ఉన
Una జిల్లా | |
---|---|
![]() Himachal Pradesh లో Una జిల్లా స్థానము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Himachal Pradesh |
ముఖ్య పట్టణం | Una, Himachal Pradesh |
మండలాలు | 4 |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | 5 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,549 కి.మీ2 (598 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 5,21,057 |
• సాంద్రత | 340/కి.మీ2 (870/చ. మై.) |
• పట్టణ | 8.8 |
జనగణాంకాలు | |
• అక్షరాస్యత | 87.23% |
• లింగ నిష్పత్తి | 977 |
సగటు వార్షిక వర్షపాతం | 1253 మి.మి. |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
" ఉన " జిల్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో ఒకటి. జిల్లా సరిహద్దులో హోషియార్పూర్ జిల్లా మరియు రూప్నగర్ జిల్లా (పంజాబు) ఉన్నాయి. దిగువ స్థాయి కొండలతో జిల్లా అధికంగా మైదానంగా ఉంటుంది. జిల్లా పారిశ్రామిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది ధర్మశాల, కులు, మణలి, జ్వాలాముఖి మరియు చింత్పూర్ణి వెళ్ళే ఉంది. సిక్కుల మొదటి గురువు నివసించిన కిలా (కోట) ఉన జిల్లాలో ఉంది.
విషయ సూచిక
ప్రజలు[మార్చు]
జిల్లాలో పంజాబీ, హిందీ భాషలు ప్రధానంగా ఉన్నాయి. ప్రజలలో యువకులు ధోవతి, ప్యాంట్, షర్ట్, ట్రైజర్స్ స్త్రీలు సల్వార్ కమీజ్ ధరిస్తుంటారు. 2001 గణాంకాల ఆధారంగా జనసంఖ్య 4,47,967. స్త్రీ: పురుషుల నిష్పత్తి 997:1000. అక్షరాశ్యత 81.09%. వైశాల్యం 1549 చ.కి.మీ.ప్రజలలో అధికంగా హిందువులు మరియు సిక్కులు (అల్పసంఖ్య) ఉన్నారు.
భౌగోళికం[మార్చు]
ఉన జిల్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆగ్నేయంలో ఉంది. జిల్లా పరిసరాలలో హిమాలయ పర్వతశ్రేణిలో భాగమైన అందమైన శివాలిక్ కొండలు ఉన్నాయి. 1972 సెప్టెంబర్ 1న కాంగ్రా జిల్లాను విభజించి ఉన జిల్లా, హమీర్పూర్ జిల్లా మరియు కాంగ్రా జిల్లాలు రూపొందించబడ్డాయి. జిల్లాలో చింత్పూర్ని (చిన్నమస్తిక ధాం), భద్రకాళీమాతా మందిరం, గుగా జహర్ పీర్ (బదుర్ కాళీ గ్రామం), డేరా బాబా రుద్రు, బాబా మోనీ ఆలయం (గనారీ), జొగ్గి పంగా, ధర్మశాలా మహంతా, ధుంసర్ మహాదేవ్ ఆలయం, తాల్మెహ్రా, పీర్ నిగహా (బ్రహ్మభూతి) మొదలైన ప్రబలమైన ఆలయాలు ఉన్నాయి.ఉన నుండి 20 కి.మీ దూరంలో ఉన్న ఆలయం ప్రపంచంలో ఉన్న రెండు బ్రహ్మదేవిని ఆలయాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. మరొకటి పుష్కర్ సరోవర తీరంలో ఉంది.
ఆర్ధికరంగం[మార్చు]
జిల్లాలో ప్రజలు అధికంగా వ్యవసాయం జీవనాధారవృత్తిగా స్వీకరిస్తున్నారు. ఉన పాఋఇశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. జిల్లా కుటీరపరిశ్రమల కేమెరంగా ఉంది. కమల్ కథా ఉద్యోగ్, మాస్టర్ కథా ఉద్యోగ్ ప్రధానంగా కథా ఉత్పత్తి చేస్తున్నాయి.అదనంగా జిల్లాలో హిం సిలిండర్స్ (సిలిండర్ తయారీ) మరియు హిం అలాయ్స్ (స్టీల్ ఫ్యాక్టరీ) ఉన్నాయి. ఇంటర్నేషనల్ కార్స్ మరియు మోటర్ బ్రాంచి ఒకటి ఇక్కడ ఉంది. జీవన్ మార్కెటులో పలు దుకాణాలు ఉన్నాయి.
ప్రయాణ సౌకర్యాలు[మార్చు]
ఉన జిల్లా రహదారులతో అనుసంధానించబడి ఉంది. ఒక రైలు మార్గం కూడా ఉంది. జాతీయరహదారి-22 ఉన నగరం గుండా పయనిస్తుంది. ఉన ఢిల్లీకి ఉత్తరంలో 375 కి.మీ దూరంలో మరియు చంఢీగడ్ కు 120 కి.మీ దూరంలో ఉంది. జిల్లా బ్రాడ్గేజ్ రైలు మార్గంతో అనుసంధానించబడి ఉంది.రాష్ట్రం మొత్తంలో ఉన్న రైలు మార్గం కూడా ఇదొక్కటే. ఇక్కడ నుండి ఢిల్లీ చేరడానికి హిమాచల్ ఎక్స్ప్రెస్ మరియు జనశతాబ్ధి ఎక్స్ప్రెస్ దినసరి సేవలు అందిస్తూ ఉన్నాయి. జిల్లా సమీపంలో చంఢీగడ్ విమానాశ్రయం ఉంది.
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 521,057,[1] |
ఇది దాదాపు. | కేప్ వర్డే దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 543వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 338 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. |
16.24%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 997:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాశ్యత శాతం. | 87.23%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
పర్యాటక ఆకర్షణలు[మార్చు]
- మా చిత్పూర్ణి దేవి ఆలయం: సుందరమైన మా చిత్పూర్ణి దేవి ఆలయం
- శీతలా మాత మందిరం (ఉన; తక్కా రోడ్డు) : ఈ ఆలయంలో మసూచి మరియు కండ్ల కలక వంటి ఉష్ణ సంబంధిత వ్యాదుల ఉపశమనం కొరకు ప్రార్ధనలు జరుగుతుంటాయి.ఇక్కడ పూజారి ఇచ్చే లాకెట్ వ్యాధులను నయం చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
- శివ్ బారి ఆలయం.
- ధ్యూంసర్ మహాదేవ్ ఆలయం.
- డెరా బాబా రుద్రాశ్రమం
- బాబా బర్బాఘ్ సింఘ్.
- జోగి పంగా.
- జ్యోతి మాతా ఆలయం సమూర్ కలాన్ (ప్రాచీన శివాలయం)
- తనీక్ పురా.
- గరీబ్ నాథ్ మందిర్
- బాబా మోని ఆలయం ఘనారి.
వెలుపలి లింకులు[మార్చు]
మూలాల జాబిత[మార్చు]
![]() |
కాంగ్రా జిల్లా | ![]() | ||
హోషియార్పూర్ జిల్లా.(పంజాబ్) | ![]() |
హమీర్పూర్ జిల్లా (హిమాచల్ ప్రదేశ్) | ||
| ||||
![]() | ||||
రూప్నగర్ జిల్లా (పంజాబ్) | బిలాస్పూర్ (హిమాచల్ ప్రదేశ్) |
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to ఉన. |