ఈము పక్షుల అవయవ లక్షణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈము పక్షి

ఈము పక్షికి, పొడుగు మెడ, చిన్న నున్నని తల, మూడు వేళ్ళు , శరీరంమంతా నిండి ఉన్న ఈకలతో ఉంటుంది. తొలిదశలో (0 – 3 నెలల వయసు వరకూ), పక్షుల శరీరం మీద పోడవైన చారలు ఉండి, క్రమంగా అవి 4 – 12 మాసాల వయసు వచ్చేసరికి దోధుమ రంగు తదలగకగ మారతాయి. బాగా ఎదిగిన పక్షులు, నున్నని నీలం రంగు మెడ, శరీరమంతటా రంగు రంగుల చుక్కలున్న ఈకలు కలిగి ఉంటాయి. పూర్తిగా ఎదిగిన పక్షి, సుమారు 6 అడుగుల ఎత్తు, 45 - 60 కేజీల బరువు కలిగి ఉంటుంది. కాళ్ళ పొడవుగా ఉండి, పోలుసులు గల చర్మంతో కప్పబడి ఉండటం వలన, ఎటువంటి గట్టిదైన, ఎండిపోయిన భూములపైన కూడా అవి తట్టుకోగలవు. ఈము పక్షి యొక్క సహజమైన ఆహారం - పురుగుతహ, మొక్కల లేత ఆకులు , దానిమేత ఇది వివిధ రకాలైన కూరగాయలు, పళ్ళు, కేరట్లు, దోసకాయ, బొప్పాయి మొదలైన వాటిని తింటుంది. ఆడ, మగ పక్షులలో, ఆడపక్షి మగపక్షి కంటే పెద్దది. సంతానోత్పత్తి సమయంతద మగపక్షి చురుగ్గా ఉన్నాకూడ, ఆడ పక్షి, జంటలో ఎక్కువ అధికారికంగా ఉంటుంది. ఈము పక్షులు 30 సంవత్సరాల వయసు వరకూ బ్రతుకుతాయి. 16 సంవత్సరాల కంటే ఎక్కువగానే అవి, గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ పక్షులను గుంపుగా గాని, జంటగా గాని పెంచవచ్చు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]