Jump to content

ఉదయ్ నారాయణ్ చౌదరి

వికీపీడియా నుండి
ఉదయ్ నారాయణ్ చౌదరి
ఉదయ్ నారాయణ్ చౌదరి


పదవీ కాలం
2000 – 2015
ముందు సదానంద్ సింగ్
తరువాత విజయ్ కుమార్ చౌదరి

ముందు రాంస్వరూప్ పాశ్వాన్
తరువాత జితన్ రామ్ మాంఝీ
పదవీ కాలం
1990 – 1995
ముందు శ్రీచంద్ సింగ్
తరువాత రాంస్వరూప్ పాశ్వాన్
నియోజకవర్గం ఇమామ్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-08-08) 1952 ఆగస్ట్ 8 (వయసు: 73)
బీహార్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు *లోక్‌తాంత్రిక్ జనతా దళ్
వృత్తి రాజకీయ నాయకుడు

ఉదయ్ నారాయణ్ చౌదరి బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2005 నవంబరు 30 నుండి 2015 నవంబరు 28 వరకు బీహార్ శాసనసభ 14వ స్పీకర్‌గా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఉదయ్ నారాయణ్ చౌదరి జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఇమామ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రామ్ స్వరూప్ పాస్వాన్‌పై 10,200 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1995 శాసనసభ ఎన్నికలలో జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమతా పార్టీ అభ్యర్థి రాంస్వరూప్ పాశ్వాన్ చేతిలో 120 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు.

ఉదయ్ నారాయణ్ చౌదరి 2000 శాసనసభ ఎన్నికలలో ఇమామ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి రామ్ స్వరూప్ పాస్వాన్‌పై 12,501 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2005 (ఫిబ్రవరి) శాసనసభ ఎన్నికలలో జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి రామ్ స్వరూప్ పాస్వాన్‌పై 1,271 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఉదయ్ నారాయణ్ చౌదరి 2005 (అక్టోబరు) శాసనసభ ఎన్నికలలో జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి రామ్ స్వరూప్ పాస్వాన్‌పై 6642 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2010 శాసనసభ ఎన్నికలలో జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి రౌషన్ కుమార్ పై 1,211 ఓట్ల మెజారిటీతో గెలిచి ఇదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఉదయ్ నారాయణ్ చౌదరి 2005 నవంబరు 30 నుండి 2015 నవంబరు 28 వరకు బీహార్ శాసనసభ 14వ స్పీకర్‌గా పని చేశాడు. ఆయన 2015 శాసనసభ ఎన్నికలలో జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యూలర్) అభ్యర్థి జితన్ రామ్ మాంఝీ చేతిలో 29,408 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఉదయ్ నారాయణ్ చౌదరి 2020 శాసనసభ ఎన్నికలలో జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యూలర్) అభ్యర్థి జితన్ రామ్ మాంఝీ చేతిలో 16,034 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. "Ex-Speaker quits Dal, says Dalits neglected". The Telegraph. 3 May 2018. Retrieved 27 November 2025.
  2. "Former Bihar Speaker Uday Narayan Choudhary quits JD(U), calls Nitish Kumar 'anti-Dalit, undemocratic'" (in ఇంగ్లీష్). The Indian Express. 3 May 2018. Retrieved 27 November 2025.