ఇరాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
جمهوری اسلامی ايران
జమ్‌హూరియె ఇస్లామీయె ఇరాన్
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్
Flag of ఇరాన్ ఇరాన్ యొక్క చిహ్నం
నినాదం
పర్షియన్: ఇస్తెఖ్‌లాల్, ఆజాది, జమ్హూరియ-ఎ- ఇస్లామీ
(తెలుగు: "స్వతంత్రం, స్వేచ్ఛ, ఇస్లామీయ గణతంత్రం")
జాతీయగీతం
సొరూద్-ఎ-మిల్లి-ఎ-ఇరాన్
ఇరాన్ యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
టెహరాన్
35°40′N, 44°26′E
అధికార భాషలు పర్షియన్
ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్
 -  ప్రధాన లీడరు అలీ ఖుమైనీ
 -  అధ్యక్షుడు మహ్‌మూద్ అహ్మద్ నెజాద్
ఇరానియన్ విప్లవం రాజరికం పరిసమాప్తి 
 -  ప్రకటితం ఫిబ్రవరి 11, 1979 
విస్తీర్ణం
 -  మొత్తం 1,648,195 కి.మీ² (17వ)
636,372 చ.మై 
 -  జలాలు (%) 0.7%
జనాభా
 -  2005 అంచనా 68,467,413 [1] (18వ)
 -  1996 జన గణన 60,055,488 [2] 
 -  జన సాంద్రత 41 /కి.మీ² (128వది)
106 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $561,600,000,000 (19వది)
 -  తలసరి $8,065 (74వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) 0.736 (medium) (99వది)
కరెన్సీ ఇరానియన్ రియాల్ (ريال) (IRR)
కాలాంశం (UTC+3.30)
 -  వేసవి (DST) గుర్తించలేదు (UTC+3.30)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ir
కాలింగ్ కోడ్ +98

ఇరాన్ (పురాతన నామం = పర్షియా) (పర్షియన్: ایران) నైఋతి ఆసియాలోని ఒక మధ్యప్రాచ్య దేశము. 1935 దాకా ఈ దేశము పాశ్చాత్య ప్రపంచములో పర్షియా అని పిలవబడేది. 1959లో మహమ్మద్ రెజా షా పహ్లవి ఉభయ పదములు ఉపయోగించవచ్చని ప్రకటించారు.కానీ ప్రస్తుత ఇరాన్ ను ఉద్దేశించి "పర్షియా" పదము వాడుక చాలా అరుదు. ఇరాన్ అను పేరు స్థలి "ఆర్యన్" అర్థం "ఆర్య భూమి".

ఇరాన్ కు వాయువ్యాన అజర్‌బైజాన్ (500 కి.మీ) మరియు ఆర్మేనియా (35 కి.మీ), ఉత్తరాన కాస్పియన్ సముద్రము, ఈశాన్యాన తుర్కమేనిస్తాన్ (1000 కి.మీ), తూర్పున పాకిస్తాన్ (909 కి.మీ) మరియు ఆఫ్ఘనిస్తాన్ (936 కి.మీ), పశ్చిమాన టర్కీ (500 కి.మీ) మరియు ఇరాక్ (1458 కి.మీ), దక్షిణాన పర్షియన్ గల్ఫ్ మరియు ఒమాన్ గల్ఫ్ లతో సరిహద్దు కలదు. 1979లో, అయాతొల్లా ఖొమేని ఆధ్వర్యములో జరిగిన ఇస్లామిక్ విప్లవం పర్యవసానముగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (جمهوری اسلامی ایران) గా అవతరించినది.

చరిత్ర[మార్చు]

ఇరాన్ యొక్క జాతీయత పర్షియా నుండి ఉద్భవించినది. పర్షియా అన్నపదము నేటి ఇరాన్, తజికిస్తాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, కాకసస్ ప్రాంతాలకు ఉన్న ప్రాచీన గ్రీకు పేరు పర్సిస్ నుండి వచ్చినది. క్రీ.పూ 6వ శతాబ్దములో ఈ ప్రాంతాలన్నీ ఆకెమెనిడ్ వంశము యొక్క పాలనలో గ్రీస్ నుండి వాయువ్య భారతదేశము వరకు విస్తరించిన మహాసామ్రాజ్యములో భాగముగా ఉన్నవి. అలెగ్జాండర్ మూడు ప్రయత్నాల తర్వాత ఈ సామ్రాజ్యాన్ని జయించగలిగాడు. అయితే పర్షియా వెనువెంటనే పార్థియన్ మరియు సస్సనిద్ సామ్రాజ్యాల రూపములో స్వతంత్ర్యమైనది. అయితే ఈ మహా సామ్రాజ్యాలను 7వ శతాబ్దములో ఇస్లాం అరబ్బీ సేనల చేత చిక్కినది. ఆ తరువాత సెల్జుక్ తుర్కులు, మంగోలు లు మరియు తైమర్‌లేను ఈ ప్రాంతాన్ని జయించారు.

16వ శతాబ్దములో సఫవిదులు పాలనలో తిరిగి స్వాతంత్ర్యమును పొందినది. ఆ తరువాత కాలములో ఇరాన్ను షాహ్ లు పరిపాలించారు. 19వ శతాబ్దంలో పర్షియా, రష్యా మరియు యునైటెడ్ కింగ్ డం నుండి వత్తిడి ఎదుర్కొన్నది. ఈ దశలో దేశ ఆధునీకరణ ప్రారంభమై 20వ శతాబ్దములోకి కొనసాగినది. మార్పు కోసము పరితపించిన ఇరాన్ ప్రజల భావాల అనుగుణంగా 1905/1911 పర్షియన్ రాజ్యాంగ విప్లవం జరిగినది.

సంస్కృతి[మార్చు]

ఫర్హంగ్ ("సంస్కృతి") అన్నివేళల పర్షియన్ నాగరికత కేంద్ర బిందువు.

ఇరానీ సంస్కృతి ప్రపంచం లోని ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి.అసలు 'ఇరాన్' అనే పదం 'ఆయిర్యాన' అను పదం నుండి ఉధ్భవంచింది.ఇరానీయుల సంప్రాదాయల కు,భారతీయ సంప్రదాయలకు దగ్గరి పోలిక ఉంది.వారు అగ్ని ఉపాసకులు.వారు కూడ ఉపనయనాన్ని పోలిన ఒక ఆచారాన్ని పాటిస్తారు.దీనిని బట్టి వారి పూర్వికులు కూడా ఆర్యులే నని పలువురు చరిత్రకారుల అభిప్రాయం.

అన్నీ ప్రాచీన నాగరికతల వలెనే, పర్షియన్ నాగరికతకు కూడా సంస్కృతే కేంద్ర బిందువు. ఈ నేల యొక్క కళ, సంగీతం, శిల్పం, కవిత్వం, తత్వం, సాంప్రదాయం మరియు ఆదర్శాలే ప్రపంచ విఫణీలో ఇరానియన్లకు గర్వకారణము. ఇరానీ ప్రజలు తమ నాగరికత ఆటుపోట్లను తట్టుకొని వేల సంవత్సరాల పాటు మనుగడ సాగించడానికి దాని యొక్క సంస్కృతే ఏకైక ప్రధాన కారణమని భావిస్తారు.

ఇరాన్ కేబినెట్‌లో మహిళలు[మార్చు]

  • దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇరాన్ కేబినెట్‌లో మహిళలకు చోటు లభించింది. దేశాధ్యక్షుడిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అహ్మదీ నెజాద్ కేబినెట్‌లో గైనకాలజిస్టు మర్‌జిహే వహిద్ దస్త్‌జెర్ది(50), శాసనకర్త ఫాతిమే అజోర్లు(40) మహిళలు.1970ల తర్వాత ఇరాన్ కేబినెట్‌లో స్త్రీలకు చోటు దక్కడం ఇదే ప్రథమం. 1968-77 మధ్య ఫరోఖ్రో పార్సే చివరి మహిళా మంత్రిగా పనిచేశారు. 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అవినీతి ఆరోపణలపై ఆమెను పాలకులు ఉరితీశారు.ఈనాడు 17.8.2009

అధికారిక ప్రభుత్వ లింకులు[మార్చు]

సూచికలు[మార్చు]

  1. Statistical Centre, Government of Iran. ""Selected Statistical Information"". Retrieved 2006-04-14. 
  2. Statistical Centre, Government of Iran. ""Population by Religion and Ostan, 1375 Census (1996 CE)"". Retrieved 2006-04-14. 

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఇరాన్&oldid=1466994" నుండి వెలికితీశారు