ఉదయ్ చోప్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊదయ్ చోప్రా
Uday Chopra
జన్మ నామంUday Chopra
జననం (1973-01-05) 1973 జనవరి 5 (వయస్సు: 46  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1992–present

ఉదయ్ చోప్రా (హిందీ: उदय चोपड़ा; 5 జనవరి 1973 న జన్మించారు) బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.

జీవితం మరియు వృత్తి[మార్చు]

ఉదయ్ చోప్రా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయిన యష్ చోప్రా[1] కుమారుడు. మరో దర్శకుడు ఆదిత్య చోప్రాకు సోదరుడు. ఉదయ్ తన తండ్రి, సోదరుడు దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు. అవన్నీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మించినవే.[2] యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన మొహబ్బతే సినిమాతో ఉదయ్ చోప్రా నటుడిగా కెరియర్ మొదలుపెట్టారు.[2] ఆ సినిమాలో అమితాబచ్చన్, షారూఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ ప్రధాన తారాగణం. ఈ సినిమాతో మరో ముగ్గురు (షమితాషెట్టి, ప్రీతిజింగానియా, కిమ్ శర్మ) కూడా పరిశ్రమ పరిచయం అయ్యారు. మొహబ్బతే సినిమాతో జిమ్మి షెర్గిల్, జుగల్ హంసరాజ్ తమ వృత్తి జీవితాలను ఫున:ప్రారంభించారు. ఉదయ్ చోప్రా ఎక్కువగా తన తండ్రి నిర్మాణ సంస్థ తీసిన సినిమాలకే పనిచేశారు. ఆయన 2004లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ థూమ్ నిర్మించారు. దాని సీక్వెల్ థూమ్ 2 కూడా తీశారు. అది 2006లో విడుదలైంది.[3] మెహబతేకి ముందు ఉదయ్ ఓ సినిమాను నిర్మించారు. 1994లో వచ్చిన ఎ దిల్లగి సినిమా ఆయన నిర్మించిందే. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కాజోల్, సైఫ్అలీఖాన్ నటించారు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
1993 డర్ర్ సహాయ దర్శకుడు
1993 పరంపరా సహాయ దర్శకుడు
1994 యే దిల్లగి నిర్మాత
1995 దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే సహాయ దర్శకుడు
1997 దిల్ తో పాగల్ హై సహాయ దర్శకుడు
2000 మొహబ్బతే విక్రమ్ కపూర్/ఒబేరాయ్ ప్రతిపాదన - ఉత్తమ నూతన నటుడి కేటగిరిలో ఫిల్మ్ ఫేర్ అవార్డు
2002 మేరే యార్ కి షాదీ హై సంజయ్
2003 ముజ్సే దోస్తీ కరోగే! రోహన్ వర్మ ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు
సుపారీ ఆర్యన్ పండిట్
కల్ హో న హో డే6 ఎనౌన్సర్ ప్రత్యేకమైన పాత్రలో
2004 Charas: A Joint Operation ఆష్రాఫ్
ధూమ్ అలీ అక్బర్ ఫతే ఖాన్ ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు
హమ్ తుం సహాయ దర్శకుడు
2005 నీల్ న్' నిక్కి గుర్నేల్ నీల్ అహ్లువాలియా
2006 ధూమ్ 2 అలీ అక్బర్ ఫతే ఖాన్
2010 ప్యార్ ఇంపాజిబుల్ అభయ్ శర్మ నిర్మాత, రచయిత
కుచ్ కుచ్ హోతా హై తొలి యానిమేషన్ చిత్రం
ధూమ్‌ 3 ఇన్స్ పెక్టర్ అలీ అక్బర్

సూచనలు[మార్చు]

  1. "Uday Chopra engagement". Oneindia.in. 25 June 2007. Retrieved 19 January 2010. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  2. 2.0 2.1 "In Candid Conversation with Uday Chopra". The Economic Times. 9 January 2010. Retrieved 19 January 2010. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  3. "Uday Chopra is the best in Dhoom 2". The Times of India. 24 November 2006. Retrieved 19 January 2010. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)

బాహ్య లింకులు[మార్చు]