ఉదయపూర్ సిటీ ప్యాలెస్
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉదయ్‌పూర్ |
అక్షాంశ రేఖాంశాలు | 24°34′34″N 73°40′59″E |
స్వంతదారు | Mahendra Singh Mewar |
Category for the interior of the item | Category:Interior of the City Palace (Udaipur) |
Category for the view of the item | Category:Views of Udaipur from City Palace |
ఉదయపూర్ సిటీ ప్యాలెస్, అనేది రాజస్థాన్ రాష్ట్రం లోని ఉదయ్‌పూర్ నగరంలో ఉన్న ఒక ప్యాలస్ కాంప్లెక్స్. మేవాడ్ రాజవంశీకులు దాదాపు 400 ఏళ్ల పాటు ఈ ప్యాలెస్ ను నిర్మించారు. 1553లో సిసోడియా రాజ్ పుత్ కుటుంబానికి చెందిన మహారాణా ఉదయ్ సింగ్ II ఈ ప్యాలెస్ నిర్మాణం ప్రారంభించారు. ఆయన తన రాజధానిని చిత్తోర్ నుంచి ఉదయపూర్ కు మార్చే సమయంలో ఈ ప్యాలెస్ ను నిర్మించడం మొదలుపెట్టారు.[1]
పిచోలా సరస్సుకు తూర్పు ఒడ్డున ఉంది. ఈ ప్యాలెస్ లోనే ఎన్నో ప్యాలెస్ లు ఉన్నాయి. అందుకే ఇది ప్యాలెస్ ల కాంప్లెక్స్ గా ఉంది.[2][3][4][5][6]
ఈ ప్యాలెస్ చాలా ఆడంబరంగా నిర్మించారు. రాజస్థాన్ లోని అన్ని ప్యాలస్ ల కన్నా ఇదే అతిపెద్ద భవనం. కొండపైన కట్టిన ఈ ప్యాలెస్ ను రాజస్థానీ, మొఘల్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ భవనం నుంచీ పూర్తి నగరాన్నీ వీక్షించవచ్చు. ఈ ప్యాలెస్ కాంప్లెక్స్ లో పిచోలా సరస్సుతో పాటు లేక్ ప్యాలెస్, జగ్ మందిర్, జగదీశ్ ఆలయం, మాన్ సూన్ ప్యాలెస్, నీమచ్ మాతా ఆలయం వంటివి ఉంటాయి. ఆరావళీ పర్వతాల్లో ఈ ప్యాలెస్ ను నిర్మించారు. 1983లో తీసిన జేమ్స్ బాండ్ సినిమా ఆక్టోపసీను ఈ ప్యాలస్ లలోనే తీశారు.
మూలాలు
[మార్చు]- ↑ UDAIPUR: Since 1553 CE!
- ↑ Brown, Lindsay; Amelia Thomas (2008).
- ↑ George, Michell; Antoni Martinelli (1994).
- ↑ Henderson, Carol E; Maxine K. Weisgrau (2007).
- ↑ "History of Udaipur" Archived 2016-03-03 at the Wayback Machine.
- ↑ "City Palace, Udaipur".