Jump to content

ఇస్మాయిల్ హుస్సేన్

వికీపీడియా నుండి
ఇస్మాయిల్ హుస్సేన్

పదవీ కాలం
2009 – 2014
ముందు ఎ.ఎఫ్. గోలం ఉస్మానీ
తరువాత సిరాజుద్దీన్ అజ్మల్
నియోజకవర్గం బార్పేట

వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
1991 – 2001

పదవీ కాలం
1991 – 2006
ముందు కుమార్ దీపక్ దాస్
తరువాత కుమార్ దీపక్ దాస్
నియోజకవర్గం బార్పేట
పదవీ కాలం
1983 – 1985
ముందు ఎ. లతీఫ్
తరువాత కుమార్ దీపక్ దాస్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-04-01)1950 ఏప్రిల్ 1
సుక్మనా, జిల్లా. బార్పేట , అస్సాం
మరణం 2015 April 24(2015-04-24) (వయసు: 65)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సెలీనా బేగం

ఇస్మాయిల్ హుస్సేన్ (1 ఏప్రిల్ 1950 - 24 ఏప్రిల్ 2015) అసోం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై వ్యవసాయ మంత్రిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఇస్మాయిల్ హుస్సేన్ 1983 అసోం శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి బార్పేట శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1985 అసోం శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 1991, 1996 & 2001 అసోం శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 1991 జూన్ 30 నుండి 1996 ఏప్రిల్ 22 వరకు హితేశ్వర్ సైకియా మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, 2001 మే 17 నుండి 2006 మే 21 వరకు తరుణ్ గొగోయ్ మంత్రివర్గంలో చార్ ఏరియా అభివృద్ధి, నేల పరిరక్షణ, రాజకీయ విభాగం (వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ మాత్రమే) ప్రభుత్వ సంస్థ శాఖల మంత్రిగా పని చేశాడు.

ఇస్మాయిల్ హుస్సేన్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్పేట లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏజీపీ అభ్యర్థి భూపేన్ రేపై 30,429 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మరణం

[మార్చు]

ఇస్మాయిల్ హుస్సేన్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ 65 సంవత్సరాల వయసులో గౌహతిలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  2. "Former Congress MP Ismail Hussain dies". Business Standard. 24 April 2015. Archived from the original on 31 July 2025. Retrieved 31 July 2025.
  3. "Ex-MP Ismail Hussain passes away" (in ఇంగ్లీష్). Assam Tribune. 15 September 2010. Archived from the original on 31 July 2025. Retrieved 31 July 2025.