Jump to content

ఇ. ఎస్. వెంకట్రామయ్య

వికీపీడియా నుండి
ఇ.ఎస్.వెంకట్రామయ్య
19వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
19 జూన్ 1989 – 17 డిసెంబర్ 1989
Nominated byఆర్. ఎస్. పాఠక్ నేతృత్వంలోని న్యాయమూర్తుల కొలీజియం
Appointed byరాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్
అంతకు ముందు వారురఘునందన్ స్వరూప్ పాఠక్
తరువాత వారుసబ్యసాచి ముఖర్జీ
వ్యక్తిగత వివరాలు
జననం(1924-12-18)1924 డిసెంబరు 18
మరణం1997 సెప్టెంబరు 24(1997-09-24) (వయసు: 72)
సంతానంబీవీ నాగరత్న

ఎంగలగుప్పె సీతారామయ్య వెంకటరామయ్య (18 డిసెంబర్ 1924 - 24 సెప్టెంబర్ 1997[1]) భారతదేశ 19వ ప్రధాన న్యాయమూర్తి, 19 జూన్ 1989 నుండి 17 డిసెంబర్ 1989న పదవీ విరమణ చేసే వరకు సేవలందించాడు. ఇతడు 1946లో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. నవంబర్ 1970లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడైనాడు.

మార్చి 1979లో, ఇతడు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. జూన్ 1989లో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. యాదృచ్ఛికంగా ఇతడు కర్ణాటక నుండి భారత ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి. తన సుప్రీంకోర్టు పదవీకాలంలో, వెంకటరామయ్య 256 తీర్పులను చెప్పాడు. 720 బెంచ్‌లపై పనిచేశారు..[2] ఇతడు 1997 సెప్టెంబర్ 24వ తేదీన గుండెపోటుతో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Obituary Events in 1997". Archived from the original on 2003-12-31. Retrieved 15 October 2018.
  2. "E.S. Venkataramaiah". Supreme Court Observer (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-30.

బయటి లింకులు

[మార్చు]