Jump to content

ఉత్తమ స్క్రీన్‌ప్లేకు జాతీయ చలనచిత్ర పురస్కారం

వికీపీడియా నుండి
ఉత్తమ స్క్రీన్‌ప్లేకు జాతీయ చలనచిత్ర పురస్కారం
భారతీయ సినిమా తోడ్పాటుకు జాతీయ పురస్కారం
Awarded forసంవత్సరపు ఉత్తమ చలనచిత్ర స్క్రీన్ ప్లే (కథా రచన)
Sponsored byనేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
Reward(s)
  • రజత కమలం
  • ₹2,00,000
మొదటి బహుమతి1967 (ఒరిజినల్ స్క్రీన్ ప్లే)
2009 (రూపాంతరం చెందించిన స్క్రీన్ ప్లే, సంభాషణలు)
ఇటీవలి విజేతసుకుమార్, యోగేష్ దేశ్‌పాండే, వెంకీ అట్లూరి (2024)

ఉత్తమ స్క్రీన్‌ప్లేకు జాతీయ చలనచిత్ర పురస్కారం అనేది భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ప్రతి సంవత్సరం ప్రదానం చేసే విభాగాల్లో ఒకటి. ఈ పురస్కారాన్ని భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అందజేస్తుంది. ఇది ఫీచర్ చిత్రాలకు ప్రదానం చేసే అనేక పురస్కారాల్లో ఒకటి. విజేతకు రజత కమలం ప్రదానం చేస్తారు. దేశవ్యాప్తంగా ఒక సంవత్సరంలో నిర్మితమైన అన్ని భారతీయ భాషల చిత్రాలను పరిగణనలోకి తీసుకొని ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. 2024 నాటికి ఈ పురస్కారంలో రజత కమలం, ప్రశంసాపత్రం, ₹2,00,000 నగదు బహుమతి ఉన్నాయి.[1]

జాతీయ చలనచిత్ర పురస్కారాలను 1954లో "ఉన్నత సౌందర్య, సాంకేతిక ప్రమాణాలు, విద్యా-సాంస్కృతిక విలువలు కలిగిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి" స్థాపించారు. అలాగే ప్రాంతీయ భాషా చిత్రాలకు కూడా పురస్కారాలను అందించాలని ప్రణాళిక రూపొందించారు.[2][3] ఈ పురస్కారాలు ప్రారంభంలో "స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్" పేరుతో ప్రారంభమయ్యాయి. అనంతరం 1967లో జరిగిన 15వ జాతీయ చలనచిత్ర పురస్కారాల సందర్భంగా వాటి పేరును "భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు"గా మార్చడంతో పాటు "ఉత్తమ స్క్రీన్‌ప్లే" విభాగాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ పురస్కారంలో ఒక ఫలకంతో పాటుగా నగదు బహుమతి అందజేసేవారు.[4]

2009లో జరిగిన 57వ జాతీయ చలనచిత్ర పురస్కారాల నుంచి ఈ విభాగాన్ని ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ అనువాదిత స్క్రీన్‌ప్లే, ఉత్తమ సంభాషణలు అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా విభజించారు. [5] భారతీయ చలనచిత్ర పరిశ్రమ సుమారు ఇరవై భాషలు, మాండలికాల్లో చిత్రాలను నిర్మిస్తున్నప్పటికీ,[6] 2022 నాటికి ఈ పురస్కారాన్ని అందుకున్న 73 మంది ప్రత్యేక కథా రచయితలు తొమ్మిది ప్రధాన భాషల్లో రచనలు చేశారు. వాటిలో హిందీ (20 పురస్కారాలు), మలయాళం (12), బెంగాలీ (11), తమిళం (9), మరాఠీ (8), కన్నడ (5), తెలుగు (4), ఆంగ్లం (2), సంస్కృతం మరియు అస్సామీ (తలా 1) ఉన్నాయి.

ఈ విభాగంలో తొలి పురస్కారం 1967లో మలయాళ చిత్రం అగ్నిపుత్రికి కథా రచన చేసిన ఎస్.ఎల్. పురం సదానందన్‌కు లభించింది.[4] 23వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (1975) సందర్భంగా ఈ విభాగంలో ఎటువంటి పురస్కారం ప్రదానం చేయలేదు.[7]

2016 నాటికి మలయాళ రచయిత, కథా రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్ ఈ విభాగంలో అత్యధికంగా నాలుగు సార్లు పురస్కారం అందుకున్న వ్యక్తిగా నిలిచాడు. ఆయన ఒరు వడక్కన్ వీరగాథ (1989), కడవు(1991),[8] సదయం (1992),[9] పరిణయం (1994)[10]చిత్రాలకు ఈ పురస్కారాలు దక్కాయి.

బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే మరణానంతరం 1993లో ఉత్తరణ్ చిత్రానికి ఈ పురస్కారం అందుకున్నాడు. [11]అంతకుముందు ఆయన ప్రతిద్వంది (1970), సోనార్ కెల్లా (1974) చిత్రాలకు కూడా ఈ విభాగంలో పురస్కారాలు అందుకున్నాడు.[12][13]

పురస్కారం

[మార్చు]

ఈ పురస్కారాన్ని తొలిసారిగా అందుకున్న ఎస్.ఎల్. పురం సదానందన్‌కు ఒక ఫలకంతో పాటు ₹5,000 నగదు బహుమతి ప్రదానం చేశారు.[4] అనంతరం 21వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (1973) సందర్భంగా ఈ పురస్కారంలో మార్పులు చేసి, ₹10,000 నగదు బహుమతి, ఒక రజత పతకం, ప్రశంసాపత్రాన్ని చేర్చారు. ఆ సంవత్సరంలో బెంగాలీ చిత్రం పదాతిక్కు మృణాల్ సేన్, ఆశిష్ బర్మన్‌లు సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.[14]

54వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (2006) సందర్భంగా ఈ పురస్కారాన్ని మరోసారి సవరించి, నగదు బహుమతిని ₹50,000కు పెంచారు. ఈ పురస్కారం మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని ప్రతిబింబించిన హిందీ చిత్రం లగే రహో మున్నాభాయ్‌కు కథా రచన చేసిన అభిజత్ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, విధు వినోద్ చోప్రాలకు ప్రదానం చేశారు.[15] 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (2022) సందర్భంగా నగదు బహుమతిని ₹2,00,000కు పెంచారు.[1]

విజేతలు

[మార్చు]
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత సుకుమార్

ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో పురస్కార గ్రహీతల జాబితా:

పురస్కారాల సంకేతాలు
స్క్రీన్ ప్లే రచయిత (ఒరిజినల్)
స్క్రీన్ ప్లే రచయిత (అనువాద)
సంభాషణలు
పురస్కార గ్రహీతల జాబితా — పురస్కార సంవత్సరం, చిత్రం(లు), భాష(లు)తో సహా
సంవత్సరం గ్రహీత(లు) చిత్రం(లు) భాష(లు) రిఫరెన్స్
1967
(15వ)
ఎస్.ఎల్. పురం సదానందన్ అగ్నిపుత్రి మలయాళం [4]
1968
(16వ)
పండిట్ ఆనంద్ కుమార్ అనోఖీ రాత్ హిందీ [16]
1969
(17వ)
పుట్టణ్ణ కణగాల్ గెజ్జె పూజె కన్నడ [17]
1970
(18వ)
సత్యజిత్ రే ప్రతిద్వంది బెంగాలీ [12]
1971
(19వ)
తపన్ సిన్హా ఎఖోనీ [18]
1972
(20వ)
గుల్జార్ కోషిష్ హిందీ [19]
1973
(21వ)
మృణాళ్ సేన్ పదాతిక్ బెంగాలీ [14]
ఆశిష్ బర్మన్
1974
(22వ)
సత్యజిత్ రే సోనార్ కెల్లా [13]
1975
(23వ)
పురస్కారం ప్రకటించలేదు [7]
1976
(24వ)
విజయ్ టెండూల్కర్ మంథన్ హిందీ [20]
1977
(25వ)
సత్యదేవ్ దూబే భూమిక [21]
శ్యామ్ బెనగళ్
గిరీష్ కర్నాడ్
1978
(26వ)
టి. ఎస్. రంగా గ్రహణ కన్నడ [22]
టి.ఎస్.నాగాభరణ
1979
(27వ)
సాయి పరాంజపే స్పర్శ్ హిందీ [23]
1980
(28వ)
మృణాళ్ సేన్ అకలేర్ సంధానే బెంగాలీ [24]
1981
(29వ)
కె. బాలచందర్ తన్నీర్ తన్నీర్ తమిళ్ [25]
1982
(30వ)
మృణాళ్ సేన్ ఖరీజ్ బెంగాలీ [26]
1983
(31వ)
జి.వి.అయ్యర్ ఆది శంకరాచార్య సంస్కృతం [27]
1984
(32వ)
అడూర్ గోపాలక్రిష్ణన్ ముఖాముఖం మలయాళం [28]
1985
(33వ)
భబేంద్రనాథ్ సైకియా అగ్నిస్నాన్ అస్సామీ [29]
1986
(34వ)
బుద్ధదేవ్ దాస్‌గుప్తా ఫెరా బెంగాలీ [30]
1987
(35వ)
అడూర్ గోపాలక్రిష్ణన్ అనంతరం మలయాళం [31]
1988
(36th)
అరుంధతీ రాయ్ ఇన్ విచ్ ఆనీ గివ్స్ ఇత్ దోజ్ వన్స్ ఇంగ్లీష్ [32]
1989
(37వ)
ఎం.టి.వాసుదేవన్ నాయర్ ఒరు వడక్కన్ వీరగాథ మలయాళం [33]
1990
(38వ)
కె.ఎస్. సేతుమాధవన్ మరుపక్కమ్ తమిళ్ [34]
1991
(39వ)
ఎం.టి.వాసుదేవన్ నాయర్ కడవు మలయాళం [8]
1992
(40వ)
ఎం.టి.వాసుదేవన్ నాయర్ సదయం [9]
1993
(41వ)
సత్యజిత్ రే
(మరణానంతరం)
ఉత్తరణ్ బెంగాలీ [11]
1994
(42వ)
ఎం.టి.వాసుదేవన్ నాయర్ పరిణయం మలయాళం [10]
1995
(43వ)
అశోక్ మిశ్రా నసీమ్ హిందీ [35]
సయీద్ అఖ్తర్ మీర్జా
1996
(44వ)
అగథియన్ కాదల్ కొట్టై తమిళ్ [36]
1997
(45వ)
రితుపర్ణో ఘోష్ దహన్ బెంగాలీ [37]
1998
(46వ)
అశోక్ మిశ్రా సమర్ హిందీ [38]
1999
(47వ)
మాడంపు కుంజుకుట్టన్ కరుణం మలయాళం [39]
2000
(48వ)
భారతీరాజా కాదల్ పూక్కల్ తమిళ్ [40]
2001
(49వ)
జి. నీలకంఠ రెడ్డి షో తెలుగు [41]
2002
(50వ)
అపర్ణా సేన్ మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ ఇంగ్లీషు [42]
2003
(51వ)
గౌతమ్ ఘోష్ అబర్ అరణ్యె బెంగాలీ [43]
2004
(52వ)
మనోజ్ త్యాగి పేజ్ 3 హిందీ [44]
నీనా అరోరా
2005
(53వ)
ప్రకాష్ ఝా అపహరణ్ [45]
శ్రీధర్ రాఘవన్
మనోజ్ త్యాగి
2006
(54వ)
అభిజత్ జోషి లగే రహో మున్నా భాయ్ [15]
రాజ్‌కుమార్ హిరానీ
విధు వినోద్ చోప్రా
2007
(55వ)
ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ గాంధీ, మై ఫాదర్ [46]
2008
(56వ)
సచిన్ కుందాల్కర్ గంధా మరాఠీ [47]
2009
(57వ)
పి. ఎఫ్. మాథ్యూస్ కుట్టి శ్రాంక్ మలయాళం [5]
హరికృష్ణ
గోపాలకృష్ణ పాయ్ కనసెంబ కుదిరెయనేరి కన్నడ
గిరీష్ కాసరవల్లి
పాండిరాజ్ పసంగ తమిళ్
2010
(58వ)
వెట్రిమారన్ ఆడుకాలం [48]
అనంత్ మహదేవన్ మీ సింధుతాయ్ సప్కల్ మరాఠీ
సంజయ్ పవార్
సంజయ్ పవార్ మీ సింధుతాయ్ సప్కల్
2011
(59వ)
వికాస్ బహల్ చిల్లర్ పార్టీ హిందీ [49]
నితేష్ తివారి
విజయ్ మౌర్య
అవినాష్ దేశ్‌పాండే నిగ్డి శాల మరాఠీ
గిరీశ్ కులకర్ణి దేవూళ్
2012
(60వ)
సుజోయ్ ఘోష్ కహానీ హిందీ [50]
భావేష్ మండలియా OMG: ఓ మై గాడ్!
ఉమేష్ శుక్లా
అంజలీ మీనన్ ఉస్తాద్ హోటల్ మలయాళం
2013
(61వ)
పి.శేషాద్రి డిసెంబర్ 1 కన్నడ [51]
పంచాక్షరి ప్రకృతి
సుమిత్ర భావే అస్తు మరాఠీ
2014
(62వ)
శ్రీజిత్ ముఖర్జీ చొతుష్కోణె బెంగాలీ [52]
జోషి మంగళత్ ఒట్టాల్ మలయాళం
విశాల్ భరద్వాజ్ హైదర్ హిందీ
2015
(63rd)
జూహీ చతుర్వేది పీకూ
హిమాంశు శర్మ తను వెడ్స్ మను రిటర్న్స్
విశాల్ భరద్వాజ్ తల్వార్
2016
(64వ)
శ్యామ్ పుష్కరన్ మహేశింతే ప్రతికారం మలయాళం [53]
సంజయ్ కృష్ణాజీ పాటిల్ దశక్రియ మరాఠీ
తరుణ్ భాస్కర్ దాస్యం పెళ్ళి చూపులు తెలుగు
2017
(65వ)
సజీవ్ పళూర్ తొందిముతలం ద్రిక్షక్షియమ్ మలయాళం [54]
జయరాజ్ భయానకం
సంబిత్ మొహంతి
(మరణానంతరం)
హలో ఆర్సి ఒరియా
2018
(66వ)
రాహుల్ రవీంద్రన్ చి.ల.సౌ. తెలుగు
శ్రీరామ్ రాఘవన్ అంధాధున్ హిందీ [55]
అరిజిత్ బిశ్వాస్
యోగేష్ చెడేకర్
హేమంత్ రావు
పూజా లాధా సూర్తి
చుర్ని గంగూలీ తారిఖ్ బెంగాలీ
2019
(67వ)
కౌశిక్ గంగూలీ జ్యేష్ఠోపుత్రో [56]
శ్రీజిత్ ముఖర్జీ గుమ్నామి
వివేక్ రంజన్ అగ్నిహోత్రి ది తాష్కెంట్ ఫైల్స్ హిందీ
2020
(68వ)
సుధ కొంగర సూరరై పొత్రు తమిళ్
శాలిని ఉషాదేవి
మడోన్నే అశ్విన్ మండేలా
2021
(69వ)
షాహీ కబీర్ నాయట్టు మలయాళం
సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయి కతియావాడి హిందీ
ఉత్కర్షిణీ వాశిష్ట
ప్రకాష్ కపాడియా
2022
(70వ)
ఆనంద్ ఏకర్షి ఆట్టం మలయాళం
అర్పితా ముఖర్జీ గుల్‌మొహర్ హిందీ
రాహుల్ వి.చిత్తెల్ల
2023
(71వ)
సాయి రాజేష్ బేబీ తెలుగు
రాంకుమార్ బాలకృష్ణన్ పార్కింగ్ తమిళ్
దీపక్ కింగ్రానీ సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై హిందీ
2024
(72వ)
సుకుమార్ పుష్ప 2: ది రూల్ తెలుగు [57]
యోగేష్ దేశ్‌పాండే స్వర్ గంధర్వ సుధీర్ ఫడ్కే మరాఠీ
వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తెలుగు

మూలాలు

[మార్చు]
  1. 1 2 Under Secretary to the Government of India (14 December 2023). "Report on Rationalization of Awards Conferred by the Ministry of Information & Broadcasting | Ministry of Information and Broadcasting | Government of India". Ministry of Information and Broadcasting. Retrieved 25 August 2024.
  2. "1st National Film Awards". International Film Festival of India. Archived from the original on 17 May 2017. Retrieved 10 May 2017.
  3. "1st National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Retrieved 10 May 2017.
  4. 1 2 3 4 "15th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 21 September 2011.
  5. 1 2 "57th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 28 March 2012.
  6. "About National Film Awards". Directorate of Film Festivals]. Retrieved 13 May 2017.
  7. 1 2 "23rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
  8. 1 2 "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 February 2012.
  9. 1 2 "40th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2 March 2012.
  10. 1 2 "42nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 5 March 2012.
  11. 1 2 "41st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 3 March 2012.
  12. 1 2 "18th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 26 September 2011.
  13. 1 2 "22nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 1 October 2011.
  14. 1 2 "21st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 29 September 2011.
  15. 1 2 "54th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 24 March 2012.
  16. "16th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 22 September 2011.
  17. "17th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 26 September 2011.
  18. "19th National Film Awards 1972". Retrieved 12 July 2012.
  19. "20th National Film Awards". International Film Festival of India. Archived from the original on 5 November 2013. Retrieved 26 September 2011.
  20. "మరాఠీplaywright Vijay Tendulkar passes away". The Times of India. 19 May 2008. Retrieved 12 July 2012.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  21. "25th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
  22. "26th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
  23. "27th National Film Awards". Retrieved 10 July 2012.
  24. "28th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
  25. "29th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
  26. "30th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
  27. "31st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 December 2011.
  28. "32nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 6 January 2012.
  29. "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 7 January 2012.
  30. "34th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 7 January 2012.
  31. "35th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012.
  32. "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012.
  33. "37th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 29 January 2012.
  34. "38th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012.
  35. "43rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 6 March 2012.
  36. "44th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012.
  37. "45th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 11 March 2012.
  38. "46th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 12 March 2012.
  39. "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 13 March 2012.
  40. "48th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 13 March 2012.
  41. "49th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 14 March 2012.
  42. "50th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 14 March 2012.
  43. "51st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 15 March 2012.
  44. "52nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 28 January 2012.
  45. "53rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 19 March 2012.
  46. "55th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 26 March 2012.
  47. "56th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 March 2012.
  48. "58th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 29 March 2012.
  49. "59th National Film Awards for the Year 2011 Announced". Press Information Bureau (PIB), India. Retrieved 7 March 2012.
  50. "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 18 March 2013.
  51. "61st National Film Awards" (PDF). Directorate of Film Festivals. 16 April 2014. Archived from the original (PDF) on 16 April 2014. Retrieved 16 April 2014.
  52. "62nd National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. 24 March 2015. Retrieved 24 March 2015.
  53. "64th National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 6 June 2017. Retrieved 7 April 2017.
  54. "Odia film Hello Arsi wins big at 65th National Film Awards - Times of India". The Times of India. Retrieved 2019-03-03.
  55. "66th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 August 2019.
  56. "67th National Film Awards" (PDF). Directorate of Film Festivals.
  57. "72nd National Film Awards: Mammootty, Kartik Aaryan, Article 370 win; check winners list". The Indian Express (in ఇంగ్లీష్). 2026-07-18.

బయటి లింకులు

[మార్చు]