ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయం
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కరీంనగర్ జిల్లా |
ప్రదేశం | ఇల్లందకుంట, ఇల్లందకుంట మండలం |
సంస్కృతి | |
దైవం | సీతారామచంద్రస్వామి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | కాకతీయ శైలీ |
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, ఇల్లందకుంట గ్రామంలో ఉన్న దేవాలయం.[1] శ్రీరాముడు తన అరణ్యవాసంలో భాగంగా ఇక్కడ అందుకే ఆ గ్రామాలకు లక్ష్మాజీపల్లె, శ్రీరాములపల్లె, సీతంపేట, లక్ష్మన్నపల్లె, రామన్నపల్లె, సిరిసేడు అని పేర్లు వచ్చాయని ఇక్కడి పెద్దలు చెబుతుంటారు.
చరిత్ర
[మార్చు]త్రేతాయుగంలో రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ 13 రోజులు గడిపారు. ఆ సమయంలోనే తండ్రి దశరథుడు మరణించిన విషయం తెలుసుకున్న రాముడు.. ఇక్కడి ఇల్లంద వృక్షానికి సంబంధించిన ఇల్లంద పలుకులతో దశరథుడికి శ్రాద్ధకర్మలు జరిపించాడని, రాముడు ఇల్లంద పలుకులతో శ్రాద్ధకర్మలు జరిపించడంతో.. ఈ ప్రాంతానికి ఇల్లందకుంట అని పేరు వచ్చిందని ప్రతీతి. ఈ దేవాలయంలోని ఉత్సవమూర్తులకు పుట్టు మచ్చలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత.[2]
బ్రహ్మోత్సవాలు
[మార్చు]ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఈ దేవాలయంలో 13 రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవవి రోజున జరిగే స్వామి కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించబడుతాయి.[3]
- మొదటిరోజు స్వామివారి ఉత్సవమూర్తులను గ్రామ దేవాలయం నుంచి ప్రధాన దేవాలయానికి బాహ్యమందిర ప్రవేశం
- రెండోరోజు విశ్వక్సేనారాదన పుణ్యహవచనం, రక్షబంధనం, అంకురార్పణ
- మూడోరోజు ఉదయం 9 గంటలకు ధ్వజారోహనం, అగ్నిప్రతిష్ట, 10 గంటలకు ఎదుర్కోళ్లు, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమం, రాత్రి 8 గంటల శేషవాహన సేవ
- నాలుగోరోజు పట్టాభిషేక మహోత్సవం, సాయంత్రం 6గంటలకు ప్రభుత్వోత్సవం ప్రారంభం, 7 గంటలకు హంసవాహన సేవ
- ఐదోరోజు రాత్రి 8 గంటలకు గరుడవాహన సేవ
- ఆరోరోజు 8 గంటలకు హన్‌మత్ వాహన సేవ
- ఏడోరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవ
- ఎనిమిదవరోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ (దీపోత్సవం)
- తొమ్మిదవరోజు రాత్రి 7 గంటలకు బండ్లు తిరుగుట, సూర్యరథోత్సవం (చిన్న రథం)
- పదవరోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారి చంద్రరథోత్సవం
- పదకొండవరోజు మధ్యాహ్నం 3గంటల వరకు భక్తులకు చంద్రోరథోత్సవంపై స్వామివారి దర్శనం, తిరుమాడ వీధుల్లో రథ ఊరేగింపు, రాత్రి 7గంటలకు మహాపూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ
- పన్నెండవరోజు అష్టోత్తరశత (108) కలశ అభిషేకం, అవబృధ చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ద్వాదశారోదన శ్రీపుష్పయాగం (నాఖబలి)
- పదమూడవరోజు రాత్రి 7 గంటలకు సప్తవర్ణాలు.. ఏకాంతసేవ, గరుడసేవ
మూలాలు
[మార్చు]- ↑ "ఘనంగా సీతారాముల కళ్యాణం". Prabha News. 2022-04-10. Archived from the original on 2022-04-10. Retrieved 2023-03-29.
- ↑ ABN (2023-03-28). "రాములోరి కల్యాణానికి సర్వసిద్ధం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-29. Retrieved 2023-03-29.
- ↑ "వైభవంగా సీతారాముల కల్యాణం". NavaTelangana. 2019-04-15. Archived from the original on 2023-03-29. Retrieved 2023-03-29.