ఇషాన్ కిషన్
2022లో కిషన్ | ||||||||||||||||||||||||||||||||||||
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండే కిషన్ | |||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1998 జులై 18 బోధ్ గయా , బీహార్, | |||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమ చేతి బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 235) | 2021 18 జులై - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2022 10 డిసెంబర్ - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 84) | 2021 14 మార్చ్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2021 16 మార్చ్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||
| 2014 – ప్రస్తుతం | ఝార్ఖండ్ క్రికెట్ టీం | |||||||||||||||||||||||||||||||||||
| 2016–2017 | గుజరాత్ లయన్స్ | |||||||||||||||||||||||||||||||||||
| 2018 – ప్రస్తుతం | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2026 1 ఫిబ్రవరి | ||||||||||||||||||||||||||||||||||||
ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండే కిషన్ (జననం 18 జూలై 1998) భారత అంతర్జాతీయ క్రికెటర్. కిషన్ భారత జాతీయ క్రికెట్ జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆడుతుంటాడు. మార్చి 2021లో ఇంగ్లాండ్ పైన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కిషన్ దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు.
డిసెంబరు 2022లో బంగ్లాదేశ్ పైన జరిగిన వన్డే మ్యాచ్‌లో 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. తద్వారా వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా, అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా, తన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మార్చిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[1] కిషన్ 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[2] కిషన్ 2023 ఆసియా కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఎస్ఆర్‌హెచ్ తరపున మార్చి 23న తొలి మ్యాచ్ ఆడి 47 బంతుల్లో 106* (11 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి తన తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు.[3][4]
జీవిత చరిత్ర
[మార్చు]ఇషాన్ కిషన్ 1998 జూలై 18లో బీహార్ రాష్ట్రం బోధ గయాలో జన్మించాడు. [5] ఆయన తండ్రి ప్రణవ్ కుమార్ పాండే స్థిరాస్తి వ్యాపారుడు (బిల్డర్), సోదరుడు రాజ్ కిషన్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభానికి సహకరించాడు. క్రికెట్ సభ్యుల రెజిస్ట్రేషన్స్ వ్యవహారాల్లో బీహార్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ మధ్య గొడవల కారణంగా తన మిత్రుడి సలహాతో ఇషాన్ కిషన్ ఝార్ఖండ్ రాష్ట్రం తరపున క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కావడం వల్ల భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోని, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంటే తనకు ఇష్టం అని తెలిపాడు.
దేశవాళీ కెరీర్
[మార్చు]6 నవంబర్ 2016న 2016-17 రంజీ ట్రోఫీలో ఢిల్లీ పైన 273 పరుగులు చేసి, జార్ఖండ్ తరపున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అక్టోబరు 2018లో దేవధర్ ట్రోఫీలో ఇండియా-సి జట్టులో చోటు దక్కించుకుని ఫైనల్‌లో సెంచరీ సాధించాడు. 2020-21 విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ పైన 173 పరుగులు చేశాడు.
అక్టోబరు 2024లో సౌరభ్ తివారీ రిటైర్మెంట్ తర్వాత కిషన్ జార్ఖండ్ రంజీ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానా జట్టును ఓడించి జార్ఖండ్‌కు మొదటి టైటిల్‌ను అందించాడు. ఈ టోర్నమెంట్‌లో కిషన్ 517 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ కెరీర్
[మార్చు]2016లో గుజరాత్ లయన్స్ కిషన్ ను వేలంలో కొనుగోలు చేసింది. 2018లో ముంబై ఇండియన్స్ జట్టులోకి ప్రవేశించాడు. 2020 ఐపీఎల్ కిషన్ కెరీర్‌లో మలుపు తిప్పిన టోర్నీగా నిలిచింది, ఆ సీజన్‌లో ముంబై తరపున అత్యధిక పరుగులు (516) చేశాడు. 2022 వేలంలో ముంబై ఇండియన్స్ ఇతనిని రూ. 15.25 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. నవంబర్ 2024లో జరిగిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.40 కోట్లకు కిషన్‌ను సొంతం చేసుకుంది. 2025లో రాజస్థాన్ రాయల్స్ పైన కిషన్ తన మొదటి ఐపీఎల్ సెంచరీ సాధించాడు.
వన్డే ఇంటర్నేషనల్ కెరీర్
[మార్చు]ఇషాన్ కిషన్ 2021లో శ్రీలంక పర్యటనలో భాగంగా జరిగిన సిరీస్ లో 18 జూలై 2021న తొలి వన్డేలో ఆడి వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇషాన్ కిషన్ తన తొలి మ్యాచ్ లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59 పరుగులు చేశాడు. ఆయన 33 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. తన మూడవ మ్యాచ్ లో డబుల్ సెంచరీ 121 బంతుల్లో సాధించాడు. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సెంచరీ. ఒకే ఏడాదిలో వన్డేతోపాటు టీ20 లో అరగేంట్ర చేసి హాఫ్ సెంచరీ చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.[6][7][8] జనవరి 2026లో న్యూజిలాండ్ పైన జరిగిన టీ20 సిరీస్‌లో కేవలం 43 బంతుల్లో 103 పరుగులు చేసి తన మొదటి అంతర్జాతీయ టీ20 సెంచరీని నమోదు చేశాడు. [9]
వెలుపలి లింకులు
[మార్చు]- క్రిక్ఇన్ఫో లో ఇషాన్ కిషన్ ప్రొఫైల్ ప్రొఫైల్
మూలాలు
[మార్చు]- ↑ "10 sixes, 24 fours: Full list of records broken by Ishan Kishan during monster knock of 210 in India vs Bangladesh ODI". Hindustan Times. New Delhi. 10 December 2022. Retrieved 12 December 2022.
- ↑ "Ishan Kishan to lead India at U19 World Cup". ESPNcricinfo. Retrieved 22 December 2015.
- ↑ "ఇషాన్ కిషన్ ఊచకోత.. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇది ఎన్నో సెంచరీ తెలుసా?". NTV Telugu. 23 March 2025. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
- ↑ "ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు". ABP Desham. 23 March 2025. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
- ↑ "Ishan Kishan Profile". ESPNcricinfo. Retrieved 15 November 2023.
- ↑ Andrajyothy (19 జూలై 2021). "అన్నంత పనీ చేసిన ఇషాన్ కిషన్". andhrajyothy. Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 జూలై 2021.
- ↑ Namasthe Telangana (19 జూలై 2021). "ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొడతా చూడండి.. టీమ్ మేట్స్‌కు చెప్పి మరీ బాదిన ఇషాన్". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 జూలై 2021.
- ↑ Sakshi (19 జూలై 2021). "భారత్, శ్రీలంక తొలి వన్డే: ధావన్ ధమాకా.. ఒక్క వన్డే 10 రికార్డులు". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 జూలై 2021.
- ↑ "Ishan Kishan Century: 42 బంతుల్లో శతకం.. భారత ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో ఇషాన్ కిషన్ చేరిక". NewsBytes. Retrieved 2026-02-01.