ఈశ్వర వేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈశ్వర వేరు
Paathaalamooli.JPG
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. indica
Binomial name
Aristolochia indica

ఈశ్వర వేరు యొక్క వృక్ష శాస్త్రీయ నామం Aristolochia indica.

ఇతర భాషలు[మార్చు]

ఆంగ్లము - ఇండియన్ బర్త్ వర్ట్, హిందీ - ఈశ్వరమూల్, ఈసర్ మూల్, కన్నడ - ఈశ్వర బెరుస, మలయాళం - కరల్ ఆయం, ఈశ్వరముల్లా, కరలకం, సంస్కృతం - గరలిక, ఈశ్వరి, తమిళం - కరుటకొట్టి, ఈశ్వరమూలి

వ్యాప్తి[మార్చు]

లోతట్టు ప్రాంతాలలోని పొదలు, కంచెలలో భారతదేశమంతటా పెరుగుతుంది.

వర్ణన[మార్చు]

పొదలాగా పెరిగే ఈ తీగ అన్ని ఋతువులలోను పెరుగుతూ అల్లుకొంటుంది. చాలా బారుగా ఉండే ఈ తీగలు దట్టంగా అల్లుకొంటాయి. తీగకు ఎటువంటి ముళ్లు, నూగు లేకుండా నున్నగా ఉంటుంది. ఆకులు మామూలుగా పొట్టిగా ఉండి తీగకు ఇరువైపులా ఒకదాని తరువాత మరొకటి ఉంటాయి. అకు అంచులు సాఫీగా ఉండక వంపులు కలిగి ఉంటాయి. పూవులు తెలుపు ఆకుపచ్చ లేత ఉందా రంగులో ఉంటాయి. గరాటా ఆకారంలో ఉంటాయి. కాయలు కోలగా, షడ్భుజాకారంలో ఉంటాయి. కాయ క్రింద భాగం నుండి ఆరు గొట్టాలుగా తొడమి సాగి ఉంటాయి. గింజలు పల్చగా, రెక్కలు కలిగి ఉంటాయి.

ఔషధానికి ఉపయోగపడే భాగాలు[మార్చు]

వేళ్లు, ఆకులు, కాయలు

ఔషధ లక్షణాలు, ఉపయోగాలు[మార్చు]

వేళ్లు చేదుగా ఉంటాయి. నాలుకకు తగిలిస్తే చురుక్కుమనిపించే గుణముంది. జీర్ణకారి, విరేచనకారి, నొప్పులను తగ్గిస్తుంది. రక్తశుద్ధి, కడుపులో పురుగులను నాశనం చేస్తోంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. గుండె బలానికి, చర్మముపై మంటల నివారణకు పనిచేస్తుంది. తరచుగా వచ్చే జబ్బులను నివారిస్తుంది. కురుపులను తగ్గిస్తుంది. కఫ, వాత రోగాలకు, కీళ్ళ సంబంధమైన వాటికి పనిచేస్తుంది. కుష్టు బొల్లి, ఇతర చర్మ రోగాలకు దివ్యంగా పనిచేస్తుంది. పేగులలో నులి పురుగులు, గుండె బలహీనత, బహిష్టు నిలిచి పోవడం, అజీర్ణం, పిల్లల గుత్తి కడుపుకు సంబంధించిన వ్యాధులకు, అన్ని రకాల విష పురుగులు, జంతువులు కరిచినా, తేళ్ళలాంటి విషక్రీములు కొట్టినా దివ్యంగా పనిచేస్తుంది. అకులను కలరా నివారణకు ఉపయోగిస్తారు. పెద్ద ప్రేవులలోని బాధలకు చిన్న పిల్లలకు తరచుగా వచ్చే జ్వరాలకు ఉపయోగపడుతుంది. ఆకులను నూరి శరీర మంటలతో బాధ పడుతున్న చోట శరీర భాగాలపైన పూసిన వెంటనే తగ్గుతుంది. అదే విధంగా విత్తనాలు శరీరమంటలు, పొడి దగ్గు, కాళ్ళ నొప్పులు, పిల్లల శ్వాస రోగాలకు పనిచేస్తున్నాయి.

వశపరచుకొనుటకు ఈశ్వరి వేరును ఉపయోగిస్తారు

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

ఆదిమ గిరిజన వైద్యము - పలురేతు షణ్ముఖరావు