ఉత్తర సముద్రం
| ఉత్తర సముద్రం | |
|---|---|
| స్థానం | పశ్చిమ ఐరోపా, ఉత్తర ఐరోపా |
| నిర్దేశాంకాలు | 56°N 3°E / 56°N 3°E |
| రకం | సముద్రం |
| సరస్సులోకి ప్రవాహం | బాల్టిక్ సముద్రం, ఎల్బే, వెసర్, రైన్/వాల్, మ్యూస్, షెల్డ్ట్, స్పే, డాన్, డీ, టే, ఫోర్త్, టైన్, వియర్, టీస్, హంబర్, థేమ్స్ |
| పరీవాహక దేశాలు | యునైటెడ్ కింగ్‌డమ్ (ముఖ్యంగా ఇంగ్లాండ్, స్కాట్లాండ్), నార్వే, డెన్మార్క్, జర్మనీ (ముఖ్యంగా లోవర్ సాక్సనీ, ష్లెస్విగ్-హోల్‌స్టీన్), నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, లీక్టెన్‌స్టైన్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ |
| గరిష్ట పొడవు | 960 km (600 mi) |
| గరిష్ట వెడల్పు | 580 km (360 mi) |
| ఉపరితల వైశాల్యం | 570,000 km2 (220,000 sq mi) |
| సరాసరి లోతు | 95 m (312 ft) |
| గరిష్ట లోతు | 700 m (2,300 ft) |
| 54,000 km3 (4.4×1010 acre⋅ft) | |
| మూలాలు | Seatemperature.org and Royal Belgian Institute of Natural Sciences |
ఉత్తర సముద్రం గ్రేట్ బ్రిటన్, డెన్మార్క్, నార్వే, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్‌ల మధ్య ఉంది. ఇది యూరోపియన్ ఖండాంతర షెల్ఫ్‌లోని సముద్రం. ఇది దక్షిణాన ఇంగ్లీష్ ఛానల్, ఉత్తరాన నార్వేజియన్ సముద్రం ద్వారా అట్లాంటిక్ మహాసముద్రానికి కలుపుతుంది. ఇది 970 kilometres (600 mi) పొడవు, 580 kilometres (360 mi) వెడల్పు, 570,000 square kilometres (220,000 sq mi) వైశాల్యంతో ఉంటుంది.
కీలకమైన ఉత్తర యూరోపియన్ షిప్పింగ్ మార్గాలు ఉత్తర సముద్రం గుండా వెళ్తాయి. ఇది ఒక ప్రధాన మత్స్య సంపదకు ఇది ప్రధానమైన వనరు. సరిహద్దు దేశాలలో వినోదం, పర్యాటకాలకు ఈ తీరం ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. పవన, తరంగ శక్తితో సహా శక్తి వనరులకు గొప్ప వనరు.
ఉత్తర సముద్రం భౌగోళిక, రాజకీయ, సైనిక వ్యవహారాలలో, ముఖ్యంగా ఉత్తర ఐరోపాలో, మధ్య యుగం నుండి ఆధునిక యుగం వరకు ప్రముఖంగా ఉంటూ వచ్చింది. మధ్య యుగాలలో మొదలై ఆధునిక యుగంలోనూ ప్రపంచవ్యాప్తంగా విలసిల్లిన ఉత్తర యూరోపియన్ల శక్తి సామర్థ్యాలలో కూడా ఉత్తర సముద్రానిది ముఖ్యమైన పాత్ర. వైకింగుల ఆధిపత్యంలో ఉత్తర సముద్రమే కేంద్రం. హాన్సియాటిక్ లీగ్, డచ్ రిపబ్లిక్, బ్రిటన్ అన్నీ ఉత్తర సముద్రంపై పట్టు సాధించడానికీ, ప్రపంచ మార్కెట్లు, వనరులను పొందేందుకూ ప్రయత్నించాయి. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో సముద్రానికి ఏకైక ప్రవేశ ద్వారంగా, జర్మనీకి ఉత్తర సముద్రం వ్యూహాత్మకంగా ముఖ్యమైనది.
తీరప్రాంతానికి వైవిధ్యమైన భూగర్భం, భౌగోళిక స్వరూపం ఉంది. ఉత్తరాన, నార్వే, స్కాట్లాండ్ తీర-ప్రాంతాల్లో లోతైన ఫ్యోర్డ్‌లు, నిటారుగా ఉన్న కొండ చరియలు ఉంటాయి. దక్షిణాన తీరంలో ప్రధానంగా ఇసుక బీచ్‌లు, పొడవైన నదుల నదీముఖద్వారాలు, విశాలమైన బురద మైదానాలూ ఉంటాయి. సాంద్ర జనాభా, భారీ పారిశ్రామికీకరణ, సముద్రం, దాని చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్రమైన వినియోగం కారణంగా, వివిధ పర్యావరణ సమస్యలు సముద్ర పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రతికూల పర్యావరణ సమస్యలు – సాధారణంగా ఓవర్ ఫిషింగ్, పారిశ్రామిక, వ్యవసాయ ప్రవాహం, త్రవ్వకం, డంపింగ్, తదితరాలతో సహా – క్షీణతను నివారించడానికి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి అనేక ప్రయత్నాలకు దారితీసాయి.
భౌగోళికం
[మార్చు]ఉత్తర సముద్రానికి పశ్చిమాన ఓర్క్నీ దీవులు, గ్రేట్ బ్రిటన్ తూర్పు తీరం, తూర్పు దక్షిణాల్లో ఉత్తర మధ్య యూరోపియన్ ప్రధాన భూభాగం సరిహద్దులుగా ఉన్నాయి. తీరదేశాల్లో నార్వే, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ లున్నాయి.[1] నైరుతిలో, డోవర్ జలసంధి కి ఆవల ఉత్తర సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రానికి అనుసంధానించే ఇంగ్లీష్ ఛానల్‌గా మారుతుంది.[2][1] తూర్పున, ఇది స్కాగెరాక్, కట్టెగాట్ ల ద్వారా బాల్టిక్ సముద్రంతో కలుస్తుంది.[1] ఇది డెన్మార్క్‌ను నార్వే, స్వీడన్ ల నుండి వేరు చేసే ఇరుకైన జలసంధి.[2] ఉత్తరాన దీనికి షెట్లాండ్ దీవులు సరిహద్దులుగా ఉన్నాయి. ఆర్కిటిక్ మహాసముద్రంలో ఒక ఉపాంత సముద్రమైన నార్వేజియన్ సముద్రంతో కలుస్తుంది.[2][3]
ఉత్తర సముద్రం 970 kilometres (600 mi) పొడవు, 580 kilometres (360 mi) వెడల్పు, 750,000 square kilometres (290,000 sq mi) విస్తీర్ణం, 54,000 cubic kilometres (13,000 cu mi) ఘనపరిమాణంతో ఉంది.[4] ఉత్తర సముద్రం అంచుల చుట్టూ షెట్లాండ్, ఓర్క్నీ, ఫ్రిసియన్ దీవులతో సహా గణనీయమైన సంఖ్యలో ద్వీపాలు, ద్వీపసమూహాలూ ఉన్నాయి. [1] ఉత్తర సముద్రం అనేక యూరోపియన్ ఖండాంతర వాటర్‌షెడ్‌ల నుండి, అలాగే బ్రిటిష్ దీవుల నుండి మంచినీటిని పొందుతుంది. బాల్టిక్ సముద్రం నుండి వచ్చే నీటితో సహా యూరోపియన్ డ్రైనేజీ బేసిన్‌లో ఎక్కువ భాగం ఉత్తర సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఉత్తర సముద్రంలోకి ప్రవహించే అతిపెద్ద, అతి ముఖ్యమైన నదులు ఎల్బే, రైన్ - మ్యూస్. [5] దాదాపు 18.5 కోట్ల మంది ప్రజలు ఉత్తర సముద్రంలోకి ప్రవహించే నదుల పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ నదీ తీరాల్లో కొన్ని పెద్ద పారిశ్రామిక ప్రాంతాలున్నాయి.[6]
ప్రధాన లక్షణాలు
[మార్చు]ఉత్తర సముద్రం లోతు, యూరోపియన్ ఖండాంతర షెల్ఫ్‌లో 90 metres (300 ft) ఉంటుంది. [7] నార్వేజియన్ కందకం దీనికి మినహాయింపు. ఇది ఓస్లో నుండి బెర్గెన్ ఉత్తర ప్రాంతం వరకు నార్వేజియన్ తీరప్రాంతానికి సమాంతరంగా విస్తరించి ఉంది.[2] ఇది 20 and 30 kilometres (12 and 19 mi) వెడల్పుతో, 725 metres (2,379 ft) గరిష్ట లోతుతో ఉంటుంది.[8] తక్కువ లోతు ఉన్న ప్రాంతాలు క్లీవర్ బ్యాంక్, ఫిషర్ బ్యాంక్, నూర్ధిందర్ బ్యాంక్ .
నీటి ప్రసరణ, ఆటుపోట్లు
[మార్చు]ఉత్తర సముద్రంలో నీటి ప్రవాహం అంచుల వెంట అపసవ్య దిశలో తిరుగుతుంది.[9]
అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక విభాగమైన ఉత్తర సముద్రానికి వాయవ్యం నుండి ఎక్కువ సముద్ర ప్రవాహం, ఇంగ్లీష్ ఛానల్ వద్ద ఉన్న చిన్న ద్వారం నుండి తక్కువ మొత్తంలో వెచ్చని ప్రవాహం వస్తాయి. ఈ అలల ప్రవాహాలు నార్వేజియన్ తీరం వెంబడి బయలుదేరుతాయి.[10] ఉపరితలాన, లోతునా ఉన్న నీటి ప్రవాహాలు వేర్వేరు దిశల్లో కదలవచ్చు. తక్కువ లవణీయత ఉండే ఉపరితల తీరప్రాంత జలాలు తీరం నుండి దూరం గాను, లోతుల్లో, అధిక సాంద్రత, అధిక లవణీయత కలిగిన జలాలు తీరం వైపుగానూ కదులుతాయి.[11]
ఖండాంతర షెల్ఫ్‌పై ఉన్న ఉత్తర సముద్రంలో అలలు, లోతైన సముద్ర నీటిలో ఉండే అలల కంటే భిన్నంగా ఉంటాయి. తరంగ వేగం తగ్గి, తరంగ వ్యాప్తి పెరుగుతుంది. ఉత్తర సముద్రంలో రెండు యాంఫిడ్రోమిక్ వ్యవస్థలు, మూడవ అసంపూర్ణ యాంఫిడ్రోమిక్ వ్యవస్థ ఉన్నాయి.[12][13] ఉత్తర సముద్రంలో అలల ఎత్తులో సగటు వ్యత్యాసం సున్నా నుండి 8 మీటర్ల వరకు ఉంటుంది.[4]
| అలల పరిధి (m) (from calendars) |
అలల గరిష్ఠ పరిధి (మీ) | టైడ్ గేజ్ | భౌగోళిక, చారిత్రిక విశేషాలు |
|---|---|---|---|
| 0.79–1.82 | 2.39 | లార్విక్[14] | షెట్‌లాండ్ దీవులు |
| 2.01–3.76 | 4.69 | ఆబర్డీన్[15] | స్కాట్లండ్‌లో డీ నది ముఖద్వారం |
| 2.38–4.61 | 5.65 | నార్త్ షీల్డ్స్[16] | టైన్ ఉప్పుకయ్య ముఖద్వారం |
| 2.31–6.04 | 8.20 | కింగ్‌స్టన్ అపాన్ హల్[17] | హంబర్ ఉప్పుకయ్య ఉత్తరం వైపు |
| 1.75–4.33 | 7.14 | గ్రిమ్స్‌బై[18] | హంబర్ ఉప్పుయ్య దక్షిణం వైపు సముద్రానికి దగ్గరగా |
| 1.98–6.84 | 6.90 | స్కెగ్‌నెస్[19] | వాష్‌కు ఉత్తరాన ఉన్న లింకన్‌షైర్ తీరం |
| 1.92–6.47 | 7.26 | కింగ్స్‌లిన్[20] | వాష్ లోకి గ్రేట్ ఔస్ నది ముఖద్వారం |
| 2.54–7.23 | హన్‌స్టాంటన్[21] | వాష్ తూర్పు కొన | |
| 2.34–3.70 | 4.47 | హార్విచ్[22] | థేమ్‌స్ ఉప్పుకయ్యకు ఉత్తరాన తూర్పు ఆంగ్లికన్ తీరం |
| 4.05–6.62 | 7.99 | లండన్ బ్రిడ్జ్ [23] | థేమ్స్ ఉప్పుకయ్య అంతర్గత భాగం |
| 2.38–6.85 | 6.92 | డన్‌కిర్క్[24] | డోవర్ జలసంధికి తూర్పున ఇసుక దిబ్బ |
| 2.02–5.53 | 5.59 | జీబ్రుగ్గ్[25] | రైన్ - మూస్ - షెల్డ్ట్ డెల్టాకు పశ్చిమాన ఉన్న ఇసుక రేవు |
| 3.24–4.96 | 6.09 | ఏంట్వెర్ప్[26] | రైన్ - మూస్ - షెల్డ్ట్ డెల్టాకు దక్షిణ కొసన ఉన్న ఉప్పుకయ్య |
| 1.48–1.90 | 2.35 | రోట్టర్‌డామ్[27] | రైన్ నది డెల్టా |
| 1.10–2.03 | 2.52 | క్యాట్‌వియ్‌క్[28] | ఉట్వాటరింగ్‌కనాల్ ముఖద్వారం |
| 1.15–1.72 | 2.15 | డెన్ హెల్డర్[29] | ఎస్సెల్మీర్ కు పశ్చిమాన ఉన్న హాలండ్ ఇసుక దిబ్బ |
| 1.67–2.20 | 2.65 | హార్లింగెన్[30] | ఎస్సెల్మీర్ కు తూర్పున |
| 1.80–2.69 | 3.54 | బోర్కమ్[31] | ఎమ్స్ నదిలోని దీవి |
| 2.96–3.71 | ఎమ్డెన్[32] | ఎమ్స్ నదికి తూర్పున | |
| 2.60–3.76 | 4.90 | విల్‌హెల్మ్‌స్‌హావెన్[33] | జేడ్ బైట్ |
| 2.66–4.01 | 4.74 | బ్రెమర్‌హావెన్[34] | వెసర్ ఉప్పుకయ్య సముద్ర ముఖం |
| 3.59–4.62 | బ్రెమెన్-ఓస్లెబ్స్‌హాసెన్[35] | బ్రెమర్ ఇండస్ట్రీహాఫెన్, ఇన్నర్ వెసర్ ఉప్పుకయ్య | |
| 3.3–4.0 | బ్రెమెన్ వెసర్ బ్యారేజి[36] | వెసర్ నది, నగర కేంద్రం నుండి 4 కి.మీ. ఎగువన | |
| 2.6–4.0 | బ్రెమర్‌హావెన్ 1879 | వెసర్ కరెక్షనుకు ముందు (వెసర్ స్ట్రైటెనింగ్ వర్క్స్) | |
| 0–0.3 | బ్రెమెన్ సిటీ సెంటర్ 1879[37] | వెసర్ కరెక్షనుకు ముందు (వెసర్ స్ట్రైటెనింగ్ వర్క్స్) | |
| 1.45 | బ్రెమెన్ సిటీ సెంటర్ 1900[38] | గ్రోబ్ వెసర్‌బ్రుక్, వెసర్ కరెక్షన్ వర్క్స్ పూర్తైన ఐదేళ్ళ తరువాత | |
| 2.54–3.48 | 4.63 | కక్స్‌హావెన్[39] | ఎల్బె ఉప్పుకయ్య సముద్ర ముఖం |
| 3.4–3.9 | 4.63 | హాంబర్గ్, సెంట్ పౌలి[40][41] | St. Pauli Piers, inner part of Elbe estuary |
| 1.39–2.03 | 2.74 | వెస్టర్‌లాండ్[42] | Sylt island, off the Nordfriesland coast |
| 2.8–3.4 | డాగెబుల్[43] | Coast of Wadden Sea in Nordfriesland | |
| 1.1–2.1 | 2.17 | ఎస్బెర్గ్[44][45] | Northern end of Wadden Sea in Denmark |
| 0.5–1.1 | హ్విడే షాండే[44] | Danish dune coast, entrance of Ringkøbing Fjord lagoon | |
| 0.3–0.5 | థైబోరెన్[44] | Danish dune coast, entrance of Nissum Bredning lagoon, part of Limfjord | |
| 0.2–04 | హిర్ట్‌షాల్స్[44] | Skagerrak. Hanstholm and Skagen have the same values. | |
| 0.14–0.30 | 0.26 | ట్రెగ్డె[46] | Skagerrak, southern end of Norway, east of an amphidromic point |
| 0.25–0.60 | 0.65 | స్టావాంగర్[46] | North of that amphidromic point, tidal rhythm irregular |
| 0.64–1.20 | 1.61 | బెర్గెన్[46] | Tidal rhythm regular |
ప్రకృతి
[మార్చు]చేపలు, షెల్‌ఫిష్
[మార్చు]
కోపెపాడ్‌లు, ఇతర జూప్లాంక్టన్‌లు ఉత్తర సముద్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ చిన్న జీవులు అనేక జాతుల చేపలకు ఆహారంగా పనికివచ్చే ఆహార గొలుసులో కీలకమైన భాగం.[47] ఉత్తర సముద్రంలో 230 కి పైగా చేప జాతులు నివసిస్తాయి. కాడ్, హాడాక్, వైటింగ్, సైతే, ప్లేస్, సోల్, మాకేరెల్, హెర్రింగ్, పౌటింగ్, స్ప్రాట్, శాండీల్ లన్నీ చాలా సాధారణం. వీటిని వాణిజ్యపరంగా పడతారు.[47][48] ఉత్తర సముద్రం లోని కందకాలలో విభిన్నమైన లోతులు, లవణీయత, ఉష్ణోగ్రత, నీటి కదలికల కారణంగా, బ్లూ-మౌత్ రెడ్ ఫిష్, రాబిట్ ఫిష్ వంటి కొన్ని చేపలు ఉత్తర సముద్రంలోని చిన్న ప్రాంతాలలో మాత్రమే నివసిస్తాయి.
క్రస్టేసియన్లు కూడా సాధారణంగా సముద్రం అంతటా కనిపిస్తాయి. నార్వే ఎండ్రకాయలు, లోతైన నీటి రొయ్యలు, గోధుమ రొయ్యలు అన్నిటినీ వాణిజ్యపరంగా పడతారు. కానీ ఇతర జాతుల ఎండ్రకాయలు, రొయ్యలు, గుల్లలు, మస్సెల్స్, క్లామ్స్ లు కూడా ఉత్తర సముద్రంలో నివసిస్తాయి.[47] ఇటీవల పసిఫిక్ ఓస్టెర్, అట్లాంటిక్ జాక్‌నైఫ్ క్లామ్‌తో సహా స్వదేశీయేతర జాతులు కూడా ఇక్కడ స్థిరపడ్డాయి.[48]
పక్షులు
[మార్చు]ఉత్తర సముద్రం తీరప్రాంతాలు యు.కె.లోని యథాన్ నదీముఖద్వారం, ఫౌల్‌ష్యూ నేచర్ ప్రిజర్వ్, ఫార్నే దీవులు, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్‌లోని వాడెన్ సీ జాతీయ ఉద్యానవనాలు వంటి ప్రకృతి నిల్వలకు నిలయంగా ఉన్నాయి.[47] ఈ ప్రదేశాలు డజన్ల కొద్దీ పక్షి జాతులకు సంతానోత్పత్తి ఆవాసాలుగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కోట్లాది పక్షులు సంతానోత్పత్తి, ఆహారం లేదా వలస విహారయాత్రల కోసం ఉత్తర సముద్రాన్ని ఉపయోగించుకుంటాయి. బ్లాక్-లెగ్డ్ కిట్టివేక్స్, అట్లాంటిక్ పఫిన్లు, నార్తర్న్ గానెట్స్, నార్తర్న్ ఫుల్మార్స్, పెట్రెల్స్, సీడక్స్, లూన్స్ (డైవర్స్), కార్మోరెంట్స్, గల్స్, ఆక్స్, టెర్న్స్ వంటి అనేక సముద్ర పక్షులు ఈ తీరాలలో ఉంటాయి.[47][48]

సముద్ర క్షీరదాలు
[మార్చు]ఉత్తర సముద్రం సముద్ర క్షీరదాలకు కూడా నిలయం. సాధారణ సీల్, బూడిద రంగు సీల్, హార్బర్ పోర్పోయిస్‌లను తీరప్రాంతాల వెంబడి, సముద్ర సంస్థాపనల వద్ద, ద్వీపాలలోనూ చూడవచ్చు. షెట్లాండ్ దీవులు వంటి ఉత్తర సముద్ర ద్వీపాలు నియర్డెడ్, హార్ప్, హుడ్, రింగ్డ్ సీల్స్, వాల్రస్ వంటి పెద్ద రకాల పిన్నిపెడ్‌లకు నిలయం.[49] ఉత్తర సముద్రపు సీటాసీయన్లలో వివిధ రకాల పోర్పోయిస్, డాల్ఫిన్, తిమింగలం జాతులు ఉన్నాయి.[48][50]
వృక్షజాలం
[మార్చు]
ఉత్తర సముద్రంలోని వృక్ష జాతులలో, బ్లాడర్ ర్యాక్, నాటెడ్ ర్యాక్, సెరేటెడ్ ర్యాక్ వంటి ర్యాక్ జాతులు ఉన్నాయి. ఓర్వీడ్, లామినేరియా హైపర్బోరియా వంటి ఆల్గే, మాక్రోఅల్గాల్, కెల్ప్, మెర్ల్ జాతులు కూడా కనిపిస్తాయి.[48] గతంలో వాడెన్ సముద్రం అంతటా సాధారణంగా కనిపించే ఈల్‌గ్రాస్, 20వ శతాబ్దంలో ఒక వ్యాధి కారణంగా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అదేవిధంగా, సముద్రపు గడ్డి సముద్రపు అడుగుభాగంలోని విస్తారమైన ప్రాంతాలను కప్పి ఉండేది. కానీ ట్రాలింగ్, త్రవ్వకాల ద్వారా దెబ్బతిన్నందున దాని ఆవాసాలు తగ్గిపోయి, తిరిగి రాలేదు.[51] జపనీస్ సముద్రపు పాచి సముద్ర తీరాల వెంబడి వ్యాపించి, ఓడరేవులు, ఇన్లెట్లు మూసుకుపోయి, ఇబ్బందిగా మారింది.[52]
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]రాజకీయ స్థితి
[మార్చు]ఉత్తర సముద్రం సరిహద్దుగా ఉన్న దేశాలన్నిటికీ 12 nautical miles (22 km; 14 mi) ప్రాదేశిక జలాల పరిధిలో, చేపలు పట్టే ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. [53] ఐరోపా సమాఖ్య (EU) ఉమ్మడి మత్స్య విధానం, EU దేశాలు, EU సరిహద్దు రాష్ట్రమైన నార్వే మధ్య ఫిషింగ్ హక్కులను సమన్వయం చేయడానికీ, వివాదాలను పరిష్కరించడంలోనూ సహాయపడుతుంది.[54]
1960 ల ప్రారంభంలో ఉత్తర సముద్రంలో ఖనిజ వనరులను కనుగొన్న తర్వాత, ఖండాంతర షెల్ఫ్‌పై జరిపిన సమావేశంలో ఆయా దేశాల హక్కులను ఒక మధ్యస్థ రేఖ వెంట విభజించారు. మధ్యస్థ రేఖను "ప్రతి దేశపు ప్రాదేశిక సముద్రం వెడల్పును కొలిచే బేస్‌లైన్‌ల సమీప బిందువుల నుండి సమాన దూరంలో ఉన్న ప్రతి బిందువు" అనే రేఖగా నిర్వచించారు.[55] జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్ మధ్య సముద్ర అడుగుభాగ సరిహద్దును 1969 లో సుదీర్ఘ చర్చలు, అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు తర్వాత తిరిగి విభజించారు.[53][56]
చమురు, వాయువు
[మార్చు]1859 లోనే, ఉత్తర సముద్రం చుట్టూ ఉన్న తీర ప్రాంతాలలో చమురును, 1910 లోనే సహజ వాయువునూ కనుగొన్నారు.[57] ఉదాహరణకు నెదర్లాండ్స్‌లోని K12-B క్షేత్రం వంటి సముద్ర తీర వనరుల నుండి నేటికీ వెలికితీత జరుగుతోంది.

ఆఫ్‌షోర్ టెస్ట్ డ్రిల్లింగ్ 1966 లో ప్రారంభమైంది. ఆ తరువాత, 1969లో, ఫిలిప్స్ పెట్రోలియం కంపెనీ అయిన ఎకోఫిస్క్, చమురు క్షేత్రాన్ని కనుగొంది.[58] ఇది విలువైన, తక్కువ-సల్ఫర్‌తో విభిన్నంగా ఉంది.[59] వాణిజ్య పరంగా ఉత్పత్తి 1971లో ట్యాంకర్లతో ప్రారంభమైంది. 1975 తర్వాత పైప్‌లైన్ ద్వారా, మొదట ఇంగ్లాండ్‌లోని టీసైడ్‌కూ, ఆపై 1977 తర్వాత, జర్మనీలోని ఎమ్డెన్‌కు కూడా ప్రారంభమైంది.[60]
1973 చమురు సంక్షోభానికి ముందు ఉత్తర సముద్ర చమురు నిల్వల దోపిడీ ప్రారంభమైంది. అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం వలన వెలికితీతకు అవసరమైన పెద్ద పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా మారాయి. 1973 లో UK లో చమురు నిల్వలు ప్రారంభం కావడంతో, 1974 లో అంతర్జాతీయ వాణిజ్యంలో తగ్గుతున్న తమ స్థానాన్ని ఆపడానికి వీలు ఏర్పడింది. 1977 లో ఫిలిప్స్ గ్రూప్ బ్రే ఫీల్డ్‌లో భారీ చమురు క్షేత్రాన్ని కనుగొని, వెలికితీయడం మొదలెట్టాక, వాణిజ్యం భారీగా పెరిగింది.
ఉత్పత్తి ఖర్చులు సాపేక్షంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, చమురు నాణ్యత, ఈ ప్రాంతపు రాజకీయ స్థిరత్వం, పశ్చిమ ఐరోపాలోని ముఖ్యమైన మార్కెట్ల సామీప్యత ఉత్తర సముద్రాన్ని ముఖ్యమైన చమురు ఉత్పత్తి ప్రాంతంగా మార్చాయి.[59] 1988లో నార్త్ సీ చమురు పరిశ్రమలో జరిగిన అతిపెద్ద మానవతా విపత్తు పైపర్ ఆల్ఫా అనే సముద్ర తీర చమురు వేదిక ధ్వంసం. ఈ ప్రమాదంలో 167 మంది ప్రాణాలు కోల్పోయారు.[61]
ఎకోఫిస్క్ చమురు క్షేత్రంతో పాటు, స్టాట్ఫ్‌జోర్డ్ చమురు క్షేత్రం కూడా ప్రముఖమైనదే. ఇది నార్వేజియన్ కందకంలో మొదటి పైప్‌లైన్‌కు కారణం.[62] ఉత్తర సముద్రంలో అతిపెద్ద సహజ వాయువు క్షేత్రం, ట్రోల్ గ్యాస్ క్షేత్రం, నార్వేజియన్ కందకంలో ఉంది. ఇది 300 metres (980 ft) లోతున ఉండి, దానిని అందుకోవడానికి పెద్ద ట్రోల్ A ప్లాట్‌ఫామ్ నిర్మాణం అవసరమైంది.
ఉత్తర సముద్రం నుండి సేకరించిన మొదటి రకాల చమురులలో ఒకటైన బ్రెంట్ ముడి చమురు ధర నేడు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల ముడి చమురుతో పోల్చడానికి ప్రామాణిక ధరగా ఉపయోగించబడుతోంది.[63] ఉత్తర సముద్రంలో పశ్చిమ ఐరోపాలో కెల్లా అతిపెద్ద చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలోని కీలకమైన OPEC యేతర ఉత్పత్తి ప్రాంతాలలో ఇది ఒకటి. [64]
ఉత్తర సముద్రంలోని UK సెక్టార్‌లో, చమురు పరిశ్రమలో 2013 లో £1440 కోట్ల పెట్టుబడి పెట్టారు. 2014 లో ఇది £1300 కోట్ల వరకు ఉంటుంది. ఈ తగ్గుదలకు పెరుగుతున్న ఖర్చులు, తక్కువ ఉత్పత్తి, అధిక పన్ను రేట్లు, తక్కువ అన్వేషణ కారణమని ఆయిల్ & గ్యాస్ పరిశ్రమ పేర్కొంది. [65]
2018 జనవరిలో నార్త్ సీ ప్రాంతంలో 184 ఆఫ్‌షోర్ రిగ్‌లు ఉన్నాయి. ఆ సమయంలో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఆఫ్‌షోర్ రిగ్‌లను కలిగి ఉన్న ప్రాంతం ఇది. [66]
2000 సంవత్సరంలో గరిష్ట స్థాయికి చేరుకున్న బ్రిటిష్ నార్త్ సీ చమురు, గ్యాస్ ఉత్పత్తి, 2024 నాటికి తగ్గింది. అయితే డాగర్ బ్యాంక్ వంటి ఆఫ్‌షోర్ పవన ప్రాజెక్టులు పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు మద్దతుగా పెరిగాయి. విండ్‌ఫాల్ పన్నులు ఈ పరివర్తనకు నిధులు సమకూర్చాయి.[67]
ఫిషింగ్
[మార్చు]
యూరప్‌లో మత్స్య సంపదకు ఉత్తర సముద్రం ప్రధానమైన నెలవు. అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా పట్టే చేపలలో 5% పైచిలుకు ఇక్కడే లభిస్తాయి. తీరప్రాంత జలాల దక్షిణ భాగంలో చేపలు పట్టడం కేంద్రీకృతమై ఉంది. ప్రధాన ఫిషింగ్ పద్ధతి ట్రాలింగ్. [68] 1995 లో ఉత్తర సముద్రంలో పట్టుకున్న చేపలు, షెల్ఫిష్‌ల మొత్తం పరిమాణం సుమారు 35 లక్షల టన్నులు. [69] అమ్మకానికి అనువైన చేపలతో పాటు, అమ్మడానికి వీలు కాని పది లక్షల టన్నుల చేపలను పారవేయగా అవి చనిపోతున్నట్లు అంచనా వేసారు.[70]
ఇటీవలి దశాబ్దాలలో, అతిగా చేపలు పట్టడం వల్ల మత్స్య సంపద ఉత్పత్తి తగ్గి, సముద్రపు ఆహార గొలుసును దెబ్బతీసింది. దీంతో మత్స్య పరిశ్రమలో ఉపాధి తగ్గిపోయింది.[71] 1970 లలో అధికంగా పట్టడం వల్ల మాకేరెల్ చేపల వేట ఆగిపోయింది. హెర్రింగ్, కాడ్, ప్లైస్ చేపలకు కూడా త్వరలోనే ఆ దుస్థితి పట్టవచ్చు.[72] యూరోపియన్ యూనియన్ కామన్ ఫిషరీస్ పాలసీ లక్ష్యాలు - చేపల వ్యర్థాలను తగ్గించడం, మత్స్య ఉత్పాదకతను పెంచడం, చేపల ప్రాసెసింగ్ మార్కెట్లను స్థిరీకరించడం, వినియోగదారులకు సరసమైన ధరలకు చేపలను సరఫరా చేయడం ద్వారా వనరుల వినియోగంతో సంబంధం ఉన్న పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం.[73]
పర్యాటక రంగం
[మార్చు]
ఉత్తర సముద్రంలోని బీచ్‌లు, తీరప్రాంత జలాలు పర్యాటకులకు గమ్యస్థానాలు. ఇంగ్లీష్, బెల్జియన్, డచ్, జర్మన్, డానిష్ తీరప్రాంతాలను[74][75] పర్యాటక పరంగా అభివృద్ధి చేసారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఉత్తర సముద్ర తీరంలో బీచ్ రిసార్ట్‌లతో కూడిన పర్యాటక ప్రదేశాలున్నాయి. స్కాట్లాండ్‌లోని సెయింట్ ఆండ్రూస్ తీరప్రాంత పట్టణం గోల్ఫ్‌కు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది గోల్ఫ్ యాత్రికులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. [76]
నార్త్ సీ ట్రైల్ అనేది ఉత్తర సముద్రం చుట్టూ ఉన్న ఏడు దేశాలను కలిపే సుదూర మార్గం. [77] బలమైన గాలులు ఉన్న కారణంగా ఈ ప్రాంతం విండ్‌సర్ఫింగ్, సెయిలింగ్ లకు[78] ప్రసిద్ధి చెందింది. మడ్‌ఫ్లాట్ హైకింగ్, [79] వినోదం కోసం చేపలు పట్టడం, పక్షుల పరిశీలన[75] ఇక్కడి ఇతర పర్యాటక కార్యకలాపాలు.
ఉత్తర సముద్ర తీరంలో వాతావరణ పరిస్థితులు ఆరోగ్యకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. 19 వ శతాబ్దం ప్రారంభంలోనే, ప్రయాణికులు వైద్యానికి, ఆరోగ్య పునరుద్ధరకూ ఉత్తర సముద్ర తీరాన్ని సందర్శించేవారు. శరీర రక్షణలను సక్రియం చేయడానికి, ప్రసరణను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, చర్మ, శ్వాసకోశ వ్యవస్థల చికిత్సలకూ ఇక్కడి సముద్రపు గాలి, ఉష్ణోగ్రత, గాలి, నీరు, సూర్యరశ్మి ఉపయోగపడుతున్నాయి.[80]
డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్‌లోని వాడెన్ సముద్రం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం.
సముద్ర ట్రాఫిక్
[మార్చు]సముద్ర రవాణాకు ఉత్తర సముద్రం ముఖ్యమైనది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఇక్కడి షిప్పింగ్ మార్గాలు కూడా ఉన్నాయి.[53] ఉత్తర సముద్ర తీరప్రాంతాల వెంబడి ప్రధాన ఓడరేవులు ఉన్నాయి: యూరప్‌లో అత్యంత రద్దీగా ఉండే రేవు, టన్నుల వారీగా ప్రపంచంలో నాల్గవ రద్దీగా ఉండే ఓడరేవు రోటర్‌డ్యామ్, ఆంట్వెర్ప్ (16వ స్థానం), హాంబర్గ్ (27వ స్థానం), అత్యంత రద్దీగా ఉండే 30 కంటైనర్ ఓడరేవులైన బ్రెమెన్ / బ్రెమెర్‌హావెన్, ఫెలిక్స్‌స్టోవ్ లు ఈ సముద్ర తీరంలో ఉన్నాయి.[81] యూరప్‌లోని ప్రముఖ రో-రో ఓడరేవు[గమనిక 1] అయిన బ్రూగెస్-జీబ్రగ్జ్ ఓడరేవు కూడా ఉత్తర సముద్ర తీరాన్నే ఉంది.[82]
ఇవి కూడా చూడండి
[మార్చు]గమనికలు
[మార్చు]- ↑ రోరో (రోల్-ఆన్/రోల్-ఆఫ్) నౌకలు అంటే కార్లు, మోటార్ సైకిళ్ళు, ట్రక్కులు, సెమీ-ట్రైలర్ ట్రక్కులు, బస్సులు, ట్రైలర్లు, రైల్‌రోడ్ కార్ల వంటి చక్రాల సరుకును తీసుకెళ్లడానికి రూపొందించబడిన సరుకు రవాణా నౌకలు. వీటిని ఓడపై ఎక్కించడానికి, దించడానికి వాటి స్వంత చక్రాలపై నడుపుతూనో, స్వీయ-చోదక మాడ్యులర్ ట్రాన్స్‌పోర్టర్ వంటి ప్లాట్‌ఫారమ్ వాహనాలను ఉపయోగించడమో చేస్తారు.
మూలాలు
[మార్చు]- 1 2 3 4 Ripley, George; Charles Anderson Dana (1883). The American Cyclopaedia: A Popular Dictionary of General Knowledge. D. Appleton and company. p. 499. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2020.
- 1 2 3 4 L.M.A. (1985). "Europe". In University of Chicago (ed.). Encyclopædia Britannica Macropædia. Vol. 18 (Fifteenth ed.). U.S.A.: Encyclopædia Britannica Inc. pp. 832–835. ISBN 978-0-85229-423-9.
- ↑ Helland-Hansen, Bjørn; Fridtjof Nansen (1909). "IV. The Basin of the Norwegian Sea". Report on Norwegian Fishery and Marine-Investigations Vol. 11 No. 2. Geofysisk Institutt. the original నుండి 14 January 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 January 2009.
- 1 2 "About the North Sea: Key facts". Safety at Sea project: Norwegian Coastal Administration. 2008. the original నుండి 9 December 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 November 2008.
- ↑ Ray, Alan; G. Carleton; Jerry McCormick-Ray (2004). Coastal-marine Conservation: Science and Policy (illustrated ed.). Blackwell Publishing. p. 262. ISBN 978-0-632-05537-1. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 October 2020.
- ↑ "Chapter 5: North Sea" (PDF). Environmental Guidebook on the Enclosed Coastal Seas of the World. International Center for the Environmental Management of Enclosed Coastal Seas. 2003. the original (PDF) నుండి 17 December 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2008.
- ↑ Calow, Peter (1999). Blackwell's Concise Encyclopedia of Environmental Management. Blackwell Publishing. ISBN 978-0-632-04951-6. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 December 2008.
- ↑ "Limits in the seas: North Sea continental shelf boundaries" (PDF). U.S. Department of State. United States Government. 14 June 1974. ఒరిజినల్ నుండి 11 June 2020 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 June 2013.
- ↑ "Met Office: Flood alert!". Met office UK government. 28 November 2006. the original నుండి 31 December 2006 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 November 2008.
- ↑ "Safety at Sea". Currents in the North Sea. 2009. the original నుండి 9 December 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 January 2009.
- ↑ Freestone, David; Ton IJlstra (1990). "Physical Properties of Sea Water and their Distribution Annual: Variation in Surface Salinity". The North Sea: Perspectives on Regional Environmental Co-operation. Martinus Nijhoff Publishers. pp. 66–70. ISBN 978-1-85333-413-9. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 December 2008.
- ↑ Dyke, Phil (1974). Modeling Coastal and Offshore Processes. Imperial College Press. pp. 323–365. ISBN 978-1-86094-674-5. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2008. p. 329 tidal map showing amphidromes
- ↑ Carter, R. W. G. (1974). Coastal Environments: An Introduction to the Physical, Ecological and Cultural Systems of Coastlines. Academic Press. pp. 155–158. ISBN 978-0-12-161856-8. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2008. p. 157 tidal map showing amphidromes
- ↑ Tide table for Lerwick: tide-forecast Archived 26 ఏప్రిల్ 2014 at the Wayback Machine
- ↑ Tide table for Aberdeen: tide-forecast Archived 5 ఆగస్టు 2014 at the Wayback Machine
- ↑ Tide table for North Shields: tide-forecast Archived 26 ఏప్రిల్ 2014 at the Wayback Machine
- ↑ Tide tables for Kingston upon Hull: Tides Chart Archived 15 ఏప్రిల్ 2019 at the Wayback Machine and Tide-Forecast Archived 7 మార్చి 2014 at the Wayback Machine
- ↑ Tide table for Grimsby: Tide-Forecast Archived 7 మార్చి 2014 at the Wayback Machine
- ↑ Tide tables for Skegness: Tideschart Archived 12 జూన్ 2020 at the Wayback Machine und Tide-Forecast Archived 7 మార్చి 2014 at the Wayback Machine
- ↑ Tide tables for King's Lynn: Tideschart Archived 12 జూన్ 2020 at the Wayback Machine und Tide-Forecast Archived 7 మార్చి 2014 at the Wayback Machine
- ↑ Tide tables for Hunstanton: Tideschart Archived 12 జూన్ 2020 at the Wayback Machine
- ↑ "Tide Times and Tide Chart for Harwich". tide-forecast.com. ఒరిజినల్ నుండి 29 August 2013 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 April 2014.
- ↑ "Tide Times and Tide Chart for London". tide-forecast.com. ఒరిజినల్ నుండి 8 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 April 2014.
- ↑ Tide tables for Dunkerque: Tides Chart Archived 15 ఏప్రిల్ 2019 at the Wayback Machine and tide forecast Archived 6 మార్చి 2014 at the Wayback Machine
- ↑ Tide tables for Zeebrugge: Tides Chart Archived 15 ఏప్రిల్ 2019 at the Wayback Machine and tide forecast Archived 6 మార్చి 2014 at the Wayback Machine
- ↑ "Tide Times and Tide Chart for Antwerpen". tide-forecast.com. ఒరిజినల్ నుండి 8 October 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 April 2014.
- ↑ "Tide Times and Tide Chart for Rotterdam". tide-forecast.com. ఒరిజినల్ నుండి 23 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ "Katwijk aan Zee Tide Times & Tide Charts". surf-forecast.com. ఒరిజినల్ నుండి 21 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ "Tide Times and Tide Chart for Den Helder". tide-forecast.com. ఒరిజినల్ నుండి 23 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ "Tide Times and Tide Chart for Harlingen". tide-forecast.com. ఒరిజినల్ నుండి 23 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ "Tide Times and Tide Chart for Borkum". tide-forecast.com. ఒరిజినల్ నుండి 23 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ "Windfinder.com – Wind, waves, weather & tide forecast Emden". Windfinder.com. the original నుండి 21 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "Tide Times and Tide Chart for Wilhelmshaven". tide-forecast.com. ఒరిజినల్ నుండి 23 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ "Tide Times and Tide Chart for Bremerhaven". tide-forecast.com. ఒరిజినల్ నుండి 23 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ Guido Gerding. "Gezeitenkalender für Bremen, Oslebshausen, Germany (Tidenkalender) – und viele weitere Orte". gezeiten-kalender.de. the original నుండి 22 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ "Gezeitenvorausberechnung". bsh.de. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ calculated from Ludwig Franzius: Die Korrektion der Unterweser (1898). suppl. B IV.: weekly average tide ranges 1879
- ↑ telephonical advice by Mrs. Piechotta, head of department of hydrology, Nautic Administration for Bremen (WSA Bremen Archived 27 మార్చి 2014 at the Wayback Machine)
- ↑ "Tide Times and Tide Chart for Cuxhaven". tide-forecast.com. ఒరిజినల్ నుండి 23 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ "Tide Times and Tide Chart for Hamburg". tide-forecast.com. ఒరిజినల్ నుండి 12 March 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ "Gezeitenvorausberechnung". bsh.de. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "Tide Times and Tide Chart for Westerland". tide-forecast.com. ఒరిజినల్ నుండి 23 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- ↑ "Gezeitenvorausberechnung". bsh.de. the original నుండి 23 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2014.
- 1 2 3 4 "Tidal tables". dmi.dk. the original నుండి 16 March 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2014.
- ↑ "Tide Times and Tide Chart for Esbjerg, Denmark". tide-forecast.com. ఒరిజినల్ నుండి 23 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2014.
- 1 2 3 Vannstand – Norwegian official maritime Information → English version Archived 29 ఏప్రిల్ 2015 at the Wayback Machine
- 1 2 3 4 5 "MarBEF Educational Pullout: The North Sea" (PDF). Ecoserve. MarBEF Educational Pullout Issue 4. the original (PDF) నుండి 5 February 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 January 2009.
- 1 2 3 4 5 "Quality Status Report for the Greater North Sea". Convention for the Protection of the Marine Environment of the North-East Atlantic (OSPAR). 2010. ఒరిజినల్ నుండి 25 January 2012 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2013.
- ↑ "Walrus". Ecomare. ఒరిజినల్ నుండి 2 May 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2013.
- ↑ Whales and dolphins in the North Sea 'on the increase'. Newcastle University Press Release. 2 April 2005. the original నుండి 1 January 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 December 2007.
- ↑ "Effects of Trawling and Dredging". Effects of Trawling and Dredging on Seafloor Habitat. Ocean Studies Board, Division on Earth and Life Studies, National Research Council. National Academy of Sciences. 2008. doi:10.17226/10323. ISBN 978-0-309-08340-9. the original నుండి 15 May 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 November 2008.
{{cite book}}: CS1 maint: others (link) - ↑ Tait, Ronald Victor; Frances Dipper (1998). Elements of Marine Ecology. Butterworth-Heinemann. p. 432. ISBN 9780750620888. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2020.
- 1 2 3 Barry, M., Michael; Elema, Ina; van der Molen, Paul (2006). Governing the North Sea in the Netherlands: Administering marine spaces: international issues (PDF). Frederiksberg, Denmark: International Federation of Surveyors (FIG). pp. 5–17, Ch. 5. ISBN 978-87-90907-55-6. the original (PDF) నుండి 5 February 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 January 2009.
- ↑ About the Common Fisheries Policy. European Commission. 24 January 2008. the original నుండి 14 July 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 November 2008.
- ↑ "Text of the UN treaty" (PDF). ఒరిజినల్ నుండి 17 October 2013 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 October 2013.
- ↑ North Sea Continental Shelf Cases. International Court of Justice. 20 February 1969. the original నుండి 1 December 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 July 2007.
- ↑ Glennie, K. W. (1998). Petroleum Geology of the North Sea: Basic Concepts and Recent Advances. Blackwell Publishing. pp. 11–12. ISBN 978-0-632-03845-9. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2020.
- ↑ Pratt, J. A. (1997). "Ekofisk and Early North Sea Oil". In T. Priest, & Cas James (ed.). Offshore Pioneers: Brown & Root and the History of Offshore Oil and Gas. Gulf Professional Publishing. p. 222. ISBN 978-0-88415-138-8. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 December 2008.
- 1 2 Lohne, Øystein (1980). "The Economic Attraction". The Oil Industry and Government Strategy in the North Sea. Taylor & Francis. p. 74. ISBN 978-0-918714-02-2. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2020.
- ↑ "TOTAL E&P NORGE AS – The history of Fina Exploration 1965–2000". About TOTAL E&P NORGE > History > Fina. the original నుండి 7 October 2006 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 January 2009.
- ↑ "On This Day 6 July 1988: Piper Alpha oil rig ablaze". BBC. 6 July 1988. ఒరిజినల్ నుండి 3 September 2012 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 November 2008.
- ↑ "Statpipe Rich Gas". Gassco. the original నుండి 14 June 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 November 2008.
- ↑ "North Sea Brent Crude". Investopedia ULC. ఒరిజినల్ నుండి 26 October 2008 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 November 2008.
- ↑ "North Sea". Country Analysis Briefs. Energy Information Administration (EIA). January 2007. ఒరిజినల్ నుండి 9 March 2009 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 January 2008.
- ↑ "Shell to cut 250 onshore jobs at its Scotland North Sea operations". Yahoo Finance. 12 August 2014. ఒరిజినల్ నుండి 14 July 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 December 2014.
- ↑ "Number offshore rigs worldwide by region 2018". Statista. ఒరిజినల్ నుండి 9 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2018.
- ↑ "The fall of UK North Sea oil and rise of offshore wind". Reuters. 3 January 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2024.
- ↑ Sherman, Kenneth; Lewis M. Alexander; Barry D. Gold (1993). Large Marine Ecosystems: Stress, Mitigation, and Sustainability (3, illustrated ed.). Blackwell Publishing. pp. 252–258. ISBN 978-0-87168-506-3. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 January 2009.
- ↑ "MUMM – Fishing". Royal Belgian Institute of Natural Sciences. 2002–2008. the original నుండి 2 December 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2008.
- ↑ "One Million Tons of North Sea Fish Discarded Every Year". Environment News Service (ENS). 2008. the original నుండి 9 November 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 December 2007.
- ↑ Clover, Charles (2004). The End of the Line: How overfishing is changing the world and what we eat. London: Ebury Press. ISBN 978-0-09-189780-2.
- ↑ "North Sea Fish Crisis – Our Shrinking Future". Part 1. Greenpeace. 1997. the original నుండి 4 July 2007 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 November 2008.
- ↑ Olivert-Amado, Ana (13 March 2008). The common fisheries policy: origins and development. European Parliament Fact Sheets. the original నుండి 22 March 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 July 2007.
- ↑ Wong, P. P. (1993). Tourism Vs. Environment: The Case for Coastal Areas. Springer. p. 139. ISBN 978-0-7923-2404-1. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 December 2008.
- 1 2 Hall, C. Michael; Dieter K. Müller; Jarkko Saarinen (2008). Nordic Tourism: Issues and Cases. Channel View Publications. p. 170. ISBN 978-1-84541-093-3. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 December 2008.
- ↑ Steves, Rick (24 October 2019). "St. Andrews, Scotland: See the place where golf was born and Will and Kate fell in love". USA Today. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 June 2024.
Tiny St. Andrews has a huge reputation, known around the world as the birthplace and royal seat of golf. The chance to play on the world's oldest course – or at least take in the iconic view of its 18th hole – keeps the town perennially popular among golfing pilgrims
- ↑ "Welcome - North Sea Trail". European Union. northseatrail.org. the original నుండి 1 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2009.
- ↑ Knudsen, Daniel C.; Charles Greet; Michelle Metro-Roland; Anne Soper (2008). Landscape, Tourism, and Meaning. Ashgate Publishing, Ltd. p. 112. ISBN 978-0-7546-4943-4. the original నుండి 17 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 December 2008.
- ↑ Schulte-Peevers, Andrea; Sarah Johnstone; Etain O'Carroll; Jeanne Oliver; Tom Parkinson; Nicola Williams (2004). Germany. Lonely Planet. p. 680. ISBN 978-1-74059-471-4. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 December 2008.
- ↑ Büsum: The natural healing power of the sea. German National Tourist Board. the original నుండి 1 December 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 November 2008.
- ↑ "World Port Rankings" (PDF). American Association of Port Authorities. 2008. ఒరిజినల్ నుండి 2 December 2012 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 July 2010.
- ↑ "Port Authority Bruges-Zeebrugge". MarineTalk. 1998–2008. ఒరిజినల్ నుండి 25 July 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 December 2008.