ఉపాసన సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉపాసన సింగ్
ఉపాసన సింగ్ (2009)
జననం (1974-06-29) 1974 జూన్ 29 (వయసు 49)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
కామెడీ నైట్స్ విత్ కపిల్‌ (2013–2016)
జీవిత భాగస్వామినీరజ్ భరద్వాజ్‌ (2009)

ఉపాసన సింగ్, పంజాబీ సినిమా నటి, స్టాండ్-అప్ కమెడియన్. బాలీవుడ్ సినిమాలతోపాటు పంజాబీ, భోజ్‌పురి, రాజస్థానీ, గుజరాతీ సినిమాలలో నటించింది.

జననం[మార్చు]

ఉపాసన 1974 జూన్ 29న పంజాబ్ లోని నవాన్‌షహర్ పట్టణంలో జన్మించింది.

సినిమారంగం[మార్చు]

రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 1986లో వచ్చిన బాబుల్‌ అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా సినిమారంగంలోకి ప్రవేశించింది. 1988లో బాయి చాలీ ససరియే అనే రాజస్థానీ సినిమాలో నటించింది. డర్, జవానీ జిందాబాద్, లోఫర్, జుదాయి, మెయిన్ ప్రేమ్ కీ దివానీ హూన్, ముజ్సే షాదీ కరోగి, ఐత్రాజ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్, మై ఫ్రెండ్ గణేశా, గోల్మాల్ రిటర్న్స్,[2]హంగామా వంటి సినిమాలలో అనేక సహాయ పాత్రలు కూడా చేసింది.[3] 1997లో వచ్చిన జుదాయి సినిమాలో చెవిటి-మూగ పాత్రలో నటించి గుర్తింపు పొందింది.[4] తరువాత ప్రియదర్శన్, డేవిడ్ ధావన్ సినిమాలలో చిన్న పాత్రలు పోషించింది. 2015లో జుహీ చావ్లా, షబానా అజ్మీ, గిరీష్ కర్నాడ్‌లతో కలిసి చాక్ ఎన్ డస్టర్‌ సినిమాలో మంజీత్ పాత్రను పోషించింది.[5] 2017లో జుడ్వా 2 లో వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తాప్సీలతో కలిసి నటించింది.[6]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఉపాసనకు 2009లో నటుడు నీరజ్ భరద్వాజ్‌తో వివాహం జరిగింది.

మూలాలు[మార్చు]

  1. "Kapil Sharma Bua aka Upasana Singh Celebrated 42nd Birthday". Dainik Bhaskar (in ఇంగ్లీష్). Retrieved 2022-05-05.
  2. "Upasana Singh to play cunning mother-in-law". The Indian Express. 3 August 2014. Retrieved 2022-05-05.
  3. "Nobody can replace Sunil as Gutthi: Upasana Singh". IBN Live. Archived from the original on 19 December 2013. Retrieved 2022-05-05.
  4. "Upasna Singh gets married". NDTV. 18 November 2009.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "'Chalk N Duster' team throws Iftar party". The Indian Express. 4 July 2015. Retrieved 2022-05-05.
  6. Vats, Rohit (30 September 2017). "Judwaa 2 movie review: Doesn't make much sense but Varun Dhawan is Salman Khan 2.0". Hindustan Times. Retrieved 2022-05-05.

బయటి లింకులు[మార్చు]