ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ | |
---|---|
ప్రత్యేకత | Gastroenterology |
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా ఐ. బి. ఎస్ పెద్దపేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే వ్యాధి. ఎక్కువ మానసిక ఒత్తిడి ఉన్న వారిలో, గతంలో పెద్దపేగులు, జీర్ణవ్యవస్థ ఇన్‌ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కడుపులో పట్టేసినట్లు నొప్పి ఉండి, దైనందిన కార్యక్రమాలకు చాలా వరకు అంతరాయం కలిగిస్తుంది. ఈ సిండ్రోమ్‌వల్ల తరచుగా టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు, ప్రయాణాలలో చాలా ఇబ్బంది పడతారు. ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి ఈ సమస్యను మరింత ఉదృతం చేస్తాయి.
మనదేశంలో అత్యధికులు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య ఐబిఎస్. పురుషులకన్నా మూడు రెట్లు ఎక్కువగా స్త్రీలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఐబిఎస్ అనగానే అది కేవలం మానసిక ఒత్తిళ్ల కారణంగా వచ్చే సమస్యగానే వ్యాఖ్యానిస్తున్నారు కానీ, నిజానికి అది పూర్తిగా మానసికమేమీ కాదు. ఈ సమస్యకు జీర్ణవ్యవస్థలోని లోపమే అసలు కారణం. మానసిక ఒత్తిళ్లు సమస్యను మరికాస్త పెంచవచ్చేమో కానీ, అవే మూల కారణం కాదు.[మూలాలు తెలుపవలెను]
కారణాలు
[మార్చు]ఐబీఎస్‌కి ప్రత్యేక కారణమంటూ ఇప్పటి వరకు తెలియలేదు. అయితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్ల బారినపడిన వారిలో పెద్దపేగుకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లకు గరైన వారిలో ఆరు రెట్లు ఐబీఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఇన్‌ఫెక్షన్లు పెద్దపేగులో బాక్టీరియా పెరుగుటకు దోహదం చేస్తుంది. కొందరు వ్యక్తులతో తీసుకునే ఆహారపదార్థాల ద్వారా పెద్దపేగుల్లోని కండరాలు అసాధారణంగా స్పందించడం ద్వారా కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా ఐబీఎస్ రావడానికి కారణమవుతాయి.
జీర్ణవ్యవస్థను ఒకసారి పరిశీలిస్తే, మానవులు తీసుకునే ఆహారం పేగుల్లో జరిగే సంకోచ వ్యాకోచాల (పెరిస్టాల్టిస్) ద్వారా జీర్ణమవుతుంది. అయితే కొందరిలో ఈ సంకోచ వ్యాకోచ ప్రక్రియ అతిగా సాగుతుంది. దీనివల్ల ఆహారం బలవంతంగా లోనికి వె ళుతుంది. ఆహారం ఇలా హఠాత్తుగా వెళ్లడం వల్లే కడుపు ఉబ్బరంతో పాటు ఇతర జీర్ణాశయ సమస్యలన్నీ మొదలవుతాయి. అయితే సంకోచ వ్యాకోచాలు కొన్నిసార్లు అతివేగంగా సాగినా, మరికొన్నిసార్లు అతి తక్కువ వేగంతోనూ జరుగుతాయి. అయితే, వేగంగా జరిగినప్పుడు విరేచనాలు, మంద్రంంగా సాగినప్పుడు మలబద్దకం మొదలవుతాయి. ఈ సమస్యనే ఐబిఎస్ (ఇరిటెబుల్ బావెల్ సిండ్రోమ్) అంటారు. దీనికి మానసిక ఒత్తిళ్లు కూడా తోడైనప్పుడు, పేగుల్లో మిలియన్ల కొద్దీ ఉండే న్యూరాన్లు ఇలా ప్రేరేపితమైనప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది. అంతే తప్ప, ఇది కేవలం మానసిక కారణాలతోనే వచ్చేదేమీ కాదు.
గ్రహణి ఒక కేంద్రంగా..
[మార్చు]జీర్ణాశయంలో గ్రహణి ఒక సూక్ష్మ వ్యవస్థ ఉంటుంది. ఆహారాన్ని జీర్ణింపచేయడం, ఆ తరువాత ఆహారంలోని రసాలను, వ్యర్థాలను వేరుచేయడం, చివరికి వ్యర్థాలన్నిటినీ బయటికి పంపడం ఈ గ్రహణి మౌలిక విధులు. అయితే, పేగుల్లో జరగాల్సిన సంకోచ వ్యాకోచ ప్రక్రియ కుంటుపడినప్పుడు ఈ ఐబిఎస్ సమస్య మొదలవుతుంది. ఈ స్థితిలో గ్రహణిని తిరిగి దాన్ని సహజస్థితికి తేవడం ఒక తక్షణ కర్తవ్యమవుతుంది. అలా ఆవ్యవస్థను సహజమైన, సాధారణ స్థితికి తేగ లిగే సమర్థవంత మైన వైద్యచికిత్సలు ఆయుర్వేదంలో అనేకం ఉన్నాయి.
సెకండ్ బ్రెయిన్ భూమిక
[మార్చు]శరీరంలో ఫస్ట్ బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ అంటూ రెండు రకాల బ్రెయిన్‌లు ఉంటాయి. ఫస్ట్ బ్రెయిన్ తలలో ఉంటే, సెకండ్ బ్రెయిన్ జీర్ణాశయంలో ఉంటుంది. దీన్నే ఆయుర్వేద పరిభాషలో గ్రహణి అంటారు. సెకండ్ బ్రెయిన్ రోగగ్రస్తమైనప్పుడే ఐబిఎస్ సమస్య మొదలవుతుంది. ఐబిఎస్ అనేది ప్రాణాంతక వ్యాధేమీ కాదు. కానీ, జీవితాన్ని దుర్భరం చేస్తుంది. నరరయాతన పెడుతుంది. ఈ సమస్య దీర్ఘకాలికంగా కొనసాగితే, ఇది వారి మానసిక వ్యవస్థను కుంగదీస్తుంది.
లక్షణాలు
[మార్చు]- మలవిసర్జన సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడం జరుగుతుంది. మలబద్ధకం ఉంటుంది. కొన్నిసార్లునీళ్ల విరేచనాలు అవుతాయి.
- మలవిసర్జన సాఫీగా జరగనట్టు అనిపిస్తుంది. మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపిస్తుంది.
- కడుపు ఉబ్బరం, నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
- ఉదయం లేవగానే త్వరగా విసర్జనకు వెళ్లాల్సి రావడం, ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది.
- భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం.
కడుపంతా పట్టేసినట్లు ఉండడం, కడుపులో నొప్పి, ఉబ్బరం, విరేచనాలు,మలబద్దకం, ఏ మాత్రం నిగ్రహించుకోలేక అనిపించిన మరుక్షణమే టాయిలెట్ కోసం పరుగులు తీయడం, విసర్జనకు ఎన్నిసార్లు వెళ్లినా ఇంకా పూర్తికాలేదనే భావన. మూత్రవిసర్జనలోనూ అదుపులేకపోవడం, ఏం తిన్నా ఒంటికి పట్టక, నీరసం, నిస్సత్తువ ఆవరించడం. పెద్దగా ఏమీ చేయకుండానే విపరీతంగా అలసిపోవడం వంటి లక్షణాలు ఐబిఎస్‌లో ప్రధానంగా కనపడతాయి. వాస్తవానికి వాతం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీర్ణక్రియ కోసం జరిగే సంకోచ వ్యాకోచాలు సహజంగా ఉంటే ఏ సమస్యా ఉండదు. హెచ్చు తగ్గులు ఏర్పడినప్పుడే ఏదైనా సమస్య మొదలవుతుంది. కొన్నిసార్లు వాత ప్రకోపం జరిగితే, కొన్నిసార్లు వాత క్షయం జరుగుతుంది.
అయితే సంకోచ వ్యాకోచాలు తీవ్రంగా ఉన్నప్పుడు విరేచనాలు అవుతాయి. మంద్రంగా ఉన్నప్పుడు మలబద్దకం ఏర్పడుతుంది. అయితే ఐబిఎస్‌లో ఎక్కువగా విరేచనం, మలబద్దకం ఈ రెండూ ఒకదాన్నివెన్నంటి మరొకటి వస్తాయి. ఐబిఎస్‌లో ఇదొక ప్రధాన లక్షణం. వీటితో పాటు మరికొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాటిలో ఛాతీలో మంట, మింగడం కష్టం కావడం, రుచి తెలియకపోవడం, అజీర్తి, వికారం, వాంతులు, పెద్దగా ఏమీ తినకుండానే కడుపు నిండినట్లు, కడుపులో అసౌకర్యంగా అనిపించడం, ఎప్పుడూ కడుపులో గుడగుడమంటూ శబ్దం రావడం, పొట్ట భాగాన్ని తాకితేనే నొప్పి అనిపించడం, పెద్ద శబ్ధంతో అపాన వాయువులు విడుదల కావడం, ఏం తిన్నా వెంటనే టాయిలెట్‌కు వెళ్లాలనిపించడం ఇవన్నీ ఐబిఎస్ లక్షణాలే. కడుపులో ఎడమవైపున పొడిచినట్లు అనిపించడం, మలవిసర్జన భాగంలోనూ పొడిచినట్లు నొప్పి అనిపించడం, మలంలో జిగురు పడటం, బరవు తగ్గిపోవడం, రక్తంలో పలుచగా రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఐబిఎస్‌లో జీర్ణాశయానికి ఆవల కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో తలనొప్పి, మైగ్రేన్, ఒంటినొప్పులు, వెన్నునొప్పి, కండరాల నొప్పులు, వస్తాయి. ఇవన్నీ వాత ప్రకోప లక్షణాలే. వీటికి తోడు మూత్రాశయ, జననాంగ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. వాటిలో తరుచూ మూత్రం రావడం, రుతుక్రమంలో తే డాలు రావడం, శృంగారపరమైన అంటే అంగస్తంభన లోపాలు, శీఘ్రస్ఖలన సమస్యలు, శృంగారంలో గానీ, శృంగారం తరువాత గానీ, నొప్పి రావడం, శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విరేచనాలు, మలబద్దకం ఒకదాని వెంట తరుచూ రావడం వల్ల ఇది అర్శమొలలకు దారి తీసే అవకాశాలు చాలా ఎక్కువ. అంతకన్నా మించి పోషకాలేవీ అందక సప్తధాతువులూ క్షీణిస్తాయి. ఆహార పదార్థాలు కడుపులోని జీర్ణరసాలతో కలిసినప్పుడు శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తితోనే, సస్తధాతువులూ ప్రాణం పోసుకుంటాయి.
వ్యాధి నిర్ధారణ
[మార్చు]మలపరీక్ష చేయడం ద్వారా బ్యాక్టీరియా, అమీబిక్ సిస్ట్‌లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే జీర్ణం కాని ఆహారపదార్థాలు వస్తున్నాయా అనే విషయాన్ని కనుక్కోవచ్చు. దీనిద్వారా సిలియాక్ డిసీజ్, మాల్ అబ్జార్బ్షన్ ఉందా అనేది తెలుస్తుంది. వీటితో పాటు సీబీపీ, ఈఎస్ఆర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, కొలనోస్కోపి పరీక్ష ద్వారా పెద్దపేగుల్లో ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయా తెలుసుకోవచ్చు. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ జబ్బులు ఉన్నాయా అనే విషయం కూడా తెలుస్తుంది.
జాగ్రత్తలు
[మార్చు]- ఆహార పదార్థాల్లో ఎక్కువ మసాలాలు, అతి కారంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
- పాలు, పాల పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
- చల్లని లేదా అతి వేడిగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
- కాఫీ ఎక్కువగా తీసుకోవడం, అతిగా మద్యపానం చేయడం, దూమపానం మానేయాలి.
- తినే ఆహార పదార్థాల ద్వారా ఇన్‌ఫెక్షన్లు సోకకుండా శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి.
- వ్యక్తిగత శుభ్రత పాటించాలి. టాయిలెట్ వెళ్లి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- మలబద్దక సంబంధితమైన ఐబిఎస్ (ఇరిటెబుల్ బావెల్ సిండ్రోమ్) ఉంటే ఎక్కువగా పండ్లు, పీచుపదార్థాలు, అధికంగా నీరు తీసుకోవాలి.
- నీటి విరేచనా సంబంధితమైన ఐబిఎస్ ఉంటే పీచుపదార్థాలు తక్కువగా తీసుకోవాలి. పాలపదార్థాలు తీసుకోకూడదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం అలవర్చుకోవాలి., రోజూ గంట పాటు వ్యాయామం చేయాలి.
హోమియో వైద్యం
[మార్చు]హోమియోలో వ్యక్తి మానసికి ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే మందులు ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి మందులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ వ్యాధిని శాశ్వతంగా నివారించవచ్చు.[మూలాలు తెలుపవలెను]
- అర్జెంటినమ్ నైట్రికమ్: తీవ్రమైన ఆందోళన, గాబరా ఎక్కువగా ఉండటం, బయటకు వెళ్లే ముందు మలవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.
- నక్స్‌వామికా : విపరీతమైన కోపం, చిరాకు ఉంటుంది. ఎక్కువగా మసాలా పదార్థాలు ఇష్టపడతారు. టాయిలెట్‌కి వెళ్లినపుడు మలవిసర్జన వస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ జరగదు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఉపయోగకరమైన మందు.
- ఆర్సెనిక్ ఆల్బమ్: ఏదైనా బయటకు ఆహారపదార్థాలు తినగానే విరేచనాలు అవుతాయి. ఇవేకాకుండా పల్సటిల్లా, అల్‌సొకట్రినా, లైకోపోడియం మందులు బాగా పనిచేస్తాయి.
ఆయుర్వేద వైద్యం
[మార్చు]జీర్ణవ్యవస్థను కేంద్రంగా చేసుకుని, అగ్నిని ఉత్తేజితం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయడం వల్లే ఆయుర్వేద చికిత్సలను ఆగ్నేయ చికిత్సలు అంటారు. అగ్నికి అంత ప్రాధాన్యత నివ్వడానికి 70 శాతం వ్యాధినిరోధక శక్తి జీర్ణవ్యవస్థ మీద ఆధారపడి ఉండడమే అందుకు కారణం. అగ్నిని ప్రకృతి సహజ స్థితికి చేర్చడానికి దీపన పాచన చికిత్సలు, లంఘన చికిత్సలు చేస్తారు. అదే సమయంలో శరీరంలోని సమస్త కణజాలంలోని ఆమాన్ని తొలగించడానికి, వాత, పిత్త, కఫాలను, సప్తధాతువులను సామ్యావస్థలోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని థెరపీలూ ఆయుర్వేదంలో ఉన్నాయి.[మూలాలు తెలుపవలెను] వ్యాధి తాలూకు ఏదో ఒక లక్షణాన్ని తొలగించడం కాదు. వ్యాధి బహుముఖాలుగా విస్తరించిన సిండ్రోమ్‌నే తొలగిస్తుంది. రోగగ్రస్తమైన సెకండ్ బ్రెయిన్‌ను అర్థం చేసుకుని దానికి చికిత్స చేయడం కీలకమవుతుంది. ఐబిఎస్ అనగానే అది ఫస్టబ్రెయిన్‌కు సంబంధించిన పూర్తిస్థాయి మానసిక సమస్యగానే అత్యధికులు పొరబడుతున్నారు. అందుకే వారు అందించే చికిత్సలేవీ ఫలవంతం కావడం లేదు.[మూలాలు తెలుపవలెను] వాస్తవానికి ఇది జీర్ణాశయమే కేంద్రంగా ఉండే సెకండ్ బ్రెయిన్ సమస్య. ఆ కేంద్రానికి చికిత్సచేయడానికి పూనుకోవడం వల్లే ఆయుర్వేదం అద్భుత ఫలితాలు సాధిస్తోంది.[మూలాలు తెలుపవలెను] తాత్కాలికంగా కాదు సమస్యను శాశ్వతంగా తొలగిస్తోంది. ఆయుర్వేదం రోగగ్రస్తమైన శరీరాన్ని ఒక నిండు ఆరోగ్య శిల్పంగా మార్చివేస్తుంది. మీరొక సంపూర్ణ జీవితాన్ని జీవించేలా పరిపూర్ణంగా సహకరిస్తుంది.