ఉపగ్రహ వాహక నౌక
అంతరిక్ష ప్రయోగ వాహనం అనేది సాధారణంగా రాకెట్‌తో నడిచే వాహనం. ఇది భూమి ఉపరితలం లేదా దిగువ వాతావరణం నుండి బాహ్య అంతరిక్షానికి పేలోడ్ (సిబ్బందితో కూడిన అంతరిక్ష నౌక లేదా ఉపగ్రహాలు) ను మోసుకెళ్లడానికి రూపొందించబడింది. దీని అత్యంత సాధారణ రూపం బాలిస్టిక్ క్షిపణి ఆకారంలో ఉండే మల్టీస్టేజ్ రాకెట్. కానీ ఈ పదం మరింత సాధారణమైనది. స్పేస్ షటిల్ వంటి వాహనాలను కూడా ఈ పేరుతో సూచిస్తారు. చాలా లాంచ్ వాహనాలను లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగిస్తారు. ఈ ప్యాడ్‌లకు లాంచ్ కంట్రోల్ సెంటర్, వాహన అసెంబ్లీ, ఇంధనం నింపడం వంటి వ్యవస్థలు మద్దతు ఇస్తాయి. [1] అంతరిక్ష ప్రయోగ వాహనాలను అధునాతన ఏరోడైనమిక్స్, టెక్నాలజీలతో రూపొందిస్తారు. వీటివలన నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి.
ఒక కక్ష్యా ప్రయోగ వాహనం, దాని పేలోడ్‌ను కనీసం అంతరిక్ష సరిహద్దు వరకు, దాదాపు 150 km (93 mi) తీసుకెళ్ళాలి. దాని క్షితిజ సమాంతర వేగాన్ని కనీసం 7,814 మీటర్లు/సెకండు వరకు తీసుకెళ్ళాలి. [2] సబ్‌ఆర్బిటాల్ వాహనాలు వాటి పేలోడ్‌లను తక్కువ వేగం వద్ద లాంచ్ చేస్తాయి.
కక్ష్యా ప్రయోగ వాహనాలు ఘన ఇంధనం, ద్రవ హైడ్రోజన్, కిరోసిన్, ద్రవ ఆక్సిజన్ లేదా హైపర్గోలిక్ ప్రొపెల్లెంట్లు వంటి రసాయన చోదకాలను ఇంధనంగా ఉపయోగిస్తాయి.
ప్రయోగ వాహనాలను వాటి పేలోడ్ సామర్థ్యం ఆధారంగా స్మాల్-లిఫ్ట్, మీడియం-లిఫ్ట్, హెవీ-లిఫ్ట్ సూపర్-హెవీ లిఫ్ట్ అని వర్గీకరిస్తారు.
సాధారణ సమాచారం
[మార్చు]కక్ష్య అంతరిక్ష ప్రయాణానికి ఉపగ్రహాన్ని లేదా అంతరిక్ష పేలోడ్‌ను చాలా అధిక వేగానికి తీసుకుపోవాలి. అంతరిక్ష శూన్యంలో, ద్రవ్యరాశిని బయటకు పంపడం ద్వారా ప్రతిచర్య శక్తులు అందించాలి. తత్ఫలితంగా రాకెట్ సమీకరణం ఏర్పడుతుంది.
ఒక్కసారి మాత్రమే ఉపయోగించేందుకు రూపొందించిన వాహనాలను ఎక్స్‌పెండబుల్ అంతరిక్ష ప్రయోగ వాహనాలు అంటారు. బూస్టర్‌లు సాధారణంగా వాటి పేలోడ్ నుండి విడిపోయి వాతావరణ పునఃప్రవేశ సమయంలో గానీ, భూమిని తాకినపుడు గానీ విచ్ఛిన్నమవుతాయి. దీనికి విరుద్ధంగా, పునర్వినియోగించదగిన అంతరిక్ష ప్రయోగ వాహనాలను మళ్ళీ మళ్ళీ వాడుకోగలిగేలా రూపొందించారు. ఫాల్కన్ 9 పునర్వినియోగించదగిన అంతరిక్ష ప్రయోగ వాహనాలకు ఒక ఉదాహరణ.[3] 2023 నాటికి, పనిచేస్తున్న పునర్వినియోగించదగిన ప్రయోగ వాహనాలన్నీ పాక్షికంగా మాత్రమే పునర్వినియోగించుకోగలిగేవి. అంటే, వీటిలో కొన్ని భాగాలను మాత్రమే తిరిగి వాడవచ్చు, మిగతావాటిని వాడలేరు. సాధారణంగా మొదటి దశను మాత్రమే తిరిగి వాడగలుగుతున్నారు. కొన్నిసార్లు రాకెట్ దశ లోని నిర్దిష్ట భాగాలు తిరిగి పొందబడవచ్చు, మరికొన్నిటిని తిరిగి పొందలేరు. ఉదాహరణకు, స్పేస్ షటిల్ దాని ఘన రాకెట్ బూస్టర్‌లను, రెండవ దశగా కూడా పనిచేసిన స్పేస్ షటిల్ ఆర్బిటర్‌ను, కోర్ స్టేజ్ (ఆర్బిటర్ వెనుక భాగంలో ఉన్న RS-25) ఉపయోగించే ఇంజిన్‌లను తిరిగి ఉపయోగించింది. అయితే ఇంజిన్‌ల నుండి వేరుగా ఉన్న ఇంధన ట్యాంక్‌ను తిరిగి ఉపయోగించలేదు.
కక్ష్య లోకి తీసుకుపోగల ద్రవ్యరాశి
[మార్చు]భూ నిమ్న కక్ష్య లోకి తీసుకుపోగలిగే పేలోడ్ సామర్థ్యం ప్రకారం లాంచ్ వాహనాలను NASA కింది విధంగా వర్గీకరిస్తుంది: [4]
- స్మాల్-లిఫ్ట్ ప్రయోగ వాహనం: 2 టన్నుల లోపు - ఉదా. వేగా [5]
- మీడియం-లిఫ్ట్ ప్రయోగ వాహనం: 2 నుండి 20 టన్నుల వరకు - ఉదా. ఎల్‌విఎం3[6]
- హెవీ-లిఫ్ట్ ప్రయోగ వాహనం: 20 టన్నుల నుండి 50 టన్నుల వరకు - ఉదా. ఏరియన్ 5 [7]
- సూపర్-హెవీ లిఫ్ట్ ప్రయోగ వాహనం: 50 టన్నులకు మించి - ఉదా. సాటర్న్ V [8]
సౌండింగ్ రాకెట్లు: ఇవి స్మాల్-లిఫ్ట్ వాహనాల్లాగానే ఉంటాయి గానీ, సాధారణంగా వాటికంటే చిన్నవిగా ఉంటాయి. ఇవి పేలోడ్‌లను కక్ష్యలోకి ప్రవేశపెట్టవు. 2018లో సవరించిన SS-520 సౌండింగ్ రాకెట్‌ను వాడి, 4-కిలోగ్రాముల పేలోడ్ (TRICOM-1R) ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.[9]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "NASA Kills 'Wounded' Launch System Upgrade at KSC". Florida Today. Archived from the original on 2002-10-13.
- ↑ Hill, James V. H. (April 1999), "Getting to Low Earth Orbit", Space Future, archived from the original on 2012-03-19, retrieved 2012-03-18.
- ↑ Lindsey, Clark (28 March 2013). "SpaceX moving quickly towards fly-back first stage". NewSpace Watch. Archived from the original on 16 April 2013. Retrieved 29 March 2013.
- ↑ NASA Space Technology Roadmaps - Launch Propulsion Systems, p.11: "Small: 0-2t payloads, Medium: 2-20t payloads, Heavy: 20-50t payloads, Super Heavy: >50t payloads"
- ↑ "Launch services—milestones". Arianespace. Retrieved 19 August 2014.
- ↑ "GSLV MkIII-M1 Successfully Launches Chandrayaan-2 spacecraft - ISRO". www.isro.gov.in. ISRO. Archived from the original on 12 December 2019. Retrieved 23 July 2019.
- ↑ "Welcome to French Guiana" (PDF). arianespace.com. Arianespace. Archived from the original (PDF) on 23 September 2015. Retrieved 19 August 2014.
- ↑ HSF Final Report: Seeking a Human Spaceflight Program Worthy of a Great Nation Archived 2009-11-22 at the Wayback Machine, October 2009, Review of U.S. Human Spaceflight Plans Committee, p. 64-66: "5.2.1 The Need for Heavy Lift ... require a “super heavy-lift” launch vehicle ... range of 25 to 40 mt, setting a notional lower limit on the size of the super heavy-lift launch vehicle if refueling is available ... this strongly favors a minimum heavy-lift capacity of roughly 50 mt ..."
- ↑ "SS-520". space.skyrocket.de. Retrieved 2020-06-02.