ఈరోడ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈరోడ్ జిల్లా
ஈரோடு மாவட்டம்
Irotu district
District
Confluence of the Bhavani and Kaveri Rivers
Confluence of the Bhavani and Kaveri Rivers
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Countryభారత దేశము
రాష్ట్రంతమిళనాడు
ప్రాంతంWestern Tamil Nadu (Kongu Nadu)
ప్రధాన కార్యాలయంErode
Revenue DivisionErode, Gobichettipalayam
Government
 • CollectorV K Shanmugam IAS
విస్తీర్ణం
 • Total2,198 చ. మై (5,692 కి.మీ2)
జనాభా
 (2011)[1]
 • Total22,59,608
 • జనసాంద్రత1,030/చ. మై. (397/కి.మీ2)
భాషలు
 • అధికారTamil
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
638***
టెలిఫోన్ కోడ్0424 (Erode)
04285 (Gobichettipalayam)
04256 (Bhavani)
04295 (Sathyamangalam)
ISO 3166 codeISO 3166-2:IN
Vehicle registrationTN 33 (Erode East)
TN 36 (Gobichettipalayam)
TN 56 (Perundurai)
TN 86 (Erode West) [2]
Largest cityErode
లింగ నిష్పత్తిM-51%/F-49% /
అక్షరాస్యత72.96%
Lok Sabha seats3
Vidhan Sabha seats8
Central location:11°15′N 77°19′E / 11.250°N 77.317°E / 11.250; 77.317
Precipitation700 మిల్లీమీటర్లు (28 అం.)
Avg. summer temperature35 °C (95 °F)
Avg. winter temperature18 °C (64 °F)

ఈరోడ్ జిల్లా, ఒకప్పుడు " పెరియార్ జిల్లా " గా ఉండేది. ఈ జిల్లా భారతీయ రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు రాష్ట్రం కొంగునాడు పడమటి భూభాగంగా ఉండేది. జిల్లా ప్రధాన పరిపాలా కేంద్రం ఈరోడ్. జిల్లా " ఈరోడ్ విభాగం " , " గోబిచెట్టి పాలెం విభాగం " అనే రెండు విభాగాలుగా పనిచేస్తుంది. ఒకప్పుడు పెరియార్ జిల్లా కోయంబత్తూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది. 1979 సెప్టెంబరు 17న పెరియార్ జిల్లాగా అవతరించింది. 1986న పెరియార్ జిల్లా పేరు ఈరోడ్ జిల్లాగా మార్చారు. గణిత మేధావి రామానుజం , పెరియార్ అని పిలువబడిన ఇ.వి రామస్వామి ఈరోడ్ జిల్లాకు చెందినవారే.

భౌగోళికం

[మార్చు]

ఈరోడ్ నగరం ఉత్తర సరిహద్దులలో కర్నాటక రాష్ట్ర జిల్లాలలో ఒకటి అయిన చామరాజనగర్ జిల్లా, తూర్పు సరిహద్దులో కావేరీ నది నది దాటగానే సేలం, నమక్కల్ , కరూర్ జిల్లాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులలో తిరుపూర్ జిల్లా , పడమర సరిహద్దులో కోయంబత్తూరు , నీలగిరి జిల్లాలు ఉన్నాయి. భూ అంతర్ఘతంగా ఉపస్థితమై ఉన్న ఈరోడ్ జిల్లా 10 36”, 11 58” ఉత్తర రేఖాశం, 76 49” తూర్పు 77 58 అక్షాంశాల వద్ద ఉంది. జిల్లా మధ్యభాగంలో విస్తరించి ఉన్న పడమర కనుమల కారణంగా జిల్లాలో కొండలు గుట్టలు అధికంగా ఉన్నాయి. నగరానికి ఆగ్నేయ భూభాగం కావేరీ నది వైపు సాగుతున్న ఏటవాలు మైదానాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో కావేరీ నది ఉపనదులైన భవానీ, నొయ్యల్, అమరావతి ప్రవహిస్తున్నాయి. నగరానికి ఉత్తరదిశలో ప్రవహిస్తున్న పాలారు నది నరానికి కర్నాటక రాష్ట్రానికి మధ్యప్రవహిస్తుంది. భావానీసాగర్ ఆనకట్ట, కొడివెరి ఆనకట్ట ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఈ ఆనకట్టలద్వారా లభ్యమౌతున్న నీటితో పంటకాలువల ద్వారా వ్యవసాయ భూములకు నీరు సరఫరా ఔతుంది. అంతే కాక నదీతీరాలలో ఉన్న సారవంతమైన భూమి జిల్లాను సస్యశ్యామలం చేస్తుంది.

గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19016,29,892—    
19116,67,968+0.59%
19217,25,434+0.83%
19317,69,455+0.59%
19418,86,108+1.42%
195110,10,616+1.32%
196111,06,528+0.91%
197113,56,092+2.05%
198115,87,604+1.59%
199118,02,939+1.28%
200120,16,582+1.13%
201122,51,744+1.11%
ఆధారం: [3]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈరోడ్ జిల్లాలో 2,251,744 మంది జనాభా ఉన్నారు, ప్రతి 1,000 మంది పురుషులకు, స్త్రీల లింగ నిష్పత్తి 993 గా ఉంది. ఇది జాతీయ సగటు 929 కంటే ఎక్కువ.929.[4] జిల్లాలోని మొత్తం జనాభాలో ఆరేళ్లలోపు వారు 195,213 మంది ఉన్నారు.వారిలో 99,943 మంది పురుషులు కాగా, 95,270 మంది మహిళలు ఉన్నారు.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు వారు 16.41% మంది ఉండగా, 0.97% షెడ్యూల్డ్ తెగలు వారు ఉన్నారు.జిల్లా అక్షరాస్యత రేటు 66.29%, ఇది జాతీయ సగటు 72.99%.కంటే తక్కువ.[4] జిల్లాలో మొత్తం 658,071 గృహాలు ఉన్నాయి. 1,195,773 మంది కార్మికులు ఉన్నారు. వారిలో 173,376 మంది రైతులు, 331,414 మంది ప్రధాన వ్యవసాయకార్మికులు ,48,960 గృహ పరిశ్రమలకార్మికులు ,557,304 ఇతర కార్మికులు , 84,722 ఉపాంత కార్మికులు ,35,768 కార్మికులు ఉన్నారు.[5] 2011 లెక్కల ప్రకారం, జనాభాలో 81.76% మంది తమిళం, 10.32% తెలుగు, 5.40% కన్నడం, 1.14% ఉర్దూ వారి మొదటి భాషగా మాట్లాడతారు.[6]

ఈరోడ్ జిల్లా ప్రజలు మతాల వారిగా (2011)[7]
మతం శాతం
హిందూ
  
93.95%
ముస్లిం
  
3.38%
క్రిష్టయన్లు
  
2.48%
ఇతరులు
  
0.19%

2001 గణాంకాలను అనుసరించి జిల్లాలోని 46.25% నగరీకరణ చేయబడింది.[8] అలాగే జిల్లా అక్షరాస్యతా శాతం 72.96%. జిల్లాలో ఈరోడ్ నగరం మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానంలో గోపిచెట్టి పాళయం ఉంది.

ఆర్ధికం

[మార్చు]

ఈరోడ్ జిల్లా ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. జిల్లాలో పండిస్తున్న ప్రధానపంటలు వడ్లు, మొక్కల పెంపకం, వేరుశనగ, పత్తి, పసుపు, కొబ్బరి తోటలు, చెరుకు మొదలైనవి. తమిళనాడులో పండిస్తున్న పసుపు పంటలో 43% ఈరోడ్ జిల్లాలో పండించబడుతుంది. అందువలన ఈరోడ్ అతి పెద్ద పసుపు ఉత్పత్తి నగరంగా గుర్తించబడుతూ " పసుపు నగరం " అని అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచింది. భారతదేశంలో వంటలలో ఉపయోగించే సుగంధద్రవ్యాలలో ప్రధానమైంది. ఆచారవ్యవహారాలలో ప్రథమ స్థానం వహిస్తుంది. విశిష్టమైన ఔషధగుణాలు కలిగిన పసుపుకు ప్రధాన వాణిజ్యకేంద్రంగా ఈరోడ్ భాసిల్లుతుంది. పసుపును వస్త్రాలకు ఉపయోగించే వర్ణాలలో ఒకటిగా ఉపయోగిస్తారు.ఈరోడ్ నగరం తమిళనాడులో అరటి తోటలకు, కొబ్బరి తోటలకు, శ్వేతవర్ణ పట్టుకు, ప్రసిద్ధి. గోబిచెట్టిపాళయం కూడా అరటి తోటలకు, కొబ్బరి తోటలకు, పత్తి, పట్టుకు, ప్రసిద్ధి. దేశంలోని మొదటి పట్టు కండెల తయారీ పరిశ్రమ గోబిచెట్టిపాళయంలో స్థాపించబడింది. ఈరోడ్ చేనేత, పవర్‌లూం వస్త్రాల తయారీకి, రెడీమేడ్ దుస్తుల తయారీకి ప్రసిద్ధి చెందింది. భారతదేశ పవర్‌లూం నగరంగా ఈరోడ్ నగరానికి మరొక ప్రత్యేకత ఉంది. చేనేత చీరెలు, దుప్పట్లు, తివాసీలు, లుంగీలు, ప్రింటింగ్ వస్త్రాలు, తుండుగుడ్డలు, పంచలు మొదలైన వాణిజ్యానికి ఈరోడ్ ప్రముఖకేంద్రంగా భాసిల్లుతుంది. 2005లో భవానీ జంకానాను భారతదేశ గియోగ్రాఫికల్ చిహ్నంగా గుర్తించబడింది. చెన్నైమలై కూడా వస్త్రాలకు ప్రాముఖ్యత సంతరుంచుకుంది. పుజై, పులియంపట్టు లలో సండే మార్కెట్లు ప్రత్యేకత కలిగి ఉన్నాయి. 12.75 ఎకరాల ప్రదేశంలో నిర్వహించబడుతున్న ఆదివారం సంత ద్వారా పురపాలకానికి సంవత్సరానికి 23.75 లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ సంత తమిళనాడులో రెండవ స్థానంలో ఉంది. తమిళనాడులో పొగాకు ఉత్పత్తికి ఈరోడ్‌కు ప్రాముఖ్యత ఉంది. అందియూరు, మడిచూరు సండే సంతలు పశువుల వ్యాపారానికి ముఖ్యత్వం ఇస్తుంది.

ఆలయాలు

[మార్చు]
పరియూర్ కొండతు కాళీయమ్మన్ ఆలయం, గోపిచెట్టిపాలెం, ఈరోడ్ జిల్లా
  • పరియూర్‌లో ప్రసిద్ధిచెందిన శ్రీ పరియూర్ కొండదు కాళియమ్మన్ ఆలయం ఉంది.
  • పరియూర్‌లో శ్రీ అమరపనీశ్వరర్ ఆలయం కూడా నగరంలోని ముఖ్య ఆలయాలలో ఒకటి.
  • బన్నారిలో ఉన్న శ్రీ బన్నారి అమ్మన్ ఆలయం కూడా ముఖ్యఆలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

పరిసర పట్టణాలు

[మార్చు]

ఈరోడ్ ప్రధాన కేంద్రం నుండి 15 కి.మీ. దూరంలో భవాని, 35 కి.మీ దూరంలో గోబిచెట్టి పాలెయం, 20 కి.మీ. దూరంలో పెరుంగుడి, 65 కి.మీ. దూరంలో సత్యమంగళం, 30 కి.మీ. దూరంలో అందియార్ పట్టణాలు ఉన్నాయి.

రాజకీయాలు

[మార్చు]

ఈరోడ్ జిల్లా ఈరోడ్ పార్లమెంటరీ నియోజక వర్గం, నీలగిరి పార్లమెంటరీ నియోజక వర్గం, తిరుపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం అనే మూడు పార్లమెంటరీ విభాగాలుగా విభజించబడింది.అలాగే జిల్లా అందియూర్, భవాని, భవానీ సాగర్, తూర్పు ఈరోడ్, పడమర ఈరోడ్, గోబిచెట్టిపాళయం, మొదకురుచ్చి, పెరుందురై అనే 8 అసెంబ్లీ నియోజక వర్గాలుగా విభజించబడింది.

పరిపాలన

[మార్చు]

పరిపాలనా ప్రయోజనాల కోసం, ఈరోడ్ జిల్లా రెండు రెవెన్యూ డివిజన్ల క్రింద పది తాలూకాలుగా విభజించబడింది.

  • ఈరోడ్ డివిజన్: ఈరోడ్ తాలూకా, కొడుముడి తాలూకా, మోదకురిచి తాలూకా, పెరుందురై తాలూకా
  • గోబిచెట్టిపాళయం డివిజన్: అంతియూర్ తాలూకా, భవానీ తాలూకా, గోబిచెట్టిపాళ్యం తాలూకా, సత్యమంగళం తాలూకా, నంబియూర్ తాలూకా, తాళవడి తాలూకా

ఈరోడ్ జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, నాలుగు పురపాలికలు ఉన్నాయి.

  • ఈరోడ్ మున్సిపల్ కార్పొరేషన్
  • గోబిచెట్టిపాళయం సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీ
  • సత్యమంగళం గ్రేడ్-1 మున్సిపాలిటీ
  • భవానీ గ్రేడ్-II మున్సిపాలిటీ
  • పుంజై పులియంపట్టి గ్రేడ్-II మునిసిపాలిటీ

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

విమాన రవాణా మినహా అన్ని ఆధునిక రవాణా మార్గాలతో బాగా అనుసంధానించబడి ఉంది. జిల్లాకు రాష్ట్ర రాజధాని చెన్నై, ఇతర ప్రధాన నగరాల నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

రైల్వే మార్గం: జిల్లాలో ఒక ప్రధాన రైల్వే స్టేషన్, ఈరోడ్ జంక్షన్ ఉంది. భారతదేశ పశ్చిమ తూర్పు తీరాలను కలుపుతూ బ్రిటిష్ వారు దీనిని నిర్మించారు. ఈరోడ్ జంక్షన్‌లో ఐెస్ఒ సర్టిఫైడ్ డీజిల్, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్‌లు ఉన్నాయి. భారతదేశంలోని మూడవ అత్యంత పరిశుభ్రమైన రైల్వే జంక్షన్‌గా గుర్తింపు పొందిన ఈరోడ్ జంక్షన్, నీటిని నింపే సౌకర్యాలు, ఆహార సదుపాయాలకు కేంద్రంగా పనిచేస్తుంది.

రోడ్డు మార్గం:xజిల్లా రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

వాయుమార్గం: సమీప విమానాశ్రయం సమీపంలోని కోయంబత్తూర్ జిల్లాలో ఉన్న కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం.

జలమార్గం: జిల్లాలో నెరింజిపేటై, నట్టత్రీశ్వర దేవాలయం వద్ద నౌకాయాన జలమార్గాలు అందుబాటులో ఉన్నాయి.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
  2. www.tn.gov.in
  3. Decadal Variation In Population Since 1901
  4. 4.0 4.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  5. "Census Info 2011 Final population totals - Erode district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  6. "Table C-16 Population by Mother Tongue: Tamil Nadu". Census of India. Registrar General and Census Commissioner of India.
  7. "Table C-01 Population by Religion: Tamil Nadu". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  8. "[[Census]] 2001". Archived from the original on 2015-04-25. Retrieved 2014-03-12.

వెలుపలి లింకులు

[మార్చు]