ఉద్దమ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉద్దమ్ సింగ్
జననండిసెంబరు 26, 1899
మరణం1940 జూలై 31(1940-07-31) (వయసు 40)
గద్దర్ పార్టీ, హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోషియేషన్
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమం

ఉద్దమ్ సింగ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు జెనరల్ మైకెల్ ఓ డయ్యర్ను చంపినందుకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ డయ్యరే జలియఁవాలాబాగ్ హత్యాకాండకు సూత్రధారి. ఉద్దమ్ సింగ్ తన పేరును రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా, భారతదేశంలోని మతాలైన హిందూ, మొహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, మార్చుకున్నాడు. ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు. 20వ శతాబ్దపు మొదట్లో భగత్ సింగ్, రాజ్‍గురు, ఇంకా సుఖదేవ్తో పాటుగా ఉద్దమ్ సింగ్ ని కూడా తీవ్రవాద స్వాతంత్ర్య సేనానులుగా గుర్తించవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని ఆనాడే భారతదేశపు మొదటి మార్క్సిస్టులుగా పేర్కొనింది. 1940 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ సంఘటనకు ప్రతీకారంగా ఉద్దం సింగ్ లండన్ కాక్స్‌టన్‌ హాల్‌లో మైకేల్ ఓ డయ్యర్‌ని కాల్చి చంపి, లొంగిపోయాడు.

బాల్యం[మార్చు]

ఉద్దమ్‌ సింగ్ పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా లోని సునం తెహసీల్ కు చెందిన కలన్ గ్రామంలో జన్మించాడు.

జలియన్ వాలాబాగ్ లో తుపాకి బుల్లెట్ల గుర్తులు
  • కోర్టులో ఉదంసింగ్ ప్రసంగం
  • నేనే  చేశాను ఈ హత్య ఎందుకు అంటే అతని మీద నాకు పగ  నేను అతనిని చంపే అంత తప్పు చేసాడు నా దెశ ప్రజల ఆత్మను భంగపరచాడు అందుకనే వాడిని చంపి వేసాను అందుకోసం 21 సం!!లు వేచి చూసాను  నేను ఈ పని చేసినందుకు సంతోషంగా ఉన్నాను నేను మరణంకు భయపడలేదు. నేను నా దేశం కోసం మరణిస్తున్నాను
  • నేను బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఆకలితో ఉన్న నా ప్రజలను చూశాను ఈ విషయంలో నేను నిరసన వ్యక్తం చేశాను, అది నా బాధ్యత నా మాతృభూమి కోసం మరణం కన్నా నాకు ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది?