ఈత కొలను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెరటి ఈత కొలను
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో లాస్ వేగాస్, నెవెడాలో భవన పైకప్పు మీద పూర్తిగా కప్పి వేయబడ్డ ఈత కొలను.

ఒక ఈత కొలను, బహిరంగ ఈత కొలను, లోతు తక్కువ కొలను, లేదా ఒక సాధారణ కొలను, అనేది ఈత కొట్టే ఉద్దేశంతో నీటితో నింపబడి ఉండే ప్రదేశం లేదా నీటి సంబంధించిన ఒక వినోదం. వీటిలో పలు నియమిత పరిమాణాలు ఉన్నాయి; అతి పెద్దది మరియు లోతైనది ఒలింపిక్-పరిమాణ ఈత కొలను.[ఉల్లేఖన అవసరం] ఒక కొలనుని భూమి ఉపరితలం మీద కాని లేదా లోపల కాని నిర్మించవచ్చు, లోహం, ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్ లేదా కాంక్రీటు వంటి సామాగ్రితో నిర్మించవచ్చు.

ఎక్కువ మంది లేదా సాధారణ ప్రజలు ఉపయోగించే కొలనులను బహిరంగ కొలనులు అని, కేవలం కొంతమంది లేదా గృహములలో ఉపయోగించు కొలనులను వ్యక్తిగత కొలనులు అని అంటారు. అనేక ఆరోగ్య సంఘాలు, దేహ ధారుడ్య కేంద్రాలు మరియు వ్యక్తిగత సంఘాలు బహిరంగ కొలనులను వ్యాయామము కొరకు ఉపయోగిస్తాయి. పలు అతిథి భవనాలు మరియు మర్దన కేంద్రాలు సేద తీరుట కొరకు బహిరంగ కొలనులను కలిగి ఉంటాయి. వేడి తొట్టెలు మరియు స్పా (ఆరోగ్యమైన నీరు ఉండే తొట్టె)లు వేడి నీటితో ఉండే కొలనులు, వీటిని సేద తీరుటకు లేదా చికిత్స కొరకు ఉపయోగిస్తారు. ఇవి గృహములలో, అతిథి భవనాలలో, క్లబ్స్ (ఉల్లాసమును అందించే కేంద్రాలు) మరియు మర్దన కేంద్రాలలో సర్వ సాధారణంగా ఉంటాయి. ఈత కొలనులని డైవింగ్ (నీటిలోకి పల్టీలు కొట్టుట) కొరకు మరియు ఇతర జల క్రీడలకు కూడా ఉపయోగిస్తారు, దీనితో పాటు జీవిత రక్షకులు మరియు వ్యోమగామిలకు శిక్షణను ఇవ్వుటకు కూడా ఉపయోగిస్తారు.

బ్యాక్టీరియా, వైరస్ లు, నాచు మరియు పురుగుల డింభములు వంటివి వ్యాప్తి చెందకుండా నిరోధించుటకు ఈత కొలనులలో తరచుగా రసాయన సూక్ష్మక్రిమిసంహారిణులు అయిన క్లోరిన్, బ్రోమిన్ లేదా ఖనిజలవణ పరిశుద్ధకారకాలు, మరియు అదనపు వడపోతలు ఉపయోగిస్తుంటారు. ప్రత్యామ్నాయంగా, ఒక బయో ఫిల్టర్ ను అదనపు కార్బన్ వడపోతలు మరియు UV క్రిమిసంహారిణులతో కలిపి ఉపయోగించి కొలనులను రసాయన క్రిమిసంహారిణులు ఉపయోగించకుండా వాడుకొనవచ్చు. ఈ రెండు సందర్భాలలో కూడా, కొలనులు అవసరమైనంత నీటి పారుదల సమర్ధతను కలిగి ఉండాలి.[1]

చరిత్ర[మార్చు]

స్నానపు స్పాలో పురాతన రోమన్ల స్నానాలు, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్ డం.

"గ్రేట్ బాత్" మొహెంజో-దారో ప్రదేశంలో బహుశ 3వ శతాబ్దం BC సమయంలో త్రవ్వినది కావచ్చు. ఈ కొలను 12x7 మీటర్ల పరిమాణంలో ఉండేది, చుట్టూ ఇటుకలతో కంచె వలె కట్టబడి దానికి తారు వంటి పదార్ధంతో పై పూత వేసివుండేది.[2]

ప్రాచీన గ్రీకులు మరియు రోమన్లు కుస్తీ శిక్షణాలయములలో దేహ ధారుడ్య శిక్షణకు, నావికా క్రీడల కొరకు మరియు సైనిక వ్యాయామాల కొరకు కృత్రిమమైన కొలనులను నిర్మించేవారు. రోమన్ చక్రవర్తులకు వ్యక్తిగత ఈత కొలనులు ఉండేవి, వీటిలో చేపలను కూడా పెంచేవారు, అందువలన ఈత కొలనుకి పిసిన అనే ఒక లాటిన్ పదము కూడా వచ్చింది. మొట్ట మొదటి వేడి ఈత కొలనును రోమ్ యొక్క గైస్ మేసునాస్ మొదటి శతాబ్దం BC లో నిర్మించారు. గైస్ మేసునాస్ ఒక రోమన్ సంపన్నుడు మరియు ఆయనను ఒక కళా పోషకుడుగా పరిగణిస్తారు.[3]

ప్రాచీన సింహళీయులు "కుట్టం పోకున" అని పిలిచే జంట ఈత కొలనులను 4వ శతాబ్దం BC లో శ్రీ లంకలోని అనురాధపుర రాజ్యంలో నిర్మించారు. వీటిని మెట్ల వరుసలతో, పున్కలాలు లేదా ఎక్కువ కుండ వంటి ఆకారాలు మరియు గుండ్రంగా తిరిగి ఉండే నగిషీలతో అలంకరించారు.[4]

లోతైన సుడిగుండపు కొలను, 1915లో నిర్మించారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని టెక్సాస్ లో ఉన్న పురాతన కాంక్రీటు ఈత కొలను.

ఈత కొలనులు బ్రిటన్ లో 19వ శతాబ్దపు మధ్యలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1837 నాటికి, ఇంగ్లాండులోని లండన్లో ఆరు కొలనులను డైవింగ్ బోర్డులతో (పల్టీలు కొట్టే బల్లలు) నిర్మించారు.[5] స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో ఉన్న అర్లింగ్టన్ బాత్స్ క్లబ్ ని ప్రపంచంలోని అతి పురాతన కాలం నుండి ఉన్న ఈత క్లబ్ గా నమ్ముతున్నారు. అర్లింగ్టన్ 1870లో కనుగొనబడింది మరియు ఇది ఇప్పటికీ నడుస్తున్న క్లబ్. ఇది 21M కొలనుతో ఉన్న విక్టోరియా భవనాన్ని కలిగి ఉంది. 1896లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు మొదలై ఈత పోటీలను వాటిలో ప్రవేశ పెట్టాక, ఈత కొలనుల యొక్క ప్రజాదరణ వ్యాప్తి చెందటం ప్రారంభమైంది. 1839లో, ఆక్స్ ఫర్డ్ లో ముఖ్యమైన ప్రజలందరు ఉపయోగించు మొట్టమొదటి అంతర ఈత కొలను టెంపుల్ కౌలే వద్ద ఉంది మరియు దానిలో ఈత మొదలైనది. ఇంగ్లాండ్ లో 1869లో ఔత్సాహిక ఈత సంఘం స్థాపించారు,[6] మరియు ఆక్స్ ఫర్డ్ ఈత సంఘమును 1909లో దాని కార్యాలయమును టెంపుల్ కౌలే కొలను ఉండే ప్రదేశంలో స్థాపించారు.[7] లండన్ మెర్టన్ వీధిలోని గులక రాళ్ళతో ఉన్న ప్రాంతములో లోపలి ఈత కొలనులు సౌకర్యవంతముగా ఉండటంతో ఔత్సాహిక ఈతగాళ్ళు ఎక్కువగా చేరటానికి అవకాశం దొరికింది. అందువలన స్నానం చేసే వారు నెమ్మదిగా ఈతగాళ్ళు అయిపోయారు, మరియు స్నానపు కొలనులు ఈత కొలనులుగా మారాయి.

USAలో, రాకెట్ క్లబ్ ఆఫ్ ఫిలడెల్ఫియా వినోద గృహము (1907) ప్రపంచములో మొట్టమొదటి ఆధునిక భూమి-ఉపరితల ఈత కొలను అని గొప్పగా చెప్పుకుంటారు. నౌక మీద సముద్రములోనికి వెళ్ళే మొట్టమొదటి ఈతకొలనును 1907లో వైట్ స్టార్ లైన్ యొక్క అడ్రియాటిక్లో ఏర్పాటు చేసారు.[8]

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఈత పోటీల మీద ఆసక్తి పెరిగింది. నియమాలను అభివృద్ధి చేసారు మరియు శిక్షణ తప్పనిసరి అయినది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంటి ఈతకొలనులు ప్రజాదరణ పొందాయి మరియు ఈత క్రీడలకు హాలీవుడ్ చిత్రాలైన ఎస్తేర్ విలియమ్స్ మిలియన్ డాలర్ మెర్మైడ్ వంటివి ప్రాచుర్యం కల్పించాయి మరియు ఇంటి కొలనులని ఏర్పాటు చేసుకోవటం హోదాకు చిహ్నంగా ఉండేది. యాభై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ సమయం తరువాత గృహము లేదా నివాస స్థలములో ఈత కొలనులు సర్వ వ్యాప్తంగా ఉంటాయి మరియు చిన్న దేశాలు కూడా ఈత కొలనుల కర్మాగారం అభివృద్ధి చెందుటను అనందిస్తాయి (ఉదాహరణకు న్యూజీలాండ్ జనాభా 4,116,900 [మూలం NZ జనగణన 2006 మార్చి 7] - ఈత కొలనుల రికార్డులలో ప్రతి ఒక్కరికి 65,000 ఇంటి ఈత కొలనులు మరియు 125,000 స్పా కొలనులు ఉన్నాయి). ఒక రెండు అంతస్తుల తెల్ల కాంక్రీటు ఈత కొలను భవనం క్షితిజ సమాంతర ఘన పరిమాణాలతో 1959లో రాయల్ రోడ్స్ మిలిటరీ కళాశాల దగ్గర నిర్మించారు, ఇది కెనడా యొక్క చారిత్రక ప్రదేశాల జాబితాలో ఉంది.[9]

ఈత కొలను రికార్డులు[మార్చు]

మొస్క్వా కొలను, ఒకసారి ప్రపంచంలోని అతి పెద్ద ఈత కొలనుగా ఎంపికైనది (1980)

గిన్నిస్ ప్రపంచ రికార్డుల ప్రకారం ప్రపంచంలోని అతి పెద్ద ఈత కొలను అల్గార్రోబో, చిలీలో ఉన్న సాన్ అల్ఫోంసో డెల్ మార్ సముద్ర నీటి కొలను. ఇది 1,013 m (3,323 ft) పొడవైనది మరియు 8 హ (20 ఎకరాల) విస్తీర్ణం కలిగినది. దీనిని డిసెంబరు 2006లో పూర్తి చేసారు.[10]

అతి పెద్ద అంతర్గత అలల కొలను ఉత్తర అమెరికాలో వెస్ట్ ఎడ్మోన్టన్ మాల్ దగ్గర ఉంది మరియు అతి పెద్ద అంతర్గత కొలను సొంనీ కార్టర్ ట్రైనింగ్ ఫెసిలిటీలో న్యూట్రల్ బోయన్సి ల్యాబ్ దగ్గర NASA JSC దగ్గర హాస్టన్ లో ఉంది.[11][12] వినోద ప్రధాన డైవింగ్ (పల్టీ) కేంద్రము నెమో 33 బ్రస్సేల్స్ కి దగ్గర ఉంది, బెల్జియంలో ప్రపంచములోనే లోతైన ఈత కొలను ఉంది. ఈ కొలను 5 m (16 ft) మరియు10 m (33 ft) లోతులలో చదునైన అడుగు భాగం కలిగిన రెండు ప్రదేశములను, మరియు 33 m (108 ft) లోతు కలిగిన గుండ్రని గుంటను కలిగి ఉంది.33 m (108 ft).[13]

కాలిఫోర్నియా సాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న ఫ్లీష్ హాకర్ కొలను అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అతి పెద్ద కొలను. 1925 ఏప్రిల్ 23లో ప్రారంభమైన ఈ కొలను, 1,000 by 150 ft (300 by 50 m) పరిమాణంలో ఉండేది. ఇది చాలా పెద్ద కొలను కావటంతో జీవిత సంరక్షకులకు కాపలాకు కయాక్ లు (ఒక మనిషి నడిపే చిన్న పడవలు) అవసరం అయ్యాయి. సురక్షత తక్కువగా ఉండుట వలన దీనిని 1971లో మూసి వేసారు.[14]

మాస్కోలో ప్యాలస్ ఆఫ్ సోవియట్స్ భవనం అసంపూర్తిగా మిగిలిపోయిన తరువాత అక్కడ అంతక ముందు ఎక్కడా లేనంత భారీ ఈత కొలనుని ప్రసిద్ధంగా నిర్మించారు. ముగిసి పోయిన స్టాలిన్ తరం తరువాత ఈ పునాదులను మొస్క్వా కొలను బహిరంగ ఈత కొలను కొరకు మార్చి వేసారు.[15] కమ్యూనిజం నిర్మూలన జరిగాక, క్రీస్ట్ ది సేవియర్ కెథడ్రాల్ (ఇది అదే ప్రదేశములో ఉండేది)ను 1995 నుండి 2000 మధ్యలో పునర్నిమించారు.

చుట్టుకొలతలు[మార్చు]

లోతు తక్కువ చిన్న పిల్లల కొలనులో ఒక బాలుడు
ఒక వ్యక్తిగత ఈత కొలను
చూడుము: #పోటీలు నిర్వహించు కొలనులు (క్రింద)
పొడవు

ప్రపంచంలోని కొలనుల పొడవును మీటర్లలో కొలుస్తారు, కాని అమెరికా సంయుక్త రాష్ట్రములలో కొలనులను అడుగులలో మరియు గజాలలో కొలుస్తారు. యునైటెడ్ కింగ్డంలో ఎక్కువ కొలనులు మీటర్లలోనే ఉంటాయి, కాని గజాలలో కొలిచే పురాతన కొలనులు కూడా ఇంకా ఉన్నాయి. USలో కొలనులు 25 గజాల పొడవు (SCY -షార్ట్ కోర్స్ యార్డ్స్), 25 మీటర్లు (SCM -షార్ట్ కోర్స్ మీటర్స్) లేదా 50 మీటర్లు (లాంగ్ కోర్స్) ఉంటాయి. US ఉన్నత విద్యాలయాలు మరియు NCAA షార్ట్ కోర్సు (25 గజాలు) పోటీలను నిర్వహిస్తాయి. ఇంకా అక్కడ 33⅓ మీ పొడవు ఉండే కొలనులు కూడా ఉంటాయి, కావున మూడు పొడవులు = 100 మీ. ఇటువంటి కొలను చుట్టుకొలతలు సాధారణంగా నీటి పోలో నిర్వహణకు వీలుగా ఉంటాయి.

USA ఈత (USA-S)మండలి వారు కొలమానం ఉండేవి మరియు కొలమానం లేని రెండు కొలనులలో ఈదుతారు. అయినప్పటికీ, మీటర్లు అంతర్జాతీయ ప్రమాణాలు, మరియు ప్రపంచ రికార్డులు 50 మీటర్ల కొలనులో ఈదినప్పుడు గుర్తించినవి (లేదా 25 మీ షార్ట్ కోర్సు కొరకు). సాధారణంగా, కొలను చిన్నదిగా ఉంటే, ఈతగాడు ప్రతి మలుపులో కొలను చివర కొలను గోడని నెట్టి వెనుకకు తిరుగుట వలన ఎక్కువ వేగాన్ని పుంజుకొని ఒకే దూరముని తక్కువ సమయములో ఈదవచ్చు.

వెడల్పు

ఎక్కువ ఐరోపా కొలనుల వెడల్పులు 10 మీ మరియు 50 మీ మధ్యలో ఉంటాయి.

లోతు

ఒక ఈత కొలను యొక్క లోతు ఆ కొలను ఏ విధంగా ఉపయోగిస్తారు ప్రజల కోసమా లేక కచ్చితంగా వ్యక్తిగతంగా ఉపయోగిస్తారా అనే విషయము మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అది ఒక వ్యక్తిగత కొలను, సేద తీరే కొలను అయితే అది 1.0 to 2.0 m (3.3 to 6.6 ft) లోతు ఉండవచ్చు. ఒకవేళ అది డైవింగ్ (పల్టీ)కు అనుకూలంగా రూపొందించిన బహిరంగ కొలను అయితే అయితే అది లోతుగా ఉండే వైపు నుండి 3.0 to 5.5 m (9.8 to 18.0 ft)* పల్లముగా ఉండవచ్చు. ఒక చిన్న పిల్లల యొక్క కొలను 0.3 to 1.2 m (1 to 4 ft) లోతు ఉండవచ్చు. ఎక్కువ బహిరంగ కొలనులు ఈతగాళ్ళ అవసరాలను బట్టి వివిధ లోతులను ఏర్పాటు చేస్తాయి. కొన్ని అధికార పరిధులలో, నీటి లోతుని కొలను గోడలకు స్పష్టంగా గుర్తు పెట్టి చూపించాల్సి ఉంటుంది.

రకాలు[మార్చు]

వ్యక్తిగత కొలనులు[మార్చు]

రాయల్ పెర్త్ వైద్యశాలలో ఉన్న వ్యక్తిగత కొలను

వ్యక్తిగత కొలనులు సాధారణంగా బహిరంగ కొలనుల కన్నా చిన్నవిగా ఉంటాయి, వాటి పరిమాణం సరాసరి 12 ft × 24 ft (3.7 m × 7.3 m)నుండి 20 ft × 40 ft (6.1 m × 12.2 m) ఉండగా బహిరంగ కొలనుల పరిమాణం 80 ft (24 m) వద్ద ప్రారంభమవుతుంది.[ఉల్లేఖన అవసరం] ఇంటి కొలనులను శాశ్వతంగా నిర్మించుకోగలరు, లేదా భూమి ఉపరితలం మీద నిర్మించుకుని వేసవి కాలము తరువాత దానిని నిర్మూలించుకొనుటకు వీలుగా కూడా నిర్మించుకోవచ్చు.[16] స్వంతంగా లేదా ఉద్యానవనములలో బహిరంగ కొలనులను నిర్మించుకొనుట 1950లలో వేడిగా ఉండే వేసవి వాతావరణాలు ఉన్న ప్రదేశాలలో ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తామర తంపరగా మొదలయ్యాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మన్ హాటన్ లో ఉన్న భవన పైకప్పు కొలను

అత్యధిక అక్షాంశములలో ఉన్న ఇండ్లలో వ్యక్తిగత కొలనులు సర్వసాధారణం అవుతున్నాయి. ఉదాహరణకు, లండన్ లోని అనేక పెద్ద భవంతులను ఇప్పుడు అంతర్గత కొలనులతో తిరిగి పునర్నిర్మిస్తున్నారు, వీటిని సాధారణంగా ఇంటి దిగువ భాగములో లేదా ఉద్యానవనములలో నిర్మిస్తున్నారు. ఐరోపా లోని కొన్ని నగరాలలో మునిచ్ తో సహా, పురాతన కట్టడాలలో నివసించే ప్రజలు వారి పురాతన మోటార్ కారు గ్యారేజీలలో అంతర్గత కొలనులను నిర్మించుకుంటున్నారు.[ఉల్లేఖన అవసరం]

భూమి-ఉపరితలం మీద ఉండే కొలను

వ్యక్తిగత కొలనుల నిర్మాణ పద్ధతులు వివిధ రకాలుగా ఉంటాయి. భూమి లోపల నిర్మించు కొలనులలో ముఖ్యమైన రకాలు కాంక్రీటు, వినైల్ లైనర్, మరియు ఫైబర్ గ్లాస్. సాధారణంగా భూమి ఉపరితల కొలనులను ("భూమి పైన ఉండే కొలనులు"అని కూడా అంటారు) చౌకగా నిర్మించుకోవచ్చు. ఇవి భూమి ఘనీభవన ఉష్ణోగ్రతలు త్రవ్వకానికి ఇబ్బంది కలిగించే మరియు కొలను యొక్క పరిమాణము చెడిపోయే పరిస్థితులు ఎదురయ్యే ప్రదేశాలలో ప్రత్యేకంగా ప్రజాదరణ పొందినవి. ఖరీదు తక్కువ తాత్కాలిక PVC కొలనులను సూపర్ మార్కెట్ లలో కొనుక్కోవచ్చు మరియు వీటిని వేసవి తరువాత తీసివేయవచ్చు. వీటిని ఎక్కువగా ఇంటి పెరుడులో ఉపయోగిస్తారు, ముఖ్యంగా లోతు తక్కువగా ఉండే ప్రదేశాలలో, వీటి యొక్క అంచులు బల్లపరపుగా కాకుండా ఉండి గట్టిగా ఉండుటకు గాలితో నింపబడి ఉంటాయి. ఉపయోగించుట పూర్తి అయిన తరువాత, దానిలో నీటిని మరియు గాలిని తీసివేసి మడత పెట్టి భద్రపరచుటకు సౌకర్యంగా ఉంటాయి. ఈత కొలనుల కర్మాగారంలో వీటిని "నీరు చిందే" కొలనులు అంటారు ఇవి చల్ల బరచుకొనుట కొరకు మరియు చిన్నపిల్లలు మరియు పసిపిల్లల ఉల్లాసం కొరకు తప్ప ఈత కొరకు తయారు చేసినవి కాదు.

కొలను నీటిలో ఆడుకొనుట కొరకు పిల్లలకు మరియు పెద్దలకు కొరకు బొమ్మలు అందుబాటులో ఉంటాయి. ఇవి గాలితో నింపబడి ఉంటాయి కాబట్టి సున్నితంగా ఉంటాయి కాని పట్టుకొనుటకు అనుకూలంగా బరకగా ఉంటి నీటిపై తేలుతూ ఉంటాయి.

చాలా దేశాలు ఇప్పుడు వ్యక్తిగత ఈత కొలనులకు కొలను కంచె నియమాల విషయంలో కచ్చితంగా ఉంటున్నాయి, వీటి ప్రకారం అర్హత లేని ఆరు సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉండే పిల్లలు ప్రవేశించకుండా ఉండుటకు కొలను ప్రదేశాలు ఏకాంతంగా ఉండాలి. చాలా దేశాలు ఇంట్లో నివసించు పిల్లలకు మరియు ఇంటికి అతిథిగా వచ్చే పిల్లలకు సమాన స్థాయి రక్షణ కావాలని సూచిస్తున్నాయి, అయినప్పటికీ కొలను యజమానులు వారి నివాస ప్రదేశానికి కొలను కనిపించే సమీప దూరంలో ఉండాలి అని అనుకుంటున్నారు, దీనివలన అనుకుంటున్న స్థాయి సంరక్షణ ఉండుటలేదు.

వ్యక్తిగత ఈత కొలనుల కంచె నియమాల గురించి రాష్ట్రాలు మరియు దేశాల మధ్య సరైన గణాంకాలు ఏవి లేవు, మరియు చాలా ప్రదేశాలలో వాటి అవసరం లేదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వీటి అవసరం ఉండదు.[17]

బహిరంగ కొలనులు[మార్చు]

మూస:Globalize/Eng

బహిరంగ కొలనులను ఎక్కువగా పెద్ద విరామ కేంద్రాలలో లేదా వినోద కాలక్షేప ప్రాంగణములలో చూడవచ్చు. ఇటువంటి కేంద్రాలలో ఒకటి కన్నా ఎక్కువ కొలనులు ఉంటాయి, వాటిలో అంతర్గత కొలను, ఒక బహిరంగ ఉప్పు నీటి కొలను లేదా వేడిగా లేని క్లోరిన్ వేసిన కొలను, ఒక లోతు తక్కువగా ఉండే చిన్న పిల్లల యొక్క కొలను మరియు తెడ్డు ఉపయోగించే వారికొరకు ఒకటి మరియు పసిపిల్లలకు ఒకటి ఇలా వివిధ రకాల కొలనులు ఉంటాయి. అక్కడ ఇంకా సానా (పొడిగా లేదా తడిగా వేడిని ఇచ్చే ప్రదేశం) మరియు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వేడి తొట్టెలు లేదా స్పా (ఆరోగ్య సంబంధమైన) కొలనులు ("జాకుజీలు") ఉండవచ్చు.

నెదర్లాండ్స్ కింగ్ డం లోని సురచావు వినోద కేంద్రంలో ఉన్న ఈత కొలను

బహిరంగ కొలనులు అతిథి భవనం లేదా సెలవు దినాలను గడిపే పర్యాటక ప్రదేశాలకు చెందినవి, వీటిని వారి అతిథుల ఉల్లాస వసతి కొరకు ఏర్పాటుచేస్తారు. ఒకవేళ ఒక కొలను విడిగా ఒక భవనంలో ఉంటే దానిని "నటాటోరియం" (అంతర్గత ఈత కొలను) అని పిలుస్తారు. ఈ భవనం ఒక్కొక్కసారి ఈత కొలనుకి సంబంధించిన డైవింగ్ (పల్టీ కొట్టే) తొట్టె సదుపాయాలను అందిస్తుంది. బహిరంగ కొలనులు వేడిగా ఉండే వాతావరణాలలో సర్వసాధారణం. భారీ కొలనులకు కొన్ని సార్లు డైవింగ్ (పల్టీ కొట్టే) బల్ల నీటి పైన ఒక చివర బిగించబడి ఉంటుంది. డైవింగ్ (పల్టీ కొట్టే) కొలనులు పల్టీ కొట్టే వారు గాయపడకుండా ఉండాల్సినంత లోతు కలిగి ఉండాలి.

అనేక బహిరంగ కొలనులు దీర్ఘ చతురస్త్ర ఆకారంలో 25 మీ లేదా 50 మీ పొడవులో ఉంటాయి, కాని ఏ పరిమాణంలో అయిన ఏ ఆకారంలో అయిన ఉండవచ్చు. ఇంకా విస్తారమైన కొలనులు కృత్రిమ జలపాతాలతో, జల యంత్రంలతో, నీరు చిందే బల్లలతో, అలల యంత్రాలతో, వివిధ లోతులు కలిగి, వంతెనలతో, మరియు మంచు గడ్డలతో ఏర్పాటు చేసి ఉంటాయి.

ఈ ప్రదేశాలలో దాదాపు బట్టలు మరియు ఇతర వస్తువులు జాగ్రత్త చేసుకొనుటకు సొరుగులు అందుబాటులో ఉంటాయి. సొరుగులు ఉపయోగించుకొనుటకు ఒక నాణెంను ధరావతు క్రింద కాని చెల్లింపుగా కాని ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అక్కడ స్నానపు జల్లులు ఉపయోగించుకొనుటకు తయారుగా ఉంటాయి - కొన్ని సమయాలలో తప్పనిసరిగా ఈత కొట్టే ముందు కాని తరువాత కాని వీటిని ఉపయోగిస్తారు. ఇంకా ఇక్కడ జీవన సంరక్షకులు ప్రజలను రక్షించుటకు ఉంటారు.

చిన్న పిల్లలు సాధారణంగా ఉద్యాన వనాలలో ఉపయోగించుకొనుటకు నీటిలో నడవగలిగిన కొలనులు లోతు తక్కువ నీటితో ఉంటాయి. నడవ గలిగిన కాంక్రీటు కొలనులు రకరకాల ఆకృతులలో ఉంటాయి, సాంప్రదాయంగా దీర్ఘ చతురస్త్ర ఆకృతి, చతురస్త్ర ఆకృతి లేదా వృత్తం ఆకృతిలో ఉంటాయి. వీటిలో వడపోత వ్యవస్థ లేకపోవుట వలన ప్రతి రోజు నీటిని నింపి వదిలి వేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి మరియు రక్షిత నిబంధనలను ధ్రువీకరిస్తూ సిబ్బంది నీటిలో క్లోరిన్ కలుపుతారు.

పోటీలు నిర్వహించు కొలనులు[మార్చు]

FINA సూక్ష్మీకరించిన పొడవైన ఈత కొలను నియమ చిత్రం, వేసవి ఒలింపిక్స్ లో ప్రపంచ విజేతల కోసం ఉపయోగించింది.
ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో 2006 కామన్ వెల్త్ క్రీడలలో ఉపయోగించిన ఒలింపిక్ ఈత కొలను మరియు మొదలయ్యే విభాగాలు
చూడండి: #చుట్టుకొలతలు (పైన) మరియు ఈత (క్రీడా)#పోటీల కొలనులు

ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి లా నటాషన్ (FINA, అంతర్జాతీయ ఈత సమాఖ్య) పోటీలు నిర్వహించు కొలనులకి నియమాలను ఏర్పరచినది: 25 or 50 m (82 or 164 ft) పొడవు మరియు కనీసపు 1.35 m (4.4 ft) లోతు. పోటీలు నిర్వహించు కొలనులు సాధారణంగా అంతర్గతంగా ఉంటాయి మరియు సంవత్సరం మొత్తం ఉపయోగించుకొనుటకు అనుకూలంగా వేడి చేస్తారు, మరియు ఉష్ణోగ్రతలకు సంబంధించిన నియమాలు కాంతి, మరియు యాంత్రికంగా పనిచేసే యంత్ర సామాగ్రి నియమాలను సులువుగా అనుసరించే విధంగా ఉంటాయి.

ఒక ఒలింపిక్ పరిమాణపు ఈత కొలను (మొట్టమొదట 1924 ఒలింపిక్ పోటీలలో ఉపయోగించారు) ఒలింపిక్ క్రీడల కొరకు మరియు ప్రపంచ విజేతల విన్యాసాల కొరకు FINA యొక్క నియమాలను అనుసరించి ఉండాలి. ఇవి కచ్చితమైన 50 m (160 ft) పొడవు 25 m (82 ft) ఎనిమిది వరుసలుగా విభజించుటకు వీలుగా ఉండే వెడల్పు కలిగి2.5 m (8.2 ft) కొలను రెండువైపులా అదే వైశాల్యములో2.5 m (8.2 ft) ఉండాలి.[18] నీటిని కచ్చితంగా 25–28 °C (77–82 °F) 1500 లక్స్ కాంతి స్థాయి ప్రసరించునట్లు ఉంచాలి. కనీసపు లోతు2 m (6.6 ft), మరియు వరసలకు కట్టిన తాడు యొక్క రంగు మరియు వెనుకకు తిరుగుటకు సూచనను ఇచ్చే జెండాలు (ప్రతి గోడ నుండి 5 మీటర్లు) మొదలగు విషయములకు నియమాలు ఉంటాయి. FINA ఈ పదముని ఉపయోగించుటకు కట్టడి చేయకపోవుట వలన "ఒలింపిక్ కొలనులు"గా చెప్పబడే కొలనులు ఎల్లప్పుడూ ఈ నియమాలను పాటిస్తాయి అని చెప్పలేము. టచ్ ప్యాడ్ లును లాంగ్ కోర్సు రెండు గోడలు కలిసే ప్రదేశంలో మరియు షార్ట్ కోర్సు ప్రతి చివర కట్టి ఉంచుతారు.

ఒక కొలను దాని భౌతిక ఆకృతిని బట్టి వేగముగా ఉందా లేదా నెమ్మదిగా ఉందా అని తెలుపుతారు.[19] కొన్ని రూపకల్పనల పరిగణలు కొలను వేగాన్ని పెంచి ఈత నిరోధమును తగ్గిస్తాయి : ముఖ్యంగా, కచ్చితమైన కొలను లోతు, విద్యుత్ ని తొలగించుట, వరస యొక్క వెడల్పుని పెంచుట, శక్తిని పీల్చివేసే పందెపు వరసలు మరియు కాలువలు, మరియు ఇతర నూతన హైడ్రాలిక్ (ఒక విధమైన ధ్రవముతో నడుపగలిగేది), ధ్వని సంబంధిత మరియు కాంతి రూపకల్పనల వంటివి.

వ్యాయామ కొలనులు[మార్చు]

గడిచిన రెండు శతాబ్ధాలలో, ఒక క్రొత్త తరహా కొలనులు ప్రజాదరణ పొందాయి. వీటిలో ఈతగాళ్ళు ఈత కొట్టే ఒక చిన్న గిన్నె (సాధారణంగా 2.5 మీ x 5 మీ) వంటి ఆకారము ఉంటుంది, ఆ ప్రదేశంలో ఈతగాడు కృత్రిమంగా ఉత్పత్తి చేసిన జల విద్యుత్ పోటుకు వ్యతిరేకంగా లేదా అణిచిపెట్టే యంత్రాలు లాగుటకు వ్యతిరేకంగా అయిన ఈత కొడతాడు. ఈ కొలనులకి ఈత స్పాలు, ఈత యంత్రాలు, లేదా ఈత వ్యవస్థలు అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇవన్ని నిరోధపు ఈతకు వివిధ ఉదాహరణలు.

వేడి తొట్టెలు మరియు స్పా(ఆరోగ్యకరమైన) కొలనులు[మార్చు]

ఖనిజ లవణాల నీటితో అంతర్గత ఈత కొలను, కారోలస్ తెర్మేన్, ఆచేన్, జర్మనీ

వేడి తొట్టెలు మరియు స్పా (ఆరోగ్యకరమైన) కొలనులు నీటిని వేడి చేయగలిగిన సాధారణ కొలనులు వీటిని సేదతీరుట కొరకు మరియు కొన్ని రకాల చికిత్సల కొరకు ఉపయోగిస్తారు. ఈత కొలనులు ఉండే ప్రదేశాలలో లేదా ఆరోగ్య క్లబ్బుల లేదా దేహ ధారుడ్య కేంద్రాలలో ఉండే సాన (పొడి లేదా తడి వేడిమిని ఇచ్చే ప్రదేశం) ప్రదేశాలలో, పురుషుల క్లబ్బులలో, స్త్రీల క్లబ్బులలో, అతిథి భవనాలలో మరియు ప్రత్యేకమైన ఐదు నక్షత్రాల అతిథి భవనాల గదులలో వాణిజ్య స్పా (ఆరోగ్యకరమైన) కొలనులు సర్వసాధారణం. స్పా (ఆరోగ్యకరమైన) క్లబ్బులు భారీ కొలనులను కలిగి ఉండవచ్చు, కొన్ని ఉస్ణోగ్రతను పెంచే విధంగా విడిగా ఉంటాయి. జపాన్ లో, పురుషుల యొక్క క్లబ్బులు వివిధ స్పా (ఆరోగ్య కరమైన కొలనులు)లు వివిధ పరిమాణాలతో వివిధ ఉష్ణోగ్రతలతో ఉండుట సాధారణం. వాణిజ్య స్పా (ఆరోగ్యకరమైన కొలనులు) లు సాధారణంగా లోపలివైపు కాంక్రీటు, వివిధ వర్ణముల గాజు పలకలతో రూపొందించి ఉంటారు. వేడి నీటి తోట్టెలు ముఖ్యంగా మద్యం పీపా వంటి వాటిలాగ నిటారుగా ఉండే భుజాలతో తయారు చేస్తారు, వీటిని కాలిఫోర్నియా ఎర్రచందనం వంటి చెక్కతో ఒక ప్రదేశంలో లోహపు కట్లతో పట్టి ఉండునట్లు తయారు చేస్తారు. స్పా (ఆరోగ్యకరమైన కొలనులు) లేదా వేడి నీటి తొట్టెలలో నీటి క్రింద ఉండే గొట్టం చూషణ శక్తుల నుండి ఎదురయ్యే పీడన ప్రమాదం వలన తలని ముంచుటని సమర్ధించరు. అయినప్పటికీ, చాలా దేశాలలో వాణిజ్య ప్రతిస్థాపనలు ప్రమాదాలను తగ్గించు విధంగా వివిధ రక్షణ ప్రమాణాలను అనుసరించాలి.

గృహములలో ఉండే స్పా (ఆరోగ్యకరమైన కొలనులు)లు 1980 నుండి పాశ్చాత్య దేశాలలో ప్రపంచవ్యాప్త ఖరీదుచేసే వస్తువు, వీటిని ప్రత్యేక స్పా దుకాణాలలోను, కొలను దుకాణాలలోను, సరకుల దుకాణాలలోను, ఇంటర్నెట్ లోను, మరియు అమ్మకాల జాబితా పుస్తకాల ద్వారా వీటిని పొందవచ్చు. వీటిని ఎప్పుడు ఉష్ణోగ్రత-బహిష్కరించు అక్రిలిక్ షీట్ పెర్స్పెక్స్ వంటి రసాయన పదార్ధాలతో తయారు చేస్తారు, ఇవి పాలరాయి రంగులో ఇంచుమించు అదే తరహాలో ఉంటాయి. అవి అప్పుడప్పుడు అతిక్రమించి8 చ .అ (0.74 మీ2) మరియు అప్పుడప్పుడు3 ft 6 in (1.07 m) లోతుగా ఉంటాయి, రా షీట్ (ముడి పట్ట) యొక్క పరిమాణాల మీద ఆధారపడి ఉంటాయి (ముఖ్యంగా వీటిని జపానులో తయారు చేస్తారు). అక్కడ ఎక్కువగా కూర్చోవుటకు లేదా పడుకోవుటకు మధ్యస్తంగా ఉండే కుర్చీలు లేదా విశ్రాంతి ప్రదేశాలు, మరియు ఆనుకొనుటకు వీలుగా ఉండే విరామ కుర్చీలు ఉంటాయి. ఉన్నత వర్గ స్పా (ఆరోగ్యకరమైన కొలనులు)లలో వివిధ నీటిని చిలకరించు యంత్రాలు (మర్దన, నాడీ వ్యవస్థను ప్రేరేపించుట మొదలైన.), ఒక పానీయముల పళ్ళెం, దీపాలు LCD చదరపు-తెర TVలు మరియు ఆ కొలనును ఉల్లాస కేంద్రంగా తలపించే సౌకర్యాలు ఉంటాయి. గృహములో ఉండే స్పా (ఆరోగ్య కొలనులు)లను సాధారణంగా వారి కుటుంబాలను అనుసరించి తయారు చేసుకుంటారు36 to 39 °C (97 to 102 °F). చాలా కొలనులు ఎర్ర చందనం లేదా అదే రకము చెక్కతో తయారు చేసిన చట్రములో సంస్థీకరించి వాటిని ఒక శాశ్వతమైన పల్లపు ప్రదేశములోనే కాకుండా ఇంటి ముందు పెరడులో కూడా పెట్టుకొనుటకు వీలుగా "కదిలించుటకు అనువుగా" ఉంటాయి. కొన్ని కదిలించగలిగిన స్పాలు లోతు తక్కువగా మరియు సన్నగా ఒక ప్రక్క ఇమిడిపోయే విధంగా ఒక నియమిత ద్వారములో పట్టి ఒక గది లోపల పెట్టుకొనే విధంగా ఉంటాయి. తక్కువ విద్యుత్ శక్తితో పనిచేసే నీటి లోపల మునిగి ఉండే వేడి యంత్రము ఇంటి స్పాలలో సర్వ సాధారణము.

సుడులు తిరిగే నీటితో ఉండే తొట్టెలు 1960లు మరియు 70లలో అమెరికాలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఒక స్పాని USAలో "జాకుజీ" అని కూడా పిలుస్తారు ఎందుకనగా గొట్టపు వస్తువుల తయారీదారులు జాకుజీ 1968లో "స్పా సుడిగుండం కొలను"ని ప్రవేశ పెట్టినప్పటి నుండి ఈ పదముని ఉపయోగించుట సాధారణమైనది. ఒకవేళ ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగి అసౌకర్యాన్ని కలిగించినప్పుడు గాలి బుడగలు రంధ్రముల లోపలి ఒక గాలి-ప్రవాహ వెంటురి గొట్టం ద్వారా లోపలి ప్రవేశించి చల్ల గాలిని లోపలి వచ్చే వేడి నీటితో కలిపి కొలనుని చల్ల పరచుతుంది. కొన్ని స్పాలు స్థిరమైన బుడగల ప్రవాహాన్ని కొలను అడుగుభాగము ద్వారా కాని లేదా పాదములు పెట్టుకును ప్రదేశము ద్వారా కాని పంపుతూ ఉంటాయి. ఇది ఒక సాధారణ ఉష్ణోగ్రత నియంత్రణ యంత్రము వలె ఉంటుంది, కృత్రిమంగా నీటిని వేడిచేయుటకన్నా వేడి నీరు సహజ (నియంత్రణలేని ఉష్ణం) భౌగోళికఉష్ణ ఉత్పత్తి వనరు నుండి వస్తాయి. నీటి ఉష్ణోగ్రత సాధారణంగా ఎక్కువ వెచ్చదనం నుండి అధిక వేడి వరకు ఉంటుంది - 38 to 42 °C (100 to 108 °F), కాబట్టి స్నానము చేసే వారు కేవలం 20 నుండి 30 నిమిషాలు పాటు ఉండగలరు. బ్రోమిన్ లేదా ఖనిజ లవణాలను శుభ్రపరచే యంత్రాలు ఎక్కువగా స్పాలను శుభ్రపరచుటకు సిఫార్సు చేస్తారు ఎందుకనగా క్లోరిన్ అధిక ఉష్ణోగ్రత వద్ద దాని యొక్క ఘాటైన రసాయన వాసనను వెదజల్లుతుంది. ఓజోన్ ఒక ప్రభావితమైన బ్యాక్టీరియా సంహారిణి మరియు దీనిని కాట్రిడ్జ్ (డొల్లవంటి) వడపోత ప్రసరణ వ్యవస్థలో కలిపి ఉంచుతారు, కాని బురదగా ఉండే సత్తువ కల భూమిలో కూరుకొని పోయే సమస్య వలన ఇసుక మాధ్యమ వడపోతతో చేయరు.

సిడ్నీ లోని కూగీ దగ్గర ఒక మహా సముద్రము, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా

మహా సముద్రపు కొలనులు[మార్చు]

20 వ శతాబ్ధపు మొదటిలో, ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలో, మహా సముద్రపు కొలనులు లను సముద్రం లోపలికి చొచ్చుకుని ఉండి కొండ భాగముతో చుట్టివేయబడ్డ భాగములో అలల తాకిడికి కొలను లోపలి నీరు ప్రవహించు విధంగా లేదా పెద్ద అలతో కొలను ప్రక్క భాగములో ప్రవహించు నీటితో ఉండే విధంగా నిర్మించేవారు. అక్కడ స్త్రీలకి మరియు పురుషులకి ప్రత్యేక కొలనులు ఉంటాయి, లేదా కొలనును స్త్రీలకు ఒక సమయంలో మరియు పురుషులకు ఒక సమయంలో స్నానం చేసే వారికి ఇతరులు చూస్తారు అనే భయం లేకుండా ఉండునట్లు చూస్తారు. ప్రత్యేక దుస్తులు మార్చుకొను గదులు మరియు నీటి జల్లులను ఏర్పాటు చేస్తారు.[20] ఇవి ఆధునిక 'ఒలింపిక్' కొలనులకి ముందు నడచినవి. తరువాత జరిగిన అభివృద్ధిలో సముద్రము- లేదా నౌకాశ్రయము-వైపు ఉండే కొలనులకి ఉండే తేడా సముద్రపు నీటిని గొట్టములను ఉపయోగించి తిప్పుతారు. ఈ తరహా కొలనులో ఆస్ట్రేలియా ఒలింపిక్ క్రీడాకారుడు డాన్ ఫ్రేసర్ అభ్యాసం చేసేవాడు.

అనంత కొలనులు[మార్చు]

గ్రాన్ కనారియ, స్పైన్ లోని ఒక అతిథి భవనం దగ్గర ఒక అనంత కొలను

ఒకఅనంత అంచు కొలను (వ్యతిరేక అంచు లేదా మాయమైన అంచు కొలను అనే పేర్లు కూడా ఉన్నాయి) నీటిని దిగంతం వరకు, అదృశ్యమైనట్లు లేదా నీరు దిగంతం వరకు పారుతూ ఉండునట్లు ఒక దృశ్యమును సృష్టిస్తుంది. ఎక్కువగా, నీరు ఒక సముద్రంలో, సరస్సులో, అఖాతంలో, లేదా ఇతర నీరు ఉండే ప్రదేశాలలోపలికి పడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. దిగంతం మీద నీరు ఉండే ప్రదేశం ఒక పరిమిత కారకం కాకపోయినప్పటికీ, ఎత్తులో ఎప్పుడైనా గుర్తించదగిన తేడా వచ్చినప్పుడు ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది.[ఉల్లేఖన అవసరం]

సహజ కొలనులు మరియు గుంటలు[మార్చు]

ఈ జర్మన్ ఈత సరస్సు NSPలు ఈ విధంగా పరిసరాలలో భాగంగా ఏ విధంగా రూపొందించబడతాయో చూపెడుతుంది.

సహజ కొలనులను మధ్య మరియు పశ్చిమ ఐరోపాలో 1980 శతాబ్దపు మధ్యలో మరియు మొదటిలో రూపశిల్పులు మరియు ప్రకృతి దృశ్య రూపశిల్పులు పర్యావరణం మీద తాపత్రయంతో రూపొందించారు. ఇవి ఇటీవలి కాలంలో సాంప్రదాయ ఈత కొలనులకు ప్రత్యామ్నయంగా ప్రజాదరణ పొందాయి.[21] NSPలు రసాయనాలు లేదా క్రిమిసంహారిణులు లేదా నీటి పారిశుధ్యం చేసే యంత్రాలను వాడకుండా నిర్మించిన నీటి ప్రదేశాలు, మొత్తం కొలనును శుభ్ర పరచుటకు నీటిని జీవసంబంధ వడపోత మరియు నీటిలో పెరిగే మొక్కల నాటిన వ్యవస్థలో కొలను నీటిని పారునట్లు చేసి ఆ నీటిని శుభ్రపరచుతారు. సారాంశం ఏమనగా, కాలుష్య రహిత, ఆరోగ్యమైన, మరియు పర్యావరణ సమతౌల్యత కలిగిన నీటిలో సరక్షితంగా ఈత కొట్టుటను ప్రజలు అనుభవించునట్లు NSPలు ఈత బొరియలు మరియు ఈత మడుగులను పునఃసృష్టించాయి.

NSPలలో ఉండే నీరు 100% రసాయన రహితమైనది, మరియు అనేక ఆరోగ్యకర లక్షణాలు కలిగినది. ఉదాహరణకు, ఎరుపుబారిన కళ్ళు, ఎండిపోయిన చర్మము మరియు జుట్టు, మరియు అతిగా క్లోరిన్ కలిపిన బ్లీచింగ్ స్నానపు గదులు సహజంగా NSPలలో ఉండవు. NSPలకు వాటి వ్యవస్థలో భాగంగా ఒక జల ఉద్యానవనం ఉండాలి, మరియు ఇవి జలగలు, కప్పలు, మరియు చిన్న బల్లివంటి జలచరం వంటి జలచరాల జీవనముకు అనుకూలంగా ఉంటాయి.

శూన్య-ప్రవేశ ఈత కొలనులు[మార్చు]

ఒక శూన్య-ప్రవేశ ఈత కొలను ను, సముద్ర తీర ప్రవేశ ఈత కొలను అని కూడా పిలుస్తారు, ఈ విధమైన ఈతకొలనుల చివర లేదా ప్రవేశం ఇంచుమించుగా నీటి పైభాగం నుండి నీటిలోకి పల్లముగా ఉంటుంది, ఒక సహజ సముద్ర తీరము వలె ఒక్కొక్క మెట్టు దిగుతూ వెళితే లోతు పెరుగుతూ ఉంటుంది. దీనికి మెట్లు లేదా నిచ్చెనలు లోపలి దిగుటకు ఉండకపోవటం వలన ముసలివారు, చిన్న పిల్లలు మరియు వికలాంగులుగా ఉండే వారికి ఈ ప్రవేశం ఎక్కడ ప్రవేశానికి అనుకూలంగా ఉంటుందో ఆ మార్గాన్ని చూపెడుతుంది.

ఇతర ఉపయోగాలు[మార్చు]

ఒక వ్యోమగామి ఈత కొలను లోకి దిగే ప్రయత్నం

ఈత కొలనులను నీటి లోపల ఆడే హాకీ, వివిధ విన్యాసాలు చేస్తూ ఈత కొట్టుట, నీటి పోలో మరియు కానియో పోలో వంటి క్రీడలతో పాటు డైవింగ్ (పల్టీ కొట్టుట)ను మరియు జీవిత సంరక్షణ వంటి సూక్ష్మాలు బోధించుటకు కూడా ఉపయోగిస్తారు. ఇంకా వీటిని విమానయాన సిబ్బంది మరియు నావికా దళ సిబ్బందికి నీటి-కందకంలో చేసే ప్రత్యేకమైన విన్యాసాలను బోధించుటకు మరియు వ్యోమగామి శిక్షణకు కూడా ఉపయోగిస్తారు. న్యూడ్ బౌల్ వంటి గుండ్రని-మూలలు కలిగిన, అనియత ఆకారంలో ఉండే ఈత కొలనులలో, నీటిని వదిలివేసి శీర్ష స్కేట్ బోర్డింగ్ కొరకు ఉపయోగించారు.

పారిశుధ్యం[మార్చు]

అంటువ్యాధులు మరియు రోగ కారక సూక్ష్మక్రిములు ప్రబలకుండా ఈత కొలనులో నీటిలో తక్కువ స్థాయి బాక్టీరియా మరియు వైరస్లు ఉండునట్లు చూసుకోవాలి. ఒకవేళ నీటిని సరిగా శుద్ధపరచకపోతే బాక్టీరియా, నాచు మరియు సూక్ష్మక్రిములు డింబాలు కొలనులో వ్యాప్తి చెందుతాయి. గొట్టాలు, యంత్రపు వడపోత సాధనాలు, మరియు క్రిమిసంహారిణులను నీటిని వడపోయుటకు తరచూ ఉపయోగించాలి.

రసాయన క్రిమిసంహారిణులు అయిన, క్లోరిన్ మరియు బ్రోమిన్ వంటివి సాధారణంగా ఉపయోగించుట వలన అవి నీటిలో రోగ కారక క్రిముల వ్యాప్తిని నిరోధిస్తాయి. ఒకవేళ వీటిని సరియిన పద్ధతిలో వినియోగించక పోతే రసాయన పారిశుధ్యం ఎక్కువ స్థాయిలో క్రిమిసంహారక అనుబంధ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. పారిశుధ్యం జరిపిన ఈత కొలను నీరు సిద్ధాంతపరంగా ఒకవేళ దానిలో ఇనుము లేదా కొన్ని ప్రత్యేక ఖనిజ లవణాలు ఆ నీటిలో ఉంటే ఆ నీరు అకుపచ్చ రంగులో కనిపిస్తుంది.[22]

ఇది జలజీవనముకి స్వల్ప పరిమాణాలలో హానికరమైన లోహాల మీద ఆధారపడినప్పటికీ ( (O3)), విద్యుత్ ఆక్సీకరణ నీటి పారిశుధ్యత అనేది క్లోరినేషన్ కు మరియు ఓజోన్ కు ప్రత్యామ్నాయం కాదు. ఆక్సిజన్ కొలనులు నీటి అణువుల విద్యుత్ ఆక్సీకరణ ద్వారా వాటికవే సహజ ఆక్సిడైజర్లు హైడ్రాక్సిల్ (HO), అటామిక్ ఆక్సిజన్ (O), హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2) మరియు మాలిక్యులర్ ఆక్సిజన్ (O2)ను ఉత్పత్తి చేస్తాయి. వీటి అన్నిటికి క్లోరిన్ కన్నా ఎక్కువ ఆక్సిడేషన్ రిడక్షన్ పోటన్షియల్ (ORP) విలువ ఉంటుంది. విద్యుత్ ఆక్సీకరణ లవణం, క్లోరిన్, లేదా UV ఒక గంటలో ఉత్పత్తి చేసే ఆక్సిడైజర్లను 1 నిమిషంలోనే ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఆక్సీకరణ తక్కువ స్థాయిలో రాగి అయోనైజేషన్ (0.5 PPM)తో సంయోగపరచుతారు, ఇది క్లోరిన్ లేకుండా ప్రభావవంతమైన పారిశుధ్యాన్ని ఇస్తుంది. శతకోటిలో కొంత భాగము ఉన్న కూడా రాగి జలజీవనముకు హానికరము.[23]

పైకప్పులు[మార్చు]

ఈత కొలను వేడిచేయుటకు అయ్యే వెలను కొలను పైకప్పులను ఉపయోగించుట ద్వారా గణనీయంగా తగ్గించవచ్చు. ఒక కొలను పైకప్పులను ఉపయోగించుట ఆ కొలనుకు సరిపడా వాడే రసాయనాల (క్లోరిన్ మొదలైనవి) పరిమాణము తగ్గుటకు కూడా సహాయ పడుతుంది. బహిరంగ కొలనులు వేడిని సూర్యుడి నుండి గ్రహిస్తాయి, కొలను ఉపరితలం మీద పడే 75%–85% సూర్య రశ్మిని గ్రహించుకుంటాయి. ఒక పైకప్పు కొలను గ్రహించుకోగలిగిన సూర్య రశ్మి యొక్క మొత్తంలో కొంత భాగాన్ని అడ్డుకోగలిగినప్పటికీ, ఆ పైకప్పు ఆవిరి అయిపోవుట ద్వారా తగ్గిపోయే ఉష్ణాన్ని పరిహరించి మరియు రాత్రి వేళలో దాని యొక్క ఉష్ణ అపరీవాహక లక్షణాల ద్వారా ఉష్ణ నష్టం జరగకుండా ఆపుతుంది. ఈత కొలనుకు ఎక్కువగా ఉష్ణ నష్టం ఆవిరి వలన జరుగుతుంది.[24]

ఉష్ణాన్ని గ్రహించే సామర్ధ్యం ఆ పైకప్పు తయారు చేసిన ముడి సరకు మీద ఆధారపడి ఉంటుంది. ఒక పారదర్శకమైన బుడగల వంటి పైకప్పు దాని ద్వారా ఎక్కువ మొత్తంలో సూర్య కిరణాలను ప్రసరించుట ద్వారా మంచి ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఉష్ణ పరివాహ బుడగ మూతలు తేలికగా UV స్థిరత్వంతో తేలియాడే మూతలు నీటిని వేడి చేసే ఈత కొలనులలో ఉష్ణ నష్టం తక్కువగా జరిగే విధంగా రూపొందిస్తారు. ముఖ్యంగా అవి కొలనులో ఉష్ణోగ్రత మరియు గాలిలో ఉష్ణోగ్రతల మధ్య తేడా ఎక్కువగా ఉండే వసంత రుతువు మరియు శరదృతువులో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి కొలను మీద ఒక వారం ఉండిన తరువాత కొలను యొక్క ఉష్ణోగ్రతను దాదాపు 20 °ఫారెన్ హీట్, లేదా 11 °సెల్సియస్ వరకు పెంచుతాయి. బుడగల పైకప్పులు కొలనుకు ఒక వైపు బిగించి ఉంచిన ఒక సాధనముకు చుట్టి ఉంచి పరచుతూ మరియు తెరచుతూ ఉంటారు (చిత్రం చూడండి). పైకప్పులు 4 లేదా 5 సంవత్సరాల తరువాత ఎండ ధాటికి, ఎండలో కొలను వేడెక్కే సమయంలో, మరియు ప్లాస్టిక్ మీద క్లోరిన్ దాడికి పనికి రాకుండా పోతాయి. బుడగల పైకప్పులను అధిక క్లోరిన్ ఉపయోగించే సమయంలో తొలగించాలి.

ఒక వినైల్ పైకప్పు ఉష్ణోగ్రతను త్వరితంగా పెంచుతూ తిన్నగా ఎక్కువ సూర్య రశ్మిని గ్రహిస్తుంది, కాని ఒక స్పుటమైన పైకప్పు వలె కొలను గరిష్ఠ ఉష్ణోగ్రతను చేరకుండా నిరోధిస్తుంది.[25] వినైల్ పైకప్పులు భారమైన సరకుతో తయారై బుడగల పైకప్పుల కన్నా ఎక్కువ కాలం మన్నుతాయి. వినైల్ కి రెండు వైపులా మూసి ఉంచుతున్న రెండు మందపాటి పొరల మధ్య ఉంచి తయారు చేసిన ప్రత్యేక వినైల్ పైకప్పులు అందుబాటులో ఉన్నాయి.[25] ఈ పైకప్పులను 2006 నుండి ఆస్ట్రేలియాలో వర్షాభావాన్ని ఎదుర్కొంటున్న అన్ని ప్రదేశాలలో తప్పనిసరిగా బిగించవలసి వస్తుంది. ఎక్కువ నీరు ఇంకిపోవునపుడు మరియు కలుషితాలు అవిరైపోవునపుడు ఇది నీటిని ఆదా చేసే ఒక ప్రయత్నం.

నిత్యం కొలనును మూసి ఉంచుటకు ఒక ప్రత్యామ్నాయం తేలియాడే అనేక బిళ్ళలు, వీటిని ఒకటి ఒకటిగా నీటిపైన ఉంచాలి మరియు తొలగించాలి. ఇవి కొలను ఉపరితలమును వీలైనంత కప్పి ఉంచి ఎల్లప్పుడూ ఉండే పైకప్పుల వలె నీరు ఆవిరి అవుటను తగ్గిస్తుంది. వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి, ఉదాహరణకు ఒపేక్ (UV నిరోధం మరియు నాచు పెరుగుదలను వీలైనంత తగ్గిస్తుంది), పారదర్శకమైనది (అలంకార ప్రాయంగా ఉండుట కొరకు), భారమైనది మరియు ఘనమైనది (గాలిని నిరోధించుట కొరకు), తేలికైనది మరియు గాలితో నింపినది (సులువుగా ఉపయోగించుకొనుటకు).

రక్షిత పైకప్పులు

ఈ పైకప్పులను శీతాకాలం మొత్తం కప్పి ఉంచుతారు, బంగీ తీగలతో లేదా స్ప్రింగు కొక్కేములతో కొలను పై భాగానికి తగిలించి ఉంచుతారు, మరియు వీటిని సాధారణంగా వివిధ రకాల సరకులతో వినైల్ పూతతో లేదా పూర్తిగా వినైల్ తో అంటించి వేసి లేదా పాలీప్రోపిలీన్ జల్లెడతో తయారు చేస్తారు. ఇవి కొలనులో పడే ఆకులను ఇతర శిథిలాలను తొలగించు విధానంలో తయారు చేయబడినవి కాని మరీ ముఖ్యంగా వీటిని సరిగా రూపొందించి అమర్చితే ఇవి జంతువులకు మరియు చిన్నపిల్లలకు రక్షణ కల్పిస్తాయి. ఈ విధానపు పైకప్పులను 1957లో మీకో పూల్ కవర్స్ యొక్క ఫ్రెడ్ మెయెర్ Jr. అతని కొలనులో ఒక చనిపోయిన జంతువుని చూసినప్పుడు కనుగొన్నారు. ఈ రోజు పైకప్పులు ASTM రక్షిత సరిహద్దుల నియమాలను అనుసరిస్తూ జంతువులను, ప్రజలను మరియు భారీ వాహనాలను కూడా కొలను బయట ఉంచే విధంగా తయారు అవుతున్నాయి. వెచ్చగా ఉండే వాతావరణంలో వీటికి ప్రాచుర్యం లేదు, ఎందువలన అనగా వీటిని బిగించుటకు/తొలగించుటకు ఐదు పది నిమిషాల సమయం తీసుకుంటాయి, అదే పనిగా తొలగించుటకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

యాంత్రికంగా కొలనుని కప్పుట[మార్చు]

ఆటోమాటిక్ కొలను పైకప్పు

ఒక కొలను పైకప్పును చేతితో లేదా పాక్షిక-యాంత్రికంగా లేదా యాంత్రికంగా ఉపయోగించవచ్చు. చేతితో ఉపయోగించు పైకప్పులను ఒక ప్రదేశంలో మడత పెట్టి భద్రపరచుకొనుటకు సౌకర్యంగా ఉంటుంది. కొలను పైకప్పు చట్రాలు కొలను పైకాపులను చేతితో చుట్టి పెట్టుటకు కూడా సహాయ పడతాయి. చట్రాలు, సాధారణంగా చక్రాల మీద ఉంటాయి, వీటిని ఆ ప్రదేశం లోపల కాని లేదా వెలుపల కాని చుట్టుకోవచ్చు.

పాక్షిక-ఆటోమాటిక్ పైకప్పులు మోటార్ తో నడిచే చట్రాల వ్యవస్థను ఉపయోగించుకుంటాయి. పైకప్పును చుట్టుటకు మరియు పరచుటకు ఇవి విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటాయి, కాని సాధారణంగా పైకప్పును పరచునప్పుడు ఒక మనిషి దానిని లాగుతూ ఉండాలి, లేదా పైకప్పుని చుట్టునపుడు అది చుట్ట మీదకు వచ్చునట్లు సర్దుతూ ఉండాలి. పాక్షిక-ఆటోమాటిక్ పైకప్పులను కొలను చుట్టు ఉండే కొలను పైభాగం లోపల నిర్మించవచ్చు, లేదా చట్రాలను బండ్లు మీద ఉపయోగించుకోవచ్చు.

ఆటోమాటిక్ పైకప్పుకు శాశ్వతంగా ఏర్పరిచిన చట్రాలు ఉంటాయి ఇవి ఒక మీటను నొక్కిన మీదట అవే పైకప్పును పరచుట మరియు తొలగించుట చేస్తాయి. ఇవి చాలా ఖరీదుతో కూడుకున్నవి, కాని సౌకర్యమైనవి. ఈ చట్రాలు కొలనుకి ఇరువైపులా త్రవ్విన గుంటలను ఉపయోగించుకుని పనిచేసే ఒక బాహ్య మోటారుతో లేదా చట్రాలను తిప్పే ఒక అంతర్గత మోటార్ సహాయంతో పనిచేస్తాయి.

కొన్ని కొలను పైకప్పులు కొలను అన్ని వైపులా ఉన్న మార్గాలలో బిగించి ఉంటాయి. ఇది ఎవరైనా కొలను లోపలకి ప్రవేశించుటను నిరోధిస్తుంది. ఇవి ఇంకా అనేక మంది బరువుని అపుతాయి. వీటిని చేతితో, పాక్షిక-యాంత్రికంగా, లేదా యాంత్రికంగా నడపవచ్చు. రక్షిత పైకప్పులు బహిరంగ కొలనులలో తనిఖీదారులకు అవసరం కావచ్చు.[25]

శీతాకాలానికి సన్నద్ధం అవుట[మార్చు]

నీరు గడ్డ కట్టిపోయే ఉష్ణోగ్రతలు సమీపించే ప్రదేశాలలో, కొలనును జాగ్రత్తగా మూసి ఉంచుట ముఖ్యం. ఈ విషయంలో భూమి లోపల మరియు భూమి ఉపరితలం మీద ఉండే కొలనులకి మధ్య చాలా తేడా ఉంటుంది. కొలనుని సంరక్షించుకొనుటకు సరైన నిభందనలు పాటించుట ద్వారా, కొలనుని గడ్డ కట్టే నీటి ద్వారా కొలను పరిమాణముకు సంభవించే హానిని ఎదుర్కొనవచ్చు.[26]

వినైల్ మరియు ఫైబర్ గ్లాస్ తో మూసి ఉంచిన కొలనులు[మార్చు]

చుట్టి వేయబడే ఒక ఉదక బుడగల కొలను పైకప్పు, నీరు ఆవిరి అయిపోకుండా మరియు కొలను యొక్క ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండునట్లు ఉపయోగపడుతుంది.

గడ్డ కట్టుకుపోయే ఉష్ణోగ్రతలకు సిద్ధంగా ఉండుటకు, భూమి లోపల నిర్మంచిన ఈత కొలనుల యొక్క గొట్టాలను ఖాళీగా ఉంచాలి. భూమి ఉపరితలం మీద ఉండే కొలనులు కూడా మూసి ఉంచాలి, దీనివలన మంచు గడ్డ కొలను యొక్క గోడను క్రిందికి గుంజి కొలను రూపం చెడకుండా ఉంటుంది. సీసపు గొట్టాలను గాలితో ఉంచి అతికించి వేయాలి, గడ్డ కట్టిన నీటి వలన గొట్టాలకు పగుళ్ళు రాకుండా ముఖ్యంగా రబ్బరు బిరడాలతో బిగించివేయాలి. కొలనుని ఆకులు ఇతర శిథిలాల వంటివి దానిలో పడకుండా నిరోధించుటకు మూసి ఉంచాలి. పైకప్పు కొలనుకు ఒక సాగే తీగ సహాయముతో కలిపి ఉంటుంది, ఈ తీగ బంగీ తీగ వలె మరియు కొక్కెములు కొలను చుట్టూ లోపల అమర్చి ఉంటారు. వడపోత జల్లెడతో మూసి ఉంచుతారు లేదా దాని లోపల ఒక తేలే వస్తువుని పూర్తిగా గడ్డ కట్టనీయకుండ మరియు పగుళ్ళు రాకుండా ఉంచుతారు. పైకప్పు క్రింద నీరు గడ్డ కట్టకుండా కొలనులో రక్షణ వలయములు లేదా బాస్కెట్ బంతులు వంటి తేలే వస్తువులను ఉంచవచ్చు. వడపోత జల్లెడను శుభ్రపరచిన తరువాత కొలను వడపోత జల్లెడ మీద ఉండే పారే నీటిని నిరోధించే మూతలను వడపోత జల్లెడను శుభ్రపరచిన తరువాత తెరచి ఉంచుతారు. కొలను పుంపు మోటరును మూత క్రింద నుండి తీసుకుంటారు. కొలనుని శుభ్రంగా ఉంచుటకు శీతాకాలపు రసాయనాలు వేస్తారు.

నీరు గడ్డ కట్టే ప్రమాదం లేని వాతావరణ పరిస్థితులలో కొలనుని శీతాకాలములో పైకప్పు వేసి ఉంచాల్సిన అవసరం అంతగా ఉండదు. ముఖ్యంగా, ఉష్ణపు మూతను తొలగించి భద్రపరచుకోవచ్చు. శీతాకాలం అంతా ఉంచి పైకప్పును తొలగిస్తే శీతకాలపు సూర్యకిరణాల వలన చిందర వందరగా నాచు ఏర్పడుతుంది. కొలను సరి అయిన pH-సమతూకమును పాటించి మరియు అదనపు-క్లోరిన్ ఉపయోగించి ఉండాలి. ఒక లీటరు నాచుసంహారిణిని ప్రతి 50,000 లీటర్ల కొలను నీటిలో కలపాలి, మరియు దీనిని ప్రతి నెల ఈ విధంగా వేస్తూ ఉండాలి. కొలనును ప్రతిరోజు ఒకటి రెండు గంటలకి ఒకసారి వడపోత చేస్తూ ఉండాలి, దీనివలన ఆటోమాటిక్ క్లోరిన్ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది.

భద్రత[మార్చు]

శిక్షకులు పిల్లలకు ఎలా ఈదాలో బోధిస్తారు

కొలనులలో చిన్నపిల్లలకు మరియు పసిపిల్లలకు మునిగిపోవుట వలన మరణం సంభవించగలిగిన ప్రమాదం ఉంది. గృహములలో కొలనులు ఉండే ప్రదేశాలలో, చిన్న పిల్లల మరణాలకు మునక అతి ముఖ్య కారణం. ముందస్తు జాగ్రత్తగా, చాలా మున్సిపాలిటీలు న్యాయ పరంగా గృహములలో ఉండే కొలనులను అనవసరంగా ప్రవేశించకుండా చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలి అనే నియమాలను అమలు చేస్తున్నాయి. వర్జీనియా గ్రేమీ బేకర్ పూల్ అండ్ స్పా సేఫ్టీ యాక్ట్ పొంచి ఉన్న ప్రమాదాల తగ్గించుటను క్రమపచుతుంది.

చాలా ఉత్పత్తులు ఉన్నాయి, ఎలాంటివి అంటే తొలిగించుటకు వీలుగా ఉండే చిన్న పిల్లల కంచెలు, తేలియాడే అలారములు, మరియు కిటికీ/తలుపు అలారములు వంటివి. కొన్ని కొలనులకు మునకలను నిరోధించుటకు కంప్యూటర్ అనుసంధానపు ఏర్పాట్లు లేదా ఇతర విద్యుత్ పరికరాలు మరియు రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అంతర్గత ఈత కొలనులలో భవన పైకప్పుకు క్రింద ఇంకొక పొరగా ఏర్పాటు చేసే పైకప్పులు రక్షణ-సంబంధిత అంశాలు.[27]

అసంఖ్యాక శాస్త్రీయ అధ్యయనాలు ప్రతి రోజు ఈతకు వెళ్ళే వారిలో మరియు అంతర్గత ఈత కొలనులలో మరియు చుట్టూ ఉండే ప్రదేశాలలో పని చేసే వారిలో శ్వాసకోశ వ్యాధులు పెంపొందుతున్నాయి అని చెబుతున్నాయి. చిన్న పిల్లల మీద చేసిన వేరొక అధ్యయనం ఎవరైతే అంతర్గత ఈత కొలనులలో 1.8 గంటలు లేదా ఒక వారం కన్నా ఎక్కువ ఈత కొట్టిన పిల్లలో ఊపిరితిత్తుల స్థితి అతిగా పొగ తాగే వారి స్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని పేర్కొంది. ఈత కొలనుల నుండి వ్యాప్తి చెందుతున్న క్లోరిన్ వలన మూత్రాశయం మరియు మూత్ర పిండాల కాన్సర్ వ్యాప్తి చెందే ప్రమాదం సుమారు 56% ఎక్కువగా ఉంటుంది మరియు 2000 సంవత్సరంలో సిడ్నీ, ఆస్ట్రేలియాలో జరిగిన ఒలింపిక్స్ లో U.S. ఒలింపిక్ ఈత జట్టులో 25% మంది ఒక స్థాయి శ్వాస కోశ ఇబ్బందులతో సతమతమయ్యారు అని కూడా పేర్కొన్నారు.[28]

వస్త్రధారణ నిబంధన[మార్చు]

బహిరంగ ఈత కొలనులలో వస్త్రధారణ నిబంధన బహిరంగ సముద్ర తీరములలో కన్నా కచ్చితంగా ఉండవచ్చు, మరియు బహిరంగ కొలనులలో కన్నా అంతర్గత కొలనులో నిబంధనలు కచ్చితంగా ఉంటాయి. ఉదాహరణకు, కొన్ని దేశాలలో సముద్ర తీరాలలో స్త్రీలు పై ఆచ్చాధన ధరించకుండా తిరిగే వీలు ఉన్నా ఈత కొలనులలో ఆవిధంగా ఉండటానికి అనుమతించారు, మరియు ఈత దుస్తులను తప్పని సరిగా ధరించాల్సి ఉంటుంది. పురుషుల కొరకు, బూట్లను ధరించుటని, మరియు ఒక చొక్కాని ధరించుట సముద్ర తీరాలలో ఒప్పుకుంటారు, కాని ఎక్కువగా కొలనులో అంగీకరించారు.[ఉల్లేఖన అవసరం]

సముద్ర తీరాలలో చాలా మంది దుస్తులతోనే ఈదుతారు మరియు సముద్రతీర దుస్తులను కూడా ధరిస్తారు, కాని కొలనులలో (ప్రత్యేకంగా అంతర్గత కొలనులలో) ఎక్కువగా కనీస దుస్తులను ధరిస్తారు, అవి ఇలాంటివి అంటే పురుషులు లైక్రా లోచెడ్డీలు లేదా లేదా స్త్రీల కొరకు లైక్రా ఒకే ముక్క ఈత దుస్తులు ఉంటాయి. కొలనులలో దుస్తులతో ఈత కొట్టటాన్ని జీవన సంరక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు, ముఖ్యంగా అంతర్గత కొలనులలో. ఫ్రాన్సు మరియు కొన్ని ఇతర ఐరోపా దేశాలలో బోర్డ్ షార్ట్ (మగవారి ధరించే చిన్న చెడ్డీలు)లను కూడా శుభ్రత దృష్ట్యా అనుమతించరు. స్కాండినేవియా దేశాలలో మరియు కొన్ని ప్రత్యేక ద్వీపాలలో, వస్త్రధారణ మరియు శుభ్రత గురించి చాలా కచ్చితమైన నియమాలు ఉంటాయి.[29] స్నానపు దుస్తులు కొన్ని సార్లు రెండు పొరలుగా ధరిస్తారు (ఒక చెడ్డి లోపల ఇంకొకటి ధరిస్తారు), ఎత్తు ఉన్న బల్ల మీద నుండి డైవింగ్ (పల్టీ) చేసే సమయంలో నీటి తాకిడికి చిరగకుండా ఉంటాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • యాంత్రిక కొలను పరిశుద్ధ కారకం
 • బాతర్ లోడ్ (ఈత కొలనులో 24 గంటలలో ఈత కొట్టే వారి సంఖ్య)
 • బీచ్‌లు
 • డిబిల్ డాబిల్
 • లిడో
 • కొలను కంచె
 • ఈత కొలను క్రీడలు
 • మూత్రం-గుర్తించు రంగు

సూచనలు[మార్చు]

 1. పద శబ్ద సంగ్రహము
 2. "Great Bath, Mohenjo-daro". Cite web requires |website= (help)
 3. "Gaius Maecenas, or Gaius Cilnius Maecenas (Roman diplomat and patron)". Britannica Online Encyclopedia. Cite web requires |website= (help)
 4. "Virtual Library: Anuradhapura". Cite web requires |website= (help)
 5. "లిడోస్: అనుసంధానాలు మరియు ఉప ప్రమాణాలు". మూలం నుండి 2015-02-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-03. Cite web requires |website= (help)
 6. "బ్రిటిషు ఈత & ఔత్సాహిక ఈత సంఘం : ASA చరిత్ర". మూలం నుండి 2010-01-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-03. Cite web requires |website= (help)
 7. [175] ^ "హిస్టరీ."
 8. TGOL - అడ్రియాటిక్
 9. కెనడా యొక్క చారిత్రక ప్రదేశాల నమోదు - ఈత కొలను భవనం
 10. "World's Largest Swimming Pool". Guinness World Records. Retrieved 2008-01-24. Cite web requires |website= (help)
 11. Edmonton.com: ప్రయాణము, విహారము & విరామము Archived 2007-03-01 at the Wayback Machine. ప్రవేశించినది 15 ఏప్రిల్ 2007
 12. NASA, చిత్రముల వెనుక: శిక్షణ, ప్రవేశము 7 మే 2007
 13. BBC, ప్రపంచం యొక్క లోతైన కొలను తెరచి ఉంచినది ప్రవేశము 15 ఏప్రిల్ 2007
 14. "San Francisco Zoological Society - About the Zoo - Historic Sites". The San Francisco Zoo. మూలం నుండి 2010-12-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-03-10. Cite web requires |website= (help)
 15. "DESTRUCTION (1931-1990)". మూలం నుండి 2015-04-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-03. Cite web requires |website= (help)
 16. భూమి ఉపరి తలం కొలనుల యొక్క మూలాలు
 17. కొలను రక్షణ సమాచారము
 18. "FINA Facilities Rules 2009-2013". Federation Internationale de la Natation. Retrieved 2009-11-09. Cite web requires |website= (help)
 19. "జేసిగేర్ కొలను రూపకల్పన", జేసిగేర్ క్రీడలు మరియు దారుడ్య కేంద్రం, MIT, ప్రవేశము 2007-02-04
 20. "యంబ మహాసముద్రపు కొలను నుండి కథలు", ఆష్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్, [] ప్రవేశము 2006-12-28
 21. Kurutz, Steven (April 5, 2007). "From Europe, a No-Chlorine Backyard Pool". The New York Times. Retrieved May 22, 2009. Cite news requires |newspaper= (help)
 22. సహత్చాయ్ వానవోంగ్ సవాద్ చేత ఈత కొలనులో నీటి యొక్క వర్ణముల సిద్ధాంతము
 23. ECOTOX సమాచార పట్టిక
 24. శక్తి విభాగము: శక్తిని నిల్వ చేయుట మరియు మీ ఈత కొలనుని సౌర శక్తితో వేడి చేయుట (PDF)
 25. 25.0 25.1 25.2 "EERE Consumer's Guide: Swimming Pool Covers". Office of Energy Efficiency and Renewable Energy. Retrieved 2007-10-20. Cite web requires |website= (help)
 26. ఒక ఈత కొలనుని శీతాకాలానికి సన్నద్ధం అగుట మీద సమాచారం
 27. M. ఫల్లెర్ మరియు P. రిచ్నేర్: అంతర్గత ఈత కొలనులలో రక్షణ-సంబంధిత విషయ ఎంపిక , విషయ సంపుటిలు మరియు Corrosion 54 (2003) S. 331 - 338.(only online in German (3.6 MB)) (ఆంగ్ల వర్షన్ యొక్క ఒక ప్రతిని అడగండి)
 28. క్లోరిన్ ఉపయోగించిన ఈత కొలనులు ఈతగాళ్ళకు శ్వాసకోశ వ్యాధిని కలిగించవచ్చు.
 29. Reykjavík చూడండి - Reykjavik యొక్క అధికారిక విహార వెబ్ సైట్ Archived 2008-03-24 at the National and University Library of Iceland, ప్రవేశము 24 డిసెంబర్ 2009

బాహ్య లింకులు[మార్చు]

మూస:Room

"https://te.wikipedia.org/w/index.php?title=ఈత_కొలను&oldid=2815047" నుండి వెలికితీశారు