Jump to content

ఇ. వి. కృష్ణ పిళ్ళై

వికీపీడియా నుండి
ఇ.వి. కృష్ణ పిళ్ళై
జననం(1894-09-14)1894 సెప్టెంబరు 14
కున్నత్తూరు, కొల్లాం, ట్రావెన్‌కోర్, బ్రిటిష్ ఇండియా
మరణం1938 మార్చి 30(1938-03-30) (వయసు: 43)
త్రివేండ్రం, ట్రావెన్‌కోర్, బ్రిటిష్ ఇండియా
వృత్తి
  • రచయిత
  • హాస్య రచయిత
  • వ్యంగ్య రచయిత
దాంపత్యభాగస్వామిమహేశ్వరి అమ్మ
పిల్లలుఅడూర్ భాసితో సహా 7 గురు
తల్లి,దడ్రులు
  • పప్పు పిళ్ళై
  • కార్త్యాయని అమ్మ
బంధువులుసి.వి. రామన్ పిళ్ళై (మామగారు)

ఇ.వి. కృష్ణ పిళ్ళై (14 సెప్టెంబర్ 1894 - 30 మార్చి 1938) మలయాళ సాహిత్యానికి చెందిన భారతీయ రచయిత, ట్రావెన్‌కోర్ శ్రీ మూలం పాపులర్ అసెంబ్లీ సభ్యుడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన ఆయన న్యాయవాదిగా, శాసనసభ సభ్యునిగా, సంపాదకుడిగా, రచయితగా రాణించాడు. తన స్వల్ప జీవితకాలంలో హాస్య రచనలు, నాటకాలు, చిన్న కథలు, ఆత్మకథను రాశాడు. ఆయన కాలమిస్ట్ (కథన రచయిత), వ్యంగ్య చిత్రకారుడు (క్యారికేచరిస్ట్) కూడా. ఆయన ప్రముఖ వ్యంగ్య రచయిత, హాస్యంలో మేధావి. ప్రముఖ మలయాళ వ్యంగ్య రచయితలలో మరొకరైన సంజయన్ తో పాటు, సంజయన్ ఆ భాషలో తేలికపాటి వ్యాసాల ప్రక్రియను అభివృద్ధి చేసినట్లుగా ప్రసిద్ధి చెందారు.

జీవిత చరిత్ర

[మార్చు]

ఇ.వి. కృష్ణ పిళ్ళై 1894 సెప్టెంబర్ 14న కొల్లాం లోని కున్నత్తూరు తాలూకాలో పప్పు పిళ్ళై, కళ్యాణి అమ్మ దంపతులకు జన్మించాడు.[1]

కున్నత్తూరులో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, కృష్ణ పిళ్ళై ఆర్ట్స్, న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై ప్రభుత్వోద్యోగిగా తన వృత్తిని ప్రారంభించాడు. రచయిత సి.వి. రామన్ పిళ్ళై చిన్న కుమార్తె మహేశ్వరి అమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు చంద్రజీ (రామచంద్రన్ నాయర్) సినీ నటుడు కాగా,[2] రెండవ కుమారుడు అడూర్ భాసి (భాస్కరన్ నాయర్), మూడవ కుమారుడు పద్మనాభన్ నాయర్ (పద్మన్) పాత్రికేయుడు, కుంచు కురుప్ కార్టూన్ రచయిత.[3] ఆయన ఇతర పిల్లలు ఓమన అమ్మ, రాజలక్ష్మి అమ్మ, శంకరన్ నాయర్ (ఆయన 18 ఏళ్ల వయసులోనే గుండె జబ్బుతో మరణించాడు), కృష్ణన్ నాయర్.

తరువాత, ఆయన మలయాళీ, మలయాళ మనోరమ వంటి పత్రికలకు సంపాదకుడిగా పదవులు చేపట్టాడు.[4] ఈ కాలంలో పిళ్ళై తన నివాసాన్ని పూర్వపు ట్రావెన్‌కోర్ రాష్ట్రంలోని అడూర్ సమీపంలోని పెరింగనాడ్‌కు మార్చాడు. ట్రావెన్‌కోర్ శ్రీ మూలం పాపులర్ అసెంబ్లీ సభ్యునిగా కూడా పనిచేశాడు.[1]

కృష్ణ పిళ్ళై 43 ఏళ్ల వయసులో 1938 మార్చి 30న మరణించాడు.[5]

ఆయన గౌరవార్థం పిరవి సాంస్కారిక సమితి ఇ.వి. కృష్ణ పిళ్ళై స్మారక సాహిత్య అవార్డును నెలకొల్పింది.[6]

రచనలు

[మార్చు]

హాస్య కృతులు (హాస్యం)

[మార్చు]
1ఎం ఎల్ సి కథకల్
2కవితా కేస్
3పోలీస్ రామాయణం
4ఇ.వి. కథకల్
5చిరియుమ్ చింతయుమ్ 1935
6రసికన్ తూలికచిత్రంగల్

నాటకంగళుమ్ ప్రహసనంగళుమ్ (నాటకం, ప్రహసనం)

[మార్చు]
1సీతాలక్ష్మి 1932
2రాజా కేశవదాసన్ 1928
3ఇరవికుట్టిపిళ్ళై 1933
4రామరాజాభిషేకం 1932
5కురుపింటె డైలీ
6పెన్నరసు నాడు
7వివాహ కమ్మట్టం
8బి.ఎ. మాయావి
9ప్రణయ కమిషన్
10కళ్ళప్రమాణం
11తిలోత్తమ
12విస్మృతి
13మాయామానుషన్

ఆత్మకథ

[మార్చు]
1జీవిత స్మరణకల్ (2 భాగాలు)

చెరుకథ (చిన్న కథ)

[మార్చు]
1కేళీ సౌధమ్ (4 భాగాలు)
  2 ఎంటె గంధర్వస్నేహితన్
1బాష్ప వర్షం
2ఆరుడే కై
3తోరాత కన్నీర్

ప్రబంధ సమాహారం (వ్యాసాల సేకరణ)

[మార్చు]
1అక్కాలంగల్
2కాంగ్రెస్ చిత్రంగల్
3నెహ్రూ గీత

బాల సాహిత్యం

[మార్చు]
1గురు సమక్షం
2భాస్కరన్
3బాల లీల
4గుణ పాఠంగల్
5శుభ చర్య
6సుఖ జీవితం

ఇ.వి. కృష్ణ పిళ్ళై, ఎ. శంకర పిళ్ళైతో కలిసి వీరమహత్వమ్, సి.వి. కుంజురామన్‌తో కలిసి గాంధీ కాలం ఓణప్పాట్టు వంటి పుస్తకాలకు సహ రచయితగా కూడా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Biography on Kerala Sahitya Akademi portal". Kerala Sahitya Akademi portal. 2019-03-28. Retrieved 2019-03-28.
  2. "Chandraji". Imprints on Indian Film Screen. Retrieved 2019-03-28.
  3. "The Herald of India". www.heraldofindia.com. 2019-03-28. Retrieved 2019-03-28.
  4. "Notable Nairs". www.nairs.in. 2019-03-28. Archived from the original on 2018-09-22. Retrieved 2019-03-28.
  5. "E. V. Krishna Pillai Malayalam Writer / Theatre Personality". 2019-03-28. Archived from the original on 7 May 2012. Retrieved 2019-03-28.
  6. ACV Channel (2014-04-23). "MA Baby recipient of EV Krishna Pillai award". YouTube. Archived from the original on 2021-12-19. Retrieved 2019-03-28.

బయటి లింకులు

[మార్చు]