సహజ ఉపగ్రహం

వికీపీడియా నుండి
(ఉపగ్రహం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


ఒక గ్రహం లేదా చిన్న గ్రహం చుట్టూ పరిభ్రమించే ఖగోళ వస్తువును సహజ ఉపగ్రహం అంటారు. భూమికి ఉన్న సహజ ఉపగ్రహం పేరు చంద్రుడు. ఉపగ్రహాలన్నిటినీ మామూలుగా చంద్రుడు అని అనడం కూడా కద్దు. సౌర కుటుంబంలో ఆరు గ్రహ వ్యవస్థలున్నాయి. అన్నిటిలోనూ కలిపి 185 ఉపగ్రహాలున్నాయి.[1][2] ఇవి కాకుండా ప్లూటో, హామియా, మాకెమాకె, ఎరిస్ అనే నాలుగు మరుగుజ్జు గ్రహాలకు కూడా ఉపగ్రహాలున్నాయి.[3] 2018 సెప్టెంబరు నాటికి తెలిసిన దాని ప్రకారం 334 చిన్న గ్రహాలకు ఉపగ్రహాలున్నాయి.[4]

సౌరకుటుంబంలో భూమి-చంద్రుడు వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రెండింటి ద్రవ్యరాశి నిష్పత్తి, మరే ఇతర పెద్ద గ్రహ-ఉపగ్రహ ద్రవ్యరాశుల నిష్పత్తి కన్నా చాలా ఎక్కువ. (అయితే, ప్లూటో-చరోన్ వంటి చిరు గ్రహవ్యవస్థలు కొన్నిట్లో ఈ నిష్పత్తి ఇంకా ఎక్కువ ఉంది.). చంద్రుడి వ్యాసం (3,474 కి.మీ.) భూమి వ్యాసంలో 0.27 రెట్లుంది.[5]

నిర్వచనం[మార్చు]

భూమి, చంద్రుల పరిమాణంలో పోలిక.

ఉపగ్రహంగా పరిగణించడానికి ఒక ఖగోళ వస్తువు పరిమాణం ఇంతకంటే తక్కువ ఉండకూడదు అని ఒక పరిమితి అంటూ లేదు. సౌరవ్యవస్థలోని ఏదైనా గ్రహం చుట్టూ స్పష్టంగా గుర్తించబడ్డ కక్ష్యలో తిరుగుతున్న ఖగోళ వస్తువులన్నిటినీ, ఒక కిలోమీటరు వ్యాసం మాత్రమే ఉన్నవాటిని కూడా, ఉపగ్రహాలు గానే పరిగణిస్తారు. శని వలయాల్లో ఉన్న, ఇందులో పదోవంతు ఉండే వస్తువులను - నేరుగా గుర్తించబడనివి - చిరు ఉపగ్రహాలు (మూన్‌లెట్స్) అంటారు. ఏస్టెరాయిడ్ల చుట్టూ తిరిగే వాటిని కూడా చిరు ఉపగ్రహాలనే అంటారు.[6]

పరిమాణం ఎంత పెద్దగా ఉండాలనే విషయంపై కూడా స్పష్టత లేదు. కక్ష్యలో పరిభ్రమించే రెండు వస్తువులను కొన్నిసార్లు గ్రహం-ఉపగ్రహం అని కాకుండా, జంట గ్రహాలు అని అంటారు. 90 ఏంటియోప్ ఏస్టెరాయిడ్లను జంట ఏస్టెరాయిడ్లు అంటారు. ప్లూటో-చరోన్‌లను కూడా కొందరు జంట మరుగుజ్జు గ్రహాలు అంటారు.

పుట్టుక, కక్ష్యా లక్షణాలు[మార్చు]

గ్రహానికి దగ్గరగా, ప్రోగ్రేడ్ కక్ష్యలో,[lower-alpha 1] వాలు లేని వృత్తాకార కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలన్నీ (సాధారణ ఉపగ్రహాలు), ఆ గ్రహం ఏర్పడిన ఆదిమ గ్రహ చక్రం లోని ప్రాంతం నుండే ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు.[7][8] దీనికి విరుద్ధంగా, గ్రహానికి దూరంగా, దీర్ఘ వృత్తాకార, వాలు కక్ష్యల్లో పరిభ్రమించే ఉపగ్రహాలను (అసాధారణ ఉపగ్రహాలు) గ్రహపు గురుత్వ శక్తికి లోబడిపోయిన ఏస్టెరాయిడ్లు అయి ఉంటాయని భావిస్తున్నారు. సౌర వ్యవస్థలో పెద్ద సహజ ఉపగ్రహాలన్నీ సాధారణ కక్ష్యల్లోనే పరిభ్రమిస్తున్నాయి.[9] చంద్రుడు[10] (బహుశా చరోన్ కూడా[11]) రెండు పెద్ద ఆదిమ గ్రహాలు గుద్దుకోవడం వలన ఏర్పడిందని భావిస్తున్నారు. ఈ ఘాతం కారణంగా కక్ష్యల్లోకి వెదజల్లబడ్డ పదార్థాలు మళ్ళీ అతుక్కుని (దీన్ని ఎక్రీషన్[lower-alpha 2] అంటారు.) ఉపగ్రహంగా తయారై ఉండవచ్చు. గ్రహాలకు చెందిన ఉపగ్రహాల కంటే, ఏస్టెరాయిడ్ల ఉపగ్రహాలు ఎక్కువగా ఈ పద్ధతిలో ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. ట్రైటన్ మరో మనహాయింపు; ఇది గ్రహం చుట్టూ దగ్గరగా, వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నప్పటికీ, రెట్రోగ్రేడ్[lower-alpha 3] కక్ష్యలో తిరుగుతున్నందున దీన్ని గ్రహానికి లోబడ్ద మరుగుజ్జు గ్రహం అని భావిస్తున్నారు.

టైడల్ లాకింగ్[మార్చు]

మొదటి బొమ్మలోని ఉపగ్రహం, దాని గ్రహంతో టైడల్ లాకింగులో ఉంది. రెండవ బొమ్మలోని ఉపగ్రహం టైడల్ లాకింగులో లేదు.

ఒక ఉపగ్రహం దాని గ్రహం చుట్టూ ఒకసారి పరిభ్రమించేందుకు పట్టే కాలం, ఆ ఉపగ్రహపు ఒక భ్రమణానికి పట్టే కాలంతో సమానంగా ఉంటే, ఆ ఉపగ్రహపు ఒకే వైపు ఎల్లప్పుడూ గ్రహం వైపు ఉంటుంది. దీన్ని టైడల్ లాకింగ్ అంటారు. సౌరవ్యవస్థలోని సాధారణ ఉపగ్రహాలు చాలావరకూ - చంద్రుడితో సహా - దాని మాతృగ్రహంతో టైడల్ లాకింగులో ఉంటాయి. శని ఉపగ్రహమైన హైపీరియన్ మాత్రం దీనికి మినహాయింపు. శని మరో ఉపగ్రహం టైటన్ హైపీరియన్‌పై చూపించే గురుత్వ ప్రభావం వలన ఈ టైడల్ లాకింగు సాధ్యపడలేదు.

బాహ్య సౌరవ్యవస్థలోని పెద్ద గ్రహాల ఉపగ్రహాలు గ్రహం నుండి బాగా దూరంగా ఉండటం చేత (అసాధారణ ఉపగ్రహాలు) వీటికి టైడల్‌ లాకింగు లేదు. ఉదాహరణకు, గురుడి ఉపగ్రహం హిమాలియా, శని ఉపగ్రహం నెరీడ్ ల భ్రమణ కాలం దాదాపు 10 గంటలుండగా, వాటి పరిభ్రమణ కాలం మాత్రం వందల రోజులు ఉంటుంది.

ఉపగ్ర్హహాల ఉపగ్రహాలు[మార్చు]

2019 నాటికి ఉప గ్రహాలకు ఉప గ్రహాలున్నట్లుగా గమనించలేదు. గ్రహం దాని ఉపగ్రహంపై చూపించే టైడల్ ప్రభావం దాన్ని సాధ్యపడనీయదు. అయితే ఇటీవలి కాలంలో శనికి ఉపగ్రహమైన రియా పై జరిపిన పరిశోధనల్లో దాని వలయాల్లోని కొన్ని ఉపగ్రహాలకు స్థిర కక్ష్యలు ఉన్నట్లు లెక్కలు కట్టారు. అయితే, కాస్సిని వ్యోమనౌక తీసిన చిత్రాల్లో ఈ వలయాలున్నట్లు కనబడలేదు.[12]

ఉపగ్రహాల చిత్రాలు[మార్చు]

సౌర వ్యవస్థలోని ఉపగ్రహాలు
Ganymede g1 true-edit1.jpg
Two Halves of Titan.png
Callisto (cropped)-1.jpg
Io highest resolution true color (non-edit version).jpg
FullMoon2010 (cropped)-1.jpg
Europa-moon.jpg
Triton moon mosaic Voyager 2 (large).jpg
గానిమీడ్
(గురుడి ఉపగ్రహం)
టైటన్
(శని ఉపగ్రహం)
కాలిస్టో
(గురుడి ఉపగ్రహం)
అయో
(గురుడి ఉపగ్రహం)
చంద్రుడు
(భూమి ఉపగ్రహం)
యూరోపా
(గురుడి ఉపగ్రహం)
ట్రైటన్
(నెప్ట్యూన్ ఉపగ్రహం)
Titania (moon) color, cropped.jpg
PIA07763 Rhea full globe5.jpg
Voyager 2 picture of Oberon.jpg
Iapetus as seen by the Cassini probe - 20071008 (cropped).jpg
Charon in Color (HQ).jpg
PIA00040 Umbrielx2.47.jpg
Ariel color PIA00041.jpg
టైటానియా
(యురేనస్ ఉపగ్రహం)
రియా
(శని ఉపగ్రహం)
ఒబేరియన్
(యురేనస్ ఉపగ్రహం)
లాపెటస్
(శని ఉపగ్రహం)
చరోన్
(ప్లూటో ఉపగ్రహం)
అంబ్రియెల్
(యురేనస్ ఉపగ్రహం)
ఏరియెల్
(యురేనస్ ఉపగ్రహం)
Dione color south.jpg
PIA18317-SaturnMoon-Tethys-Cassini-20150411.jpg
PIA17202-SaturnMoon-Enceladus-ApproachingFlyby-20151028-cropped.jpg
PIA18185 Miranda's Icy Face.jpg
Proteus Voyager 2 cropped.jpg
Mimas PIA12568.jpg
Hyperion true.jpg
డయోన్
(శని ఉపగ్రహం)
టెథిస్
(శని ఉపగ్రహం)
ఎన్‌సెలాడస్
(శని ఉపగ్రహం)
మిరాండా
(యురేనస్ ఉపగ్రహం)
ప్రోటియస్
(నెప్ట్యూన్ ఉపగ్రహం)
మిమాస్
(శని ఉపగ్రహం)
హైపీరియన్
(శని ఉపగ్రహం)
Phoebe cassini.jpg
PIA12714 Janus crop.jpg
Amalthea (moon).png
PIA09813 Epimetheus S. polar region.jpg
Thebe.jpg
Prometheus 12-26-09a.jpg
PIA21055 - Pandora Up Close (cropped).jpg
ఫోబ్
(శని ఉపగ్రహం)
జానస్
(శని ఉపగ్రహం)
అమాల్థియా
(గురుడి ఉపగ్రహం)
ఎపిమేథియస్
(శని ఉపగ్రహం)
థీబ్
(గురుడి ఉపగ్రహం)
ప్రొమేథియస్
(శని ఉపగ్రహం)
పాండోరా
(శని ఉపగ్రహం)
Hydra (moon) from 231 000 kilometres.jpg
Nix best view-true color.jpg
Leading hemisphere of Helene - 20110618.jpg
Atlas (NASA).jpg
Pan by Cassini, March 2017.jpg
Telesto cassini closeup.jpg
N00151485 Calypso crop.jpg
హైడ్రా
(ప్లూటో ఉపగ్రహం)
నిక్స్
(ప్లూటో ఉపగ్రహం)
హెలీన్
(శని ఉపగ్రహం)
అట్లాస్
(శని ఉపగ్రహం)
పాన్
(శని ఉపగ్రహం)
టెలెస్టో
(శని ఉపగ్రహం)
కాలిప్సో
(శని ఉపగ్రహం)
Phobos colour 2008.jpg
Deimos-MRO.jpg
Daphnis (Saturn's Moon).jpg
Methone PIA14633.jpg
Dactyl-HiRes.jpg
ఫోబోస్
(అంగారకుడి ఉపగ్రహం)
డేమోస్
(అంగారకుడి ఉపగ్రహం)
డాఫ్నిస్
(శని ఉపగ్రహం)
మీథోన్
(శని ఉపగ్రహం)
డాక్టిల్
(ఇడా ఉపగ్రహం)

నోట్స్[మార్చు]

  1. ఒక ఖగోళ వస్తువు యొక్క పరిభ్రమణ దిశ, మాతృవస్తువు యొక్క భ్రమణ దిశ లోనే ఉంటే దాన్ని ప్రోగ్రేడ్ కక్ష్య అంటారు. వ్యతిరేక దిశలో ఉంటే దాన్ని రెట్రోగ్రేడ్ కక్ష్య అంటారు.
  2. గ్రహాలు ఏర్పడిన విధానాన్ని ఎక్రీషన్ అంటారు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ధూళితో కూడిన డిస్కులోని వస్తువులు ఒకదానికొకటి అతుక్కుని పెద్దవవయ్యాయి. అలా పెద్దవైన వస్తువులకు చుట్టూ ఉన్న చిన్న చిన్న వస్తువుల కంటే గురుత్వ శక్తి ఎక్కువ ఉంటుంది. దాంతో అవి చిన్న వస్తువులను తమలో కలిపేసుకుని మరింత పెద్దవయ్యాయి. అలా ఆదిమ గ్రహాలు ఏర్పడ్డాయి. దీన్ని ఎక్రీషన్ అంటారు.
  3. ఒక ఖగోళ వస్తువు యొక్క పరిభ్రమణ దిశ, మాతృవస్తువు యొక్క భ్రమణ దిశకు వ్యతిరేక దిశలో ఉంటే దాన్ని రెట్రోగ్రేడ్ కక్ష్య అంటారు. ఒకే దిశలో ఉంటే దాన్ని ప్రోగ్రేడ్ కక్ష్య అంటారు.

మూలాలు[మార్చు]

  1. Sheppard, Scott S. "The Jupiter Satellite and Moon Page". Departament of Terrestrial Magnetism at Carniege Institution for science. Retrieved 2018-03-08.
  2. "How Many Solar System Bodies". NASA/JPL Solar System Dynamics. Retrieved 2012-01-26.
  3. "Planet and Satellite Names and Discoverers". International Astronomical Union (IAU) Working Group for Planetary System Nomenclature (WGPSN). Retrieved 2012-01-27.
  4. Wm. Robert Johnston (2018-09-30). "Asteroids with Satellites". Johnston's Archive. Retrieved 2018-10-22.
  5. Glenday, Craig (2014). Guinness World Records 2014. p. 186. ISBN 978-1-908843-15-9.
  6. F. Marchis; et al. (2005). "Discovery of the triple asteroidal system 87 Sylvia". Nature. 436 (7052): 822–24. Bibcode:2005Natur.436..822M. doi:10.1038/nature04018. PMID 16094362.
  7. Canup, Robin M.; Ward, William R. (2008-12-30). Origin of Europa and the Galilean Satellites. University of Arizona Press. p. 59. arXiv:0812.4995. Bibcode:2009euro.book...59C. ISBN 978-0-8165-2844-8.
  8. D'Angelo, G.; Podolak, M. (2015). "Capture and Evolution of Planetesimals in Circumjovian Disks". The Astrophysical Journal. 806 (1): 29–. arXiv:1504.04364. Bibcode:2015ApJ...806..203D. doi:10.1088/0004-637X/806/2/203.
  9. Encyclopedia of the Solar System, page 366, Academic Press, 2007, Lucy-Ann Adams McFadden, Paul Robert Weissman, Torrence V. Johnson
  10. Canup, RM; Asphaug, E (2001). "Origin of the Moon in a giant impact near the end of the Earth's formation". Nature. 412 (6848): 708–12. Bibcode:2001Natur.412..708C. doi:10.1038/35089010. PMID 11507633.
  11. Stern, SA; Weaver, HA; Steffl, AJ; Mutchler, MJ; et al. (2006). "A giant impact origin for Pluto's small natural satellites and satellite multiplicity in the Kuiper belt". Nature. 439 (7079): 946–49. Bibcode:2006Natur.439..946S. doi:10.1038/nature04548. PMID 16495992.
  12. Tiscareno, Matthew S.; Burns, Joseph A.; Cuzzi, Jeffrey N.; Hedman, Matthew M. (2010). "Cassini imaging search rules out rings around Rhea – Tiscareno – 2010". Geophysical Research Letters – Wiley Online Library. 37 (14): n/a. arXiv:1008.1764. Bibcode:2010GeoRL..3714205T. doi:10.1029/2010GL043663.

బయటి లింకులు[మార్చు]

బృహస్పతి ఉపగ్రహాలు[మార్చు]

శని చంద్రులు[మార్చు]

మొత్తం చంద్రులు[మార్చు]

eu:Satelite fa:فهرست ماه‌های سیارات ru:Спутники планет sk:Prirodzený satelit slnečnej sústavy