ఈస్ట్‌మన్ కొడాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Eastman Kodak Company
రకంPublic
NYSEKODK
ISINUS2774614067 Edit this on Wikidata
పరిశ్రమ
పూర్వీకులుThe Eastman Dry Plate Company
స్థాపనసెప్టెంబరు 4, 1888; 136 సంవత్సరాల క్రితం (1888-09-04)[1]
స్థాపకుడు
ప్రధాన కార్యాలయంRochester, New York, U.S.
సేవ చేసే ప్రాంతము
Worldwide
కీలక వ్యక్తులు
ఉత్పత్తులుDigital imaging, photographic materials, equipment and services
రెవెన్యూDecrease US$1.798 billion (2015)[2]
Decrease US$2 million (2015)[2]
Decrease -US$16 million (2016)[2]
Total assetsDecrease US$2.138 billion (2015)[2]
Total equityDecrease US$103 million (2015)[2]
ఉద్యోగుల సంఖ్య
6,100 (2017)[3]
వెబ్‌సైట్www.kodak.com Edit this on Wikidata
ఈస్ట్‌మన్‌ కొడాక్ వ్యవస్థాపకుడు జార్జి ఈస్ట్‌మన్‌

ఈస్ట్‌మన్‌ కొడాక్‌ కంపెనీ లేదా కొడాక్ (ఆంగ్లం: Kodak) ఛాయాచిత్రాలకు సంబంధించిన ఉత్పత్తులను రూపొందించే ఒక అమెరికన్ సంస్థ. దీని ప్రధాన కేంద్రం న్యూయార్క్ లోని రోచెస్టర్ లో ఉంది. ప్యాకింగు, ముద్రణ, గ్రాఫిక్స్, ఇతర వ్యాపార సంబంధిత సేవలను అందించటంలో కొడాక్ కు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. సాఫ్టువేర్ వంటి ఇతర విభాగాలలో కొడాక్ ఉన్ననూ, ఫోటోగ్రఫిక్ ఫిలిం ఉత్పత్తిలో కొడాక్ పేరొందిన సంస్థగా ప్రజల మనసులలో ముద్రించబడింది.

జార్జి ఈస్ట్‌మన్‌, హెన్రీ ఏ. స్ట్రాంగ్ లు కలసి 1888 సెప్టెంబరు 4 న కొడాక్ సంస్థను ప్రారంభించారు. 20వ శతాబ్దంలో ఎక్కువ భాగం ఫోటోగ్రఫిక్ ఫిలింను కొడాక్ శాసించింది. అప్పట్లో కొడాక్ ఫిలింలో ఎంతగా వేళ్ళూనుకుపోయిందంటే, ఏదయినా ఒక ముఖ్య ఘట్టాన్ని నమోదు చేయటాన్ని కొడాక్ మొమెంట్ (కొడాక్ క్షణం) అని వ్యవహరించటం పరిపాటిగా ఉండేది. 1990 లో డిజిటల్ ఫోటోగ్రఫికి పెరుగుతోన్న ఆదరణతో, కొడాక్ ఈ మార్పుకు పరివర్తన చెందలేకపోవటంతో సంస్థను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనితో కొడాక్ డిజిటల్ ఫోటోగ్రఫి, డిజిటల్ ప్రింటింగ్ ల పై దృష్టి కేంద్రీకరించింది.

జనవరి 2012 లో సంస్థను దివాళా తీయకుండా ఆదుకోవాలని కోర్టులో దావా వేసింది. ఫిబ్రవరి 2012లో డిజిటల్ కెమెరాలు, పాకెట్ వీడియో కెమెరాలు వంటి వాటి ఉత్పత్తులు ఆపివేసి, కేవలం కార్పొరేట్ డిజిటల్ ఇమేజింగ్ విపణిపై దృష్టి కేంద్రీకరించబోతోన్నట్లు ప్రకటించింది. ఆగస్టు 2012లో కొడాక్ దివాళా తీయకుండా ఉండే క్రమంలో తమ ఫోటోగ్రాఫిక్ ఫిలిం, వాణిజ్య స్కానర్ లు, కియోస్క్ కార్యకలాపాలను విక్రయిస్తున్నామని మోషన్ పిక్చర్ ఫిలిం కార్యకలాపాలు మాత్రం విక్రయించబోమని తెలిపింది. జనవరి 2013లో కోర్టు కొడాక్ దివాళా తీయకుండా ఉండటానికై నిధులను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. తమ పేటెంటులలో చాలా వాటిని $525,000,000 ఇతర సంస్థలకు విక్రయించింది. 3 సెప్టెంబరు 2013 నాటికి పాత బకాయిలను చెల్లించి పలు వ్యాపారాల నుండి నిష్క్రమించటంతో దివాళా కోరల నుండి బయటపడింది.

చరిత్ర

[మార్చు]

పూర్వాపరాలు

[మార్చు]

ఏప్రిల్ 1880 లోనే జార్జి ఈస్ట్‌మన్‌ రోచెస్టర్ లో ఒక గదిని అద్దెకు తీసుకొని అప్పటి తరం కెమెరాలకు కావలసిన డ్రై ప్లేట్ లను వాణిజ్య విక్రయాలకై రూపొందించటం మొదలు పెట్టాడు. జనవరి 1881లో హెన్రీ ఏ స్ట్రాంగ్ అనే వ్యాపారవేత్త భాగస్వామిగా ఈస్ట్‌మన్‌ డ్రై ప్లేట్ కంపెనీని స్థాపించారు. రోచెస్టర్ లో బ్యాంకులో తాను చేస్తున్న ఉద్యోగానికి ఈస్ట్‌మన్‌ రాజీనామా చేసి, పూర్తి స్థాయిలో ఈస్ట్‌మన్‌ డ్రై ప్లేట్ కంపెనీలోనే పనిచేయటం ప్రారంభించాడు. 1884 లో స్ట్రాంగ్ తో భాగస్వామ్యం పూర్తయింది. పధ్నాలుగు మంది వాటాదారులతో ఈస్ట్‌మన్‌ డ్రై ప్లేట్ అండ్ ఫిలిం కంపెనీ ఏర్పడింది. కేవలం నిపుణులకే పరిమితం కాకుండా, సామాన్యులు కూడా ఉపయోగించే కెమెరాలను ఈస్ట్‌మన్‌ డ్రై ప్లేట్ అండ్ ఫిలిం కంపెనీ తయారు చేసింది. 1885లో జార్జి ఈస్ట్‌మన్‌ డేవిడ్ హూస్టన్ నుండి ఫిలిం చుట్ట యొక్క పేటెంటులను కొనుగోలు చేసి దానికి మరిన్ని మెరుగులు దిద్దారు. ఈ మెరుగులే తర్వాత మోషన్ పిక్చర్ ఫిలిం తయారు చేయటానికి దారులు వేశాయి.

1890లో కొడాక్ రూపొందించిన కొడాక్ 2 కెమెరాతో జార్జి ఈస్ట్‌మన్‌ (ఫ్రెడరిక్ చర్చ్ ఈ ఫోటోను తీసారు)

స్థాపన

[మార్చు]

అక్షరం K అంటే ఈస్ట్‌మన్‌కు బాగా ఇష్టం. "ఈ అక్షరంలో చాలా బలం ఉన్నటు అనిపిస్తుంది. ఎందుకో అది మనసును తాకుతున్నట్లు ఉంటుంది" అని ఈస్ట్‌మన్‌ అనేవారు.

తన తల్లితో కలిసి Kodak అనే బ్రాండును సృష్టించారు. చిన్నగా, పలకటానికి సులువుగా వేరే ఏ పేరుకు సామ్యం లేకుండా వేరే దేనికి అర్థం ఆపాదించకుండా ఉండాలనే తాను తన సంస్థకు ఆ పేరును ఎంచుకొన్నానని తెలిపేవారు.

1888 లో ఈస్ట్‌మన్‌ కొడాక్ ప్రారంభమైంది. మొట్టమొదటి కొడాక్ కెమెరా రూపు దిద్దుకొంది. 2.5 ఇంచిల వ్యాసం గల, 100 ఫ్రేముల ఫిలిం చుట్టను తనలో ఇముడ్చుకోగల ఫిక్స్డ్ ఫోకస్ కెమెరా అది. ఈ కెమెరా ఔత్సాహిక ఫోటోగ్రఫర్లకు అనుగుణంగా తీర్చిదిద్దబడింది. దీనికి ముందు ఫోటోగ్రఫీ, పరికరాలు, ప్రక్రియ చాలా భారీగా ఉండి, ఫోటోగ్రఫీని ఒక శాస్త్రాన్ని తలపింపజేసేది. కానీ ఈ కెమెరాతో ఫోటోగ్రఫీ ఒక వినోద సాధనం అయింది.

మొదటి ఫిలిం చుట్ట కాగితం ముడి పదార్థంగా చేయబడగా, తర్వాతి పారదర్శక చుట్టలు సెల్యులోజ్ తో చేయబడ్డవి. మొదటి తరం ఫిలిం ల లోడింగ్/అన్ లోడింగ్, డార్క్ రూంలలోనే చేయబడేవి. తర్వాత వచ్చిన కార్ట్రిడ్జ్ సిస్టంతో వెలుపల కూడా ఫిలింను లోడ్ చేయగల సౌలభ్యం కలిగింది.

అప్పటి నుండి పలు కెమెరాలు, ఫిలిం, ఫోటోగ్రఫిక్ రసాయనాలు, ఫోటోగ్రఫిక్ కాగితాన్ని సామాన్యుడు సైతం కొనగలిగే స్థాయిలో అందుబాటులోకి తెచ్చి వాటిపై భారీ లాభాలను అర్జించింది. 1976వ సంవత్సరం నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఫిలిం విక్రయాలలో 90%, కెమెరా విక్రయాలలో 85% కొడాక్ యే ఉంది.

విస్తరణ

[మార్చు]

1891 లో రెండవ శ్రేణి కెమెరాలను కొడాక్ రూపొందించింది. 1892 లో You Press the Button, We Do the Rest (మీరు కేవలం మీట నొక్కండి, మిగితాది మాకు వదిలెయ్యండి) అనే ఉపశీర్షికతో వాణిజ్య ప్రకటనను నడిపింది. మొట్టమొదటి ఫోల్డింగ్ కెమెరాను కొడాక్ రూపొందించింది. 1895లో కోటు జేబులో ఇమిడిపోయేంత చిన్న కాంపాక్ట్ కెమెరాను కొడాక్ రూపొందించింది. దీని వెల $5 మాత్రమే.

19వ శతాబ్దం

[మార్చు]

1900లో మొదటి బ్రౌనీ కెమెరాను కొడాక్ రూపొందించింది. 1972లో జార్జి ఈస్ట్‌మన్‌, తనను తానే తుపాకీతో కాల్చుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. 1935లో కొడాక్రోం పేరుతో స్లైడ్ (రివర్సిబుల్) ఫిలింను కొడాక్ విడుదల చేసింది. 1934 నుండి 1956 వరకు కొడాక్, రెటీనా పేరుతో 35 ఎం ఎం కెమెరాలను విడుదల చేసింది. 1975 లో కొడాక్ డిజిటల్ కెమెరాను రూపొందించింది. 1986 లో కొడాక్ ప్రపంచంలోనే మొట్టమొదటి మెగాపిక్సెల్ సెన్సర్ ను రూపొందించింది.

ఫూజీఫిలిం తో వైరం

[మార్చు]

జపనీసు ప్రత్యర్థి ఫూజీఫిల్మ్ అమెరికా విపణి లోకి సరసమైన ధరలతో ప్రవేశించిననూ, కొడాక్ తమ వినియోగదారులపై ఆత్మస్థైర్యాన్ని ఒదులుకోలేదు. 1984 లో లాస్ ఏంజలెస్లో జరిగిన ఒలింపిక్స్కు స్పాన్షర్షిప్ హక్కులను కొడాక్ వదులుకోవటం, ఫూజీఫిల్ం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంతో ఫూజీఫిల్ం తన స్థానాన్ని పదిలపరచుకొంది. అమెరికాలో ఒక కార్మాగారాన్ని నెలకొల్పి, దుందుడుకు విపణీకరణ వ్యూహాలతో, తక్కువ ధరలకే ఫిలిం/ఇతర ఫోటోగ్రఫిక్ సామాగ్రిని సరఫరా చేయటంతో కొడాక్ కు గట్టి పోటీ ఇచ్చింది. 1990లో ఫూజీ షేర్ 10% ఉండగా, 1997 నాటికి అది 17% అయ్యింది. వెల్వియా, ప్రోవియాల వంటి ట్రాన్స్పరెన్సీ (స్లైడ్) ఫిలింలతో ఫూజీ నిపుణుల మనసులను సైతం దోచుకొంది. కొడాక్ యొక్క కొడాక్రోం వీటికి పోటీగా ఉన్ననూ, కొడాక్రోం ఫిలిం సంవర్థన చేయటానికి ప్రత్యేకమైన సామాగ్రి కావలసి వచ్చేది. కానీ ఫూజీఫిల్ం సంవర్థన సులభంగా, తక్కువ ధరలతో కూడుకొని ఉండటం వలన ఫూజీఫిలిం సర్వత్రా వ్యాపించింది. అధిక వేగం గల ఫిలిం లలో కూడా బిగుతుగా ఉండే ఫిలిం గ్రెయిన్ తో ఫూజీ అందరి మన్ననలను పొందినది.

మే 1995 లో కొడాక్ అమెరికా వాణిజ్య విభాగంలోని వాణిజ్య చట్టంలోని సెక్షను 301 క్రింద ఫూజీఫిల్ం పై దావా వేసింది. జపాన్లో మనలేక ఫూజీ అమెరికాలో ఆమోదయోగ్యం కాని పద్ధతులను అమలులోకి తెచ్చి అమెరికాలో తమ ఆదాయనికి గండి కొడుతోందని కొడాక్ అభియోగాలు మోపింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు దీనిని ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి తీసుకెళ్ళింది. 1998 జనవరి 30 లో ఈ అభియోగాలన్నీ నిరాధారమైనవిగా ప్రపంచ వాణిజ్య సంస్థ కొట్టివేసింది. 1996లో పోలిస్తే 1997 లో కొడాక్ లాభాలు క్షీణించినవి. తన ప్రత్యర్థులను కొడాక్ సరిగా అంచనా వేయలేకపోయిందని వాణిజ్య విమర్శకులు పెదవి విరిచారు.

1970ల నుండి కొడాక్, ఫూజీలు డిజిటల్ ఫోటోగ్రఫీని గుర్తించినను, విభిన్నతయే ఈ సమస్యకు పూరణమని గమనించినను దీనిన్ సాధించటంలో మాత్రం ఫూజీయే ముందు వరుసలో నిలిచింది.

డిజిటల్ పయనం

[మార్చు]

1975 లోనే కొడాక్ మొట్టమొదటి డిజిటల్ కెమెరాను రూపొందించిననూ, ఫిలిం వ్యాపారానికి ఇది గొడ్డలిపెట్టు అవుతుందనే భయంతో కొడాక్ దానిని బయటికి పొక్కనివ్వలేదు. అప్పటికే కొడాక్ డిజిటల్ విప్లవాన్ని ఎదుర్కొనటానికి రంగం సిద్ధం చేసుకొంది. 1996 లో తమ డిజిటల్ కెమెరాలు అయిన డిసి శ్రేణి కెమెరాలను విడుదల చేసింది. ఈ సమకాలీన సాంకేతికతల నుండి కొడాక్ అసలు వ్యాపారానికి ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. కొడాక్ ఉద్యోగులు ఫిలిం లేని ప్రపంచాన్ని కనీసం నామమాత్రానికి కూడా ఊహించలేకపోవటంతో ప్రత్యామ్నాయ మార్గాలకు ద్వారాలు తెరుచుకోలేదు. క్రమంగా వినియోగదారులు డిజిటల్ కెమెరాలను అందించే సోనీ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపటం ప్రారంభించారు. 2001 లో కొడాక్ అమ్మకాలు పడిపోయినందుకు 11 సెప్టెంబరు దాడులను ఆపాదించుకొన్నది. ఫూజీ చేసినట్లే దుందుడుకు విపణీకరణ వ్యూహాలతో డిజిటల్ విప్లవానికి అడ్డుకట్ట వేయవచ్చని కొడాక్ ఉద్యోగులు ఊహాగానాలు చేశారు.

ఈజీషేర్ శ్రేణి డిజిటల్ కెమెరాలతో కొడాక్ డిజిటల్ ఫోటోగ్రఫీ వైపుకు అడుగులు వేసింది. అపరిమిత వనరులను వెచ్చించి మహిళలు డిజిటల్ ఫోటోలను తీయటంలో ఉత్సుకత చూపినను, వాటిని కంప్యూటర్ లలోకి మార్చటంలో పడుతున్న ఇబ్బందులను గుర్తించింది. ఇది కొడాక్ కు ఎడారిలో ఒయాసిస్ గా ఉపయోగపడినది. డిజిటల్ ఫోటోలను కంప్యూటర్ లో చూచుకొనటానికి పలు ఉపకరణాలను కొడాక్ రూపొందించి. 2005 నాటికి కొడాక్ కెమెరా అమ్మకాలలో 40% వృద్ధి సాధించింది.

వృద్ధిలో ముందంజలో ఉన్ననూ, డిజిటల్ కెమెరాల వ్యాప్తిలో వేగాన్ని అంచనా వేయటంలో కొడాక్ వెనుకంజ వేసింది. 2000 నాటికి లాభాలను తగ్గించుకొని అధిక సంస్థలు డిజిటల్ ఫోటోగ్రఫీలోకి ప్రవేశించినవి. 2001లో కొడాక్ అమెరికాలోని డిజిటల్ కెమెరా అమ్మకాలలో (సోనీ తర్వాత) రెండవ స్థానంలో నిలిచింది. సంస్థలోని డిజిటల్, ఫిలిం విభాగాల మధ్య అంతర్గత కలహాలు కూడా ఉండేవి. 2005 నాటికి అధిక లాభాలను అర్జించే ఫిలిం విభాగం లాభాలు 18% క్షీణించినవి. తక్కువ లాభాలకే మెరుగైన ఉత్పత్తులు తయారు చేయగలిగే ఆసియాలోని ప్రత్యర్థులు కొడాక్ ను వెనుకకు నెట్టేశాయి. 1999 నాటికి 27% మార్కెట్ షేర్ గల కొడాక్, 2003 నాటికి 15%తో సరిపెట్టుకొంది. 2007లో 9.6%, 2010కి 7% లకు కొడాక్ మార్కెట్ షేర్ పడిపోయింది. కెనాన్, నికాన్, సోనీలు మార్కెట్ ల పై పెత్తనం చెలాయించటం మొదలైంది. 2000 వ దశాబ్దం ద్వితీయార్థంలో మొబైల్ ఫోన్ల లోనే కెమెరాలు రావటంతో డిజిటల్ కెమెరాలు కూడా సగటు మనిషికి దూరమైపోయాయి.

సరిక్రొత్త వ్యూహం

[మార్చు]

కొడాక్ తయారీ రంగం మొత్తం ఔట్ సోర్స్ చేయబడటంతో 27,000 ఉద్యోగాలను తొలగించవేయబడ్డాయి. డిజిటల్ సాంకేతికలలోను, లాభాలాను అర్జించే సేవలలోను కొడాక్ పెట్టుబడులను మొదలుపెట్టింది. కాలక్రమేణా తగ్గుతోన్న ఫిలిం అమ్మకాలకు సమతౌల్యంగా ముద్రణలలో వినియోగించే సిరాలలో కొడాక్ పెట్టుబడులను పెట్టింది. హ్యూలెట్ ప్యాకార్డ్ అవలంబిస్తున్న విపణీకరణ వ్యూహానికి భిన్నంగా కొడాక్ ప్రింటర్లు అధిక ధర కలిగియున్ననూ సిరాలు మాత్రం తక్కువ ధరలకే లభించాయి. 2011 నాటికి ఈ ప్రింటర్లు/సిరా లాభాలనార్జించే దిశలో పయనించినను ప్రింటౌట్ల అవసరం తగ్గటంతో కొందరు వాణిజ్య విమర్శకులు ఇవి పెద్దగా లాభాలను అర్జించవని అభిప్రాయపడ్డారు. ఇంట్లోనే ఫోటోలను ప్రింటు చేసుకొనే ప్రింటర్లు, ప్రింటర్లు/సిరాలు, సాఫ్టువేరు, ప్యాకేజింగ్ వంటి రంగాలలో ప్రవేశించడం ద్వారా 2013 లో ఫలితాలు ఆశాజనకంగా కనబడ్డాయి. 2012 వీటి అమ్మకాలు తగ్గు ముఖం పట్టటంతో కొడాక్ ఈ వ్యాపారాల నుండి కూడా నిష్క్రమించింది.

జనవరి 2015 లో క్రొత్త విభాగాలను ప్రారంభిస్తున్నట్లు కొడాక్ ప్రకటించింది. ప్రింట్ సిస్టంస్, ఎంటర్ప్రైజ్ ఇంక్ జెట్ సిస్టంస్, మైక్రో త్రీ-డీ ప్రింటింగ్ మరియ్యు ప్యాకేజింగ్, సాఫ్టువేరు, వినియోగదారుని అవసరాలు, ఫిలిం.

ఉత్పత్తులు

[మార్చు]

సంవర్థన ప్రక్రియలో నూతన శకం

[మార్చు]

1900లో రూపొందించిన కొడాక్ డెవలపింగ్ మషీన్ ఫిలిం సంవర్థనను కేవలం డార్క్ రూంలోనే చేసే అవసరం తప్పించింది. తర్వాత దీనినే మరింత సరళీకరించి ద కొడాక్ ఫిలిం ట్యాంక్ గా వ్యవహరించారు.

స్టిల్ ఫిలిం కెమెరాలు

[మార్చు]

మొదటి తరం కొడాక్ కెమెరాలు బాక్స్ కెమెరాలుగా ఉండి ఫిక్స్డ్ ఫోకస్ తో కూడి ఉండేవి. వివిధ పరిమాణాలలో ఉండే వీటికి, వీటి కటకాలకు అనేక ఉపకరణాలను కొడాక్ రూపొందించింది.

13 జనవరి 2004 న కొడాక్ డిస్పోజబుల్ కెమెరాలను తప్పితే మిగతా అన్ని ఫిలిం కెమెరాలను అమెరికా, కెనడా, పశ్చిమ ఐరోపాలలో ఆపివేస్తున్నట్లు, కానీ ఫిలిం కెమెరాలను భారతదేశం, ల్యాటిన్ అమెరికా, తూర్పు ఐరోపా, చైనాలలో కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2005 నాటికి కొడాక్ అడ్వాన్స్డ్ ఫోటో సిస్టం సాంకేతికను వాడే రూపొందించటం ఆపేసింది. తమ అన్ని కెమెరాలకు సంబంధించిన లైసెన్సులను 2005, 2006 సంవత్సరాలలో వివిటార్ కు అమ్మివేసింది. 2007 తర్వాత కొడాక్ ఏ ఒక్క ఫిలిం కెమెరాను రూపొందించలేదు.

ఇన్స్టంట్ కెమెరాలు

[మార్చు]

1963 నుండి 1969 వరకు పోలరాయిడ్ కెమెరాలకు కొడాక్ యే ఇన్స్టంట్ ఫిలింను సమకూర్చేది. కానీ దాని తర్వాత పోలరాయిడ్ తమ ఫిలింను తామే రూపొందించుకొంది.

9 జనవరి 1986 న పోలరాయిడ్ కార్పొరేషన్ లో పేటెంట్ యుద్ధం కోల్పోయిన తర్వాత, కొడాక్ తమ ఇన్స్టంట్ కెమెరాలు అయిన కొడామాటిక్, కలర్ బస్ట్ కెమెరాలను రూపొందించటం మానేసింది. దీనికి గాను, కొడాక్ పోలరాయిడ్ కు $909,457,567 ను చెల్లించుకొంది.

డిజిటల్ , వీడియో కెమెరాలు

[మార్చు]

కొడాక్ యొక్క మొదటి తరం డిజిటల్ కెమెరాలను జపాన్ కు చెందిన చినాన్ ఇండస్ట్రీస్ రూపొందించేది. 2004 లో కొడాక్ జపాన్ చినాన్ ను కొనివేసింది.

1990ల నుండి 2000ల వరకు కొడాక్ డిసిఎస్ పేరుతో కొడాక్ డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా (మొదటి తరం డి ఎస్ ఎల్ ఆర్) లను డిజిటల్ కెమెరా బ్యాక్ లను రూపొందించింది. నికాన్, కేనాన్ లు రూపొందించిన 35ఎంఎం ఎస్ ఎల్ ఆర్ కెమెరాలకు ఈ బ్యాక్ (వెనుకభాగాన్ని) అమరిస్తే డిజిటల్ ఫోటోలు తీయటానికి సాధ్యపడేది. 2005 నాటికి వీటిని రూపొందించటం మానేసింది.

2006లో తమ కెమెరాలన్నింటినీ ఫ్లెక్స్ట్రానిక్స్ సంస్థ తయారు చేస్తుందని ప్రకటించింది.

ఫోటోగ్రఫిక్ ఫిలిం అండ్ పేపర్

[మార్చు]

ఇప్పటికీ కొడాక్ ఫోటోగ్రఫిక్ ఫిలిం, పేపర్ ను ఉత్పత్తి చేస్తుంది.

బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్ ఫిలిం

[మార్చు]

కలర్ నెగిటివ్ ఫిలిం

[మార్చు]

కలర్ స్లైడ్ (రివర్సబుల్) ఫిలిం

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; foundingdate అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Eastman Kodak Company". US: Securities and Exchange Commission. 2015.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-03-09. Retrieved 2018-04-26.