ఈజిప్టు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
جمهورية مصر العربية
జమ్-హూరియత్ మిస్ర్ అల్-అరబియ్యాహ్
అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్
Flag of ఈజిప్టు ఈజిప్టు యొక్క చిహ్నం
జాతీయగీతం
Bilady, Bilady, Bilady
ఈజిప్టు యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Cairo
30°2′N, 31°13′E
అధికార భాషలు Arabic1
ప్రజానామము Egyptian
ప్రభుత్వం Semi-presidential republic
 -  President Hosni Mubarak
 -  Prime Minister Ahmed Nazif
Establishment
 -  First Dynasty c.3150 BCE 
 -  Independence from United Kingdom February 28 1922 
 -  Republic declared June 18 1953 
 -  జలాలు (%) 0.632
జనాభా
 -  2007 అంచనా 80,335,036 (est.)[1] 
 -  1996 జన గణన 59,312,914 
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $329.791 billion (27th)
 -  తలసరి $4,836 (110th)
Gini? (1999–00) 34.5 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.708 (medium) (112nd)
కరెన్సీ Egyptian pound (EGP)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .eg
కాలింగ్ కోడ్ +20
1 Spoken language is Egyptian Arabic.

ఈజిప్టు (ఆంగ్లం : Egypt), అధికారికనామం అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్, (En-us-Egypt.ogg ˈiː.dʒɪpt , ఈజిప్షియన్: కెమెత్; అరబ్బీ : مصر ; (మిస్ర్, మిసర్, మసర్).

ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రాచీన దేశం. ఈజిప్టులో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్లు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి.

ఈజిప్ట్ అధికారికంగా పిలవబడే పేరు అరబ్ రిపబ్లిక్ అఫ్ ఈజిప్టు, ముఖ్యంగా ఉతర ఆఫ్రికాలోని సినై పెనిసుల నుండి పశ్చిమ ఆసియా వరకు భూమి వారధిగా కలుపుతుంది. దీని వైశాల్యము సుమారు 10,10,000 చదరపు కిలోమీటర్లు (3,90,000 చదరపు మీటర్లు), ఈజిప్ట్ కి సరిహద్దులుగా ఉత్తరాన మెడిటేరియన్ సముద్రము ఈశాన్య స్ట్రిప్ మరియు ఇజ్రాయిల్, తూర్పున ఎర్ర సముద్రం, పశ్చిమాన లిబియా ఉన్నాయి. ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ లోని అధిక జనాభా గల దేశాలలో ఈజిప్టు ఒక ముఖ్యమైనిది. 7.6 కోట్ల జనాభాలో ఎక్కువ భాగం నిలే నది ఒడ్డున నివసిస్తున్నారు, ఇది సుమారు 40,000 చదరపు కిలోమీటర్లు (15,000 చదరపు మీటర్లు) వైశాల్యం విస్తీర్ణంలో వ్యాపించి ఉంది, అక్కడే వ్యవసాయానికి అనుకూలంగా సాగుభూమిని కనుగొన్నారు. సహారా ఎడారిలో అధిక భూభాగం ఎవ్వరూ నివసించరు. ఈజిప్ట్ జనాభాలోని సుమారు సగభాగం పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు, వీరిలో ఎక్కువ భాగం అధిక జనసాంద్రత గల కైరో, అలెక్షాన్ద్రియా మరియు మిగతా పెద్ద నగరాలైన నిలే డెల్టాలలో వ్యాపించి ఉన్నారు. ఈజిప్టు పురాతన నాగరికతకు పేరుగాంచినది మరియు ప్రపంచ ప్రసిధి గాంచిన పురాతనమైన, గిజా పిరమిడ్ భవనం మరియు గ్రేట్ స్ఫిన్క్ష్ ఉన్నాయు. లక్షర్ నగరం యొక్క దక్షిణ భాగంలో చాలా పురాతన మైన కట్టడాలు, కర్నక్ గుడి మరియు వ్యాలీ అఫ్ ది కింగ్స్ ఉన్నాయు. మిడిల్ ఈస్ట్ లో ఈజిప్టును ముఖ్యమైన రాజకీయ మరియు సాంసృతిక దేశంగా పరిగణిస్తారు. మిడిల్ ఈస్ట్ లో ఈజిప్టుని ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందిన దేశంగా పేరుగాంచినది. విహారం, వ్యవసాయం, పారిశ్రామిక మరియు సేవా రంగాలలో ఈ దేశం ఉత్పత్తి జాతీయ ఉత్పత్తిలో సగభాగం ఉంటుంది. దీనికి అనుగుణంగా ఈజిప్టు యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులను ఆకర్షించడం కోసం చట్టాలను అమలు చేయడంతో పాటు అమలులోకి తీసుకు రావడం దానితో పాటు అంతరంగిక మరియు రాజకీయ నిచలతతో పాటు అధునాతన వ్యాపారం మరియు విపణి స్వేచ్ఛాతత్వం కలిగి ఉంటుంది.

రాజకీయ సంక్షోభము [2013][మార్చు]

దేశంలో చెలరేగిన రాజకీయ సంక్షోభము కారణంగా ఈజిప్టు ప్రభుత్వం ఆగస్టు 14, 2013 బుధవారం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీకి మద్దతుగా ఆందోళనలకు దిగిన నిరసనకారులపై సైన్యం విరుచుకుపడింది. సైన్యం దాడిలో 149 మంది మరణించారు. ఇదిలా ఉండగా, హింసాకాండపై కలత చెందిన ఈజిప్టు ఉపాధ్యక్షుడు ఎల్‌బరాడీ తన పదవికి రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి అమలులోకి వస్తున్నట్లు ఈజిప్టు అధ్యక్ష కార్యాలయం ప్రభుత్వ టీవీ చానల్ ద్వారా ప్రకటించింది. ముర్సీ మద్దతుదారులపై విరుచుకుపడిన సైన్యం, వారు వేసుకున్న శిబిరాలను బుల్‌డోజర్లతో నేలమట్టం చేసింది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు తగిన చర్యలు చేపట్టేందుకు ఎమర్జెన్సీ సైన్యానికి తగిన అధికారాలు కల్పిస్తోందని అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సైన్యం దాడుల్లో 95 మంది మరణించగా, 758 మంది గాయపడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. అయితే, మృతుల సంఖ్య రెండువేలకు పైనే ఉంటుందని, దాదాపు పదివేల మంది గాయపడ్డారని ముర్సీకి చెందిన ముస్లిం బ్రదర్‌హుడ్ తెలిపింది

మూలాలు[మార్చు]

  1. "Egypt" in the CIA World Factbook, 2007.

ఈజిప్ట్ వికీపీడియా

"https://te.wikipedia.org/w/index.php?title=ఈజిప్టు&oldid=2049316" నుండి వెలికితీశారు