ఇలియానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇలియానా డిక్రుజ్
జన్మ నామం ఇలియానా డిక్రుజ్
జననం (1987-11-01) 1987 నవంబరు 1 (వయస్సు: 30  సంవత్సరాలు)
భారతదేశం ముంబాయి, భారతదేశం
వెబ్‌సైటు ileanaonline.com
ప్రముఖ పాత్రలు దేవదాసు (2005)
పోకిరి (2006)
కేడి (తమిళ సినిమా) (2006)

ఇలియానా డిక్రుజ్ (Ileana D'Cruz) (జ. 01 నవంబర్, 1987[1] ముంబాయి [2]) తెలుగు సినిమా నటీమణి.

సినీ జీవితం[మార్చు]

2006-2007 : సినిమాల్లోకి తెరంగేట్రం[మార్చు]

అరుణ భిక్షు దగ్గర కొంతకాలం నటనలో శిక్షణ పొందిన తర్వాత 2006లో ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో ఆమె రామ్ సరసన నటించింది. ఇద్దరికీ తొలిచిత్రమైన ఈ సినిమా విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఇద్దరి నటనకూ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఒక పోలీస్ అధికారిచే వేధించబడే శృతి అనే ఎయిరోబిక్స్ టీచర్ పాత్రను పోషించింది ఇలియానా. ఈ చిత్రం విడుదలయ్యాక నాటి తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయమై నిలిచింది. పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగు సినిమాలో ఒక ప్రముఖ నటిగా అవతరించింది.

ఆపై 2006లో తను కేడి అనే చిత్రంతో తమిళ సినిమాలోకి అడుగుపెట్టింది. రవికృష్ణ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాకపొయినా ఇలియానాకు అవకాశాలు తగ్గలేదు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రవితేజ సరసన ఖతర్నాక్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా పరాజయం పాలైనప్పటికీ ఇందులో ఇలియానా తన అందచందాలకు మంచి ప్రశంసలు అందుకుంది. కానీ కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన నటించిన రాఖీ మరియూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన మున్నా చిత్రాలు తనని తిరిగి వజయపధంలోకి నడిపించాయి. ఈ విజయాలతో ఇలియానా తెలుగు సినిమాలో తిరుగులేని నటిగా అవతరించింది.

2007-2011 : తెలుగు సినిమాల్లో ఎదుగుదల[మార్చు]

అప్పటికే తన ప్రతిభతో తెలుగులో మంచి గుర్తింపుని సాధించిన ఇలియానా విజయాలు మరియూ పరాజయాలకు అతీతంగా తిరుగులేని తారగా ఎదిగింది. 2007లో సిద్దార్థ్ సరసన నటించిన ఆట చిత్రం మంచి విజయాన్ని సాధించింది. 2008లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన జల్సా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ రెండు చిత్రాల్లో ఇలియానా నటనకు మంచి గుర్తింపు లభించడంతో పాటు ఇలియానా జల్సా చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది. ఆ తర్వాత తరుణ్ కుమార్ సరసన నటించిన భలే దొంగలు ఓ మోస్తరు విజయం సాధించినా, 2009లో రవితేజ సరసన తను నటించిన కిక్' సినిమా ఆ సంవత్సరంలోనే అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు కూడా తను ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది.

కిక్ వంటి భారీవిజయం తర్వాత ఇలియానా నితిన్ సరసన రెచ్చిపో, మంచు విష్ణు సరసన సలీమ్ చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత 2011లో ఇలియానా రెండు చిత్రాల్లో నటించింది. ఒకటి మెహెర్ రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన శక్తి. మరొకటి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా సరసన నేను నా రాక్షసి. ఈ రెండు చిత్రాలు కూడా పరాజయం పాలైనప్పటికీ నేను నా రాక్షసి చిత్రంలో ఇలియానా తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది.

2012-ప్రస్తుతం : హిందీ సినిమాల్లోకి తెరంగేట్రం[మార్చు]

2012లో ఇలియానా శంకర్ దర్శకత్వంలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సరసన నన్బన్ చిత్రంలో నటించింది. ఇది ప్రముఖ హిందీ చిత్రం త్రీ ఈడియట్స్ చిత్రం యొక్క పునఃనిర్మాణం. త్రీ ఈడియట్స్ లాగే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆపై త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన జులాయి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా అనూహ్యమైన రీతిలో విజయం సాధించింది. అదే ఏడాది రవితేజ సరసన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించింది. ఈ చిత్రం మాత్రం పరాజయం పాలైంది. కానీ ఇందులో రవితేజ మరియూ ఇలియానాల నటనకు మంచి ప్రశంసలందాయి.

ఆ ఏడాది ఇలియానా అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బర్ఫీ చిత్రంతో హింది సినిమల్లోకి అడుగుపెట్టింది. రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇందులో ఇలియానా పోషించిన శృతి పాత్రకు విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలను అందుకున్న ఇలియానా అదే చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి అవార్డ్ ను గెలుచుకుంది. ప్రస్తుత తరం కథానాయికల్లో ఆసిన్, కాజల్ అగర్వాల్ తర్వాత తొలిచిత్రంతోనే భారీ విజయం అందుకున్న దక్షిణాది కథానాయికగా ఇలియానా కొనియాడబడింది. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన ఫటా పోస్టర్ నిక్లా హీరో చిత్రంలో నటిస్తోంది ఇలియానా.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే గ్రీకు పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు. తల్లితండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం, ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరిగేవి. అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవ పడకపోవడం విశేష మంటుంది ఇలియానా.

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయకుడు ఇతర విశేషాలు
2006 దేవదాసు భానుమతి రామ్ విజేత, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నూతన నటి
2006 పోకిరి శృతి మహేశ్ ‌బాబు
2006 ఖతర్నాక్ నక్షత్ర రవితేజ
2006 రాఖీ త్రిపుర జూనియర్ ఎన్.టి.ఆర్.
2007 మున్నా నిధి ప్రభాస్
2007 ఆట సత్య సిద్దార్థ్
2008 జల్సా భాగ్యమతి పవన్ కళ్యాణ్ పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటి
2008 భలే దొంగలు జ్యోతి తరుణ్ కుమార్
2009 కిక్ నైన రవితేజ పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటి
2009 రెచ్చిపో కృష్ణవేణి నితిన్
2009 సలీమ్ సత్యవతి మంచు విష్ణు
2011 శక్తి ఐశ్వర్య జూనియర్ ఎన్.టి.ఆర్.
2011 నేను నా రాక్షసి మీనాక్షి
శ్రావ్య
దగ్గుబాటి రానా ద్విపాత్రాభినయం
2012 జులాయి మధు అల్లు అర్జున్
2012 దేవుడు చేసిన మనుషులు ఇలియానా రవితేజ

తమిళం[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయకుడు ఇతర విశేషాలు
2006 కేడి ఆర్తి రవికృష్ణ తెలుగులో "జాదూ" అనే పేరుతో అనువదించబడింది
2006 నన్బన్ రియా విజయ్ తెలుగులో "స్నేహితుడు" అనే పేరుతో అనువదించబడింది

కన్నడ[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయకుడు ఇతర విశేషాలు
2010 హుడుగ హుడుగి ఒక గానంలో ప్రత్యేక నృత్యం

హిందీ[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయకుడు ఇతర విశేషాలు
2012 బర్ఫీ! శృతి ఘోష్ రణబీర్ కపూర్ విజేత, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి
పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ సహాయనటి
2013 ఫటా పోస్టర్ నిక్లా హీరో కజల్ షాహిద్ కపూర్
2014 మే తెరా హీరో సునైనా వరుణ్ దవన్
2014 హ్యపి ఎండింగ్ అంచల రెడ్డి సైఫ్ అలి ఖాన్
2016 రస్తుమ్ సింతియా పర్వి అక్షయ్ కుమార్
2017 ముబారకన్ స్వీటి అర్జున్ కపూర్
2017 బాద్షాహో రాణి గితాంజలీ దేవి అజయ్ దెవగన్
2018 రెయిడ్ మాలిని పట్నాయక్ అజయ్ దెవగన్

మూలాలు[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3565: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3565: bad argument #1 to 'pairs' (table expected, got nil).
"https://te.wikipedia.org/w/index.php?title=ఇలియానా&oldid=2375343" నుండి వెలికితీశారు