ఈలూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈలూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ పిడుగు రాఘవులు
జనాభా (2011)
 - మొత్తం 1,475
 - పురుషులు 736
 - స్త్రీలు 739
 - గృహాల సంఖ్య 392
పిన్ కోడ్ 521163
ఎస్.టి.డి కోడ్ 08676

ఐలూరు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం 521 163., ఎస్.టి.డి.కోడ్ = 08676.

  • English:- ILURU.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఐలూరు గ్రామం, విజయవాడకు 40 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు. ఈ గ్రామం కృష్ణానదీ తీరాన ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో మేడూరు, కుదేరు, క్రిష్ణాపురం, చోరగుడి, దేవరపల్లి, కనిగిరిలంక గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

కొల్లూరు, కొల్లిపర, తోట్లవల్లూరు, మొవ్వ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కూచిపూడి, కొల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 39 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఐలూరు.

శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాల, తోట్లవల్లూరు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పిడుగు రాఘవులు సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఉభయ రామేశ్వరక్షేత్రం[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

రావణ సంహారానంతరం, రాముడు అయోధ్యకు పుష్పక విమానంపై వెళుతుండగా, రైభ్యుడు అను మహర్షి, తపఃప్రభావంచే, ఈశ్వరుని కోరిక నెరవేర్చుటకు వెళ్తున్నప్పుడు, విమానం కృష్ణా నదిలో ఆగిపోతుంది. ఇక్కడ మునులు చెప్పిన ప్రకారం, సైకత లింగం ప్రతిష్ఠించుతారు. ఆంజనేయుడు తెచ్చిన శివలింగం, ముహూర్తం దాటిపోవడంతో, శ్రీరాముని చేత ఐలూరులో ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం. అప్పుడు శివుడు, రామాంజనేయులకు ప్రత్యక్షమై, ఇది "దక్షిణ కాశి" అని "ఉభయ రామేశ్వరక్షేత్రం"గా ప్రసిద్ధి చెందగలదని చెపుతాడు. ఇక్కడ కృష్ణా నదిలో స్నానం చేసి, శివుడిని దర్సించుకున్న వారికి, కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుడిని దర్శించిన ఫలితం కలుగుతుందని స్థలపురాణం చెపుచున్నది. శ్రీరామునిచే శివలింగం ప్రతిష్ఠ జరగడంతో ఇక్కడనే రఘునాయకస్వామి పేరుతో నేను ఇక్కడ్నే ఉండగలనని చెప్పటంతో, దీనికి, "ఊభయరామక్షేత్రం" అని పేరు. ఆలయంలో పార్వతీదేవి విగ్రహం లేకపోవటం కారణంగా, ఇక్కడ శివుడిని, "యోగశివుడు" అని పిలుస్తారు. నందీశ్వరుడు, అమ్మవారు లేకపోవటం ఈ ఆలయ ప్రత్యేకత. [2]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, పరతి సంవత్స్రం శివరాత్రి సందర్భంగా వారం రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ప్రతిదినం ఆలయం వద్ద పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. దక్షిణకాశీగా పేరుపొందిన ఈ ఆలయంలో, 2017, ఫిబ్రవరి-20వతేదీ సోమవారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, శ్రీ రామేశ్వరస్వామి, పార్వతీదేవి, చండీశ్వరుడు ఉత్సవ విగ్రహాలకు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. 2016, ఆగస్టులో కృష్ణా పుష్కరాల అనంతరం, ఈ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. నెలరోజుల తరువాత ఈ విగ్రహాలను ఒక సంచిలో ఉంఛి చిన్నకట్ట రహదారిపై వదలివెళ్ళినారు. పోలీసులు ఈ విగ్రహాలను స్వాఈధీనం చేసుకుని ఆలయ అధికారులకు అప్పజెప్పినారు. అయితే ఈ విగ్రహాలలో కొంత భాగం దొంగలు కోసివేసినారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఈ విగ్రహాలకు మరమ్మత్తులు చేయించి, 24 గంటలు ఆలయంలో ఉంచి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం, వాస్తుపూజ, వాస్తుహోమం మొదలగు పూజలను పురోహితులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,475 - పురుషుల సంఖ్య 736 - స్త్రీల సంఖ్య 739 - గృహాల సంఖ్య 392

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1485.[2] ఇందులో పురుషుల సంఖ్య 740, స్త్రీల సంఖ్య 745, గ్రామంలో నివాసగృహాలు 382 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 466 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Iluru". Retrieved 18 June 2016. External link in |title= (help)[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014, ఫిబ్రవరి-26; 8వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016, జనవరి-1; 24వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, ఫిబ్రవరి-21; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఈలూరు&oldid=2983704" నుండి వెలికితీశారు