ఉడ్డియానదేశము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉడ్డియాన మనే ప్రాంతమొకటి భారతదేశంలో ఉండేది. ఫాహీక్ యాత్రికుడు ఇచట 500 సంఘారామములు ఉన్నవని, ఇవిహీనయానానికి చెందినవని, బుద్ధధర్మమిచట గౌరవించబడేదని చెప్పినాడు. 6వ శతాబ్దములో మనదేశానికి వచ్చిన సుంగ్ అయాత్రికులకు ఉడ్డియాన దేశపురాజు గౌరవపూర్వకమైన స్వాగతిమిచ్చాడట. ఈరాజు శాకాహారియని, ఈయన ప్రతిదినము బుద్ధుని పూజించెడివాడని వీరన్నారు. ఈ ఉడ్డియానములో 70 భిక్షువులు గల బౌద్ధ చైత్యమొకటి, 300 భిక్షువులు గల స్వర్ణశకలాలతో నిండిన మరొక చైత్యము, 200 భిక్షువులున్న వేరొక మహాచైత్యము ఉండెడిదని, ఈభిక్షువులు నియమబద్దమైన జీవితమును నడుపుతూ ఉన్నారని కూడా ఈయాత్రికులు పల్కినారు.

ఉడ్డియానములో 1400 సంఘారామములు, 1800 భిక్షువులు ఒకానికప్పుడు ఉండేవారని, తమ కాలానికి ఈసంఖ్య బాగా తగ్గిపోయినదని, వీరనుసరించే మహాయానము లోని గ్రంథాలు వీరికి అర్ధం కావటం లేదని, వీరంతా తాంత్రికులై పోయినారని యువాక్ చ్వాంగ్ వాపోయినాడు. కాని ఇతని తర్వాత వచ్చిన ఇట్సింగ్ వ్రాతలను గమనిస్తే యువాక్ చ్వాంగ్ ఉడ్డియానంలో అడుగుపెట్టి నానడానికి కారణాలు కంపించవు. తవోహిక్ అనే చీనాభిక్షువు ఉడ్డియానమునకు పోయి, అచట సమాధిని ఏర్పరుచుకొని ప్రజ్ఞాపారమితలను అవగాహన చేసికొని సాగెనని ఇట్సింగ్ చెప్పునాడు. చీనాదేశమునించి ముగ్గురు భిక్షువులు ఉడ్డియానమునకు వెళ్ళినారని అచటి భిక్షువొకడీయనకు వర్తమానము నొసగినాడట. ఇచటి రాజు మహాయానము అవలంబించుచు, త్రిరత్నములను పూజించువాడని హువైచవో చెప్పినాడు. క్రీ.వె. 980 ప్రాంతమున ఉడ్డియాన వాస్తవ్యుడైన దానపాలుడు 111 బౌద్ధ గ్రంథాలను వ్రాయటమే కాక చీనాప్రభువుల ఆస్థానములో తన అంత్యదినాలను గడిపినాడంటే ఉడ్డియానమే మహాయానము నకు ఆశ్రయమిచ్చి, బౌద్ధమతమును పోషించిన దేశముగా తెలుస్తున్నది.

ఉడ్డియాన మనే పేరును ఒడ్డియానమని, ఉర్గ్యానమని, ఓడ్యానమని, ఉడయనమని, రకరకాలుగా వ్యవహరించారు.తారానాధుడు మొదలగు వారి వ్రాతలలో కనిపించే ఈశిబాన్ని చూచి ఇది వడ్డెవారి దేశమగు ఒరిస్సా అని కొందరు అంటారు. మరికొందరు దీనిని వంగదేశంలో కనిపెట్టినారు. కాని అసలు ఈ దేశ మెక్కడిదో తెలిసికొనుటకు రెండు ఆధారాలు కనిపిస్తున్నవి.

మొదటి ఆధారము వజ్రయానము మహాయానముతో బాటు వజ్రయానమనే తెగ బుద్ధ మతంలో బయలుదేరింది. జ్ఞానోదయమైన 16సం.లకు బుద్ధుడు ధాన్యకటక వచ్చినాడని అప్పుడచట మూడవ ధాన్యకటక మొచ్చినాడని అప్పుడచట మూడవ ధర్మచక్రమును ప్రవర్తింప జేసినాడని, ఇదే వజ్రయానమని టిబెట్ దేశపు చరిత్రకారుల నేకులు వ్రాసినారు. పద్మవజ్రుడనే బౌద్ధాచార్యుడు గుహ్య సమాజ, హేవజ్రతంత్రములను వ్రాసి వాటిలో వజ్రయానమును లేవదీసినాడు.ఈయన శిష్యుడు అనంగవజ్రుడు అనేక వజ్రయాన గ్రంథాలను రచించాడు. అనంగవజ్రుని శిష్యుడు ఇంద్రభూతి ఇతను ఒడియానసిద్ధుడని ప్రసిద్ధి. ఇంద్రభూతి కుమారుడు పద్మసంభువుడు.మొదత టిబెట్ దేశానికి వెళ్ళిన శాంతరక్షకుడు అచటి రాజును ప్రోత్సాహించి ఆయనచే తన బావమరిదియగు పద్మసంభవుని ఆహ్వానింపజేసాడని, తర్వాత క్రీ.శ 747లో పద్మసంభవుడు టిబెట్ జేరి అక్కడ మొట్టమొదట చైత్యమును క్రీ.శ.749లో నిర్మించానడని తెలుస్తుంది.

రెండవ ఆధారము పద్మసంభువుని చరిత్రలో కనిపిస్తుంది. క్రీ.వె.747లో టిబెట్లో చేరిన పద్మసంభువునకు యెషెట్షోగల్ అనే టిబెట్ దేశపు స్త్రీ ముఖ్య శిష్యురాలు. ఈమెను సరస్వతియొక్క అవతారంగా భావిస్తారు. ఈమె తన గురువుగారి యొక్క జీవిత చరిత్రను వ్రాసింది. అందులో ధనకోశమని పిలువబడే ప్రధాన సరోవరమున్నది. ఉడ్డియానమునకు వాయవ్య దిశన ఈ '''ధాన్యకటము '' ఉన్నదని, అందలు పలు సరస్సులు కలవట. అంటే ఉడ్డియాన దేశములో ధాన్యకటకము కలదని ఇదే నాగార్జుని కొండ ఉన్న మండలం. ఈ చరిత్రను బట్టి ఉడ్డియాన దేశమనగా ధాన్యకటక ప్రాంతమని, ఇదే వజ్రయానదేశమనీ, ఇచటి శ్రీ పర్వతమే వజ్రపర్వతమనీ ఇచట వజ్రయానబౌద్ధము క్రీ.వె.16వ శతాబ్దందాకా ఉన్నదని చెప్పవచ్చును.

పైకి ఎగరుపోవుట అనే అర్ధంలో ఉడ్డియాన శబ్దం కనిపిస్తుంది.

అడవి జాతి బియ్యమనే అర్ధముతో ఓడీ అనే శబ్దమొకటి ఉంది. ఈ బియ్యాన్ని ఆధారంగా చేసుకొని జీవించేవారు ఓడివాసులు కావచ్చును. ఏది ఎట్లున్నా వజ్రయానికులే ఓడియాసులు, ఉడ్డియానులు కావచ్చును. వీరి మంత్రాలకు ధారణీలని పేరు. అందుచేత వీరికి ప్రధానాశ్రయము ఇచ్చిన ధాన్యకటకము ధరణీకోటాయినది.వీరి ముఖ్య పీఠము వజ్రపర్వతమనే శ్రీపర్వతము. నేడు వజ్రాలదిన్నె అనబడే వీరి ఉపపీఠము కావచ్చును. పైగా జగ్గయ్యపేట దగ్గరగా నున్న నేడు ధనంబోడు అనబడే ఒకఊరు ఉంది. ఈధనంబోడులో మళ్ళీ ధారణీ శబ్దమే కనపడును.ఉడ్డియానులకు ఇది స్థావరమై ఉంది.

బౌద్ధుల యోగాభ్యాసంలో అతి ప్రాచీన కాలం నుంచీ ధ్యానాలు, సమాధులే కాక బుద్ధిపాదాలనేవి కూడా ఉన్నాయి. బహుశః బుద్ధి అనే శబ్దానికి ఉడ్ది అనేది వికృతి కావచ్చును. వృద్దిశబ్దము వడ్డి అయినట్లు బుద్ధిశబ్దం ఉడ్డి నుండి కావచ్చును. ఈవజ్రయానీకుల ధారణీలలో బుద్ధిపాదాల కతి విశిష్టమైన స్థానమున్నది. అతిలోక శక్తులను వశపరుచుకొనుట, తత్త్వమును సాక్షాత్కరించుకొనుట, సిద్దులను పొందుట అనేవన్ని ఇది ఆచరించపడే దేశానికి కూడా ఉడ్డియానమనే పేరు వచ్చింది.

[1]

మూలాలు[మార్చు]

  1. * 1956న భారతి మాస పత్రిక: వ్యాసము ఉడ్డియానదేశము - రచన : శ్రీ [[పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి.