ఇస్డాల్ మహిళ
ఇస్డాల్ మహిళ (Norwegian: Isdalskvinna) | |
---|---|
దస్త్రం:Stephen Missal-Isdal woman.jpg 2016 నాటి, చిత్రకారుని స్కెచ్[1] from morgue photographs | |
జననం | సుమారు 1930–1945 తెలియదు (బహుశా అగ్నేయ జర్మనీలో నూరెంబర్గ్ పరిసరల్లో అయి ఉండవచ్చు) |
మరణం | సుమారు 1970 నవంబరు (aged 25–40) |
మరణ కారణం | కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం, బార్బిచ్యురేట్ ఓవర్‌డోసు |
పార్థివదేహం కనుగొనబడింది | 1970 నవంబరు 29 ఇస్డాలెన్, బర్గెన్, నార్వే |
విశ్రాంతి ప్రదేశం | బర్గెన్ లోని మోలెండాల్ శ్మశానం |
ప్రసిద్ధి | అంతుతెలియని మరణం |
ఎత్తు | 164 cమీ. (5 అ. 4+1⁄2 అం.) |
ఇస్డాల్ మహిళ (సుమారు 1930–1945 – 1970 నవంబరు) నార్వేలోని బెర్గెన్‌లోని ఇస్డాలెన్ ("ది ఐస్ వ్యాలీ") వద్ద 1970 నవంబరు 29న చనిపోయినట్లు కనుగొనబడిన గుర్తు తెలియని మహిళకు పెట్టిన పేరు.
ఆ సమయంలో పోలీసులు ఆత్మహత్యగా భావించినప్పటికీ, కేసు స్వభావం, పలు ఊహాగానాలకూ, ఆ తర్వాతి సంవత్సరాలలో కొనసాగుతున్న దర్యాప్తుకూ ఊపునిచ్చింది.[2] అర్ధ శతాబ్దం తరువాత, ఇది నార్వేజియన్ చరిత్రలో అత్యంత లోతైన కోల్డ్ కేస్ మిస్టరీలలో ఒకటిగా మిగిలిపోయింది.[2][3]
కనుగోలు
[మార్చు]1970 నవంబరు 29 ఉదయం, ఒక వ్యక్తి, అతని ఇద్దరు చిన్న కుమార్తెలు ఉల్రికెన్ ఉత్తర ముఖం వద్ద గల పర్వత ప్రాంతాలలో, ఇస్డాలెన్ ("ఐస్ వ్యాలీ") అని పిలువబడే ప్రాంతంలో హైకింగ్ చేస్తున్నారు; మధ్య యుగాలలో ఆత్మహత్యల చరిత్ర, ఇటీవలి హైకింగ్ ప్రమాదాల కారణంగా దీనికి "డోడ్స్‌డాలెన్" ("డెత్ వ్యాలీ") అని కూడా పేరు వచ్చింది.[3]
వారు కొన్ని రాళ్ళ మధ్య ఉన్న ఒక మహిళ కాలిపోయిన శరీరాన్ని చూశారు.[3]
దర్యాప్తు
[మార్చు]బెర్గెన్ పోలీసులు త్వరగా స్పందించి పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు, కేసు పేరు "134/70"గా నమోదు చేశారు. ఆ స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఆ మహిళ వెల్లకిలా పడుకున్న స్థితి, ఆమె చేతులు ఆమె మొండెం మీద బిగించి ఉండటం, సమీపంలో క్యాంప్ ఫైర్ వేసిన ఆధారాలను వారు గుర్తించారు. ఆమె శరీరం ముందు భాగం, ఆమె బట్టలూ తీవ్రంగా కాలిపోయాయి. ఆమె ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. మృతదేహం దగ్గరే, మంటల వల్ల దెబ్బతిన్న సెయింట్ హాల్వార్డ్ లిక్కర్ ఖాళీ బాటిల్; రెండు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు; ప్లాస్టిక్ పాస్‌పోర్ట్ హోల్డర్; రబ్బరు బూట్లు, ఉన్ని జంపర్, స్కార్ఫ్; నైలాన్ మేజోళ్ళు; ఒక గొడుగు, పర్సు, ఒక అగ్గిపెట్టె కూడా ఉన్నాయి. ఒక గడియారం, రెండు చెవిపోగులు, ఒక ఉంగరం కూడా ఉన్నాయి. శరీరం చుట్టూ కాలిన కాగితం ఆనవాళ్లు ఉన్నాయి, దాని కింద ఒక బొచ్చు టోపీ ఉంది, దానిలో పెట్రోల్ ఆనవాళ్లు ఉన్నట్లు తరువాత కనుగొన్నారు.[4] ఈ వస్తువులపై ఉండే అన్ని గుర్తులు, లేబుళ్ళూ తొలగించబడ్డాయి లేదా రుద్దేసి ఉన్నాయి.
మూడు రోజుల తరువాత, ఆ మహిళకు చెందిన రెండు సూట్‌కేసులను బెర్గెన్ రైల్వే స్టేషన్‌లో పరిశోధకులు కనుగొన్నారు.[5][3] ఒక సూట్‌కేస్ లైనింగ్‌లో ఐదు 100 డ్యూయిష్ మార్క్ నోట్లు కనిపించాయి.[6] ఇతర వస్తువులలో, దుస్తులు, బూట్లు, విగ్గులు, మేకప్, ఎగ్జిమా క్రీమ్, 135 నార్వేజియన్ క్రోనర్, బెల్జియన్, బ్రిటిష్, స్విస్ నాణేలు, మ్యాప్‌లు, టైమ్‌టేబుల్‌లు, ప్రిస్క్రిప్షన్ లేని ఒక కళ్ళజోడు, పాక్షిక వేలిముద్రలు ఉన్న సన్ గ్లాసులూ (ఇది మహిళకు సరిపోలింది),[5] సౌందర్య సాధనాలు, నోట్‌ప్యాడ్ కూడా వాటిలో దొరికాయి.[3] ఆ వస్తువులన్నిటి నుండి అన్ని గుర్తింపు సమాచారం తొలగించబడి ఉంది.[3]
గేడ్స్ ఇన్స్టిట్యూట్‌లో జరిగిన శవపరీక్షలో ఆ మహిళ ఫినోబార్బిటల్ ద్వారా, కార్బన్ మోనాక్సైడ్ ద్వారా విషప్రయోగం కారణంగా మరణించిందని నిర్ధారించారు. [5] ఆమె ఊపిరితిత్తులలో మసి కనిపించింది, ఆమె కాలిపోతున్నప్పుడు ఆమె బతికే ఉందని సూచించింది. ఆమె మెడపై గాయమై ఉంది. అది, బహుశా పడిపోవడం లేదా దెబ్బ వల్ల అయి ఉండవచ్చు. ఆ మహిళ రక్తం, కడుపుల విశ్లేషణలో ఆమె 50 నుండి 70 ఫెనెమల్ బ్రాండ్ నిద్ర మాత్రలు [7] మింగినట్లు తేలింది. ఆమె దేహం పక్కన మరో పన్నెండు నిద్ర మాత్రలు కనిపించాయి. ఆమె దంతాలపై చేసిన ప్రత్యేకమైన పని కారణంగా, శవపరీక్ష సమయంలో ఆమె దంతాలను, దవడనూ తొలగించవలసి వచ్చింది. ఆమె అవయవాల కణజాల నమూనాలను తీసుకున్నారు. [3]
ఆ తర్వాత పోలీసులు ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం నార్వేజియన్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. నవంబరు 23 న హోటల్ హోర్డాహైమెన్‌లోని 407వ గది నుండి చెక్ అవుట్ చేసినప్పుడు ఆమె చివరిసారిగా సజీవంగా కనిపించింది. పొడవైన, ముదురు గోధుమ రంగు జుట్టు, చిన్న గోధుమ కళ్ళతో ఆమె అందంగా ఉందని, దాదాపు 1.63 మీ. (5 అ. 4 అం.) ఉంటుందని హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. ఆ మహిళ ప్రధానంగా తన గదిలోనే ఉండిపోయి, జాగ్రత్తగా ఉన్నట్లు సిబ్బంది గమనించారు. ఆమె చెక్ అవుట్ చేసినప్పుడు, ఆమె బిల్లును నగదుగా చెల్లించి టాక్సీ తెప్పించ్మని అడిగింది. అప్పటి నుండి ఆమె మృతదేహం కనిపించేంత వరకు ఆమె కదలికల గురించి తెలియరాలేదు.
పోలీసులు నోట్‌ప్యాడ్ ఎంట్రీలను డీకోడ్ చేయగలిగారు. అవి, ఆ మహిళ సందర్శించిన తేదీలు, ప్రదేశాలను సూచిస్తున్నాయని వాళ్ళు నిర్ధారించారు.[8] ఫలితంగా, చేతితో రాసిన చెక్-ఇన్ ఫారమ్‌ల ఆధారంగా, ఆ మహిళ కనీసం ఎనిమిది నకిలీ పాస్‌పోర్ట్‌లు, మారుపేర్లతో నార్వే (అంటే ఓస్లో, ట్రోండ్‌హీమ్, స్టావాంజర్ ), యూరప్ (పారిస్) చుట్టూ తిరిగిందని పోలీసులు నిర్ధారించారు.[9] పుట్టినరోజులు, వృత్తుల వంటి వివరాలు ఒక్కో ఫారములో ఒక్కో రకంగా ఉన్నప్పటికీ, ఆమె తన జాతీయతను బెల్జియన్ అని స్థిరంగా ఇచ్చింది. ఫారమ్‌లను జర్మన్ లేదా ఫ్రెంచ్ భాషలో నింపింది.[3][5]
ఆమె తప్పుడు గుర్తింపులు ఇవే:
- జెనీవీవ్ లాన్సియర్, పుట్టిన ప్రదేశం లెవెన్, ర్యూ సెయింట్-వాల్బర్గ్ 2, లెవెన్‌లో నివాసం.
- క్లాడియా టైల్ట్, పుట్టిన ప్రదేశం బ్రస్సెల్స్, ప్లేస్ సెయింట్-వాల్బర్గ్ 17, బ్రస్సెల్స్‌లో నివాసం.
- క్లాడియా టైల్ట్, పుట్టిన ప్రదేశం బ్రస్సెల్స్, బ్రస్సెల్స్‌లోని ర్యూ డి లా మడేలిన్ 3లో నివాసం.
- క్లాడియా నీల్సన్, జన్మస్థలం ఘెంట్, బ్రస్సెల్స్‌లోని రూ సెయింట్-వాల్బర్గ్ 18లో నివాసం.
- అలెక్సియా జార్నె-మెర్చాజ్, పుట్టిన ప్రదేశం లుబ్జానా, బ్రస్సెల్స్‌లో నివాసం.
- వెరా జార్లే, జన్మస్థలం ఆంట్వెర్ప్ (బ్రస్సెల్స్‌లో చిరునామా ఉన్న ఫారమ్ పోయింది)
- ఫెనెల్లా లార్క్ (బ్రస్సెల్స్‌లో చిరునామా ఉన్న ఫారం పోయింది)
- ఎలిసబెత్ లీన్‌హౌవర్, జన్మస్థలం ఓస్టెండ్, బ్రస్సెల్స్‌లోని ఫిలిప్‌స్టాక్‌స్ట్రాట్ 44Aలో నివాసం.
ఆ మహిళ గతంలో బెర్గెన్‌లోని అనేక హోటళ్లలో బస చేసిందని, చెక్ ఇన్ చేసిన తర్వాత గదులు మార్చుకునేదని కూడా తెలిసింది. [10] తాను ట్రావెలింగ్ సేల్స్ ఉమెన్ నని, పురాతన వస్తువుల డీలర్ననీ ఆమె తరచుగా హోటల్ సిబ్బందికి చెప్పేది. బెర్గెన్‌లోని ఒక హోటల్‌లో ఆ మహిళ ఒక వ్యక్తితో జర్మన్‌లో మాట్లాడుతుండటం తాను విన్నానని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఆమెను కలిసిన ఇతరులు ఆమె ఫ్లెమిష్ లేదా అతుకుబొతుకుల ఇంగ్లీషు కూడా మాట్లాడుతుందని, ఆమె వద్ద వెల్లుల్లి వాసన వచ్చేదనీ పేర్కొన్నారు.[5][11] ఆమెను చూసిన లేదా కలిసిన వ్యక్తులు కూడా ఆమె విగ్గులు ధరించేదని చెప్పారు.
సాక్షుల వివరణలు, ఆమె శరీర విశ్లేషణల ఆధారంగా తెలియని మహిళ యొక్క మిశ్రమ స్కెచ్‌లు ఇంటర్‌పోల్ ద్వారా అనేక దేశాలలో ప్రసారం చేసారు. గణనీయంగా పోలీసు బలగాలను మోహరించినప్పటికీ, ఆ మహిళ ఎవరో గుర్తించలేకపోయారు. కేసు త్వరగా ముగిసింది.[3]ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని అధికారులు తేల్చగా,[2] మరికొందరు ఆమె హత్యకు గురైందని చెప్పే ఆధారాలున్నాయని నమ్ముతారు.[12]
ఖననం
[మార్చు]1971 ఫిబ్రవరి 5 న బెర్గెన్‌లోని ముల్లెండల్ స్మశానవాటికలోని ఒక గుర్తు తెలియని సమాధిలో ఆమె దేహాన్ని కాథలిక్ పద్ధతిలో ఖననం చేసారు. బెర్గెన్ పోలీసు దళానికి చెందిన పదహారు మంది సభ్యులు హాజరై ఆమె అవశేషాలను భద్రపరచడానికి, సులభంగా తవ్వడానికీ వీలుగా జింక్ శవపేటికలో ఆమెను ఖననం చేశారు. తరువాత ఎప్పుడైనా బంధువులు వస్తే, వారికి చూపించేందుకు ఆమె ఖననాన్ని ఫోటో తీసి ఉంచారు.[3]
సిద్ధాంతాలు
[మార్చు]
ఈ కేసు గురించి చాలా వరకు సమాధానాలు తెలియలేదు, ముఖ్యంగా ఆ మహిళ ఇచ్చిన అనేక గుర్తింపులు, వివరించలేని ప్రయాణ ప్రణాళికలకు గల కారణాలు, ఇవి గూఢచర్యం లేదా నేర కార్యకలాపాల అనుమానాలను లేవనెత్తుతాయి.[5] ఆ కాలంలోని శీతల యుద్ధ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆమె గూఢచారి అయి ఉండే అవకాశముందని అనేక దర్యాప్తులు సూచిస్తున్నాయి.[3] 1960 లలో నార్వేలో సైనిక స్థావరాలకు దగ్గరలో ఇతర వింత అదృశ్యాలు కూడా జరిగాయి. ఇది అంతర్జాతీయ గూఢచర్యం నాటిది.[13] నార్వేజియన్ సాయుధ దళాలకు చెందిన వర్గీకరించబడిన రికార్డులు కూడా ఆ మహిళ కదలికలు పెంగ్విన్ క్షిపణి యొక్క అత్యంత రహస్య పరీక్షలకు అనుగుణంగా ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి.[14] స్టావాంజర్‌లో పెంగ్విన్ క్షిపణి పరీక్షా ప్రాంతంలో ఒక జాలరి కూడా ఆ మహిళను చూసినట్లు నివేదించబడింది;[15] స్టావాంజర్‌లో ఆమె ఉనికిని ఒక షూ సేల్స్‌మాన్ ఆమెకు రబ్బరు బూట్లను విక్రయించడం ద్వారా ధృవీకరించారు.[5]
తరువాత పరిణామాలు
[మార్చు]ఆ మహిళను హోటల్ నుండి బెర్గెన్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లిన టాక్సీ డ్రైవర్ ఆ తరువాత ఎప్పుడూ కనిపించలేదు. అయితే 1991 లో, పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక టాక్సీ డ్రైవర్, ఆ గుర్తు తెలియని మహిళను హోటల్‌లో ఎక్కించుకున్న తర్వాత, రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు మరొక వ్యక్తి కూడా వారితో చేరాడని చెప్పాడు. [16]
2005 లో 1970 లో 26 ఏళ్ల బెర్గెన్ నివాసి ఒక స్థానిక వార్తాపత్రికతో మాట్లాడుతూ, ఆమె స్కెచ్‌ను ప్రసారం చేసిన తర్వాత, ఇస్డాల్ మహిళ మృతదేహం కనుగొనబడటానికి ఐదు రోజుల ముందు తాను ఫ్లోయెన్ వద్ద కొండపై హైకింగ్ చేస్తున్నప్పుడు చూసిన మహిళ ఆమేనని అనుమానంగా ఉందని చెప్పాడు. ఆశ్చర్యకరంగా, ఆమె హైకింగ్ కోసం కాకుండా నగరానికి తగ్గట్టుగా తేలికగా దుస్తులు ధరించింది. "దక్షిణాది వ్యక్తి"గా కనిపించే కోట్లు ధరించిన ఇద్దరు పురుషుల ముందు ఆమె నడుస్తోంది. ఆ మహిళ నిరాశగా ఉన్నట్లు కనిపించింది. అతనికి ఏదో చెప్పబోతున్నట్లు అనిపించింది కానీ చెప్పలేదు. ఈ సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి, తనకు తెలిసిన వ్యక్తి వద్దకు వెళ్ళాడు. కానీ దాని గురించి మరచిపోమని అతనికి ఆ వ్యక్తి సలహా ఇచ్చాడు.[17] అందువల్ల, ఆ సమయంలో ఆ వ్యక్తి పేరు గానీ, అతను చూసినట్లు చెప్పబడిన సమాచారం గానీ నమోదు కాలేదు.
2016 లో కేసును తిరిగి తెరిచిన తర్వాత, [5] నార్వేజియన్ ప్రసారకర్త NRK, ఇస్డాల్ మహిళ యొక్క ఆరు ప్రత్యామ్నాయ స్కెచ్‌లను రూపొందించడానికి అమెరికన్ కళాకారుడు స్టీఫెన్ మిస్సల్‌ను నియమించింది. ఆమెను చూసిన వ్యక్తులకు ఆ చిత్రాలను చూపించారు.[18]
2017 లో ఆ మహిళ దంతాల స్థిరమైన ఐసోటోప్ విశ్లేషణలో (ఆమె పాతిపెట్టని దవడ ఎముక నుండి తీసుకోబడింది [19] ) ఆ మహిళ నాలుగైదేళ్ళు అటూ ఇటూగా 1930 లో జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో లేదా ఆ సమీపంలో జన్మించిందనీ, కానీ బాల్యంలో ఫ్రాన్స్ లేదా ఫ్రాన్స్-జర్మనీ సరిహద్దుకు వెళ్లిందనీ అంచనాలు వచ్చాయి.[20][21] గతంలో ఆ మహిళ చేతివ్రాతపై చేసిన విశ్లేషణను ఇది బలోపేతం చేసింది. ఆమె ఫ్రాన్స్‌లో గానీ లేదా ఏదైనా పొరుగు దేశంలో గానీ చదువుకున్నట్లు సూచించింది. [5] విశ్లేషణ ప్రకారం ఆమె తూర్పు ఆసియా, మధ్య ఐరోపా, దక్షిణ ఐరోపా లేదా దక్షిణ అమెరికాలోని దంతవైద్యుడి వద్దకు వెళ్లి ఉంటుందని కూడా సూచించింది. [22] [23]
2018 లో NRK, BBC వరల్డ్ సర్వీస్ "డెత్ ఇన్ ఐస్ వ్యాలీ" అనే పాడ్‌కాస్ట్ సిరీస్‌ను ప్రచురించాయి, ఇందులో ప్రత్యక్ష సాక్షులు, ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలతో ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇస్డాల్ మహిళ జన్మస్థలం దక్షిణ జర్మనీ లేదా ఫ్రెంచ్-జర్మన్ సరిహద్దు ప్రాంతం అయి ఉండవచ్చనీ, ఆమె బహుశా 1930 ప్రాంతాల్లో జన్మించి ఉండవచ్చనీ సూచిస్తుంది. ఆమె బహుశా ఫ్రెంచ్ మాట్లాడే బెల్జియం ప్రాంతంలో కూడా పెరిగి ఉండవచ్చు. 2019 జూన్‌లో పాడ్‌కాస్ట్ శ్రోతలు మరిన్ని ఆధారాలు ఇచ్చారని BBC వెల్లడించింది. [19] ఇంకా, DNA డో ప్రాజెక్ట్‌లో జన్యు శాస్త్రవేత్త అయిన కొలీన్ ఫిట్జ్‌ప్యాట్రిక్, డెత్ ఇన్ ఐస్ వ్యాలీ బృందాన్ని సంప్రదించి, శవపరీక్ష చేయబడిన కణజాలాల జన్యు వంశపారంపర్య ఐసోటోప్ పరీక్ష ద్వారా మహిళని గుర్తించడంలో తన సహాయం అందించాలని కోరారు.[19] అప్పటి నుండి ఆమె mtDNA హాప్లోగ్రూప్ H24 కి చెందినదని వెల్లడైంది, ఇది ఆగ్నేయ ఐరోపా లేదా నైరుతి ఆసియాలో ఉద్భవించిన మాతృస్వామ్య వంశాన్ని సూచిస్తుంది. ఆ మహిళ నార్వేకు వెళ్ళిన విమానాలలో ఒకదానిలో గుర్తు తెలియని ఫ్రెంచ్ జాతీయుడు కూడా ఉన్నాడనే వాస్తవం ఆధారంగా ఆమె వద్ద ఫ్రెంచ్ పాస్‌పోర్ట్ కూడా ఉన్నట్లు తెలిసింది.[24]
ఆమె మార్గాన్ని ప్రణాళిక చేసిన విధానాన్ని బట్టీ (లక్ష్యం ఆధారితమైనది ఎల్లప్పుడూ ఒకే స్థానానికి తిరిగి రావడం, బహుశా ఆమె ఇంటికి), అనామకంగా ఉండాలనే కోరికను బట్టీ, హోటళ్లలో ఆమె ప్రవర్తనను బట్టీ(వివిధ మార్గాల్లో ఉన్న తలుపులకు గుర్తులు పెట్టడం), ఆమె కలుసుకున్న పురుషులు ఎవ్వరూ ముందుకు రాలేదనే వాస్తవాన్ని బట్టీ, రచయిత డెన్నిస్ జాచెర్ ఆస్కే, ఇస్డాల్ మహిళ ఒక వ్యభిచారిణి అని ప్రతిపాదించాడు. సంఘటన స్థలం నుండి లభించిన ఆధారాలు, మరణానికి కొన్ని గంటల ముందు ఆమె వైద్యపరంగా మద్యం మత్తులో ఉన్న స్థితి ఆధారంగా, ఆ మహిళ మరణించినప్పుడు నేరం జరిగిన ప్రదేశంలో మరొక వ్యక్తి బహుశా ఉండి ఉంటాడని ఆస్కే వాదించాడు. ఆమెది హత్య లేదా ఇతరుల సహాయంతో చేసుకున్న ఆత్మహత్యకు అయి ఉండవచ్చనీ, ఎక్కువ శాతం హత్యే జరిగిందని నమ్ముతూ, దానికి మద్దతు ఇచ్చే వాదనలు ఉన్నాయని ఆయన గుర్తించాడు.[25]
2019లో, ఫ్రెంచ్ వార్తాపత్రిక లె రిపబ్లికన్ లోరైన్‌లో ఒక కథనం ప్రచురించబడిన తర్వాత, [26] ఫోర్‌బాచ్ నివాసి ఒకరు 1970 వేసవిలో ఇస్డాల్ మహిళతో తనకు సంబంధం ఉందని పేర్కొన్నాడు. ఆ మహిళ బాల్కన్ యాసలో మాట్లాడే బహుభాషావేత్త అని, తన వయస్సు (26) కంటే చిన్నదిగా కనిపించేలా అలంకరించుకునేదని, వ్యక్తిగత వివరాలను పంచుకోవడానికి నిరాకరించేదనీ తరచుగా విదేశాల నుండి ఫోన్ కాల్స్ అందుకునేదనీ ఈ సమాచారం ఇచ్చే వ్యక్తి చెప్పాడు. ఆ మహిళ వస్తువులను పరిశీలించగా, ఆ వ్యక్తికి వివిధ రకాల విగ్గులు, రంగురంగుల బట్టలు గుర్రంపై స్వారీ చేస్తున్న మహిళ ఫోటో కనిపించాయి. ఆమె గూఢచారి అని అనుమానించి, అతను అధికారులను సంప్రదించాలని అనుకున్నాడు కానీ అలా చేయడానికి భయపడ్డాడు. ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి కథ, ఛాయాచిత్రం రెండూ ఆ వార్తాపత్రిక తదుపరి సంచికలో ప్రచురించారు.[27]
2023 జూన్ 12 న న్యూ జుర్చర్ జైటుంగ్‌లోని ఒక కథనం, ఇస్డాల్ మహిళకు స్విస్ బ్యాంకర్ ఫ్రాంకోయిస్ జెనౌడ్‌తో సంబంధాలు ఉండి ఉండవచ్చని నార్వేజియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్, స్థానిక పోలీసులు చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకుందనీ రాసింది. ఆ వార్తాపత్రిక ఈ సూచనను "ప్రొఫెషనల్ ఫ్యాక్ట్-చెకర్" నుండి తీసుకుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Death in Ice Valley: New clues in Isdal Woman mystery". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-06-24. Retrieved 2024-11-20.
- ↑ 2.0 2.1 2.2 Tønder, Finn Bjørn (26 November 2002). "Viktig nyhet om Isdalskvinnen" [Important news about Isdal Woman]. Bergens Tidende (in నార్వేజియన్). Archived from the original on 10 November 2013. Retrieved 21 October 2012.
- ↑ 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 Cheung, Helier (2017-05-13). "Isdal Woman: The mystery death haunting Norway for 46 years". BBC News. Retrieved 2018-04-11.
- ↑ "Tidslinje: Slik etterforsket politiet Isdalssaken". NRK (in నార్వేజియన్ బొక్మాల్). 2016-10-17. Retrieved 2019-06-25.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 Ståle Hansen; Marit Higraff; Øyvind Bye Skille; Eirin Aardal; Ellen Borge Kristoffersen (29 November 2016). "The Isdalen Mystery". NRK. Retrieved 13 December 2016.
- ↑ "Historical US Dollars to German Marks currency conversion". marcuse.faculty.history.ucsb.edu. Retrieved 2020-01-12.
- ↑ "The Isdal Woman". Futility Closet. 2014-01-03. Retrieved 2019-06-25.
- ↑ "Kalde spor fra Isdalen" [Cold trail from Isdalen]. A-magasinet (in నార్వేజియన్). 19 November 2010.
- ↑ "The Isdal woman's many identities". Death in Ice Valley. BBC World Service. Retrieved 2019-06-27.
- ↑ Eirin Aardal; Øyvind Bye Skille; Marit Higraff; Ellen Borge Kristoffersen; Ståle Hansen. "Slo bensin over seg og tende på" (in నార్వేజియన్). NRK. Retrieved 23 October 2016.
- ↑ "Norway makes international appeal to solve 46-year-old mystery". The Local. Retrieved 1 July 2018.
- ↑ "If You're Never Heard Of The Case Of The Isdal Woman, It's One Of The Most Odd Cases You'll Ever See". BuzzFeed. 16 February 2018. Retrieved 2018-04-25.
- ↑ Ståle Hansen; Øyvind Bye Skille; Eirin Aardal; Marit Higraff (14 May 2017). "De kom til Norge og døde" (in నార్వేజియన్). NRK.
- ↑ "The secret police file on the Penguin missile system". Death in Ice Valley. BBC World Service. Retrieved 2019-07-25.
- ↑ Ståle Hansen; Marit Higraff; Eirin Aardal; Øyvind Bye Skille; Ellen Borge Kristoffersen (30 October 2016). "Etterforsket for militærspionasje" (in నార్వేజియన్). NRK.
- ↑ Ståle Hansen; Eirin Aardal; Marit Higraff; Øyvind Bye Skille; Ellen Borge Kristoffersen (21 October 2016). "Sporene politiet aldri fant ut av" (in నార్వేజియన్). NRK.
- ↑ Yndestad, Monika Nordland (20 March 2005). "Turgåer møtte isdalskvinnen" [Hiker met Isdal Woman]. Bergensavisen (in నార్వేజియన్). Retrieved 22 May 2017.
Glem henne, hun ble ekspedert. Saken blir aldri oppklart [Forget her, she's been seen to. The case won't ever be solved]
- ↑ Eirin Aardal; Ellen Borge Kristoffersen; Øyvind Bye Skille; Ståle Hansen; Marit Higraff (20 October 2016). "Er dette Isdalskvinna?" [Is This Isdal Woman?] (in నార్వేజియన్). NRK. Retrieved 22 May 2017.
- ↑ 19.0 19.1 19.2 Higraff, Marit; McCarthy, Neil (25 June 2019). "Death in Ice Valley: New clues in a Norwegian mystery". BBC.
- ↑ Øyvind Bye Skille; Marit Higraff; Ståle Hansen (8 January 2018). "Tennene avslører: Isdalskvinnen eldre enn man trodde" [The teeth reveal: Isdal woman is older than previously thought] (in నార్వేజియన్). NRK. Retrieved 9 January 2018.
- ↑ "'Major breakthrough' in Norway's 46-year-old Isdal woman mystery". BBC. 19 May 2017. Retrieved 19 May 2017.
- ↑ "Do you remember this woman?". NRK. 29 November 2016. Retrieved 13 May 2017.
This is the description the Norwegian police sent to Interpol and police forces throughout Europe, North Africa and the Middle East: 'Approximately 25–30 years of age. Height 164 cm, slim with broad hips. Long brownish-black hair, small round face, brown eyes, small ears. The teeth showed many repairs, several of the molars had gold caps, and the dental work is of a kind practised in the Far East, Central or Southern Europe, and South America. Fourteen of the teeth are partly or completely root-filled. There is a marked partition between the two upper front teeth'
- ↑ Yndestad, Monika Nordland (20 March 2005). "Hær bæres Isdalskvinnen til sitt anonyme gravsted" [Here Isdal Woman is carried to her anonymous grave]. Bergensavisen (in నార్వేజియన్). Retrieved 21 October 2012.
- ↑ Aske, Dennis Zacher (2018). Kvinnen i Isdalen: Nytt lys over norgeshistoriens største krimgåte [The Woman in The Ice Valley: A new light on Norway’s biggest unsolved criminal case] (in Norwegian) (Digital ed.). Bergen: Vigmostad & Bjørke. p. 262. ISBN 978-82-419-1570-3.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Aske, Dennis Zacher (2018). Kvinnen i Isdalen: Nytt lys over norgeshistoriens største krimgåte [The Woman in The Ice Valley: A new light on Norway’s biggest unsolved case] (in Norwegian) (Digital ed.). Bergen: Vigmostad & Bjørke. pp. 248–249 and 231. ISBN 978-82-419-1570-3.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Grethen, Kevin (2019-03-08). "Faits divers. Mystère du corps calciné en Norvège : la solution pourrait se trouver dans le Grand Est". www.republicain-lorrain.fr (in ఫ్రెంచ్). La Republican lorrain. Archived from the original on 2020-06-05. Retrieved 2023-07-02.
- ↑ Grethen, Kevin (June 9, 2019). "Un Forbachois pense avoir connu l'inconnue tuée en Norvège" [A Forbach resident claims he encountered the unidentified woman killed in Norway]. Le Républicain lorrain (in ఫ్రెంచ్). Archived from the original on 2019-06-09. Retrieved August 2, 2021.