ఉడల్గురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Udalguri district
Map of Udalguri District
Map of Udalguri District
Countryభారత దేశము
Stateఅసోం
HeadquartersUdalguri
ప్రామాణిక కాలమానంUTC+05:30 (Indian Standard Time)
జాలస్థలిudalguri.gov.in

అస్సాం రాష్ట్రం లోని 27 జిల్లాలలో ఉడల్గురి జిల్లా ఒకటి. (అస్సాం: ওদালগুৰি জিলা) జిల్లాకేంద్రంగా ఉడల్గురి పట్టణం ఉంది.

పేరువెనుక చరిత్ర[మార్చు]

జిల్లా కేంద్రమైన ఉడల్గురి పేరు జిల్లా పేరుగా ఉంది. ఉడల్గురి పేరు గురించి 3 కథనాలు ఉన్నాయి. మొదటిది ఓడల్ (ఒక చెట్టు), గురి (వేర్లు లేక పరిసరాలు). ఒడల్ చెట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో ఊరు అభివృద్ధి చెందింది కనుక ఈ ఊరికి ఈ పేరు వచ్చింది. మరొక కథనంలో ఉద్దాలక మహర్షి ఆశ్రమం ఉన్న ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఇంకొక కథనం అనుసరించి బోడో భాషలో " ఓడో గురి " అంటే విశాలమైన మెత్తని మట్టి కలిగిన ప్రాంతమని అర్ధం.

చరిత్ర[మార్చు]

ఉడల్గురి జిల్లా 2004 జూన్ 14 న రూపొందించబడింది.[1] బోడోలాండ్‌లోని 4 జిల్లాలలో ఇది ఒకటి. దర్రాంగ్ జిల్లాలో కొంత భూభాగం విడదీసి ఈ జిల్లా రూపొందించబడింది.[1] ప్రస్తుత జిల్లా ప్రాతం ఉడల్గురి ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాలో హిందువులు, క్రైస్తవులు మరియు ముస్లిములు అధికసంఖ్యలో ఉన్నారు. 1980 వరకూ ఇది చాలా ప్రశాంతమైన ప్రాంతంగా ఉంటూ వచ్చింది. తరువాత తరచుగా మతసంఘర్షణలు చోటుచేసుకున్నాయి. అస్సాం రాష్ట్రంలోని స్వాతంత్ర్యపోరాటవీరులలో ఒకరైన జొజారాం శర్మ ఈ జిల్లాలో నివసించాడు. జిల్లాలో ఒక పురాతనమైన ప్రార్థనా మందిరం (అస్సామీయుల ప్రార్ధానా ప్రదేశం) ఉంది. అలాగే ఉడల్గురిలో పురాతన హనుమాన్ ఆలయం ఉంది. అలాగే పురాతన బాప్టిస్ట్ క్రైస్తవ చర్చి ఉంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 832 769.[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 497 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.8% [2]
స్త్రీ పురుష నిష్పత్తి. 966:1000[2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 66.6%
జాతియ సరాసరి (72%) కంటే.
  • అస్సామీ ప్రజలలో బోర్పెటియా, బోడో, కోచ్ రాజ్‌బొంగ్షి, రాభా, సయోటల్, మార్వారి, బెంగాలి హిదువులు మరియు ఇతర ప్రజలు ఉన్నారు.

భౌగోళికం[మార్చు]

ఈ జిల్లా ఉత్తర సరిహద్దులో భూటాన్ మరియు పశ్చిమ కమెంగ్ జిల్లా అరుణాచల్ ప్రదేశ్, తూర్పు సరిహద్దులో సోనిత్‌పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో దర్రాంగ్ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో బక్స జిల్లా ఉంది. జిల్లావైశాల్యం 1852చ.కి.మీ.[3]

అభయారణ్యాలు[మార్చు]

  • మనస్ నేషనల్ పార్క్ (కొంత భాగం)

విభాగాలు[మార్చు]

  • జిల్లా 2 ఉపవిభాగాలుగా విశిపోయింది : ఉడల్గురి మరియు భెర్గావ్.
  • ఉపవిభాగాలు అదనంగా 9 రెవెన్యూ సర్కిల్స్‌గా విడివడ్డాయి: ఉడల్గురి, మజ్‌బాత్, హరిసింగ.కలైగావ్, ఖొయిర్బరి, డాల్గావ్, పతెరీఘాట్, మంగళ్డై మరియు ధెకైజులి.
  • 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : పనెరి, మజ్బాత్ మరియు ఉడల్గురి.
  • ఇవన్నీ మంగళడై పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

1990లో ఉడల్గురి జిల్లాలో " మనస్ నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[4] ఇది ఈ పార్కును ఇతర 4 జిల్లాలతో పంచుకుంటుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. 2.0 2.1 2.2 2.3 "District Census 2011". Census2011.co.in. Cite web requires |website= (help)
  3. Assam state website – Udalguri district
  4. Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Retrieved September 25, 2011. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=ఉడల్గురి&oldid=2101011" నుండి వెలికితీశారు