ఉత్తర లఖింపూర్
ఉత్తర లఖింపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°14′29″N 94°6′20″E / 27.24139°N 94.10556°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | లఖింపూర్ |
Government | |
• Body | ఉత్తర లఖింపూర్ పురపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 13.74 కి.మీ2 (5.31 చ. మై) |
Elevation | 101 మీ (331 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 59,814 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 787001[2] |
టెలిఫోన్ కోడ్ | 91-3752[3] |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్-07 |
ఉత్తర లఖింపూర్, అస్సాం రాష్ట్రంలోని లఖింపూర్ జిల్లా ముఖ్య పట్టణం, పురపాలక సంస్థ. ఈ పట్టణం ఈశాన్య గువహాటికి 394 కి.మీ. (245 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది లఖింపూర్ జిల్లా ప్రధాన కార్యాలయం.
భౌగోళికం
[మార్చు]ఈ పట్టణం 27° 13' 60 N 94° 7' 0 E అక్షాంక్షరేఖాంశాల మధ్య ఉంది.[4] లఖింపూర్ ముఖ్యమైన భాగాలలో ఫుల్బరి, లాలూక్, ధకువాఖానా, నారాయణపూర్, నౌబోయిచా, టౌన్ బాంటో, చెటియా పారా, ఖెల్మతి, ఎన్‌టి రోడ్, డికె రోడ్, కెబి రోడ్, సిడి రోడ్, నకారి, బోర్మురియా, జోయిహింగ్, మొయిడోమియా ప్రాంతాలు ఉన్నాయి.
జనాభా
[మార్చు]2001 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం,[5] ఉత్తర లఖింపూర్ జనాభా 54,262గా ఉంది. జనాభా ప్రకారం, ఇది క్లాస్ -2 (50,000 - 99,999 నివాసుల మధ్య) నగరంగా వర్గీకరించబడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం, దీని జనాభా 105,376గా ఉంది.[6]
ఈ మొత్తం జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. ఉత్తర లఖింపూర్ సగటు అక్షరాస్యత రేటు 89% కాగా, జాతీయ సగటు 65% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 90%, స్త్రీ అక్షరాస్యత 87%గా ఉంది. ఉత్తర లఖింపూర్‌లో, జనాభాలో 13%మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు.
పరిపాలన
[మార్చు]2016 నుండి ఉత్పాల్ దత్తా లఖింపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు.[7][8]
రవాణా
[మార్చు]ఉత్తర లఖింపూర్‌ను 'అరుణాచల్‌కు గేట్‌వే'గా పరిగణిస్తారు. ఇది రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు కలుపబడి ఉంది.
వాయుమార్గం
[మార్చు]ఈ పట్టణం నుండి 5 కి.మీ.ల (3.1 మైళ్ళు) దూరంలో లీలాబరి విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుండి వారానికి నాలుగు (ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం) రోజులలో కోల్‌కతా, గువహాటిలకు అలయన్స్ ఎయిర్ సర్వీస్ ద్వారా విమానాలు నడుపబడుతున్నాయి.
రైలుమార్గం
[మార్చు]రంగియా రైల్వే డివిజన్‌లోని రంగియా -ముర్కాంగ్‌సెలెక్ విభాగానికి చెందిన ఉత్తర లఖింపూర్ రైల్వే స్టేషన్ నకారి వద్ద ఉంది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (ముర్కాంగ్‌సెలెక్-కామాఖ్యా) గువహాటి నుండి ఉత్తర లఖింపూర్, గౌహతి (కామాఖ్యా స్టేషన్.) మధ్య రంగియా, రంగపారా, బిశ్వనాథ్ చారియాలి మొదలైన వాటి ద్వారా పనిచేస్తోంది. మరో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (నహర్‌లాగన్-గౌహతి) గువహాటి నుండి హర్ముతి, గువహాటి మధ్య రంగియా, రంగపారా, బిశ్వనాథ్ చారియాలి మొదలైన వాటి ద్వారా నడుస్తోంది. హర్ముతి రైల్వే స్టేషన్ (జెఎన్) జిల్లా ముఖ్య పట్టణం నుండి సుమారు 30 కి.మీ. ఉన్న హర్ముతిలో ఉంది.
రోడ్డుమార్గం
[మార్చు]ఉత్తర లఖింపూర్ పట్టణం అనేక రోడ్డు మార్గాల ద్వారా కలుపబడి ఉంది. ఈ పట్టణం మీదుగా 15వ నూతన జాతీయ రహదారి వెళుతుంది. ఎసి, నాన్-ఎసి బస్సులు అస్సాం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి అందుబాటులో ఉన్నాయి. గువహాటి, ఇతర సుదూర ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి.
మీడియా
[మార్చు]లఖింపూర్‌లో ఆల్ ఇండియా రేడియో రిలే స్టేషన్ ఉంది, దీనిని ఆకాశవాణి లఖింపూర్ అని పిలుస్తారు. అసోమియా ప్రతిదిన్, అమర్ అసోమ్ అనే అస్సామీ భాషా వార్తాపత్రికలు ఉన్నాయి.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- పద్మనాథ్ గోహైన్ బారువా
- ఉద్ధాబ్ భారలి (ఆవిష్కర్త)
- లాబన్య దత్తా గోస్వామి (1952-2009)
- రాజ్ జె కొన్వర్ (బాలీవుడ్ గాయకుడు)
మూలాలు
[మార్చు]- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 11 November 2020.
- ↑ India Post. "Pincode search - North Lakhimpur". Archived from the original on 16 జూలై 2011. Retrieved 11 November 2020.
- ↑ Bharat Sanchar Nigam Ltd. "STD Codes for cities in Assam". Archived from the original on 26 మే 2011. Retrieved 11 నవంబరు 2020.
- ↑ Falling Rain Genomics, Inc. "North Lakhimpur, India Page". Retrieved 11 July 2008.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 11 November 2020.
- ↑ Census of India. "Alphabetical list of towns and their population - Assam" (PDF). Retrieved 11 November 2020.
- ↑ "Lakhimpur LAC unit of Asom Chatra Parishad constituted at Gana Bhavan - Sentinelassam". www.sentinelassam.com (in ఇంగ్లీష్). 20 August 2020. Retrieved 11 November 2020.
- ↑ "Lakhimpur Assembly Election 2016 Latest News & Results". India.com (in ఇంగ్లీష్). Retrieved 11 November 2020.