ఈడ్పుగంటి రాఘవేంద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈడ్పుగంటి రాఘవేంద్రరావు
ఈడ్పుగంటి రాఘవేంద్రరావు
జననంఈడ్పుగంటి రాఘవేంద్రరావు
1890
మరణంజూన్ 15, 1942
మరణ కారణంఅధివృక్క గ్రంథి ఆగిపోవటం వలన
వృత్తిబిలాస్‌పూర్ చైర్మను
కేంద్ర ప్రభుత్వ సలహాదారు
ఆపద్ధర్మ గవర్నరు
మౌంట్‌బాటన్ వైస్రాయి
ప్రసిద్ధిభారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు , బహుముఖ ప్రజ్ఞాశాలి
రాజకీయ పార్టీస్వరాజ్య పార్టీ
తండ్రినాగన్న

ఈడ్పుగంటి రాఘవేంద్రరావు (1890 - జూన్ 15, 1942[1]) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేసారు. 1935 మే 15 నుండి 1936 సెప్టెంబరు 11 వరకు రాఘవేంద్రరావు మధ్య పరగణాలు (సెంట్రల్ ప్రావిన్సెస్ - ఇప్పటి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, విదర్భ ప్రాంతం), బేరర్ యొక్క ఆపద్ధర్మ గవర్నరుగా పనిచేశాడు.[2] బ్రిటీషు పాలనలో ఒక ప్రాంతము యొక్క ప్రొవిన్సియల్ గవర్నరుగా నియమితుడైన మొట్టమొదటి భారతీయుడు రాఘవేంద్రరావు.[3] ఈయన ఆ తరువాత మౌంట్‌బాటన్ వైస్రాయిగా పనిచేసిన కాలములో, ఎం.ఎస్. ఆనేతో పాటు వైస్రాయి యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యునిగా నియమితుడైనాడు. ఆనేతో పాటు రాఘవేంద్రరావు ఆ కౌన్సిల్లో భారతీయ వస్త్రధారణతోనే ఇతర బ్రిటీషు సభ్యులతో పాటు కూర్చొని తన జాతీయవాదాన్ని చాటుకున్నాడు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాఘవేంద్రరావు తండ్రి నాగన్న వ్యవహార కారణాల వలన నాగపూరు, బిలాస్‌పూరులకు వెళ్ళడంతో రాఘవేంద్రరావు మధ్యప్రదేశంలోనే పెరిగి పెద్దయ్యాడు. ఆయన చదువు నాగపూర్‌, అలహాబాదుల్లో సాగింది. ఉన్నత విద్య కోసం ఆయన 1909లో ఇంగ్లండు వెళ్లాడు.[4] భారతదేశం తిరిగివచ్చి బారిష్టరుగా జీవితము ప్రారంభించిన రాఘవేంద్రరావు తొలుత బిలాస్‌పూర్ చైర్మనుగా ఎన్నికైనాడు. 1926 వరకు స్వరాజ్య పార్టీలో పనిచేసిన రాఘవేంద్రరావు పార్టీలోని మరాఠీ నాయకులతో విభేదించి బయటికి వచ్చాడు.[5] ఆ తరువాత నాగపూరులో ప్రధానమంత్రిగానూ, గవర్నరుగానూ పనిచేశాడు.[6] విద్యార్థిదశలోనే రాఘవేంద్రరావు జాతీయోద్యమంలోని తీవ్రవాదుల పట్ల ఆకర్షితుడయ్యాడు. వీరిలో ముఖ్యంగా వినాయక దామోదర సావర్కార్‌, శ్యాంజీ కృష్ణవర్మ వంటి వారి ప్రభావం ఆయనపై బాగా పడింది.

రాఘవేంద్రరావు 1941 జూలైలో బ్రిటీషు ప్రభుత్వపు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పౌరరక్షణ వ్యవహారాల సభ్యునిగా నియమితుడయ్యాడు.[7] చివరి దాకా పాలనావ్యవహారాలలో తలమునకలై, అధివృక్క గ్రంథి ఆగిపోవటం వలన ఆరోగ్యం క్షీణించి 1942 జూన్ నెలలో పరమపదించాడు[8]

రాఘవేంద్రరావు యొక్క పెద్దకొడుకు ఆశోక్‌రావు 1983లో బిలాస్‌పూర్ మేయరుగాను, 1990, 1993లలో బిలాస్‌పూర్ నియోజకవర్గము నుండి మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికై మంత్రిగా పనిచేశాడు.[9]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-15. Retrieved 2007-12-15.
  2. http://www.worldstatesmen.org/India_BrProvinces.htm
  3. http://www.centralchronicle.com/20061225/2512307.htm[permanent dead link]
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-06-12. Retrieved 2009-03-12.
  5. Saffron Versus Green By Kanchanmoy Mojumdar పేజీ.121
  6. ఆంధ్రసర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.560
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-04. Retrieved 2009-03-12.
  8. Course of My Life, The - Centenary Edn. By Deshmukh, I.C.S. పేజీ.119
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2007-12-15.