ఇవ్వబడిన పేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇవ్వబడిన పేరు (Given Name) అనేది ఒక వ్యక్తి యొక్క పేరు. ఇది వ్యక్తుల సమూహంలోంచి ఒక వ్యక్తిని వేరు చేసి ప్రత్యేకంగా చూపుతుంది. ముఖ్యంగా ఒక కుటుంబంలో, సభ్యులందరూ ఒకే కుటుంబపేరు (ఇంటిపేరు) ను కలిగి ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇవ్వబడిన పేరు అంటే ఒక వ్యక్తికి ఇచ్చిన పేరు, ఇది వారసత్వంగా ఒక కుటుంబం నుంచి వచ్చిన పేరకు వ్యతిరేకంగా ఉంటుంది.[1] అధికశాతం యూరోపియన్‌ దేశాలలో మరియు సంస్కృతిలో యూరోప్‌ ప్రభావం ఉన్న దేశాలలో (యూరోపియన్‌ పూర్వీకులుగా ఉండి, ఉత్తర మరియు దక్షఙణ అమెరికాలలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాలలో నివశించేవారిలో) ఇవ్వబడిన పేరు అనేది కుటుంబ పేరు కంటే ముందుగా వస్తుంది (సాధారణంగా జాబితాల్లో మరియు క్యాటలాగ్‌లలో ఇలా లేనప్పటికీ) మరియు వీరు ఫోర్‌ నేమ్‌ లేదా మొదటి పేరు తోనే అందరికీ తెలుస్తారు. కానీ ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో - హంగెరీ లాంటి వాటిలో, ఆఫ్రికాలోని అనేక సంస్కృతుల్లో, తూర్పు ఆసియా (ఉదాహరణకు చైనా, జపాన్‌, కొరియా, వియత్నాం) - ఇవ్వబడిన పేర్లు సాధారణంగా, కుటుంబ పేరు తర్వాత వస్తాయి. తూర్పు ఆసియాలో, ఇవ్వబడిన పేరులో కొంత భాగం, ఒక కుటుంబంలో అదే తరంలో మిగిలిన వారితో పంచుకోవడం జరుగుతుంది మరియు ఈ పేర్లు ఒక తరం నుంచి మరో తరానికి అలా వెళుతూనే ఉంటాయి.

ఆధునిక కాలంలో సహజంగా ప్రజలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫోర్‌నేమ్స్‌ (ఇవ్వబడినవి కావచ్చు లేదా సంపాదించుకున్నవి కావచ్చు) ఉంటున్నాయి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఉంటే, ఒక ముందు పేరు (ప్రతిరోజూ వాడేది) కచ్చితంగా ఉంటుంది. దానికి అదనంగా ఒకటి కంటే ఎక్కువ ప్రత్యామ్నాయ‌ ముందు పేర్లు ఉంటాయి. కొన్నిసార్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ పేర్లు ఒకే ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ముందు పేరు అనేది ఇంటిపేరు కంటే ముందు వస్తుందనేది వాస్తవ అంశం అయినా, ఇలాగే పేరు రావాలనే నిబంధన ఎక్కడా లేదు. తరచుగా ప్రధాన ముందు పేరు ఆరంభంలో ఉంటుంది. దీనివల్ల ముందు పేరు మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మధ్య పేర్లు వస్తాయి. ఇతర ఏర్పాట్లు అనేవి చాలా సహజం.

ఇవ్వబడిన పేర్లు అనేవి చాలా తరచుగా ప్రాచుర్యం పొందడంతో పాటు అనధికారిక‌ పరిస్థితుల్లో కూడా స్నేహపూర్వకంగా పలుకుతారు. కానీ అనేక అధికారిక‌ పరిస్థితుల్లో మాత్రం ఇంటిపేరును వాడతారు. ఒకవేళ అదే ఇంటిపేరుతో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం అలా వాడరు. మొదటి పేరు ఆధారంగా (లేదా మొదటి పేరు నిబంధనలు) ఒక జాతీయం ఉంది. దీని ప్రకారం వ్యక్తికి ఇవ్వబడిన పేరును బట్టి ప్రాచుర్యం లభిస్తుంది.

న్యాయబద్దత[మార్చు]

సాధారణంగా పిల్లలకు పేరు లేదా పేర్లు వారు పుట్టినప్పుడే పెట్టడం జరుగుతుంది. అనేక న్యాయ పరిధులలో, పుట్టినప్పుడు పేరు పెట్టడం అనేది పబ్లిక్‌ రికార్డుల కోసం అవసరం. దీని ఆధారంగానే జనన ధృవీకరణ పత్రం లేదా దానికి సమానమైన పత్రం తయారవుతుంది. కొన్ని న్యాయపరిధులలో, ముఖ్యంగా సివిల్‌ న్యాయ పరిధిలో, ఫ్రాన్స్‌, క్యూబెక్‌, ది నెదర్లాండ్స్‌ లేదా జర్మనీలలో, పేర్లను నమోదు చేసే వ్యక్తి, పిల్లలకు వారి తల్లిదండ్రులు హాని కలిగే విధంగా పేరు పెట్టకుండా చూడాలి. (ఫ్రాన్స్‌లో, ఈ అంశాన్ని స్థానిక న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలలి) .[ఉల్లేఖన అవసరం] పేరులో స్పెల్‌ చెకింగ్‌ కూడా అదే వ్యక్తి చేయాలి.

ఒక దేశంలో పుట్టిన వ్యక్తి, మరో దేశానికి వలస వెళ్లినప్పుడు, పేరులో మార్పు చేసుకుంటే దానికి సంబంధించి అవసరమైన న్యాయపరమైన నిబంధనలు పాటించాలి.[ఉల్లేఖన అవసరం] ఒకవేళ పుట్టినప్పుడు పేరు పెట్టకపోతే, కొద్ది రోజుల తర్వాత స్నేహితులు, బంధువుల సమక్షంలో పేరు పెట్టేందుకు ఒక వేడుక చేస్తారు.

1991లో, స్వీడిష్‌ పేర్ల చట్టంలో కేసు ప్రకారం, ఇద్దరు తల్లిదండ్రులు తమ పిల్లాడికి Brfxxccxxmnpcccclllmmnprxvclmnckssqlbb11116, అనే పేరు పెట్టాలని ప్రయత్నించారు. దీనికి వారు ఒక గర్భిణి, కళాత్మక హృదయంతో తన భావాలను వ్యక్తపరిచే ప్రయత్నం అని సమర్ధించుకున్నారు.

ఇవ్వబడిన పేర్ల పుట్టుక / మూలం[మార్చు]

సాధారణంగా ఇవ్వబడిన పేర్లు కింద పేర్కొన్న విభాగాల నుంచి వచ్చాయి:

 • వ్యక్తిగత భావాలను తీసుకుని (బహిర్గత మరియు అంతర్గత) . ఉదాహరణకు, క్లెమెంట్‌ అనే పేరుకు అర్థం దయగల అని.[2][3] ఆంగ్లం‌లో ఉదాహరణలను తీసుకుంటే నమ్మకం, ప్రుడెన్స్‌ మరియు ఆగస్టు కూడా ఉన్నాయి.
 • వృత్తులు, ఉదాహరణకు జార్జ్‌ అంటే వ్యవసాయదారుడు అని అర్థం[4]
 • పుట్టిన పరిస్థితులను బట్టి, ఉదాహరణకు థామస్‌ అంటే కవలలు' అని అర్థం లేదా లాటిన్‌ పేరు క్విన్‌టస్ ‌, ఇది సంప్రదాయబద్దంగా ఐదో మగ పిల్లాడికి ఇచ్చే పేరు.[5][6]
 • అంశాలు, ఉదాహరణకు పీటర్‌ అంటే రాయి అని మరియు ఎడ్జర్‌ అంటే రిచ్‌ స్పియర్‌ అని అర్థం.[7][8]
 • శారీరక స్థితులను బట్టి, ఉదాహరణకు కెల్విన్‌ అంటే బాల్డ్‌ అని అర్థం.[9]
 • ఇతర పేర్లలో మార్పులను బట్టి, ప్రత్యేకించి పేరు యొక్క లింగాన్ని మార్చడానికి (పౌలిన్‌, జార్జియా) లేదా మరో భాష నుంచి అనువదించడానికి (ఉదాహరణకు ఫ్రాన్సిస్‌ లేదా ఫ్రాన్సిస్కో అనే పేరు ఫ్రాన్సిస్‌కస్‌ నుంచి వచ్చింది. దీని అర్థం ఫ్రెంచ్‌మ్యాన్‌ అని) మరియు (డైలాన్‌ లేదా డిలిన్‌ అనే పేరు, కొన్ని సందర్భాలలో దీని అర్థం సన్‌ ఆఫ్‌ ద సీ అని).[10][11][12]
 • ఇంటిపేర్లు,[13] ఉదాహరణకు విన్‌స్టన్‌, హారిసన్‌ [14] మరియు రాస్‌.[15] ఇలాంటి పేర్లు తరచుగా కుటుంబాల నుంచి తరచుగా పెళ్లిళ్ల ద్వారా, కుటుంబాలు వ్యక్తుల యొక్క ఇంటిపేర్లను తీసుకోవడం ద్వారా వస్తాయి.
 • ప్రదేశాలు, ఉదాహరణకు బ్రిటనీ[16] మరియు లోరేన్‌[17]
 • పుట్టిన సమయాన్ని బట్టి, ఉదాహరణకు వారంలోని పేరు, కోఫి అన్నన్‌ మాదిరిగా. ఈ పేరుకు అర్థం శుక్రవారం పుట్టిన వ్యక్తి అని.[18] లేదా సెలవు రోజుల్లో పుట్టిన వారికి దానికి అనుగుణంగా పేరు పెడతారు. నథాలీ అనే పేరుకు అర్థంక్రిస్ట్‌మస్‌(ఆ రోజు పుట్టిన) అని లాటిన్‌లో అర్థం ఉంది.[19]
 • పైవాటి అన్నింటి కలయిక, ఉదాహరణకు ఆర్మేనియన్‌ పేరు సిర్‌వర్ట్‌ అంటే గులాబీని ప్రేమించు అని.[20]
 • తెలియని పేర్లు లేదా వివాదాస్పద శాస్త్రం, ఉదాహరణకు మేరి.[21]

అనేక సంస్కృతుల్లో, ఇవ్వబడిన పేర్లు తిరిగి ఉపయోగిస్తారు. ప్రత్యేకించి పూర్వీకులను గుర్తు చేసుకోవడానికి లేదా ఎవరి పైన అయినా ఆరాధనా భావం ఉంటే, అదే పేరును తిరిగి పునరావృతం చేస్తుంటారు. కొన్నిసార్లు ఆర్థోగ్రఫీని బట్టి కూడా నిర్ణయాలు తీసుకుంటారు.

దీనికి బాగా తెలిసిన ఉదాహరణ, ముఖ్యంగా పాశ్చాత్య రీడర్స్‌కు, అనేక క్రిస్టియన్‌ దేశాలలో బైబిలికల్‌ మరియు సెయింట్ ల పేర్లు (ఇథియోఫియాతో, ఇక్కడ పేర్లు తరచుగా ఆదర్శపూర్వకంగా ఉంటాయి. హెలీ సిలాసీ ట్రినిటి యొక్క శక్తి. హెలీ మిరియమ్‌ మేరి యొక్క శక్తి - ఇవిలా చాలా చెప్పుకోదగ్గ మినహాయింపులు) . ఏదేమైనా జీసస్‌ అనే పేరు క్రైస్తవ‌ ప్రపంచంలోని కొన్ని భాగాలలో నిషేధించబడింది లేదా సరిగా వినియోగించబడలేదు. అయితే ఈ నిషేధం అనేది కోగ్నెట్‌ జోషువా లేదా సంబంధిత రూపాల దాకా వెళ్లలేదు. అనేక మంది క్రైస్తవులలో, అనేక భాషలలో దీనిని సహజంగా వాడుతున్నారు.

ఇదే విధంగా, మేరి అనేపేరు. ఇప్పుడు చాలా ప్రాచుర్యం చెందింది. కానీ క్రైస్తవులకు ప్రత్యేకించి రోమన్‌ కాథలిక్‌లకు ఆమోదయోగ్యం కాదు. వీరు 12వ శతాబ్దం వరకు దీనిని చాలా పవిత్రంగా భావించేవారు. మేరి అనే పేరు చాలా దేశాలలో ఎక్కువగా లేకపోవడానికి కారణం ఇలా భావించడమే. పొలాండ్‌లో, 17వ శతాబ్దంలో ఫ్రెంచ్‌ రాణి మేరి ప్రవేశించే వరకూ ఈ పేరు లేదు.[22]

ఆంగ్లంలో చాలా ఎక్కువగా ఇవ్వబడే పేర్ల (అనేక ఇతర యూరోపియన్‌ భాషల్లోనూ) ను అనేక విభాగాలుగా వాటి మూలాలను బట్టి విభజించవచ్చు:

 • హీబ్రూ పేర్లు, ఇవి ఎక్కువగా బైబిల్‌ నుంచి వచ్చాయి, మరియు ఇందులో ఉపయోగించే పేర్లలో ఒకే విధమైన‌ అంశాలు చాలా ఉంటాయి. చారిత్రాత్మకంగా క్రైస్తవ‌ దేశాలలో ఇవి ఉంటాయి. కొన్ని పేర్లలో దేవుడు అనే అర్థం ఉంటుంది. ప్రత్యేకించి El. ఉదాహరణలు: మైకేల్‌, జోషువా, డానియెల్‌, జోసెఫ్‌, డేవిడ్‌, ఆడమ్‌, ఎలిజబెత్‌, హన్నా మరియు మేరి. అదే విధంగా చెప్పుకోదగ్గ స్థాయిలో పేర్లు అరామిక్‌ నుంచి వచ్చాయి. ప్రత్యేకించి న్యూ టెస్టమెంట్‌లో ఉన్న చెప్పుకోదగ్గ పేర్లు థామస్‌, మార్తా మరియు బార్తోలోమ్యూ.
  • చరిత్రలోని సిమిటిక్‌ ప్రజలతో పాటు ప్రస్తుత రోజుల్లో ఉపయోగించే పేర్లలో కనీసం కొన్ని హీబ్రూలో ఇలాంటి నిర్మాణం కలిగి ఉన్నాయి. (మరియు పూర్వీకులు హీబ్రూస్‌ ఇలా నిర్మాణం కానీ పేర్లను వాడేవారు, మోసెస్‌ అనే పేరు ఈజిప్టియన్‌ పేరు. ఇదిఫారోహాస్‌లో తుట్‌మోస్‌ మరియు అహ్‌మోస్‌కు సంబంధించిన పేరు) . ముస్లిం ప్రపంచం ఉత్తమ ఉదాహరణ (సైఫ్‌ అల్‌ దిన్‌ అంటే నమ్మకం యొక్క ఖడ్గం అని లేదా అబ్డ్‌ అల్లా అంటే దేవుడి సేవకుడు అని అర్థం) . కానీ కార్తాజీనియన్స్‌ కూడా ఇదే తరహా పేర్లు కలిగి ఉంటారు: హన్నిబాల్‌ దేవుడి యొక్క దయ (ఈ సందర్భంలో అబ్రహమిచ్‌ దేవుడు కాదు. దేవుడు మర్దూక్‌ ఈ పేరు సాధారణంగా బాల్‌ అని అనువదించకుండా ఉంటుంది) .
 • జర్మనిక్‌ పేర్లు సాధారణంగా యుద్ధం తరహాలో ఉంటాయి; వెలుగు, బలం, కోరిక అనే అర్థాలను మూలాల్లో కలిగి ఉంటాయి. బెరాహత్‌ నుంచి వచ్చిన పేర్లలో ది బెర్ట్‌ అనే అంశం సహజంగా ఉంటుంది. దీని అర్థం వెలుగు. ఉదాహరణకు: రాబర్ట్‌, ఎడ్వర్డ్‌, రోజెర్‌, రిచర్డ్‌, ఆల్బెర్ట్‌, కార్ల్‌, ఆల్‌ఫ్రెడ్‌, రోసాలిండ్‌, ఎమ్మా, ఎరిక్‌ మరియు మాటిల్డా
 • ఫ్రెంచ్‌ రూపంలో ఉన్న జర్మనిక్‌ పేర్లు. ఇంగ్లండ్‌ విజయం సాధించిన కారణంగా అనేక ఆంగ్లం‌లో ఇవ్వబడే పేర్లు జర్మనిక్‌ మూలాలను కలిగి ఉండి ఫ్రెంచ్‌ రూపంలో వాడబడతాయి. ఉదాహరణకు: రాబర్ట్‌, చార్లెస్‌, హెన్రీ, విలియమ్‌, ఆల్బర్ట్‌.
 • స్లావిక్‌ పేర్లు తరచుగా శాంతియుత స్వభావాన్ని సూచిస్తాయి. రక్షించడానికి, ప్రేమించడానికి, శాంతి, దేవుడిని ఆరాధించడానికి, ఇవ్వడానికి అనే అంశాలను మూలాలుగా తీసుకుని పేర్లు ఉంటాయి. ఉదాహరణకు: మిలెనా, వెస్నా, బోహూమిల్‌, డోబ్రోమిర్‌, స్వెత్లానా, వ్లాస్టిమిల్‌. ఈ పేర్లలో కొన్ని యుద్ధం తరహాలో, పోరాటయోధుడు, యుద్ధం, కోపం అనే అర్థాలతోనూ ఉంటాయి. ఉదాహరణకు: కాసిమిర్‌, శామ్‌బోర్‌, వోజిక్‌ మరియు జిబిగ్నీవ్యూ. వీటిలో చాలా స్లావా - గ్లోరి అనే పదాలను కలిగి ఉంటాయి: బోలెస్లా, మిరోస్లావ్‌, వ్లాడిస్లావ్‌, రాడోస్లావ్‌ మరియు స్టానిస్లా.
 • సెల్టిక్‌ పేర్లు కొన్నిసార్లు సెల్టిక్‌ పద్దతిలోని యాంగ్లిసైజ్డ్‌ వెర్షన్‌ను కలిగి ఉంటాయి. కానీ వాటి అసలు రూపం కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు: అలెన్‌, బ్రియాన్‌, బ్రిజిడ్‌, మోరాగ్‌, సియారాన్‌, జెన్నిఫర్‌ మరియు సియాన్‌. ఈ పేర్లు తరచుగా వాటి మూలాలైన సెల్టిక్‌ పదాలను కలిగి ఉంటాయి. సెల్టిక్ పేర్లు అంతర్జాతీయంగా క్రిస్టియన్ సెయింట్ ల పేర్లను కలిగి ఉంటాయి. సెల్టిక్‌ పురాణాలలోని వ్యక్తుల పేర్లు ఉంటాయి. లేదా దీర్ఘకాలం ఉండే పేర్లు ఉంటాయి. ఎందుకంటే వీటి శాస్త్రం స్పష్టంగా లేదు.
 • గ్రీక్‌ పేర్లు ఎక్కువగా గ్రీకో రోమన్‌ దేవుళ్ల పేర్ల నుంచి వచ్చాయి. లేదా ఇతర అర్థాలను కూడా కలిగి ఉంటాయి. ఇందులో కొన్ని కొత్త టెస్టామెంట్‌ మరియు ఆరంభ క్రిస్టియన్‌ సంప్రదాయాల నుంచి వచ్చాయి. కొన్ని పేర్లు చాలా తరచుగా, అన్ని సార్లు కాదు, యాంగ్లిసైజ్‌ చేయబడతాయి. ఉదాహరణకు: ఎలెనార్‌, స్టీఫెన్‌, అలెగ్జాండర్‌, ఆండ్రూ, పీటర్‌, గ్రెగొరి, జార్జి, క్రిస్టోఫర్‌, మెలిస్సా, మార్గరెట్‌, నికోలస్‌, జాసన్‌, టిమోతి, చోల్‌ మరియు జో.
 • లాటిన్‌ పేర్లు కూడా మారకుండానే తీసుకోబడ్డాయి లేదా మార్చబడ్డాయి; ముఖ్యంగా, ప్రభావం ఉన్న అంశాలను తొలగించి, చాలా తరచుగా లాటిన్‌ నుంచి ఆంగ్లం‌కు తెచ్చిన పదాలను వాడతారు. ఉదాహరణకు: లౌరా, విక్టోరియా, మార్కస్‌, జస్టిన్‌, పాల్‌ (లాటిన్‌లో పౌలస్‌) , జులియస్‌, సెసిలియా, ఫెలిక్స్‌, జులియా, ఫాస్కల్‌ (సంప్రదాయబద్దమైన లాటిన్‌ పేరు కాదు, కానీ దీని ఎడ్జెక్టివ్‌ పేరు ఫాస్కలిస్‌, ఇది ఫాస్కాకు సంబంధించినది ఆంగ్లం‌ ఈస్టర్‌) .
 • పదాల పేర్లు ఆంగ్లంలోని వొకాబులరీ పదాల నుంచి వచ్చాయి. ఇలాంటి చెప్పుకోదగ్గ పేర్లు అనేక ఆంగ్లేతర భాషల్లో ఉన్నాయి. యూరోప్‌లోనే కాకుండా ఇతర సంస్కృతుల్లో సాధారణంగా ప్రకృతి, పూలు, పక్షులు, రంగులు లేదా రత్నాల పేర్ల నుంచి వచ్చాయి. ఉదాహరణకు: జాస్మిన్‌, లావెండర్‌, డాన్‌, డైసీ, రోస్‌, ఐరిస్‌, పెటునియా, రోవన్‌ మరియు వయొలెట్‌. ఇలాంటి వాటిలో మగ పేర్లు చాలా తక్కువగా ఒకేలా ఉంటాయి. కొన్నిసార్లు బ్రోన్‌కో మరియు ఊల్ప్‌ తరహా ప్రమాదకరమైన జంతువుల తరహాలోనూ పేర్లు ఉంటాయి. (కొన్ని ఇతర భాషల్లో ఇవి చాలా సమజం. ఉత్తర జర్మనిక్‌ మరియు టర్కిష్‌ వీటికి ఉదాహరణలు) .
 • ట్రెయిట్‌ పేర్లు చాలా సహజంగా క్రైస్తవ అంశాలను పైన పేర్కొన్న తరహాలో కలిగి ఉంటాయి మరియు సాధారణంగా ప్రాచుర్యం పొందిన పేర్లను కలిగి ఉంటాయి. (మూడు క్రైస్తవ‌ అంశాలు ఫెయిత్‌, హోప్‌, చారిటీ అనేవి చెప్పుకోదగ్గవి) .
 • డిమినుటివ్స్‌ అనేవి కొన్నిసార్లు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందికి ఒకే పేరు ఇచ్చినప్పుడు తేడాను చూపిస్తాయి. ఇవి చాలా ఎక్కువగా పిల్లలు ఉపయోగిస్తారు. ఆంగ్లం‌లో, రాబర్ట్‌ అనే పేరును రాబీగా మార్చొచ్చు. లేదా డేనియల్‌ అనే పేరును డేనీగా మారుస్తారు. జర్మన్‌లో హన్సెల్‌ మరియు గ్రెటెల్‌ అనే పేర్లు (ఇవి ప్రముఖంగా చెప్పుకోదగ్గ కథలలో పాత్రలు) వీటికి జోహాన్‌ మరియు మార్గరేట్‌ అనే రూపాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు: విక్కీ, డేనీ, అబ్బి, అలి.
 • తగ్గించబడిన పేర్లు (నిక్‌నేమ్‌ను చూడండి) అనేవి సహజంగా ఒక పెద్ద పేరుకు నిక్‌నేమ్‌లా ఉంటాయి. కానీ అవి వ్యక్తికి ఇవ్వబడిన పేరులాగే ఉంటాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తిని సాధారణంగా జిమ్‌ అనే పేరుతో పిలుస్తాం. ఇది జేమ్స్‌కు తగ్గించబడిన పేరు కాదు. ఉదాహరణకు: బెత్‌, డాన్‌, మ్యాక్స్‌, పీటె, స్టీవ్‌.
 • ఫెమినైన్‌ భేదాలు అనేక మస్కులైన్‌ పేర్లలో ఫెమినైన్‌ భేదాలు ఉంటాయి, తరచుగా అనేకము ఉంటాయి. ఉదాహరణకు: చార్‌లెట్‌, స్టీఫనీ, విక్టోరియా, ఫిలిప్పా, జేన్‌, జాక్విలీన్‌, జోసెఫైన్‌, డానియెల్లి, పౌలా, పౌలైన్‌, పాట్రిసియా మరియు ఫ్రాన్సెస్కా.

తరచుగా, ఇవ్వబడిన పేరుకు విభిన్న భాషల్లో విభిన్న రూపాలు ఉంటాయి. ఉదాహరణకు, బైబికల్‌ హీబ్రూ పేరు సుసన్నా అనేది దాని మూలం హీబ్రూ రూపంలో షోషన్నా, దాని స్పానిష్‌, పోర్చుగీస్‌ రూపంలో సుసానా మరియు ఫ్రెంచ్‌ రూపంలో సుజానె మరియు పోలిష్‌ రూపంలో జుజాన్నా.

 • చైనీస్‌ పేర్లు వాటికవే అన్నట్లు ఉంటాయి, ఎందుకంటే అర్థవంతమైన హంజి మరియు హంజా అక్షరాలను విస్తారంగా కలిపి వాడవచ్చు. కానీ కొరియాలో పేర్లు మరియు వియత్నాంలో పేర్లు చాలా సాధారణంగా తమ సహచర చైనీస్‌ నుంచి తీసుకున్న పేర్లలాగే ఉంటాయి.

ఏదేమైనా, కొందరు తల్లిదండ్రులు ప్రముఖ పేర్లను తిరిగి ఉపయోగిస్తుంటారు. ప్రముఖ, విజయవంతమైన వ్యక్తుల యొక్క పేర్లను సందర్బాన్ని బట్టి తిరిగి వాడుతుంటారు. అనేక మంది చైనీస్‌ మరియు కొరియన్‌ తల్లిదండ్రులు తమ పిల్లలు పుట్టకముందే పేర్ల గురించి చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశోధనలు చేస్తారు. చాలా ఎక్కువగా నిఘంటవులు, మత సంబంధ గైడ్‌లు వెతుకుతారు. కొన్ని అధికారికంగా, కొన్ని అనధికారికంగా కూడా వెతుకుతారు. ప్రత్యేకించి సంప్రదాయబద్ద కుటుంబాలలో తండ్రివైపు తాతలు పేర్లు పెడుతుంటారు. చైనీస్‌ భాషలో ప్రత్యేకించి పేర్లు ఇవ్వడం కోసం పదాలు లేవు. ఇది ఆంగ్లం‌కు భిన్నంగా ఉండే అంశం. చైనీస్‌ అక్షరాలను ఏ కూర్పుతోనైనా వాడి పేర్లు పెడతారు. కానీ సాధారణంగా ఆంగ్లం‌ అక్షరాల సమ్మేళనాన్ని మాత్రం వాడరు. చాలా సార్లు చైనీయులు ఆలోచించేదాని ప్రకారం, చైనీస్‌ భాషలో కంటే ఆంగ్లం‌లోనే ఎక్కువ మందికి ఒక విధమైన‌ పేర్లు ఉంటాయి. కానీ నిజానికి ఆంగ్లం‌లో కుటుంబ పేర్ల కోసం చాలా పదాలను పెద్ద సంఖ్యలో సమ్మేళనాలుగా వాడతారు.

అనేక పాశ్చాత్య ఆసియా ప్రాంతాల్లో, అది అధికారికమైనా, కాకపోయినా, అనేక మంది ఆసియన్లు కూడా పాశ్చాత్య (ఎక్కువగా ఆంగ్లం‌) భాషలతో పేర్లు పెడుతున్నారు. ఇది వారు ఇచ్చే ఆసియా పేరుకు అదనంగా ఉంటుంది. యునైటెడ్‌ స్టేట్స్‌, కెనడా మరియు ఆస్ట్రేలియాల్లోని కళాశాలల్లో చదువుకుంటున్న ఆసియా విద్యార్థులు మరియు ప్రజలు అంతర్జాతీయంగా సులభంగా ఉండటానికి వీలుగా పేర్లను పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అటు ఆంగ్లం‌ వాళ్లతో పాటు తమ సొంత భాషలోని ప్రజలు కూడా పలకడానికి వీలుగా పేర్లు ఉంటున్నాయి. గమనించదగ్గ మరో ఆసక్తికరం అంశం, చైనా నుంచి చదువుకోవడం కోసం వలస వచ్చిన విద్యార్థులు వారంతట వారే ఆంగ్లం‌ పేర్లు పెట్టుకుంటున్నారు. అయితే సాధ్యమైనంత వరకూ వారి అసలు పేరుకు దగ్గరగా కొత్త పేరు ఉండేటట్లు చూసుకుంటున్నారు. ఉదాహరణకు, ఒక చైనీస్‌ మనిషి పేరు అహ్‌ దార్‌ అనుకుంటే... అతడు యునైటెడ్‌ స్టేట్స్‌కు వలసపోగానే అది ఆర్థర్‌గా మారిపోతుంది. లేదా ఒక వియత్నాం మనిషి పేరు ఖాన్‌ అయితే ఆంగ్లం‌ మాట్లాడే దేశానికి రాగానే ఆ పేరు కెన్‌గా మారిపోతోంది.

అనేక జపనీస్‌ మహిళల పేర్లు, యోకో ఓనో లాంటివి చివర్లో కో (子 ) ,తో పూర్తవుతాయి. దీని అర్థం పిల్ల అని. ఇది పాశ్చాత్యులలో కొంత అయోమయాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే కొన్ని రొమన్స్‌ భాషల్లో, పురుషుల‌ పేర్లు ఇన్‌ తో ముగుస్తాయి. కొన్ని స్త్రీల పేర్లు తో ముగుస్తాయి. టినో, టినా లాంటి పేర్లకు అలవాటుపడ్డ తర్వాత మారికో లేదా యోకో అనేది మహిళల పేర్లు అంటే ఆశ్చర్యపోతున్నారు.

ఆంగ్లం‌లో ఎక్కువ పేర్లు, ప్రత్యేకించి పురుషుల లేదా స్త్రీల‌ పేర్లులో అనేక పేర్లు లింగంతో సంబంధం లేకుండా ఉంటాయి. జోర్డాన్‌, జేమీ, జెస్సీ, అలెక్స్‌, యాష్లీ, క్రిస్‌, హిల్లరీ, లెస్లి, జోయ్‌ / జో, జాకీ, పాట్‌, శామ్‌ లాంటివి. తరచుగా ఒక లింగము ముందుగా డామినేట్‌ చేస్తుంది. అనేక సంస్కృతులు, సమూహాలలో చరిత్రను పరిశీలిస్తే లింగంను బట్టి బలమైన పేర్లు లేవు. కాబట్టి ఎక్కువ పేర్లు లింగముతో సంబంధం లేకుండా ఉంటాయి. ఇతరులలో వ్యాకరణంలోనే లింగము కలిసిపోయి ఉంటుంది. ఉదాహరణకు ఓల్డ్‌ నోర్స్‌, లాటిన్‌, వాటి తరహాలో ఇటాలియన్‌, ఫ్రెంచ్‌, గ్రీక్‌ లాంటివి.

క్రైస్తవ‌ పేరు[మార్చు]

క్రైస్తవ‌ పేరు అనే పదం తరచుగా ఇవ్వబడిన పేరుకు నానార్థంగా ఉపయోగిస్తున్నారు. గట్టిగా చెప్పాలంటే, ఈ పదం ఒక పిల్లాడికి బాప్టిజమ్‌ లేదా "క్రిస్టినింగ్"‌ సమయంలో ఇస్తున్న సాధారణమైన పేరు.

ఇవ్వబడిన పేర్ల యొక్క ప్రాచుర్యం పంపిణీ[మార్చు]

ఇవ్వబడిన పేర్ల యొక్క ప్రాచుర్యం పొందిన (ఫ్రీక్వెన్సీ) పంపిణీ, సాధారణంగా పవర్‌ లా పంపిణీని అనుసరిస్తుంది.

ఇంగ్లండ్‌ మరియు వేల్స్‌ మరియు యు.ఎస్‌.లో 1800 సంవత్సరానికి ముందు, ఇవ్వబడిన పేర్ల యొక్క ప్రాచుర్యం పంపిణీ అనేది చాలా ఎక్కువగా జరగడం వల్ల ప్రాచుర్యం కోల్పోవడం జరిగింది. ఉదాహరణకు, ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌లో 1800 కాలంలో పుట్టిన పిల్లలకు ఇచ్చిన ప్రాచుర్యం కలిగిన మగ, ఆడ పేర్లు జాన్‌ మరియు మేరి. ఇక్కడ 24 శాతం మంది ఆడపిల్లలకు, 22 శాతం మంది మగపిల్లలకు ఈ పేర్లను ఇచ్చారు.[23] దీనికి భిన్నంగా ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌లో 1994లో గణాంకాలను పరిశీలిస్తే, 3 శాతం మంది ఆడపిల్లలకు ఎమిలి అని 4 శాతం మంది మగపిల్లలకు జేమ్స్‌ అని పేర్లు పెట్టారు. ఇక్కడ మేరి మరియు జాన్‌ అనే పేర్లు ఆంగ్లం‌ మాట్లాడే ప్రపంచం నుంచి వెళ్లిపోవడమే కాకుండా, వంద సంవత్సరాలలో ఈ పేర్లును వినియోగించడం బాగా తగ్గిపోయింది. ఆడపిల్లల విషయంలో ఇది ఎక్కువగా జరిగినా, మగ పిల్లల విషయంలో ఎక్కువగా జరగలేదు. దీంతో విభిన్నమైన పేర్లను ఆడపిల్లల కోసం వెతికే వారి సంఖ్య బాగా పెరిగింది.[24]

పాప్‌ సంస్కృతి యొక్క ప్రభావం[మార్చు]

పేర్ల ట్రెండ్‌పై పాపులర్‌ సంస్కృతి యొక్క ప్రభావం ముఖ్యంగా యునైటెడ్‌ స్టేట్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో చాలా ఎక్కువగా ఉంది. కొత్తగా ప్రాచుర్యం పొందుతున్న సెలబ్రిటీలు, పబ్లిక్‌ ఫిగర్స్‌ ప్రభావం పేర్లపై బాగా ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు 2004లో కీరా, కియెరా అనే పేర్లు యుకెలో బాగా ప్రాచుర్యం పొందిన పేర్లలో 51, 92వ స్థానాల్లో ఉన్నాయి. దీనికి కారణం బ్రిటిష్‌ నటి కియెరా నైట్లీకి బాగా ప్రాచుర్యం లభించడం.[25] 2001లో యునైటెడ్‌ స్టేట్స్‌లో కోల్బి అనే అబ్బాయి పేరు 233వ స్థానం నుంచి 99వ స్థానానికి వచ్చింది. కారణం, కోల్బి డోనాల్డ్‌సన్‌ రన్నర్‌అప్‌గా నిలవడం.Survivor: The Australian Outback అదే విధంగా, 2007లో ప్రాచుర్యం పొందిన పేర్ల జాబితాలో కనీసం వెయ్యో స్థానంలో కూడా లేనిమిలీ అనే ఆడపిల్లల పేరు కాస్తా 278వ స్థానానికి వచ్చింది. గాయని, నటి మిలీ సైరస్‌ బాగా ప్రాచుర్యం పొందడం దీనికి కారణం. (పుట్టినప్పుడు ఆమె పేరు డెస్టినీ) .[26]

కల్పిత పాత్రల ప్రభావం కూడా పేర్ల పై బాగా పడింది. అమెరికన్‌ సోప్‌ ఒపెరా డేస్‌ ఆఫ్‌ అవుర్‌ లివ్స్ ‌లోని కయాలా అనే పేరుకు చాలా ఎక్కువగా ప్రాచుర్యం పెరిగింది. టామీ మరియు దానికి సంబంధిత టామారా అనే పేరు టామీ అండ్‌ ది బ్యాచిలర్‌ అనే సినిమా 1957లో విడుదల అయ్యాక బాగా ప్రాచుర్యం పొందింది. కొన్ని పేర్లు సాహిత్యంలో వాడుకలోనికి రాగానే ప్రాచుర్యం పొందాయి. దీనికి చెప్పుకోదగ్గ ఉదాహరణ జెస్సికా. ఈ పేరు విలియమ్‌ షేక్‌స్పియర్‌ తన నాటకం ద మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌లో పాత్రకు పెట్టిన పేరు. వనెస్సా అనే పేరు జోనాథన్‌ స్విఫ్ట్‌ సృష్టించారు; ఫియోనా అనే పాత్ర జేమ్స్‌ మాక్‌ఫెర్స్‌న్‌ యొక్క ఓసియన్‌ పద్యాల నుంచి వచ్చింది మరియు వెండీ అనేది జె.ఎమ్‌. బారీ తన నాటకం పీటర్‌ పాన్‌ లేదా ది బాయ్‌ హూ వుడ్‌ నాట్‌ గ్రో అప్‌లో వాడారు. మరియు మ్యాడిసన్‌ అనే పాత్ర ‌ స్ప్లాష్‌ అనే సినిమా నుంచి ప్రాచుర్యం పొందింది. లారా మరియు లారిస్సా అనేవి డాక్టర్‌ జివాగో రాకముందు ఎక్కడోగానీ వినిపించేది కాదు. ఆ తర్వాత బాగా ప్రాచుర్యం పొందింది.

పిల్లల పేర్ల పై పాటల ప్రభావం కూడా బాగా ఎక్కువగా ఉంది. జూడ్‌ అనే మగపిల్లాడి పేరు 1968లో 814వ స్థానంలో ఉంటే, 1969కి 668వ స్థానంలోకి వచ్చింది.బీట్‌లెస్‌ హే జూడ్‌ అనే పాట విడుదలయ్యాక ఇలా జరిగింది. ఇదే విధంగా, లేలా చార్టడ్‌ 969వ స్థానంలోకి 1972లో వచ్చింది. ఎరిక్‌ క్లాప్టన్‌ పాట రాకముందు ఇది కనీసం వెయ్యిలోపు ఎక్కడా లేదు.[26]

కేలీ అనే పేరు యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో బాగా ప్రాచుర్యం పొందిన పేరు. బ్రిటిష్‌ రాక్‌ గ్రూప్‌ మారిలియన్‌ పాటను విడుదల చేశాక దీనికి ప్రాచుర్యం లభించింది. 2005లో ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 96 శాతం కేలీట్స్‌ 1985 తర్వాతే జన్మించారు. 1985లోనే మారిలియన్‌ గ్రూప్‌ కేలీ అనే పాటను విడుదల చేసింది.

ప్రఖ్యాత సాంస్కృతిక అంశాలు కూడా పేర్ల పై ప్రభావం చూపాయి. ఉదాహరణకు యునైటెడ్‌ స్టేట్స్‌లో పీటన్‌ అనే అమ్మాయిల పేరు 1992లో 583వ స్థానానికి వచ్చింది. అంతకు ముందు వెయ్యిలో కూడా లేదు. ది హ్యాండ్‌ దట్‌ రాక్స్‌ ద క్రెడిల్‌ సినిమా విడుదలయ్యాక, అందులోని దెయ్యం నానికి పెట్టిన పేరు వల్ల ఇలా జరిగింది.[26] మరోవైపు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అడాల్ఫ్‌ అనే పేరును పూర్తిగా వాడటం మానేశారు.

కవల పేర్లు[మార్చు]

కొన్ని సంస్కృతుల్లో, కవలలకు రెండు విభిన్నరకాల పేర్లను ఇస్తారు. కొన్నిసార్లు కవలల పేర్లు వినడానికి ఒకేలా ఉంటాయి. ఉదాహరణకు అబ్బాయి /అమ్మాయి కవలల పేర్లు క్రిస్టియన్‌ మరియు క్రిస్టియాన. లేదా ఇద్దరు కవల అమ్మాయిలైతే భారతదేశంలో సుధ, శుభ అని పెడతారు. నైజీరియాలో అయితే ఓజోర్‌, ఓమోణ్‌ అంటారు. పేర్లలో మూల అంశం ఒకే రకంగా ఉండేలా చూస్తున్నారు. ఉదాహరణకు జెస్సీ (లేదా జెస్సికా) మరియు జేమ్స్‌ (అమెరికాలోని జెస్సీ జేమ్స్‌ ప్రభావంతో) లేదా మాథ్యూ మరియు మార్క్‌ (బైబిల్‌లోని క్రొత్త నిబందనలో రెండు తొలి పుస్తకాలు) లేదా క్యాస్టర్‌ మరియు పోలక్స్‌ మరియు రోములస్‌ మరియు రెముస్‌ అనేవి గ్రీక్‌ పురాణాల్లోని పాత్రల నుంచి వచ్చాయి. ఇతర పేర్లు కొన్ని సెలబ్రిటీ కవలలు మేరీ కేట్‌ మరియు ఆష్లీ ఓల్‌సెన్‌ (అమెరికా నటి) లేదా పిల్లలను (జెన్నిఫర్‌ లోపెజ్‌ మరియు మార్క్‌ ఆంథోని లేదా యాంజెలినా జోలీ మరియుబ్రాడ్‌పిట్‌) చూసి పెడుతున్నారు. అతి పాత మహిళల కవలలు, ఇద్దరూ 2000, 2001లో మరణించారు. వీరి పేర్లు కిన్‌ నారిటా మరియు జిన్‌ కేనీ. జపనీస్‌ భాషలో వరుసగా బంగారం, వెండి అని అర్థం.

కామిక్‌ స్ట్రిప్స్‌ ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ టిన్‌టిన్‌ సిరీస్‌ నుంచి ఒకేలా కనిపించే ఇద్దరు డిటెక్టివ్‌ల పేర్లు థామ్‌సన్‌, థామ్‌ప్సన్‌ (ఫ్రెంచ్‌లో డుఫోన్ట్‌, డుఫోన్డ్‌) ఉన్నాయి, వీరు కూడా కవలలు కావచ్చు. ది సింప్సన్స్‌లో పాటీ మరియు సెలెమా బౌవియర్‌ ఉన్నాయి.

మరిన్ని సాధ్యమైన మూలాల కొరకు, లిస్ట్‌ ఆఫ్‌ ట్విన్స్‌ అనే వ్యాసం చూడండి.

సంబంధిత వ్యాసాలు మరియు జాబితాలు[మార్చు]

 • అమెరికాలో అత్యధిక ప్రాచుర్యం పొందిన ఇవ్వబడిన పేర్ల జాబితా
 • అనేక దేశాలలో మరియు సంస్కృతులలో ప్రాచుర్యం పొందిన ఇవ్వబడిన పేర్ల జాబితా
 • రోజుల పేరు
 • భగవంతుని పేర్లు
 • వ్యక్తిగత పేరు

రకాలను బట్టి[మార్చు]

 • మధ్య నామము
 • మారుపేరు
 • తప్పు పేరు
 • సెయింట్‌యొక్క పేరు
  • సెయింట్‌ల క్యాలెండర్
 • బానిస పేరు
 • వంశనామము
 • థియోఫోరిక్‌ పేర్లు
  • బైబిల్‌లోని థియోఫోరి
 • యునిసెక్స్‌ పేరు

సంస్కృతిని బట్టి[మార్చు]

ఇండో-యూరోపియన్
 • జర్మనిక్‌ పేర్లు
  • డచ్‌ పేరు
  • జర్మన్‌ పేర్లు
 • గ్రీక్‌ పేరు
 • భారతీయుల పేర్లు
 • ఐరిష్‌ పేరు
 • లిథుయానియన్‌ పేరు
 • పెర్షియన్‌ పేరు
 • రోమన్‌ పేర్ల సంబరాలు
 • ప్రేమ వ్యవహారం
  • ఫ్రెంచ్‌ పేర్లు
  • ఇటాలియన్‌ పేరు
  • పోర్చుగీస్‌ పేరు
  • స్పానిష్‌ పేరు
 • స్కాటిష్‌ పేర్లు
 • స్లావిక్‌ పేర్లు
  • బల్గేరియన్‌ పేర్లు
  • క్రొయేషియన్‌ పేరు
  • చెక్‌ పేరు
  • స్లొవేకియాలో రోజుల పేరు
  • పోలిష్‌ పేరు
  • రష్యన్‌ పేరు
  • సెర్బియన్‌ పేరు
  • స్లోవక్‌ పేరు
మధ్య ఆసియా, అల్టాక్‌, ఫిన్నో ఉగ్రిక్‌
 • ఫిన్నిష్‌ పేరు
 • హంగేరియన్‌ పేరు
 • మంగోలియన్‌ పేరు
 • రష్యన్‌ సామ్రాజ్యంలో పేర్లు, సోవియన్‌ యూనియన్‌ మరియు సిఐఎస్‌ దేశాలు
 • టాటర్‌ పేరు
సెమిటిక్‌ / ఈస్టర్న్‌ దగ్గర
 • అరబిక్‌ పేరు
 • హీబ్రూ పేరు
 • బైబ్లికల్‌ పేర్ల జాబితా
తూర్పు ఆసియా
 • చైనీస్‌ పేరు
 • ఇండోనేషియన్‌ పేరు
  • బాలినీస్‌ పేరు
  • జావనీస్‌ పేరు
 • జపనీస్‌ పేరు
 • కొరియన్‌ పేరు
 • మలేషియన్‌ పేరు
 • ఫిలిప్పీన్‌ పేరు
 • థాయ్‌ పేరు
 • టిబెటన్‌ పేరు
 • వియత్నామీ పేరు
ఆఫ్రికా
 • అకాన్‌ పేరు
ఐసోలేట్స్‌ భాష
 • సెమెన్‌ (ఆంథ్రోపోనిమ్‌)

సూచనలు[మార్చు]

 1. ఒక వ్యక్తికి పుట్టినప్పుడు లేదా బాప్టిజమ్‌ సమయంలో ఇవ్వబడిన పేరు, ఇంటిపేరుకు భిన్నంగా ఉంటుంది. అమెరికన్‌ హెరిటేజ్‌ డిక్షనరీ Archived 2008-12-11 at the Wayback Machine. ప్రకారం.
 2. Igor Katsev. "Origin and Meaning of Clement". MFnames.com. మూలం నుండి 2008-11-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-05.
 3. Igor Katsev. "Origin and Meaning of Clemens". MFnames.com. మూలం నుండి 2008-11-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-05.
 4. Mike Campbell. "Meaning, Origin and History of the Name George". Behind the Name. Retrieved 2008-07-21.
 5. Mike Campbell. "Meaning, Origin and History of the Name Thomas". Behind the Name. Retrieved 2008-07-21.
 6. Mike Campbell. "Meaning, Origin and History of the Name Quintus". Behind the Name. Retrieved 2008-07-21.
 7. Mike Campbell. "Meaning, Origin and History of the Name Edgar". Behind the Name. Retrieved 2008-07-21.
 8. Mike Campbell. "Meaning, Origin and History of the Name Peter". Behind the Name. Retrieved 2008-07-21.
 9. Mike Campbell. "Meaning, Origin and History of the Name Calvin". Behind the Name. Retrieved 2008-07-21.
 10. Igor Katsev. "Origin and Meaning of Francis". MFnames.com. మూలం నుండి 2011-03-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-05.
 11. Igor Katsev. "Origin and Meaning of Francisco". MFnames.com. మూలం నుండి 2013-01-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-05.
 12. Igor Katsev. "Origin and Meaning of Franciscus". MFnames.com. మూలం నుండి 2008-12-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-05.
 13. Igor Katsev. "Origin and Meaning of Winston". MFnames.com. మూలం నుండి 2008-12-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-05.
 14. Igor Katsev. "Origin and Meaning of Harrison". MFnames.com. మూలం నుండి 2011-05-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-05.
 15. Igor Katsev. "Origin and Meaning of Ross". MFnames.com. మూలం నుండి 2011-05-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-05.
 16. Igor Katsev. "Origin and Meaning of Brittany". MFnames.com. మూలం నుండి 2009-01-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-05.
 17. Mike Campbell. "Meaning, Origin and History of the Name Lorraine". Behind the Name. Retrieved 2009-01-05.
 18. Mike Campbell. "Meaning, Origin and History of the Name Kofi". Behind the Name. Retrieved 2009-01-05.
 19. Igor Katsev. "Origin and Meaning of Natalie". MFnames.com. మూలం నుండి 2008-09-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-05.
 20. Mike Campbell. "Meaning, Origin and History of the Name Sirvart". Behind the Name. Retrieved 2009-01-05.
 21. Mike Campbell. "Meaning, Origin and History of the Name Mary". Behind the Name. Retrieved 2008-07-21.
 22. పోలిష్‌ పేర్లు
 23. గత వెయ్యి సంవత్సరాలలో ఇంగ్లండ్‌ మరియు వేల్స్‌లో ప్రాచుర్యం పొందిన మొదటి పేరు
 24. విశ్లేషణాత్మక విజన్స్‌ : పేర్లు
 25. నేషనల్ స్టాటిటిక్స్ ఆన్‌లైన్
 26. 26.0 26.1 26.2 పాపులర్‌ పిల్లల పేర్లు సాంఘిక భద్రత నిర్వహణ, యుఎస్‌ఎ

27 శామిల్‌ షా, ఎం.టెక్‌ (ఇంటిగ్రేటెడ్‌) బయోటెక్‌

బాహ్య లింకులు[మార్చు]

మూస:Names in world cultures