటికీ బెల్ 77 పరుగులు సాధించాడు, కాని బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికా జట్లపై జరిగిన తదుపరి రెండు గేమ్‌లలో బెల్ వరుసగా 0, 7 పరుగులు చేయడంతో వెస్టిండీస్‌తో జరిగిన జట్టు ఫైన‌ల్ మ్యాచ్‌లో బెల్ స్థానం కోల్పోయాడు. ఈ ఆటలో ఇంగ్లండ్ విజయం సాధించింది. టోర్నీలో సూపర్ 8 దశలో ఐదవ స్థానం సాధించిన ఇంగ్లండ్ సెమీ పైనల్‌కి అర్హత సాధించలేకపోయింది.

2007 - వెస్టిండీస్ మరియు ఇండియా[మార్చు]

ఇయాన్ బెల్ లార్డ్స్‌లో మే నెలలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ తరపున నాలుగో శతకాన్ని సాధించాడు. అలాస్టెయిరక్ కుక్, పాల్ కాలింగ్ఉడ్ మరియు మాట్ ప్రియర్‌ తొలి మూడు శతకాలు సాధించారు. 1938వ తరువాత ఇంగ్లండ్ తరపున ఒకే టెస్టు మ్యాచ్‌లో నాలుగు శతకాలు బాదిన తొలి నలుగురు బ్యాట్స్‌మన్‌లుగా వీరు చరిత్ర సృష్టించారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో బెల్ 6వ స్థానంలో వచ్చాడు. ఇంగ్లండ్ డిక్లేర్ చేశాక ఆ స్థానంలో బెల్ 121.00 సగటుతో 484 పరుగులతో మెరుగైన రికార్డును సాధించాడు.

2007 ఆగస్టు 21న, బెల్ ఇండియాతో జరిగిన 7 వన్డే మ్యాచ్‌లలో తన తొలి ODI శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో 118 బంతులలో 126 పరుగులు సాధించాడు (స్ట్రయిక్ రేట్ 106.8) తదుపరి రెండు గేమ్‌లలో బెల్ మరొక రెండు అర్థ శతకాలు సాధించాడు. వీటిలో ఎడ్గ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ అప్పటికి సీరీస్‌‍లో 2-1 తో ముందంజలో ఉంది. ఈ ఏడు మ్యాచ్‌లలో బెల్ సగటు 70.33కు చేరింది, ఇంగ్లండ్ 4-3 తేడాతో సీరీస్ నెగ్గింది. లార్డ్స్‌లో జరిగిన కీలకమ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ నెగ్గింది, బెల్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌గా ఎంపికయ్యాడు.[11]

2007/8 - శ్రీలంక[మార్చు]

2007 సెప్టెంబరు చివరలో శ్రీలంకకు టీమ్‌తో పాటు వెళ్లిన బెల్ మొదట్లో తన వన్డే ఫామ్‌ని మెరుగుపర్చుకోవడం కొనసాగించాడు. శ్రీలంక క్రికెట్ బోర్డ్ XI పై ఇంగ్లండ్ పాల్గొన్న ఏకైక సన్నాహక మ్యాచ్‌లో బెల్ 121 బంతుల్లో 131 పరుగులు సాధించాడు.[12] అయితే, తదనంతరం జరిగిన 5 గేమ్‌ల వన్డే సీరీస్‌లో తీవ్రంగా ఇబ్బందిపడిన బెల్ కేవలం 14.00 సగటుతో 70 పరుగులు మాత్రమే సాధించాడు.

తొలి టెస్టు మ్యాచ్‌నాటికి ఫామ్ దొరకబుచ్చుకున్న బెల్ 83, 74 పరుగులు చేసినప్పటికీ ఇంగ్లండ్ 88 పరుగులతో ఓడిపోయింది.[13] శ్రీలంక టెస్టు సీరీస్‌ను 1-0 తేడాతో గెల్చుకుంది. రెండు, మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. బెల్ 43.50 బ్యాటింగ్ సగటుతో సీరీస్ ముగించాడు.[14]

2007/8 - న్యూజిలాండ్[మార్చు]

న్యూజిలాండ్‌‌తో జరిగిన ఐదు గేమ్‌ల వన్డే సీరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు గేమ్‌లలో భారీ పరాజయాలు సాధించింది. వీటిలో బెల్ కేవలం 5, 0 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే, జట్టులో స్థానంకోసం ఒత్తిడికి గురయిన బెల్ అక్లాండ్‌లో జరిగిన, ఇంగ్లండ్ గెలుపొందిన మూడో గేమ్‌లో 73 పరుగులతో టాప్ స్కోర్ సాధించాడు. నేపియర్‌లో జరిగిన 4వ మ్యాచ్‌ని ఇంగ్లండ్ టైగా ముగించగా బెల్ ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. చివరి గేమ్‌లో బెల్ 24 పరుగులు చేశాడు. సీరీస్‌ని న్యూజిలాండ్ 3-1తో కైవసం చేసుకుంది.

హామిల్టన్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో షార్ట్ లెగ్‍‌‌లో పీల్డింగ్ చేస్తుండగా బెల్ మణికట్టుకు తీవ్రగాయమయింది. అతడి మణికట్టు విరిగిందని, పర్యటనలో అతడి పాత్ర ముగిసిందని మొదట్లో వ్యాపించిన భయాలు తొలగిపోయీయి, మణికట్టుకు తగిలిన దెబ్బవల్ల కాస్త వాచింది, చిన్న గాయ తగిలిందని తేలింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన బెల్ రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. దీంట్లో ఇంగ్లండ్ 110 పరుగులకే కుప్పగూలిపోయి 189 పరుగుల తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. బెల్ తర్వాత అలిస్టార్ కుక్ 13 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం.[15] రెండో టెస్టులో, బెల్ వరుసగా 11, 41 పరుగులు చేయగా ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచి సీరీస్‌ని సమం చేసింది.[16] టూర్‌లో చివరి టెస్టు తన అత్యున్నత ఇన్నింగ్స్‌గా మిగిలింది. తొలి ఇన్నింగ్స‌లో 9 పరుగులు చేసిన బెల్ పెద్ద స్కోర్ సాధించే విషయమై బాగా ఒత్తిడి నెదుర్కొ న్నాడు. ఇంగ్లండ్ 140/3 స్కోరు వద్ద ఉన్నప్పుడు క్రీజులో ఉన్న ఆండ్రూ స్ట్రాస్‌తో జత కలిపాడు. ఈ ద్వయం 187 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌కి సవాలు విసిరింది.[17] ఈ క్రమంలో, బెల్ తన 7వ టెస్ట్ శతకాన్ని సాధించాడు. ఇది రెండేళ్ల తర్వాత అతడికి విదేశాల్లో దక్కిన శతకం. బెల్ 50.00 బ్యాటింగ్ సగటుతో సీరీస్‌ని ముగంచాడు. అలాగే ఇంగ్లండ్ తరపున 2,500 పరుగులు సాధించిన అతి పిన్న వయస్సు ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.[18]

బెల్ స్వదేశంలో జరిగిన టెస్టు సీరీస్‌లో పరుగులకోసం గుంజాటన పడ్డాడు, అయితే, నాలుగు ఇన్నింగ్స్‌లలో 45 పరుగులు మాత్రమే చేసాడు. అత్యధిక స్కోరు 21*.[19] తర్వాత జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో బెల్ కొంత ఫామ్ దొరకపుచ్చుకున్నాడు, ఈ ఫార్మాట్‌లో ఇతడి అత్యధిక స్కోర్*, ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌ని 9 వికెట్లతో గెలుచుకుంది[20] ఇతడు తర్వాత వన్డే సీరీస్‌లో ఓపెనింగ్ స్థానాన్ని స్వీకరించాడు. అయితే అతడి ఫామ్ 46,[21] 0,[22] 20,[23] మరియు 46 సగటుతో నిలకడ కోల్పోయింది.[24]

2008 - దక్షిణాఫ్రికా, ఇండియా, వెస్టిండీస్[మార్చు]

పాల్ హారిస్‌ చేత ఔట్ కావడానికి ముందు, బెల్ ఈ సీరీస్‌ని 199 పరుగులతో ప్రారంభించాడు. డబుల్ సెంచరీకి ఒకే ఒక్క పరుగు తక్కువ చేసి ఔటయ్యాడు, దీంతో 199 పరుగుల వద్ద ఔటైన తొలి ఇంగ్లీష్‌ ప్లేయర్‌గా రికార్డు కెక్కాడు.[25] టూర్ ప్రారంభంలో మంచిగా మొదలెట్టిన తర్వాత, బెల్ మళ్లీ ఫామ్‌ని దొరకబుచ్చుకోవడానికి హైరానాపడ్డాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేశాడు.[26] ఇరవైలు, ముప్పైలు తప్పిస్తే ఇతడు ఏమంత పురోగితి సాధించ లేకపోయాడు. ఇండియా మరియు వెస్టిండీస్‌లో జరిగిన టోర్నీలలో బెల్ బాగా దెబ్బతిన్నాడు. తొలి టెస్టులో ఇంగ్లండ్ 51 పరుగులకే ఔటవడంతో బెల్ స్థానంలో ఒవైస్ షా రంగంలోకి వచ్చాడు.

2009 - ది యాషెస్[మార్చు]

జట్టులోంచి స్థానం కోల్పోయిన బెల్ తీవ్రంగా స్పందించి కౌంటీ ఛాంపియన్‌షిప్పులో నిలకడగా పరుగులు సాధించడం ప్రారంభించాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టులకోసం ఇతడిని 16 మంది సభ్యుల శిక్షణ జట్టుకు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ లయన్స్ జట్టు కెప్టెన్ కూడా అయ్యాడు. ఆ మ్యాచ్‌లో అతడు 0 (గోల్డెన్ డక్) మరియు 20,[27] పరుగులతో విఫలమయినప్పటికీ, సీరీస్ మొదటి రెండు మ్యాచ్‌లకు గాను అతడిని రిజర్వులో పెట్టారు.

బెల్‌ తన స్వంత మైదానం ఎడ్గ్‌బాస్టన్‌లో మూడో టెస్టుకి గాను ఎంపికయ్యాడు గాయపడిన కెవిన్ పీటర్సన్‌ స్థానంలో ఇతడిని తీసుకున్నారు. టెస్టు జట్టుకు తిరిగివచ్చాక బెల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి ఒకే ఒక ఇన్నింగ్స్‌లో 53 పరుగులు చేశాడు. తర్వాత ఆట డ్రాగా ముగిసింది. హెడింగ్లే వద్ద జరిగిన 4వ టెస్టులో బెల్ రెండు సార్లు వరుసగా 8, 3 పరుగులతో మిచెల్ జాన్సన్‌ చేతిలో ఔటయ్యాడు. దీంతో అరుదైన టెస్టు రికార్డులో బెల్ తన వంతు భాగం పుచ్చుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మిడిలార్డర్ మూడు (రవి బొపారా), నాలుగు (బెల్) ఐదు (పాల్ కాలింగ్‌ఉడ్), పరుగులు చేసి ఔటయిన ఘటన జరిగింది. వీరు రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఒక్కొక్కరు పదేసి పరుగులు కూడా చేయలేకపోయారు. వీరు కలిసి చేసిన మొత్తం పరుగులు 16 మాత్రమే.[28]

ఆ మరుసటి వారంలోనే బెల్ ట్రెంట్ బ్రిడ్జ్‌ వద్ద నాటింగ్‌హామ్‌షైర్తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులు చేశాడు. దీంతో ఇతడిని ఓవల్‌లో జరిగిన చివరి టెస్టుకు ఎంపిక చేశారు, బెల్ చేసిన 72 పరుగులు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 172 పరుగుల ముందంజకు పునాది వేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇతడు 4 పరుగులకే ఔటైనప్పటికీ, వార్‌విక్‌షైర్ సహచరుడు జోనాథన్ ట్రాట్ చేసిన తొలి సెంచరీతో ఇంగ్లండ్ 197 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సీరీస్‌ని మాత్రం ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుపొందింది. బెల్ ఈ సీరీస్‌లో తన తొలి అయిదు ఇన్నింగ్స్‌లలో మిచెల్ జాన్సన్‌ చేతిలో నాలుగు సార్లు ఔటయ్యాడు. రెండు అర్థ శతకాలతో 28 సగటుతో ఇతడు 140 పరుగులు సాధించాడు.[29]

2009/10 - దక్షిణాఫ్రికా & బంగ్లాదేశ్[మార్చు]

సెంచూరియన్‌ మైదానంలో తొలి టెస్టులో పేలవంగా ఆడిన ఇంగ్లండ్ డ్రాగా ముగించింది. ఈ టెస్టులో వరుసగా 5, 2 పరుగులు చేసిన బెల్‌కి టెస్టు జట్టులో స్థానం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లీష్ టీమ్ డైరెక్టర్ ఆండీ ఫ్లవర్ బెల్‌పై విశ్వాస తీర్మానం[30] ప్రకటించాడు దీనికి స్పందనగా బెల్ టెస్టుల్లో మొట్ట మొదటి సెంచరీ కొట్టి చూపించాడు. 2008లో దక్షిణాఫ్రికాపై 199 పరుగులు చేసిన తర్వాత ఇదే అతని తొలి సెంచరీ కావడం విశేషం. డర్బన్‌లో రెండో టెస్టులో, బెల్ తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులు సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు. చివరి రెండు టెస్టులలో బెల్ ఒక మోస్తరు పరుగులు చేశాడు నాలుగు ఇన్నింగ్సులలోనూ 41.50 సగటుతో 166 పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్ పర్యటనలో చిట్టగాంగ్‌లో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో, బెల్ శరవేగంగా ఆడి 105 బంతుల్లో 84 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో కింది స్థానాల్లో అంటే సాధారణంగా 6వ స్థానంలో రావడం ద్వారా బెల్ తన స్కోర్లను మెరుగుపర్చుకున్నాడు, అతడు తన పది సెంచరీలలో అయిందింటిని 6వ స్థానంలో ఆడుతున్నప్పుడే సాధించాడు. మీర్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 107 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. బెల్ 5వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి జోనాథన్ ట్రాట్ (67 పరుగుల భాగస్వామ్యం), మాట్ ప్రియర్ (98 పరుగుల భాగస్వామ్యం) 6వ వికెట్‌కి టిమ్ బ్రెస్నన్‌తో కలిసి 143 పరుగుల చేయడం ద్వారా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలో పదవ సెంచరీ సాధించిన బెల్ చివరకు 138 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఔటయ్యాడు. ఈ శతకంతో బంగ్లాదేశ్‌తో బెల్ సగటు 488కి చేరుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక దేశంపై ఏ బ్యాట్స్‌మన్ అయినా సాధించిన ఆత్యధిక సగటు ఇదే కావడం విశేషం.[31]

2010 - బంగ్లాదేశ్ మరియు గాయంతో గైర్హాజరీ[మార్చు]

బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సీరీస్‌ ప్రారంభంలో రాణించిన బెల్ రెండో టెస్టులో సెంచరీ సాధించాడు. అయితే మడమ ఎముక విరగడంతో తదనంతరం జరిగిన వన్డే సీరీస్‌కే కాకుండా పాకిస్తాన్‌తో జరిగిన వేసవికాలపు ప్రధాన సీరీస్‌కి కూడా అతడు ఆడలేకపోయాడు. సీజన్ చివర్లో బెల్ తన కౌంటీ వార్విక్‌షైర్ తరపున ఆడాడు. సోమర్‌సెట్‌తో జరిగిన CB40 ఫైనల్‌లో యాక్టింగ్ కెప్టెన్‌గా సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించాడు.

2010/11 - ఆస్ట్రేలియాలో యాషెస్[మార్చు]

యాషెస్ సమీపించే సరికి, బెల్ జట్టులో 6వ స్థానం స్థిరంగా ఖాయపడింది. ఈ సీరీస్ పొడవునా పాల్ కాలింగ్‌వుడ్ ఫామ్ కోల్పోవడంతో బెల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావడంపై చర్చలు జరిగాయి. బెల్ సీరీస్‌ని మంచిగా ప్రారంభించాడు అద్భుతమైన డ్రైవ్‌లతో, కట్లతో, ఫుల్స్‌తో సీరీస్ మొత్తంగా బెల్ అలరించాడు. సిడ్నీలో జరిగిన 5వ టెస్టులో గాని బెల్ తన తొలి యాషెస్ సెంచరీని సాధించలేకపోయాడు. దీనికి ముందు అతడు యాషెస్‌లో పదకొండు అర్థ శతకాలను సాధించాడు. ఇంగ్లండ్ జట్టు తరపున ఆడిన అద్భుత ఆటగాళ్లలో బెల్ ఒకడు. ఈ క్రమంలో 1986/87లో గ్యాటింగ్ తర్వాత యాషెస్ సీరీస్‌ను ఇంగ్లండ్ 3-1తో గెల్చుకోవడంలో బెల్ చక్కగా సాయపడ్డాడు.

2003 ICC క్రికెట్ ప్రపంచ కప్[మార్చు]

ఫిబ్రవరి, మార్చి నెలల్లో, బంగ్లాదేశం, భారత్, పాకిస్తాన్ 2011 ప్రపంచ కప్ నిర్వహించాయి. ఇంగ్లండ్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఆటగాళ్లు నెదర్లాండ్స్ చేసిన అధిక స్కోరును దిగ్విజయంగా ఛేదించారు, బెల్ తన వంతుగా 33 పరుగులు చేసాడు. తదుపరి మ్యాచ్‌ని భారత్‌పై ఆడిన ఇంగ్లండ్ 338 పరుగులను సమర్పించుకుంది. బెల్, కెప్టెన్ స్ట్రాస్ ఇంగ్లండ్ స్థానాన్ని బలోపేతం చేశారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ యువరాజ్ సింగ్ బౌలింగ్‌లో బెల్ ఎల్‌బిడబ్ల్యు అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సమీక్షను కోరుకున్నాడు. టివీ రీప్లేలు మరియు హాక్-ఐ రెండూ బెల్ నిజంగానే ఔటయినట్లు చూపించాయి. అయితే బ్యాట్స్‌మన్ స్టంప్‌ల నుండి 2.5 మీటర్ల దూరంలో ఉంటే ఆన్ ఫీల్డ్ అంపైర్ (ఇక్కడ బిల్లీ బౌడన్ ఉన్నాడు) చివరి నిర్ణయం తీసుకోగలడని ఐసీసీ రూపొందించిన నిబంధన కారణంగా అంపైర్ ఈ సందర్భంగా బ్యాట్స్‌మన్ నాటవుట్ అని ప్రకటించాడు. దీంతర్వాత బెల్ 69 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయాన్ని దాదాపుగా ఖరారు చేయడంలో సాయపడ్డాడు. ఈ మ్యాచ్ తదనంతరం టైగా ముగిసింది.

గణాంకాలు[మార్చు]

టెస్ట్ గణాంకాలు[మార్చు]

ఇన్నింగ్స్ వారీగా బెల్ టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ కెరీర్. చేసిన పరుగులు (ఎర్రటి గీతలు) మరియు చివరి పది ఇన్నింగ్స్ యొక్క సగటు (నీలి గీత).

టెస్ట్ సెంచరీలు

ఇయాన్ బెల్ టెస్టు సెంచరీలు
పరుగులు మ్యాచ్ ప్రత్యర్థి నగరం/దేశం వేదిక సంవత్సరం
[1] 162* 3  బంగ్లాదేశ్ చెస్టర్-లె-స్ట్రీట్, ఇంగ్లండ్ రివర్‌సైడ్ Ground 2005
[2] 115 10  పాకిస్తాన్ ఫైసలాబాద్, పాకిస్తాన్ ఇక్బాల్ స్టేడియం 2005
[3] 100* 15  పాకిస్తాన్ లండన్, ఇంగ్లండ్ లార్డ్స్ 2006
[4] 106* 16  పాకిస్తాన్ మాంచెస్టర్, ఇంగ్లండ్ ఓల్డ్ ట్రఫార్డ్ 2006
[5] 119 17  పాకిస్తాన్ లీడ్స్, ఇంగ్లండ్ హెడింగ్లే స్టేడియం 2006
[6] 109* 24  వెస్ట్ ఇండీస్ లండన్, ఇంగ్లండ్ లార్డ్స్ 2007
[7] 110 36  New Zealand నేపియర్, న్యూజిలాండ్ మెక్లాన్ పార్క్ 2008
[8] 199 40  దక్షిణ ఆఫ్రికా లండన్, ఇంగ్లండ్ లార్డ్స్ 2008
[9] 140 51  దక్షిణ ఆఫ్రికా డర్బన్, దక్షిణాఫ్రికా సహారా స్టేడియం కింగ్స్‌మీడ్ 2009
[10] 138 55  బంగ్లాదేశ్ ఢాకా, బంగ్లాదేశ్ షేర్-ఇ-బంగ్లా క్రికెట్ స్టేడియం 2010
[11] 128 57  బంగ్లాదేశ్ మాంచెస్టర్, ఇంగ్లండ్ ఓల్డ్ ట్రఫార్డ్ 2010
[12] 115 61  ఆస్ట్రేలియా సిడ్నీ, ఆస్ట్రేలియా సిడ్నీ క్రికెట్ మైదానం 2011

కేరీర్ పనితీరు

  బ్యాటింగ్[32] బౌలింగ్[33]
ప్రత్యర్థి ఆటలు పరుగులు సగటు అత్యధిక స్కోరు 100 / 50 పరుగులు వికెట్లు సగటు ఉత్తమం
 ఆస్ట్రేలియా 18 971 32.36 115 1/11 32 0 - -
 బంగ్లాదేశ్ 6 633 158.25 162* 3/2 - - - -
 [[భారత్ {{{altlink}}}|భారత్]] 8 370 24.66 67 0/3 2 0 - -
 New Zealand 6 295 36.87 110 1/1 - - - -
 పాకిస్తాన్ 7 688 68.80 119 4/2 42 1 42.00 1/33
 దక్షిణ ఆఫ్రికా 8 645 46.07 199 2/2 - - - -
 శ్రీలంక 3 261 43.50 83 0/3 - - - -
 వెస్ట్ ఇండీస్ 6 329 41.12 109* 1/2 - - - -
మొత్తం 62 4192 44.12 199* 12/26 76 1 76,00 1/33

వన్డే ఇంటర్నేషనల్ గణాంకాలు[మార్చు]

శతకాలు

ఇయాన్ బెల్ వన్డే ఇంటర్నేషనల్ శతకాలు
పరుగులు మ్యాచ్ ప్రత్యర్థి నగరం/దేశం వేదిక సంవత్సరం
[1] 126* 48  [[భారత్ {{{altlink}}}|భారత్]] సౌతాంప్టన్, ఇంగ్లండ్ రోస్ బౌల్ 2007

కెరీర్ పనితీరు

  బ్యాటింగ్[34] బౌలింగ్[35]
ప్రత్యర్థి ఆటలు పరుగులు సగటు అత్యధిక స్కోరు 100 / 50 పరుగులు వికెట్లు సగటు ఉత్తమం
 ఆస్ట్రేలియా 15 476 31.73 77 0/3 - - - -
 బంగ్లాదేశ్ 3 84 84.00 84* 0/1 - - - -
 కెనడా 1 28 28.00 28 0/0 - - - -
 [[భారత్ {{{altlink}}}|భారత్]] 14 588 45.23 126* 1/2 - - - -
 Ireland 2 111 55.50 80 0/1 39 2 19.50 2/39
 కెన్యా 1 16 16.00 16 0/0 - - - -
 New Zealand 15 379 25.26 73 0/1 - - - -
 పాకిస్తాన్ 9 319 53.16 88 0/2 10 0 - -
 Scotland 1 6 6* 0/0 - - - -
 దక్షిణ ఆఫ్రికా 10 182 30.33 73 0/1 - - - -
 శ్రీలంక 11 289 26.27 77 0 1 30 1 30 1/ 13
 వెస్ట్ ఇండీస్ 4 135 33.75 56 0/2 - - - -
 Zimbabwe 4 163 40.75 75 0/2 9 3 3.00 3/9
మొత్తం 90 2,776 35/13 126* 1/16 88 6 14.66 3/9

పురస్కారాలు[మార్చు]

మ్యాన్-ఆఫ్-ది-మ్యాచ్ అవార్డులు:
తేదీ ప్రత్యర్థి మైదానం రికార్డు/స్కోర్‌కార్డులు
2004 నవంబరు 28  Zimbabwe హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే బ్యాటింగ్:75
2006 సెప్టెంబరు 8  పాకిస్తాన్ ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ బ్యాటింగ్:86
2007 ఆగస్టు 21  [[భారత్ {{{altlink}}}|భారత్]] రోజ్ బౌల్, సౌతాంప్టన్ బ్యాటింగ్:126
2007 ఆగస్టు 27  [[భారత్ {{{altlink}}}|భారత్]] ఎడ్గ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ బ్యాటింగ్:79
అంతకు ముందువారు
Kevin Pietersen
Emerging Player of the Year
2006
తరువాత వారు
Shaun Tait

గమనికలు[మార్చు]

 1. Westerby, John (14 June 2008). "Bell puts himself in contention for pot of gold". The Times. London. Retrieved 4 May 2010.
 2. 2.0 2.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 3. ఇంగ్లండ్ ఫెర్‌ఫార్మన్స్ ప్రోగ్రామ్ ఇంటేక్స్, ECB, 9 అక్టోబర్ 2008న తిరిగి పొందబడింది.
 4. వార్విక్‌షైర్ కోసం ఒక ఇన్నింగ్‌లో సెంచురీ మరియు 5 వికెట్లు, క్రికెట్‌ఆర్కైవ్, 9 అక్టోబర్ 2008 న పొందబడింది
 5. వార్విక్‌షైర్ కోసం ఆడిన మ్యాచ్‌లో ప్రతి ఇన్నింగ్స్‌లో శతకం, క్రికెట్‌ఆర్కైవ్, 9 అక్టోబర్ 2008 న పొందబడింది
 6. ఇయాన్ బెల్ నాలుగో టెస్టుకోసం పిలువబడ్డాడు, క్రిక్‌ఇన్‌ఫో, 9 అక్టోబర్ 2008 న పొందబడింది
 7. ఇంగ్లండ్ వెర్సెస్ వెస్ట్ ఇండీస్ ఫోర్త్ టెస్ట్ క్రిక్‌ఇన్ఫో 11 మార్చ్ 2008 న పొందబడింది
 8. జింబ్వాబ్వే వెర్సెస్ ఇంగ్లండ్ ఫస్ట్ ODI క్రిక్‌ఇన్పో 11 మార్చ్ 2008 న పొందబడింది
 9. Andrew Miller (2005-06-04). "Bell relieved to reach first Test century". Cricinfo.com. Retrieved 2008-02-23.
 10. "Highest averages at any point of time". Cricinfo. Retrieved 17 June 2010.
 11. 7 వ ODI వెర్సెస్ ఇండియా (స్కోర్ కార్డ్ & అవార్డ్స్) క్రిక్‌ఇన్ఫో, 9 సెప్టెంబర్ 2007 న పొందబడింది
 12. టూర్ మ్యాచ్: శ్రీలంక క్రికెట్ XI v ఇంగ్లండ్ BBC న్యూస్, 28 సెప్టెంబర్ 2007 న పొందబడింది
 13. శ్రీలంక వెర్సెస్ ఇంగ్లండ్ ఫస్ట్ టెస్ట్ BBC న్యూస్ 5 డిసెంబర్ 2007 న పొందబడింది
 14. శ్రీలంకలో టెస్ట్ సీరీస్ సగటులు BBC న్యూస్ 22 డిసెంబర్ 2007 న పొందబడింది
 15. న్యూజిలాండ్ వెర్సెస్ ఇంగ్లండ్ ఫస్ట్ టెస్ట్ క్రిక్ఇన్ఫో 11 మార్చ్ 2008 న పొందబడింది
 16. న్యూజిలాండ్ వెర్సెస్ ఇంగ్లండ్ సెకండ్ టెస్ట్ క్రిక్ఇన్పో 24 మార్చ్ 2008 న పొందబడింది
 17. స్ట్రాస్ అండ్ బెల్ బరీ న్యూజిలాండ్' క్రిక్ఇన్ఫో, 24 మార్చ్ 2008 పొందబడింది
 18. న్యూజిలాండ్ వెర్సెస్ ఇంగ్లండ్ - ౩ర్డ్ టెస్ట్' BBC న్యూస్ 24 మార్చ్ 2008 న పొందబడింది
 19. యావరేజెస్ వెర్సెస్ న్యూజిలాండ్ (h) 2008 BBC న్యూస్ నుండి13 జూన్ 2008 న పొందబడింది
 20. బెల్ ఇన్‌స్పైర్స్ ఇంగ్లండ్ టు హ్యూజ్ విన్ BBC న్యూస్ నుండి 13 జూన్ 2008న పొందబడింది
 21. నాట్‌వెస్ట్ వన్డే ఇంటర్నేషనల్ సీరీస్: ఇంగ్లండ్ v న్యూజిల్యాండ్ - 15-06-2008 ఎట్ రివర్‌సైడ్ BBC న్యూస్ నుండి 25 జూన్ 2008 న పొందబడింది
 22. నాట్‌వెస్ట్ వన్డే ఇంటర్నేషనల్ సీరీస్: ఇంగ్లండ్ v న్యూజిలాండ్ - 18-06-2008 అట్ ఎడ్గ్‌బాస్టన్ BBC న్యూస్ నుండి 25 జూన్ 2008న పొందబడింది
 23. నాట్‌వెస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ సీరీస్: ఇంగ్లండ్ v న్యూజిలాండ్ - 21-06-2008 అట్ బ్రిస్టోల్ BBC న్యూస్ నుండి 25 జూన్ 2008న పొందబడింది
 24. నాట్‌వెస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ సీరీస్: ఇంగ్లండ్ v న్యూజిలాండ్ - 25-06-2008 ఎట్ ది బ్రిట్ ఓవల్ BBC న్యూస్ నుండి 25 జూన్ 2008న పొందబడింది
 25. ఇంగ్లండ్ v సౌతాఫ్రికా 1స్ట్ టెస్ట్t: సుప్రీమ్ బెల్ పైల్స్ ప్రెజర్ ఆన్ SA BBC న్యూస్ నుండి11 జూలై 2008న పొందబడింది
 26. క్రిక్ఇన్ఫో - 3ర్డ్ టెస్ట్: ఇంగ్లండ్ v సౌతాఫ్రికా అట్ బర్మింగ్‌హామ్, జూలై 30-ఆగస్ట్ 2, 2008 క్రిక్ఇన్ఫో నుండి 18 ఆగస్టు 2008న పొందబడింది
 27. - వాగన్ అండ్ హార్మిసన్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ యాషెస్ ట్రెయినింగ్ స్క్వాడ్, 22 జూన్, 2009 క్రిక్ఇన్ఫో నుండి 22 జూన్2009న పొందబడింది
 28. Selvey, Mike (9 August 2009). "Incompetent England cannot hide behind the camouflage against". The Guardian. London. Retrieved 17 June 2010.
 29. "Australia in the British Isles 2009". Cricket Archive. Retrieved 17 June 2010.
 30. "Vote of confidence for Bell". Sky Sports. Retrieved 17 June 2010.
 31. "The List: The highest batting average against a particular team or at a particular venue". Cricinfo. Retrieved 17 June 2010.
 32. "Statsguru - IR Bell - Test Batting - Career summary". Cricinfo. Retrieved 2009-12-18.
 33. "Statsguru - IR Bell - Test Bowling - Career summary". Cricinfo. Retrieved 2009-12-18.
 34. "Statsguru - IR Bell - ODI Batting - Career summary". Cricinfo. Retrieved 2011-02-09.
 35. "Statsguru - IR Bell - ODI Bowling - Career summary". Cricinfo. Retrieved 2010-03-26.

బాహ్య లింకులు[మార్చు]